slumps
-
సామాన్యుడికి ఊరట:11 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: సామాన్యుడికి ధరల మంట కాస్తంత తగ్గింది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారోత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గాయి. దీంతో నవంబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 5.88 శాతానికి దిగొచ్చింది. ఇది 11 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అంటే ఏడాది తర్వాత మళ్లీ తక్కువ ధరలు చూస్తున్నాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (వినియోగ ధరల ఆధారిత సూచీ/రిటైల్ ద్రవ్యోల్బణం) గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) సోమవారం విడుదల చేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం ఇది వరుసగా రెండో మాసం. (ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్ వెరిఫైడ్ మార్క్ షురూ) అంతకుముందు అక్టోబర్‌లో 6.77 శాతంగా ఉంది. 2021 నవంబర్ నెలలో ఇది 4.91 శాతంగా ఉండడం గమనార్హం. ఏడాది క్రితంతో పోలిస్తే ఇప్పటికీ 1శాతం మేర అధికంగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడే ధ్యేయంగా ఆర్బీఐ వరుసగా వడ్డీ రేట్లను పెంచుతూ, వ్యవస్థలో లిక్విడిటీని తగ్గించే ప్రయత్నం చేస్తుండడం తెలిసిందే. ఈ నెల మొ దటి వారంలో ముగిసిన తాజా ఎంపీసీ సమీక్షలోనూ కీలక రెపో రేటు 0.35శాతం మేర పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చూస్తే రెపో రేటు మొత్తం మీద 2.25 శాతం ఎగిసింది. వచ్చే జనవరి-మార్చి త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6శాతం లోపునకు దిగొస్తుందని, రానున్న రోజుల్లో ధరల మంట కాస్తంత చల్లారుతుందని ఇటీవలి సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. (ఐఐపీ డేటా షాక్: పడిపోయిన పారిశ్రామికోత్పత్తి) ధరల తీరు...: ఆహార ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 7.01 శాతంగా ఉంటే అది నవంబర్ నెలకు 4.67 శాతానికి క్షీణించింది. సీపీఐలో ఆహారోత్పత్తుల వాటా 40 శాతం. కూరగాయల ధరలు 8 శాతం మేర తగ్గాయి. ఇక వంట నూనెల ధరలు 0.63 శాతం, చక్కెర ధరలు 0.25 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ధాన్యాలకు సంబంధించిన ద్రవ్యోల్బణం ఇంకా గరిష్ట స్థాయిలో 12.96శాతం వద్ద ఉంటే, వంట దినుసులకు సంబంధించి 19.52 శాతం, పాల ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8.16 శాతం, పప్పులకు సంబంధించి 3.15శాతంగా నమోదైంది. చమురు, పొగాకు, మత్తు కారకాల రేట్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఎక్కువలోనే ఉన్నాయి. వస్త్రాలు, పాదరక్షల ధరలు 9.83శాతం, ఇళ్ల ధరలు 4.57శాతం పెరిగాయి. ‘డిసెంబర్‌లోనూ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడితే వచ్చే ఫిబ్రవరి సమీక్షలో పాలసీ రేట్ల సమీక్షలో కీలక అంశంగా మారుతుందని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ తెలిపారు. ఊహించని విధంగా ద్రవ్యోల్బణం 6 శాతం లోపునకు దిగివచ్చినట్టు చెప్పారు. నవంబర్ నెలకు 5.88 శాతం చర్యల ఫలితమే ఇది..: ఆహార ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా, ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశిత గరిష్ట పరిధి అయిన 6 శాతం లోపునకు దిగొచ్చింది. ధాన్యాలు, పప్పులు, వంట నూనెల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాం. ఈ చర్యల ఫలితాలు రానున్న నెలల్లో ద్రవ్యోల్బణంపై ఇంకా ప్రతిఫలిస్తాయి. – కేంద్ర ఆర్థిక శాఖ ట్వీట్ -
‘బేర్’ మన్న దలాల్ స్ట్రీట్
సాక్షి, ముంబై : బడ్జెట్ ప్రతిపాదనల్లో పన్ను పోటుకుతోడు..అంతర్జాతీయ ప్రతికూల అంశాల జత కలవడంతో దళాల్ స్ట్రేట్ ఢమాల్ అంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే అమ్మకాలు వెల్లువెత్తాయి. అనంతరం మరింత నష్టపోయిన సెన్సెక్స్ ఒక దశలో 880 పాయింట్లకు పైగా కుప్పకూలింది. చివరికి సెన్సెక్స్ 793 పాయింట్లు కుప్పకూలి 38720 వద్ద, నిఫ్టీ 252 పాయింట్లు పతనమై 11558వద్ద ముగిసింది. తద్వారా సెన్సెక్స్ 39 వేల పాయింట్ల మైలురాయి దిగువకు, నిఫ్టీ 11 600 స్థాయిని కోల్పోయాయి. సార్వత్రిక బడ్జెట్, దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత, ఆసియా మార్కెట్ల పతనం తదితర అంశాలు ఇన్వెస్టర్ల అమ్మకాలకు దారితీసిందని ఎనలిస్టులు తెలిపారు. బడ్జెట్ రోజు శుక్రవారం కూడా నష్టపోయిన స్టాక్‌మార్కెట్లు రెండు సెషన్లలో 1000 పాయింట్లకు పతనమైంది. ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత కూడా ఈ పతనానికి తోడైంది. అన్ని రంగాలూ నష్టాల్లోనే ముగిసాయి. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంక్స్ పతనంతో నిఫ్టీ బ్యాంకు 880 పాయింట్లకు పైగా కోల్పోయింది. రియల్టీ, ఆటో, ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్ రంగాలు నష్టపోయాయి. ఐటీ స్వల్పంగా లాభపడింది. తాజాగా మరో భారీ కుంభకోణం వెలుగులోకి రావడంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు భారీగా నష్టపోగా, బజాజ్ ఫిన్స్ 11 శాతం నష్టపోయింది. సంస్థ సీఈవో రాజీనామాతో మైండ్ ట్రీ షేరు 15శాతం కుప్పకూలింది. ఎన్‌బీఐ బీవోఐ, యూనియన్ బ్యాంక్, కెనరా, సిండికేట్, ఇండియన్, అలహాబాద్, ఓబీసీ, ఎస్బీఐ, బీవోబీ, సెంట్రల్ బ్యాంక్, జేఅండ్‌కే బ్యాంక్ కుప్పకూలాయి. అలాగే ఉత్పత్తికోతతో మారుతి షేర్ల అమ్మకాల వెల్లువ కొనసాగింది. దీంతో మారుతి షేరు 52 వాకాల కనిష్టానికి చేరింది. దీంతోపాటు హీరో మోటో, మారుతీ, టాటా మోటార్స్, అపోలో టైర్, ఐషర్, బజాజ్ ఆటో, అశోక్ లేలాండ్, ఎంఆర్ఎఫ్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, ఐవోసీ, గ్రాసిమ్, ఎల్అండ్టీ, ఎన్టీపీసీ, కోల్ ఇండియా టాప్ లూజర్స్ జాబితాలో నిలవడం గమనార్హం. మరోవైపు ఇంత భారీ పతనంలో ఎస్ బ్యాంక్ టాప్ విన్నర్‌గా నిలిచింది. హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫ్రాటెల్, టీసీఎస్ స్వల్పలాభాలతో ముగిసాయి. -
జెట్ ఎయిర్వేస్కు మరో ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై: ఆర్థిక సంక్షోభం కారణంగా కార్యకలాపాలు నిలిపివేసిన ప్రయివేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. లావాదేవీల నిర్వహణ (ట్రేడింగ్ యాక్టివిటీ)లో ఆంక్షలు విధించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలు నిర్ణయించినట్లు వెలువడిన వార్తలు నేపథ్యంలో ఇన్వెస్టర్లు జెట్ ఎయిర్ వేస్ షేర్లలో భారీ అమ్మకాలకు దిగారు. దీంతో గురువారం నాటి మార్కెట్లో జెట్ షేరు ఏకంగా 23శాతం పతనమైంది. తద్వారా సరికొత్త కనిష్టానికి చేరింది. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 986.03 కోట్లకు పడిపోయింది. బిఎస్ఇలో 15.61 లక్షల షేర్లు చేతులుమారాయి. స్టాక్ గత తొమ్మిది రోజుల్లో 40శాతానికి పైగా పతనమైంది. జెట్ షేర్లను రోజువారీ ట్రేడింగ్నుంచి తీసివేయనున్నామని నేషనల్ స్టాక్ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) తెలిపింది. గరిష్టస్థాయిలో ఆటుపోట్లను చవిచూడకుండా నివారించే బాటలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. జెట్ ఎయిర్వేస్ కౌంటర్లో ట్రేడింగ్ యాక్టివిటీపై నియంత్రణలు విధించనున్నట్లు ఎన్ఎస్ఈ ఒక సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఈ ఆంక్షలు ఈ నెల 28 నుంచీ అమల్లోకిరానున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా ఈ షేరును ఎఫ్‌అండ్‌వో విభాగం నుంచి తొలగించనున్నారు. ఫలితంగా 100 శాతం మార్జిన్ల చెల్లింపుతోపాటు 5 శాతం ప్రైస్‌బ్యాండ్ అమలు కానుంది. -
15నెలల కనిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి పతనమైంది. డాలరుతో మారకంలో రూపాయి కీలక మద్దతు స్థాయి 67 మార్క్ దిగువకు చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే 26 పైసలు(0.3 శాతం) బలహీనపడి 67.13ను తాకింది. దీంతో 15 నెలల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. అటు చమురు ధరలు, ఇటు కీలక వడ్డీరేట్ల పెంపు అంచనాలు రూపాయి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు 10 సంవత్రాల బాండ్ ఈల్డ్స్ వరుసగా నాలుగోసారి కూడా పతనాన్ని నమోదు చేశాయి. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా తదుపరి వారంలో ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలను (ఓఎంఓ) ప్రకటించిన తరువాత 10 సంవత్సరాల బాండ్ దిగుబడి(7.637శాతం) 13 బేసిస్ పాయింట్లు తగ్గింది. మే నెలలో రూ .10,000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు నాలుగు నెలల గరిష్టాన్ని తాకింది. ఒక దశలో 92.90 వరకూ ఎగసింది. ఇది రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క దేశీ స్టాక్స్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు సైతం రూపాయిని దెబ్బతీస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. జూన్ నెలలో రిజర్వ్ బ్యాంక్ చేపట్టనున్న పరపతి సమీక్షలో వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చన్న సంకేతాలు, ఇటీవల స్థానిక కరెన్సీల మ్యానిప్యులేషన్ జాబితాలో యూఎస్ ఆర్థిక శాఖ రూపాయిని చేర్చడం వంటి అంశాలు దేశీ కరెన్సీని ప్రభావితం చేస్తున్నట్టు కరెన్సీ మార్కెట్ ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా మార్చి నెలలో వాణిజ్య లోటు 28.5 శాతం (13.7 బిలియన్ డాలర్లు) ఎగసి 87 బిలియన్ డాలర్లను అధిగమించడం కూడా సెంటిమెంటును దెబ్బతీసినట్టు వ్యాఖ్యానించాయి. కాగా శుక్రవారం డాలరుతో మారకంలో రూపాయి 66.86 వద్ద ముగిసింది. -
హైవే బ్యాన్ దెబ్బ: చతికిలపడిన యునైటెడ్ స్పిరిట్స్
సాక్షి,ముంబై: లిక్కర్ దిగ్గజం యునైటెడ్ స్పిరిట్స్ క్యూ3లో నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసిక ఫలితాల్లో ఎనలిస్టుల అంచనాలను అందుకోలేక పోయింది. నికర లాభాలు 9 శాతం క్షీణించగా ఆదాయం కూడా భారీ క్షీణతను నమోదు చేసింది. దీంతో ఇవాల్టీ మార్కెట్లో యునైటెడ్ స్పిరిట్స్ షేరు భారీగా నష్టపోయింది. 6.7శాతం పతనమై రూ. 3,501ని తాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో యునైటెడ్ స్పిరిట్స్ లాభం 9 శాతం క్షీణించి రూ. 135 కోట్లను తాకగా..మొత్తం ఆదాయం 8శాతం తగ్గి రూ. 2,263 కోట్లకు పరిమితమైంది. ఇబిటా సైతం 7శాతం నీరసించి రూ. 272 కోట్లకు చేరింది. కొన్ని రాష్ట్రాల్లోని మార్కెట్ మార్పులకు అనుగుణంగా ఈ త్రైమాసికంలో తమ నికర విక్రయాలపై ప్రతికూలంగా ప్రభావం కనిపించిందని యునైటెడ్ స్పిరిట్స్ సిఇఓ ఆనంద్ క్రిపాలు వెల్లడించారు. ముఖ్యంగా హై వేలపై మద్య నిషేధం తమ లాభాలను కొంతవరకు దెబ్బతీసిందని చెప్పారు. -
క్యూ2లో ఢమాలన్న జెట్ ఎయిర్వేస్
సాక్షి, ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద విమాన యాన సంస్థ జెట్ ఎయిర్వేస్ (ఇండియా) లిమిటెడ్ క్యూ 2 ఫలితాల్లో ఢమాల్ అంది. గురువారం ప్రకటించిన రెండవ త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం 91శాతం క్షీణించింది. భారీగా పెరిగిన ఇంధన వ్యయం కంపెనీ లాభాలను దారుణంగా దెబ్బతీసింది. గురువారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో జెట్ఎయిర్ వేస్ చాలా నిరాశ పర్చింది. సెప్టెంబరు 30 తో ముగిసిన త్రైమాసికంలో నికరలాభం రూ .49.63 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ .549 కోట్లగా ఉంది. మొత్తం ఆదాయం 59శాతం క్షీణిం చి రూ.131.57కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ. 320కోట్లను సాధించింది. మొత్తం సేల్స్ గతం క్వార్టర్లోని రూ. 5772 కోట్లతో పోలిస్తే ఈ క్వార్టర్లో రూ.5758 కోట్లకు పడిపోయింది. మొత్తం వ్యయం 9.2 శాతం పెరిగి రూ .5,709 కోట్లకు పెరిగింది. విమాన ఇంధన వ్యయం 17 శాతం పెరిగింది. -
దివీస్ షేర్‌కు మరోసారి నష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మ దిగ్గజం దివీస్ లాబ్స్‌కు మరోసారి చిక్కులు తప్పలేదు. యూఎస్ఎఫ్డీఏ తాజా అబ్జరేషన్స్ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో దివీస్ లేబ్స్ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. ఈ నెలలో తనిఖీలు నిర్వహించిన తనిఖీల్లో ఆరు లోపాలను(అబ్జర్వేషన్స్) నమోదు చేసినట్లు వెల్లడికావడంతో దివీస్ షేర్ 9 శాతానికిపైగా నష్టపోయింది. మార్చి 21 తరువాత ఇదే అతిపెద్ద ఇంట్రా డే పతనాన్నినమోదు చేసింది. మంగళవారం నాటి ముగింపుతో గత 12నెలల్లో 28 శాతం పడిపోయింది. వైజాగ్‌లోని యూనిట్-2లో యూఎస్ఎఫ్డీఏ నిర్వహించిన తుది ఏపీఐల ఇండివిడ్యుయల్ పరీక్షలలో దివీస్ విఫలమైనట్లు తెలుస్తోంది. తయారీ, పరికరాల పరిశుభ్రత వంటి అంశాలలోనూ లోపాలు గుర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే తాజా నివేదికలపై దివీస్ ఇంకా స్పందించలేదు. కాగా అమెరికా రెగ్యులేటరీ నుంచి ఆరు అబ్జర్వేషన్స్ తమకు అందాయని దివీస్ గతవారం తెలిపింది. ఇది సాధారణమేనని పేర్కొంది. -
వారాంతంలో భారీ నష్టాలు!
-
వారాంతంలో భారీ నష్టాలు!
ట్రేడింగ్ ఆరంభంలో 100 పాయింట్లకు పైగా దిగజారిన స్టాక్‌మార్కెట్లు, అమ్మకాల ఒత్తిడితో మధ్యాహ్న సెషన్లో మరింత పడిపోయి వారం ముగింపులో భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. సెన్సెక్స్ ఒక్కసారిగా 329.26 పాయింట్లు కుప్పకూలి 26,230.66 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 106.10 పాయింట్లు పడిపోయి 8086.80గా క్లోజ్ అయింది. పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ఆటో కంపెనీల నవంబర్ నెల విక్రయ డేటా ఒక్కసారిగా కుప్పకూలడం, పోటీ తీవ్రతరమవడంతో వైరలెస్ ప్రొవేడర్ల షేర్లు అతలాకుతలమవడం మార్కెట్లను దెబ్బతీసింది. అమెరికా నెల వారీ ఉద్యోగ డేటా విడుదల, ఇటలీ తన రాజ్యాంగంపై రెఫరాండం, వచ్చే వారంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్య పాలసీ నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ స్తబ్దుగా కొనసాగిన్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. అంతర్జాతీయంగా వస్తున్న బలహీన సంకేతాలకు ప్రాఫిట్ బుకింగ్ తోడవ్వడంతో మార్కెట్లు నష్టాల బాట పట్టినట్టు చెప్పారు. ఆర్బీఐ ద్రవ్య పాలసీ నేపథ్యంలో బ్యాంక్స్ షేర్లు భారీగా పడిపోయినట్టు పేర్కొన్నారు. కొటక్ మహింద్రా బ్యాంకు 3.12 శాతం, హెచ్డీఎఫ్సీ 2.52 శాతం దిగజారాయి. నేటి మార్కెట్లో బజాజ్ ఆటో, హీరో మోటోకార్పొ, సిప్లా, భారతీ ఎయిర్టెల్ టాప్ గెయినర్లుగా నిలువగా.. అదానీ పోర్ట్స్, మారుతీ, టాటా మోటార్స్, ఏషియన్ పేయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీలు నష్టాలు గడించాయి. -
కరెన్సీ నేలచూపులు
ముంబై: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అనూహ్య విజయంతో డాలర్ బాగా పుంజుకుంది. దీంతో ఇతర కరెన్సీలన్నీ నేలచూపులు చూస్తున్నాయి. . ఈ నేపథ్యంలో దేశీయ కరెన్సీ కూడా భారీగానే పడుతోంది. డాలరుతో మారకంలో 44 పైసలు పతనమై 67.07 వద్ద రెండు నెలల కనిష్టాన్ని నమోదు చేసింది.. తద్వారా సాంకేతికంగా కీలకమైన 67 మార్కు దిగువకు పతనమైంది. కాగా ట్రంప్ విజయంతో డాలర్ 8 ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో బాగా పుంజుకుంది. ప్రధానంగా జపనీస్ యెన్‌తో మారకంలో తాజాగా 3 నెలల గరిష్టాన్ని తాకింది. మరోవైపు దేశీ య సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్, ఫార్మా తప్ప దాదాపు అన్ని రంగాల్లో బలహీనంగా ఉన్నాయి. -
ఫెడ్ ఎఫెక్ట్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ఫెడరల్ రిజర్వు మీటింగ్ భయాందోళనతో దేశీయ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయ సంకేతాలు సైతం మార్కెట్లను కుప్పకూల్చాయి. 270 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్, మరింత పడిపోతూ 27,594వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 95.15 పాయింట్ల నష్టంతో 8,513గా ట్రేడ్ అవుతోంది. ఫెడ్ రిజర్వు బ్యాంకు రెండు రోజుల పాలసీ సమావేశం నేడు ముగియనుంది. దీంతో ఫెడ్ రిజర్వు రేట్లపెంపుపై ఎలాంటి ప్రకటన చేస్తుందోనని పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఫెడరల్ సెంట్రల్ బ్యాంకు వడ్డీరేట్లను పెంచదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ డిసెంబర్లో రేట్ల పెంపు సంకేతాలను ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అటు ఆసియన్ మార్కెట్లు సైతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై వాల్‌స్ట్రీట్ చేస్తున్న భయాందోళన ప్రకటన ఆసియన్ మార్కెట్లకు దెబ్బకొట్టింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు చేరువలో ఉన్నారని వాల్‌స్ట్రీట్ పేర్కొంది. యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ నష్టాలను చవిచూస్తున్నాయి. టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, సీఐఎల్ లాభాలను గడిస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా కోల్పోయింది. మంగళవారం 66.71గా ముగిసిన రూపాయి, నేడు 66.78గా ప్రారంభమైంది. -
యాక్సిస్ బ్యాంకుకు కార్పొరేట్ రుణాల సెగ
ముంబై: దేశంలో మూడవ అతిపెద్ద ప్రయివేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకును మొండి బకాయిల సెగ బాగానే తాకింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసిక ఫలితాల్లో బ్యాంక్ భారీ నికర లాభాలను నమోదు చేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 83 శాత పడిపోయింది. బ్యాంక్ నికర లాభం 83 శాతం క్షీణించి రూ. 319 కోట్లను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ.1,915.60 కోట్ల నికర లాభాలు సాధించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) మాత్రం 11 శాతం పెరిగి రూ. 4,514 కోట్లను అధిగమించింది. నికర ఎన్పీఏలు కూడా 0.48 శాతం నుంచి 2.02 శాతానికి ఎగశాయి.క్యూ2(జూలై-సెప్టెంబర్)లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.54 శాతం నుంచి 4.17 శాతానికి ఎగబాకాయని బ్యాంక్ ప్రకటించింది. గతంలో ప్రకటించిన రూ.7,287 కోట్ల సమస్యాత్మక రుణాలు సెకండ్ క్వార్టర్ ను ప్రభావితం చేసినట్టు చెప్పారు. ఇంకా రూ.13,789 కోట్లరుణాలను వాచ్ లిస్ట్ లో ఉన్నట్టు వెల్లడించారు. ప్రధానంగా కార్పొరేట్ రుణాల ఎగవేత బ్యాంకు రికార్డును దెబ్బతీసిందని బ్యాంక్ ఫైనాన్స్ ఛీఫ్ జైరాం శ్రీధరన్ చెప్పారు. వార్షిక ప్రాతిపదికన మొదటి సగం లో దాదాపు 305 బేసిస్ పాయింట్లను రికార్డ్ చేయనుంది. మునుపటి మార్గదర్శకత్వం 125-150 బేసిస్ పాయింట్లుకంటే రెట్టింపు కంటే ఎక్కువ. ప్రొవిజన్లు ఐదు రెట్లు ఎగసి లాభాలను దెబ్బతీశాయి. ప్రొవిజన్లకు రూ. 3623 కోట్లను కేటాయించింది.నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 20 బేసిస్ పాయింట్లు నీరసించి 3.64 శాతానికి చేరాయి. ఈ నిరాశాజనక ఫలితాలతో మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. దాదాపు 7.56 శాతం పతనమైంది. -
భారీగా పతనమైన బ్రిటిష్ పౌండ్
-
భారీగా పతనమైన బ్రిటిష్ పౌండ్
లండన్ : బ్రిటిష్ కరెన్సీ పౌండ్ విలువ దారుణంగా పడిపోయింది. డాలర్ తో పోలిస్తే పౌండ్ విలువ 31ఏళ్ల కనిష్టానికి పతనమైంది. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్ వాసులు ఓటు వేసిన ఉదంతం తరువాత భారీగా క్షీణించింది. అనంతరం ఇది మరో భారీ పతనం. జూన్ 1985 నాటికి విలువకు పడిపోయింది. ఈ పతనం మరింత కొనసాగనుందని ఎనలిస్టులు భావిస్తున్నారు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ఆందోళనలతో పెట్టుబడిదారులు కరెన్సీ విక్రయాలకు దిగారు. దీంతో పౌండ్ విలువ1శాతం నష్టంతో మూడు దశాబ్దాల కిందికి దిగజారింది. బ్రిటన్ ప్రధానమంత్రి థెరిస్సా మే బ్రెగ్జిట్ మార్చి చివరి నుంచి మొదలవుతుందని ఆదివారం ప్రకటించారు. దీంతో సోమవారం స్టెర్లింగ్ పౌండ్ 1 శాతానికిపైగా నష్టపోయింది. ఈ అమ్మకాలు మంగళవారం కొనసాగాయి. అధికారిక 'ఆర్టికల్ 50' చట్టపరమైన నిష్క్రమణ ప్రక్రియ తర్వాత బ్రిటన్, ఈయూ ప్రాధమిక రెండు సంవత్సరాల నెగోషియేటింగ్ పీరియడ్ లోకి ప్రవేశించనున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పౌండ్ అతిపెద్ద పతనాలు 1971లో నిక్సన్ ప్రభుత్వం అంతర్జాతీయంగా డాలర్‌ను బంగారంతో మార్చడాన్ని రద్దు చేసినప్పుడు దాదాపు పౌండ్ 3.4శాతం విలువ కోల్పోయింది. దీనిని అప్పట్లో 'నిక్సన్ షాక్'గా అభివర్ణించారు. 1978 నవంబర్ 1న యూకే ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం దెబ్బతినడంతో ఒక్క రోజులో 4.3శాతం విలువ కోల్పోయింది. దీనిని 'వింటర్ ఆఫ్ డిస్కాంటెంట్'గా పేర్కొన్నారు. యూకే 1992 సెప్టెంబర్ 16న ఈయూ ఎక్స్చేంజి రేట్ వ్యవస్థ నుంచి వైదొలగింది. ఈ నేపథ్యంల పౌండ్ 4.29శాతం విలువ కోల్పోయింది. 2009 జూన్ 20న ఆర్థిక సంక్షోభం కారణంగా పౌండ్ 3.9శాతం విలువ కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా డాలర్ తోపోలిస్తే దేశీ కరెన్సీ రూపాయి 0.02పైసల నష్టంతో ఉంది. గత మూడు రోజులుగా లాభాలతో ఉన్న రూపాయి నష్టాల్లోకి జారుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి 4 పైసలు పెరిగింది. 66.54 వద్ద మొదలై 66.90 దగ్గ ఉంది. -
భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఆరంభంలోనే మదుపర్లు షాకిచ్చిన మార్కెట్లు మిడ్ సెషన్లో కొద్దిగా కోలుకున్నా చివరికి భారీ నష్టాల్లోనే ముగిశాయి. 443 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 28,353 వద్ద, నిఫ్టీ 151 పాయింట్ల నష్టంతో 8,715, వద్ద క్లోజ్ అయ్యాయి. బ్రెగ్జిట్ సంక్షోభం తర్వాత ఇదే భారీ పతనమని మార్కెట్ల వర్గాలు అంచనావేశాయి. ప్రధానంగా అన్ని రంగాల సూచీలు నష్టాల బాట పడ్డాయి. మిడ్ సెషన్ నుంచీ పెరిగిన అమ్మకాలతో బ్యాంక్ సెక్టార్ భారీగా పతనం కాగా, ఐటీ సెక్టార్ లాభాలను ఆర్జించింది.. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాలు కూడా మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. దీంతో రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ సూచీల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆటో, మీడియా, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు కూడా ఇదే బాట పట్టాయి. హిందాల్కో బీవోబీ, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, యస్‌బ్యాంక్, అంబుజా, టాటా పవర్, ఏసీసీ, స్టేట్‌బ్యాంక్, భెల్ నష్టపోగా, ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఆర్ఐఎల్, టీసీఎస్ లాభపడ్డాయి. అమెరికా మందగమనం, బ్రెక్సిట్ వంటి అంశాల కారణంగా ఇటీవల నీరసించిన ఈ రంగంలో ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌కు దిగడం దీనికి కారణమని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు బక్రీద్ సందర్భంగా మంగళవారం మార్కెట్లకు సెలవు. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి మరింత నేల చూపులు చూస్తోంది. 22 పైసల భారీ పతనంతో 66.94 దగ్గర ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. ల పసిడి రూ.102 నష్టంతో రూ. 31,115 వద్ద ఉంది. -
నిరాశపర్చిన టాటాపవర్
ముంబై: ముంబైకి చెందిన ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం టాటా పవర్ మంగళవారం క్యూ1 ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభాల్లో 76 శాతం, ఆదాయంలో 5శాతం క్షీణతను నమోదు చేసింది. ఇది గత ఏడాది రూ.303కోట్ల తోపోలిస్తే నికర లాభాలో భారీగా క్షీణించాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో నికర లాభం రూ. 72.5 కోట్లను ప్రకటించింది. ఆదాయం కూడా రూ. 7184 కోట్ల నుంచి రూ. 6838 కోట్లకు తగ్గింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 1636 కోట్లకు చేరగా, ఇతర ఆదాయం 54 శాతం తగ్గి రూ.112 కోట్లకు పరిమితమైంది. ఈ కాలంలో రూ. 312 కోట్లమేర వన్‌టైమ్ నష్టం నమోదైనట్లు కంపెనీ తెలియజేసింది. ఈ నిరుత్సాహకర ఫలితాలతో టాటా పర్ షేరు దాదాపు 3శాతానికిపైగా క్షీణించింది. అయితే నికర లాభాలు రూ.335 కోట్లు, ఆదాయాన్ని రూ.9,270కోట్లుగా ఉండనుందని ఎనలిస్టులు అంచనావేశారు -
నేలచూపులు చూస్తున్న రూపాయి
ముంబై: అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు ప్రపంచ కరెన్సీలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వరుసగా మూడో రోజు దేశీయ కరెన్సీ రూపాయి డాలర్ తో పోలిస్తే మరింత దిగజారింది 16 పైసలు క్షీణించి 67.21 వద్ద నేలచూపులు చూస్తోంది. రూపాయి విలువ దాదాపు మూడు వారాల కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 13 పైసలు క్షీణించి 67.18 వద్ద ట్రేడవుతోంది. ఇది మూడు వారాల కనిష్టంకాగా, గత శుక్రవారం డాలరుతో మారకంలో 24 పైసలు క్షీణించిన రూపాయి సాంకేతికంగా కీలకమైన 67 స్థాయిని దాటి బలహీనపడింది. పెరుగుతున్న ముడిచమురు ధరల కారణంగా దిగుమతిదారుల నుంచి డాలరుకు డిమాండ్ పెరిగినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఇది రూపాయిని బలహీనపరిచిందనీ, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడటం కూడా ప్రభావం చూపిందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపుంజుకుందన్న ఫెడ్ రిజర్వ్ ఉపాధ్యక్షుడు స్టాన్లీ ఫిచెర్ వ్యాఖ్యలు రూపాయి విలువను ప్రభావితం చేసిందని ఫారెక్స్ డీలర్స్ చెప్పారు. జాక్సన్ హోల్లో ప్రసంగించనున్న అమెరికా ఫెడలర్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ యెలెన్ వడ్డీ రేట్ల పెంపుపై సంకేతాలు ఇవ్వవచ్చునంటూ పెరిగిన అంచనాలు డాలరుకు బలాన్నిచ్చినట్లు వివరించారు. ఫెడ్ వడ్డీ రేట్లు పెరగనున్నాయనే అంచనాలతో డాలర్ బాగా బలపడడంతో బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరిగింది. అటు దేశీ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సందేశాలు, రూపాయి బలహీనత నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు దిగారు. -
భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు
ముంబై: వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు జూన్ 24 తరువాత మళ్లీ భారీగా పతనమయ్యాయి. రోజు మొత్తం నష్టాలతో నీరసంగా కదిలిన మార్కెట్లు చివరికి రోజులో కనిష్టం వద్దే ముగిశాయి ప్రారంభంలో 50 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ మిడ్ సెషన్ తరువాత భారీగా పతనమైంది. అమ్మకాల ఒత్తిడితో ఒకదశలో 350 పాయింట్లకు పైగా కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 310 పాయింట్ల నష్టంతో 27,774 దగ్గర, నిఫ్టీ 103 పాయింట్ల నష్టంతో 8,575 దగ్గర క్లో జ్ అయ్యాయి. ప్రధానంగా ఆటో, సెక్టార్ లో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఇదే ట్రెడ్ దాదాపు అన్ని ప్రభుత్వ రంగ షేర్లలో కనిపించింది. మారుతి, ఎం అండ్ ఎం, హీరో మోటో కార్ప్, ఐషర్ మోటార్స్ , మదర్సన్ సుమి అశోక్ లేలాండ్ భారీగా నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఏ బ్యాంక్ టాప్ సెల్లర్స్ గా నిలిచాయి. అదానీ పోర్ట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు లాభపడ్డాయి. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 0.012 పైసల లాభంతో 66.72వద్ద ఉండగా, పసిడి ధరలు కూడా లాభాల్లో ఉన్నాయి. రూ. ఎంసీఎక్స్ లో పది గ్రాముల బంగారం ధర రూ. 218 లాభంతోరూ. 31,491 వద్ద ఉంది. -
వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 284 పాయంట్లు నష్టంతో దగ్గర, నిఫ్టీ 78 పాయింట్ల నష్టంతో 8,544 దగ్గర ముగిసాయి గ్లోబల్ వీక్ నెస్, భారీ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా వరుసగా నాలుగో రోజుకూడా సూచీలన్నీ పతనం దిశగా పయనించాయి. దీంతో సెన్సెక్స్, 28 వేల దిగువకు, నిఫ్టీ 86 వేల దిగువకు పడిపోయాయి. జీఎస్ టీబిల్లుపై అనిశ్చితి తొలగకపోవడంతో బుధవారం నాటి ఈక్విటీ మార్కెట్లు నెగిటివ్ గా స్పందించాయి. ఈ నాటి ట్రేడింగ్‌లో భారీ అమ్మకాల ఒత్తిడికి లోనైనరంగాల్లో ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఉన్నాయి. మరోవైపు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జీఎస్ టీ బిల్లును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఒకే దేశం ఒకే పన్ను విధానానికి మద్దతు తెలిపాలని సభ్యులను కోరారు. చర్చ కొనసాగుతోంది. కాగా బిల్లుపై కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం వేడివేడి వ్యాఖ్యలు చేయడం మార్కెట్లపై ప్రభావం చూపింది. బిల్లులో మరిన్ని సవరణలు చేయాల్సి ఉన్నదంటూ చిదంబరం పేర్కొనడంతో చివర్లో అమ్మకాలు పెరిగాయి. అన్ని రంగాలూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. కాగా, ఐటీ సెక్టార్ స్థిరంగా ఉంది. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ 2.5 శాతం పడిపోగా, ఆటో, రియల్టీ, మీడియా, బ్యాంకింగ్ 1.8-0.7 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో భెల్, ఐటీసీ, టాటా మోటార్స్, మారుతీ, ఐషర్ మోటార్స్, అరబిందో, పవర్‌గ్రిడ్, రిలయన్స్, టీసీఎస్ 3.7-2 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే మరోవైపు ప్రోత్సాహకర క్యూ1 ఫలితాలతో హెచ్‌సీఎల్ టెక్ 3 శాతం ఎగసింది. ఈ బాటలో ఇన్ఫ్రాటెల్, సిప్లా, ఏషియన్ పెయింట్స్, బాష్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, యస్‌బ్యాంక్ 2-0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఈ మధ్య కాలంలో భారీ గా లాభపడిన స్టాక్ మార్కెట్లు కన్ సాలిడేషన్ పీరియడ్ లో ఉన్నాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ఇది మార్కెట్లకు ఆరోగ్యకరమైన సంకేతమని బ్రోకరేజ్ సర్వీస్ నిపుణుడు ప్రదీప్ హాట్ చందాని తెలిపారు. నిఫ్టీ ప్రస్తుత స్థాయినుంచి కిందికి జారితే 8450 స్థాయి ప్రధానమద్దతని తెలిపారు. -
ఐటీ రంగాన్ని ముంచేసిన బ్రెగ్జిట్
ముంబై: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ఐటి షేర్లను తీవ్ర నష్టాల్టోకి నెట్టేసింది. డాలర్ కు వ్యతిరేకంగా బ్రిటిష్ పౌండ్ విలువ భారీగా పతనంకావడంతో శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఐటి ఇండెక్స్ 4 శాతానికి పైగా నష్టపోయింది. అయితే ఈ ప్రభావం స్వల్ప కాలం మాత్రమేని ఐటి నిపుణులు వ్యాఖ్యానించారు. టెక్ మహీంద్రా దాదాపు 7 శాతం, హెచ్ సీఎల్ టెక్ ఎక్కువ 6 శాతం క్షీణించగా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో 3 నుంచి 6 శాతం మేర పతనమయ్యాయి. అలాగే యూకే నుంచి టీసీఎస్ 13 శాతం, హెచ్ సీఎల్ టెక్ 14 శాతం భారీ ఆదాయాన్ని పొందుతుండగా, ఇన్ఫోసిస్ , విప్రో లు కూడా దాదాపు 7 నుంచి11 శాతం ఆదాయాన్ని పౌండ్లలో పొందుతున్నాయని విశ్లేషకులు చెప్పారు. బ్రెగ్జిట్ నిర్ణయం మూలంగా పౌండ్ విలువ 31 సంవత్సరాల కనిష్ఠానికి కూలిపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుందని తెలిపారు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ) వైదొలగుతున్న ప్రభావం ఐటి పరిశ్రమ పై స్వల్పకాలికమేనని పరిశ్రమ పెద్దలు అభిప్రాయ పడ్డారు. ఈ అనిశ్చిత వాతావరణంలో భారీ హెచ్చుతగ్గులు, ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు. బ్రెగ్జిట్ ప్రభావంతో మారకపు అనిశ్చితి కారణంగా ప్రతికూల ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు. కాగా బ్రిటన్ గురువారం జరిగిన ఒక చరిత్రాత్మక ప్రజాభిప్రాయ సేకరణలో 43 సంవత్సరాల తర్వాత ఈయూని వీడింది. ఈ పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : బ్యాంకింగ్, ఐటీ, రియాల్టీ, ఆటో స్టాక్స్ లో కొనసాగుతున్న నష్టాలతో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ ఒడిదుడుకులకు లోనవుతోంది. అదేవిధంగా మార్నింగ్ ట్రేడ్ లో 100 పాయింట్ల రేజ్ అయిన బీఎస్ఈ సెన్సెక్స్ సైతం 63.94 పాయింట్లు నష్టపోతోంది. సెన్సెక్స్ 25,426 వద్ద, నిఫ్టీ 7,796 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకు ఆఫ్ బరోడా నాలుగో త్రైమాసికంలో రూ.3,230 కోట్ల నష్టాలను నమోదుచేస్తూ శుక్రవారం ఫలితాలను విడుదలచేయడంతో, నేటి ట్రేడింగ్ 7శాతం మేర ఆ బ్యాంకు షేర్లు పతనమవుతున్నాయి. మార్కెట్ విశ్లేషకులు అంచనావేసిన కంటే దారుణంగా దీని లాభాలు పడిపోయాయి. బ్యాంకు ఆప్ బరోడాతో పాటు యూకో బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, దేనా బ్యాంకులు మొండి బకాయిల బెడదతో క్యూ4 ఫలితాల్లో నిరాశను చూపాయి. దీంతో నిఫ్టీ పీఎస్ యూ ఇండెక్స్ 3శాతం కిందకు జారింది. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, ఏషియన్ పేయింట్స్, బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా లాభాల్లో నడుస్తుండగా.. ఎస్ బీఐ, భారతీ ఎయిర్ టెల్, హెచ్ యూఎల్, ఐసీఐసీఐ బ్యాంకు, గెయిల్ నష్టాలను నమోదుచేస్తున్నాయి. పసిడి, వెండి ధరలు నేటి మార్కెట్లో పుంజుకున్నాయి. పసిడి రూ.63 పెరిగి రూ.30,097గా నమోదవుతుండగా... వెండి రూ.392 పెరిగి రూ. 41,366గా ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.85గా ఉంది.