కరెన్సీ నేలచూపులు
ముంబై: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అనూహ్య విజయంతో డాలర్ బాగా పుంజుకుంది. దీంతో ఇతర కరెన్సీలన్నీ నేలచూపులు చూస్తున్నాయి. . ఈ నేపథ్యంలో దేశీయ కరెన్సీ కూడా భారీగానే పడుతోంది. డాలరుతో మారకంలో 44 పైసలు పతనమై 67.07 వద్ద రెండు నెలల కనిష్టాన్ని నమోదు చేసింది.. తద్వారా సాంకేతికంగా కీలకమైన 67 మార్కు దిగువకు పతనమైంది.
కాగా ట్రంప్ విజయంతో డాలర్ 8 ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో బాగా పుంజుకుంది. ప్రధానంగా జపనీస్ యెన్తో మారకంలో తాజాగా 3 నెలల గరిష్టాన్ని తాకింది. మరోవైపు దేశీ య సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పీఎస్యూ బ్యాంకింగ్, ఫార్మా తప్ప దాదాపు అన్ని రంగాల్లో బలహీనంగా ఉన్నాయి.