వారాంతంలో భారీ నష్టాలు!
Published Fri, Dec 2 2016 4:11 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
ట్రేడింగ్ ఆరంభంలో 100 పాయింట్లకు పైగా దిగజారిన స్టాక్మార్కెట్లు, అమ్మకాల ఒత్తిడితో మధ్యాహ్న సెషన్లో మరింత పడిపోయి వారం ముగింపులో భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. సెన్సెక్స్ ఒక్కసారిగా 329.26 పాయింట్లు కుప్పకూలి 26,230.66 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 106.10 పాయింట్లు పడిపోయి 8086.80గా క్లోజ్ అయింది.
పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ఆటో కంపెనీల నవంబర్ నెల విక్రయ డేటా ఒక్కసారిగా కుప్పకూలడం, పోటీ తీవ్రతరమవడంతో వైరలెస్ ప్రొవేడర్ల షేర్లు అతలాకుతలమవడం మార్కెట్లను దెబ్బతీసింది. అమెరికా నెల వారీ ఉద్యోగ డేటా విడుదల, ఇటలీ తన రాజ్యాంగంపై రెఫరాండం, వచ్చే వారంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్య పాలసీ నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ స్తబ్దుగా కొనసాగిన్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు.
అంతర్జాతీయంగా వస్తున్న బలహీన సంకేతాలకు ప్రాఫిట్ బుకింగ్ తోడవ్వడంతో మార్కెట్లు నష్టాల బాట పట్టినట్టు చెప్పారు. ఆర్బీఐ ద్రవ్య పాలసీ నేపథ్యంలో బ్యాంక్స్ షేర్లు భారీగా పడిపోయినట్టు పేర్కొన్నారు. కొటక్ మహింద్రా బ్యాంకు 3.12 శాతం, హెచ్డీఎఫ్సీ 2.52 శాతం దిగజారాయి. నేటి మార్కెట్లో బజాజ్ ఆటో, హీరో మోటోకార్పొ, సిప్లా, భారతీ ఎయిర్టెల్ టాప్ గెయినర్లుగా నిలువగా.. అదానీ పోర్ట్స్, మారుతీ, టాటా మోటార్స్, ఏషియన్ పేయింట్స్, హెచ్డీఎఫ్సీలు నష్టాలు గడించాయి.
Advertisement
Advertisement