చివరి గంటల్లో లాభాలు పోయాయ్!
Published Tue, Jun 13 2017 3:49 PM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM
మార్నింగ్ నుంచి లాభాల్లో ట్రేడవుతూ వచ్చిన మార్కెట్లు చివరికి ఫ్లాట్ గా ముగిశాయి. ఇంట్రాడేలో 150 పాయింట్లకుపైగా ఎగిసిన సెన్సెక్స్ స్వల్పంగా 7.79 పాయింట్లు లాభపడి 31,103 వద్ద, నిఫ్టీ స్వల్పంగా 9.50 పాయింట్లు నష్టపోయి 9,606 వద్ద క్లోజయ్యాయి. మిడ్ క్యాప్స్ కూడా ఫ్లాట్ గానే ముగిశాయి. మెటల్, ఐటీ, ఆటో, పవర్ స్టాక్స్ కిందకి దిగజారగా.. ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రాక్ట్ర్చర్ లాభాల్లో నమోదయ్యాయి. లుపిన్ 2 శాతం పైగా లాభాలు పండించింది. లుపిన్ తో పాటు ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, ఎల్ అండ్ టీ, హెచ్యూఎల్ లు లాభాల్లో కొనసాగాయి.
టీసీఎస్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఐటీసీ ఒత్తిడిలో ట్రేడై, నష్టాలు గడించాయి. కాగ నిన్న విడుదల చేసిన ద్రవ్బోల్బణ డేటా రికార్డు కనిష్ట స్థాయిల్లో నమోదవడంతో మార్నింగ్ సెషన్ లో సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభాల్లో నడించింది. మధ్యాహ్న ట్రేడింగ్ లోనూ తన లాభాలను కొనసాగించింది. కానీ ఆఖరికి మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 64.43గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 108 రూపాయలు నష్టపోయి, 28,885గా నమోదయ్యాయి.
Advertisement