ముంబై: వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు జూన్ 24 తరువాత మళ్లీ భారీగా పతనమయ్యాయి. రోజు మొత్తం నష్టాలతో నీరసంగా కదిలిన మార్కెట్లు చివరికి రోజులో కనిష్టం వద్దే ముగిశాయి ప్రారంభంలో 50 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ మిడ్ సెషన్ తరువాత భారీగా పతనమైంది. అమ్మకాల ఒత్తిడితో ఒకదశలో 350 పాయింట్లకు పైగా కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 310 పాయింట్ల నష్టంతో 27,774 దగ్గర, నిఫ్టీ 103 పాయింట్ల నష్టంతో 8,575 దగ్గర క్లో జ్ అయ్యాయి. ప్రధానంగా ఆటో, సెక్టార్ లో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఇదే ట్రెడ్ దాదాపు అన్ని ప్రభుత్వ రంగ షేర్లలో కనిపించింది. మారుతి, ఎం అండ్ ఎం, హీరో మోటో కార్ప్, ఐషర్ మోటార్స్ , మదర్సన్ సుమి అశోక్ లేలాండ్ భారీగా నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఏ బ్యాంక్ టాప్ సెల్లర్స్ గా నిలిచాయి. అదానీ పోర్ట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు లాభపడ్డాయి.
అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 0.012 పైసల లాభంతో 66.72వద్ద ఉండగా, పసిడి ధరలు కూడా లాభాల్లో ఉన్నాయి. రూ. ఎంసీఎక్స్ లో పది గ్రాముల బంగారం ధర రూ. 218 లాభంతోరూ. 31,491 వద్ద ఉంది.
భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు
Published Wed, Aug 10 2016 3:59 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
Advertisement