సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం కొత్త సంవత్ 2079ని అట్టహాసంగా ప్రారంభించిన సూచీలు మంగళవారం స్వల్పంగా వెనుకబడ్డాయి. ఎనిమిదో వరుస సెషన్‌లో లాభాలతో టట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్ ప్రస్తుతం 90 పాయింట్ల నష్టంతో 59741 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు వెనుకబడి 17706 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది.
ఊహించిన దానికంటే మెరుగైన త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ మంగళవారం రికార్డు స్థాయికి చేరుకుంది. బీఎస్‌ఇలో 1.81 శాతం పెరిగి గరిష్టంగా రూ.943 తాకింది. అయితే 21 శాతం పెరుగుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. మరోవైపు టెక్‌మహీంద్ర, మారుతి సుజుకి, గ్రాసిం, డా. రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా లాభపడుతుండగా, నెస్లే, కోటక్ మహీంద్ర, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంకు, యూపీఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.72 స్థాయికి బలహీనపడింది.
Comments
Please login to add a commentAdd a comment