ముంబై: దేశంలో మూడవ అతిపెద్ద ప్రయివేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకును మొండి బకాయిల సెగ బాగానే తాకింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసిక ఫలితాల్లో బ్యాంక్ భారీ నికర లాభాలను నమోదు చేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 83 శాత పడిపోయింది. బ్యాంక్ నికర లాభం 83 శాతం క్షీణించి రూ. 319 కోట్లను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ.1,915.60 కోట్ల నికర లాభాలు సాధించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) మాత్రం 11 శాతం పెరిగి రూ. 4,514 కోట్లను అధిగమించింది. నికర ఎన్‌పీఏలు కూడా 0.48 శాతం నుంచి 2.02 శాతానికి ఎగశాయి.క్యూ2(జూలై-సెప్టెంబర్)లో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.54 శాతం నుంచి 4.17 శాతానికి ఎగబాకాయని బ్యాంక్ ప్రకటించింది. గతంలో ప్రకటించిన రూ.7,287 కోట్ల సమస్యాత్మక రుణాలు సెకండ్ క్వార్టర్ ను ప్రభావితం చేసినట్టు చెప్పారు. ఇంకా రూ.13,789 కోట్లరుణాలను వాచ్ లిస్ట్ లో ఉన్నట్టు వెల్లడించారు. ప్రధానంగా కార్పొరేట్ రుణాల ఎగవేత బ్యాంకు రికార్డును దెబ్బతీసిందని బ్యాంక్ ఫైనాన్స్ ఛీఫ్ జైరాం శ్రీధరన్ చెప్పారు.
వార్షిక ప్రాతిపదికన మొదటి సగం లో దాదాపు 305 బేసిస్ పాయింట్లను రికార్డ్ చేయనుంది. మునుపటి మార్గదర్శకత్వం 125-150 బేసిస్ పాయింట్లుకంటే రెట్టింపు కంటే ఎక్కువ. ప్రొవిజన్లు ఐదు రెట్లు ఎగసి లాభాలను దెబ్బతీశాయి. ప్రొవిజన్లకు రూ. 3623 కోట్లను కేటాయించింది.నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 20 బేసిస్ పాయింట్లు నీరసించి 3.64 శాతానికి చేరాయి. ఈ నిరాశాజనక ఫలితాలతో మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. దాదాపు 7.56 శాతం పతనమైంది.
యాక్సిస్ బ్యాంకుకు కార్పొరేట్ రుణాల సెగ
Published Wed, Oct 26 2016 10:56 AM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
Advertisement
Advertisement