సాక్షి,ముంబై: లిక్కర్ దిగ్గజం యునైటెడ్ స్పిరిట్స్ క్యూ3లో నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసిక ఫలితాల్లో ఎనలిస్టుల అంచనాలను అందుకోలేక పోయింది. నికర లాభాలు 9 శాతం క్షీణించగా ఆదాయం కూడా భారీ క్షీణతను నమోదు చేసింది. దీంతో ఇవాల్టీ మార్కెట్‌లో యునైటెడ్ స్పిరిట్స్ షేరు భారీగా నష్టపోయింది. 6.7శాతం పతనమై రూ. 3,501ని తాకింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో యునైటెడ్ స్పిరిట్స్ లాభం 9 శాతం క్షీణించి రూ. 135 కోట్లను తాకగా..మొత్తం ఆదాయం 8శాతం తగ్గి రూ. 2,263 కోట్లకు పరిమితమైంది. ఇబిటా సైతం 7శాతం నీరసించి రూ. 272 కోట్లకు చేరింది. కొన్ని రాష్ట్రాల్లోని మార్కెట్ మార్పులకు అనుగుణంగా ఈ త్రైమాసికంలో తమ నికర విక్రయాలపై ప్రతికూలంగా ప్రభావం కనిపించిందని యునైటెడ్ స్పిరిట్స్ సిఇఓ ఆనంద్ క్రిపాలు వెల్లడించారు. ముఖ్యంగా హై వేలపై మద్య నిషేధం తమ లాభాలను కొంతవరకు దెబ్బతీసిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment