United Spirits
-
హైవే బ్యాన్ దెబ్బ: చతికిలపడిన యునైటెడ్ స్పిరిట్స్
సాక్షి,ముంబై: లిక్కర్ దిగ్గజం యునైటెడ్ స్పిరిట్స్ క్యూ3లో నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసిక ఫలితాల్లో ఎనలిస్టుల అంచనాలను అందుకోలేక పోయింది. నికర లాభాలు 9 శాతం క్షీణించగా ఆదాయం కూడా భారీ క్షీణతను నమోదు చేసింది. దీంతో ఇవాల్టీ మార్కెట్లో యునైటెడ్ స్పిరిట్స్ షేరు భారీగా నష్టపోయింది. 6.7శాతం పతనమై రూ. 3,501ని తాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో యునైటెడ్ స్పిరిట్స్ లాభం 9 శాతం క్షీణించి రూ. 135 కోట్లను తాకగా..మొత్తం ఆదాయం 8శాతం తగ్గి రూ. 2,263 కోట్లకు పరిమితమైంది. ఇబిటా సైతం 7శాతం నీరసించి రూ. 272 కోట్లకు చేరింది. కొన్ని రాష్ట్రాల్లోని మార్కెట్ మార్పులకు అనుగుణంగా ఈ త్రైమాసికంలో తమ నికర విక్రయాలపై ప్రతికూలంగా ప్రభావం కనిపించిందని యునైటెడ్ స్పిరిట్స్ సిఇఓ ఆనంద్ క్రిపాలు వెల్లడించారు. ముఖ్యంగా హై వేలపై మద్య నిషేధం తమ లాభాలను కొంతవరకు దెబ్బతీసిందని చెప్పారు. -
లిక్కర్ షేర్లకు మంచి కిక్కు..
లిక్కర్ కంపెనీ షేర్లు నేటి ట్రేడింగ్‌లో మంచి కిక్కు అందిస్తున్నాయి. యునిటెడ్ స్పిరిట్స్ ఏకంగా ఇంట్రాడే ట్రేడ్‌లో 16 శాతం మేర ర్యాలీ జరుపుతోంది. కంపెనీ భారీ లాభాలను నమోదుచేయడంతో, ఈ మేర దూసుకెళ్తున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో యునిటెడ్ స్పిరిట్స్ విక్రయాల్లో పడిపోయినప్పటికీ, లాభాల్లో మాత్రం భారీగా 84 శాతం జంప్ చేసి, రూ.153 కోట్లను నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.83 కోట్లున్నాయి. కంపెనీ ఈబీఐటీడీఏలు 57 శాతం పెరిగి రూ.318 కోట్లను రికార్డు చేశాయి. స్థూల మార్జిన్లు పెరగడం, తక్కువ స్టాఫ్ వ్యయాలు ఉండటం, మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్లు పెరగడం వంటి కంపెనీకి సహకరించాయి. హైవేలపై లిక్కర్ అమ్మకాలు బ్యాన్ చేయడంతో, నికర అమ్మకాలు యునిటెడ్ స్పిరిట్స్వి కాస్త తగ్గాయి. అయినప్పటికీ కంపెనీ బలమైన లాభాలనే నమోదుచేసింది. ఈ జోరుతో యునిటెడ్ స్పిరిట్స్ షేర్లతో పాటు ఇతర లిక్కర్ కంపెనీల షేర్లు కూడా లాభాలు పండిస్తున్నాయి. జీఎం బెవరీస్, పయనీర్ డిస్టిలరీస్ కంపెనీలు 10 శాతం మేర లాభపడ్డాయి. మిగతా లిక్కర్ కంపెనీలు కూడా నేటి ట్రేడింగ్‌లో జోష్‌గా దూసుకుపోతున్నాయి. -
మాల్యా ఆస్తుల అమ్మకం యోచనలో యూఎస్ఎల్
న్యూఢిల్లీ: ఒప్పందం ప్రకారం వ్యాపారవేత్త, మాజీ చైర్మన్ విజయ్ మాల్యా గడువులోగా నిర్దిష్ట 13 ప్రాపర్టీలను తిరిగి కొనుగోలు చేయకపోవడంతో వాటిని విక్రయించాలని యునైటెడ్ స్పిరిట్స్ యోచిస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో యూఎస్ఎల్ను డియాజియో సంస్థ దక్కించుకున్న దరిమిలా కుదిరిన 75 మిలియన్ డాలర్ల డీల్ కింద నిర్దేశిత గడువులోగా మాల్యా తన ప్రాపర్టీలను తిరిగి కొనుక్కోవాల్సి ఉంది. అయితే, గడువు తీరిపోయినప్పటికీ మాల్యా గానీ ఆయన నామినీ గానీ కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్ రేటు ప్రకారం వీటిని విక్రయించాలని యోచిస్తున్నట్లు యూఎస్ఎల్ తెలిపింది. నష్టాల్లోకి యునైటెడ్ స్పిరిట్స్ లిక్కర్ కింగ్ యునైటెడ్ స్పిరిట్స్ మార్చి క్వార్టర్లో రూ.104 కోట్ల నష్టాలను ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.1.4 కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. ఆదాయం మాత్రం 9 శాతం వృద్ధితో రూ.5,931 కోట్ల నుంచి రూ.6,474 కోట్లకు వృద్ధి చెందింది. 2016–17లో మాత్రం కంపెనీ లాభం రూ.170 కోట్లు, ఆదాయం రూ.25,354 కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.122 కోట్లు, రూ.23,384 కోట్లుగా ఉన్నాయి. -
వినియోగదారులకు పరిహారం చెల్లించండి
యునైటెడ్ స్పిరిట్స్‌ను ఆదేశించిన వినియోగదారుల ఫోరం వరంగల్ లీగల్: శరీరంలో ఉన్న కొవ్వు తగ్గి లావుగా ఉన్న వారు సన్నబడుతారని ప్రచారం చేసి వినియోగదారులను తప్పుదోవ పట్టించిన మద్యం కంపెనీలు నష్టపరిహారం చెల్లించాలని, వినియోగదారుల సంక్షేమ నిధికి అదనంగా డబ్బులు జమ చేయాలని ఆదేశిస్తూ సోమవారం జిల్లా వినియోగదారుల ఫోరం ఇన్చార్జి ప్రెసిడెంట్ పటేల్ ప్రవీణ్‌కుమార్, మెంబర్ ఎస్బీ భార్గవి ఆదేశాలు జారీ చేశారు. శరీరంలో ఉన్న కొవ్వు తగ్గించి, లావుగా ఉన్న వారు సన్నబడుతారని బెంగళూరు కేంద్రంగా ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ వివిధ మార్గాల ద్వారా విస్తృత ప్రచారం చేసింది. దీనిని విశ్వసించిన జనగామ జిల్లా కేంద్రానికి చెందిన జి.వెంకటరమణ, కె.వి.రమణకుమార్ మేక్డాల్ డైట్మేట్ మద్యం సేవించసాగారు. 2014 మే నెల నుంచి కొనుగోలు చేస్తూ ఇంట్లో వారికి లావు తగ్గడానికి సేవిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఇరువురు అనారోగ్యానికి గురైనారు. వైద్య పరీక్షలు చేయగా, గతం కంటే ఎక్కువ కొవ్వు పెరిగింది. దీనితో తమను మద్యం కంపెనీ తప్పుదోవ పట్టించిందని, మాకు జరిగిన నష్టానికి పరిహారంగా రూ.20 లక్షల చొప్పున చెల్లించాలని విడివిడిగా 2014 డిసెంబర్ 30న లీగల్ నోటీసు జారీ చేశారు. కంపెనీ నుంచి ఎలాంటి స్పందన లేదు. చివరకు 2015 జనవరి 17న జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. దీనిపై విచారించిన ఫోరమ్ వినియోగదారులను ప్రచార సాధనాల ద్వారా తప్పుడు మార్గంలో ప్రయాణించడానికి కారకులైనందున ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం, రూ.5వేల చొప్పున ఖర్చులు చెల్లించాలని ఫోరం ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేసుకు రూ. లక్ష చొప్పున రూ. 2 లక్షలను రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధిలో జమ చేయాలని కంపెనీలను ఆదేశించారు. -
బీఐఎఫ్ఆర్ కోసం అనుమతించండి
వాటాదారులను కోరిన యునెటైడ్ స్పిరిట్స్ న్యూఢిల్లీ: పారిశ్రామిక, ఆర్థిక పునర్నిర్మాణ బోర్డ్(బీఐఎఫ్ఆర్-బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్) పరిశీలన కోసం మరోసారి వాటాదారుల ఆమోదాన్ని యునెటైడ్ స్పిరిట్స్ కోరింది. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో తమకు వచ్చిన నష్టాలు తమ నెట్‌వర్త్‌లో సగానికిపైగా మించాయని, అందుకే బీఐఎఫ్ఆర్ పరిశీలన కోసం వాటాదారుల ఆమోదాన్ని మరోసారి కోరుతున్నామని యునెటైడ్ స్పిరిట్స్ పేర్కొంది. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన నష్టాలు రూ.5,850 కోట్లకు చేరాయని, ఇది తమ నెట్‌వర్త్‌లో సగం కంటే ఎక్కువేనని వాటాదారులకు పంపిన నోటీస్‌లో యునెటైడ్ స్పిరిట్స్ పేర్కొంది. వచ్చే నెల 14న వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) నిర్వహించనున్నామని వెల్లడించింది. ఖాయిలా పారశ్రామిక కంపెనీల చట్టం ప్రకారం, గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఏ కంపెనీ నష్టాలైనా ఈ కంపెనీ నెట్‌వర్త్‌లో సగానికి చేరితే బీఐఎఫ్ఆర్ పరిశీలన కోరవచ్చు. ఈ ఏడాది జనవరి 22న జరిగిన అసాధారణ వార్షిక సమావేశం (ఈజీఎం)లో బీఐఎఫ్ఆర్ పరిశీలనకు వాటాదారుల అనుమతిని యునెటైడ్ స్పిరిట్స్ కోరింది. -
ఆ డబ్బు మాల్యాని విత్ డ్రా చేసుకోనివ్వండి.. !
75 మి. డాలర్ల డీల్‌పై డియాజియో హోల్డింగ్స్ నెథర్లాండ్స్ పిటిషన్ బెంగళూరు: యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడానికి సంబంధించి విజయ్‌మాల్యాతో కుదుర్చుకున్న ఒప్పందం అమలు జరిగేలా చూడాలని డియాజియో హోల్డింగ్స్ నెథర్లాండ్స్ బెంగళూరు డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)ని ఆశ్రయించింది. ఈ దిశలో ఒప్పందం మేరకు 75 మిలియన్ డాలర్లను (దాదాపు రూ.500 కోట్లు) మాల్యా ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరింది. ఇప్పటికే బ్రిటిష్ లిక్కర్ దిగ్గజం డియాజియో కూడా ఈ మేరకు ఒక పిటిషన్ దాఖలు చేసింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. మాల్యా యూబీ గ్రూప్ కంపెనీ అయిన యునెటైడ్ స్పిరిట్స్‌లో మెజారిటీ వాటాను డియాజియో 2012లో చేజిక్కించుకుంది. అయితే, యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవితోపాటు కంపెనీ డెరైక్టర్ల బోర్డు నుంచి పూర్తిగా వైదొలగే షరతుపై మాల్యా 75 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.500 కోట్లు) చెల్లించే విధంగా డియాజియో డీల్ కుదుర్చుకుంది. అయితే, ఈ మొత్తం తమకే చెందాలని.. వేల కోట్లు బకాయిలు పడిన మాల్యాకు ఈ సొమ్మును డియాజియో చెల్లించకుండా ఆదేశించాలంటూ ఎస్బీఐ కాన్సార్షియం డీఆర్టీని ఆశ్రయించింది. దీనితో ఈ డబ్బు మాల్యా విత్‌డ్రా చేసుకోకుండా డీఆర్టీ మార్చి 7న స్టే విధించింది. -
యునెటైడ్ స్పిరిట్స్ తనఖా షేర్లు విక్రయం
న్యూఢిల్లీ: యునెటైడ్ బ్రూవరీస్ (హోల్డింగ్)లిమిటెడ్(యూబీహెచ్ఎల్) తనఖా పెట్టిన యునెటైడ్ స్పిరిట్స్ షేర్లను ఈసీఎల్ ఫైనాన్స్ సంస్థ విక్రయించింది. తాము తనఖాగా పెట్టిన 72,250 యునెటైడ్ స్పిరిట్స్ షేర్లను ఈసీఎస్ ఫైనాన్స్ గురువారం విక్రయించిందని బీఎస్ఈకి యూబీహెచ్ఎల్ నివేదించింది. గురువారం నాటి యునెటైడ్ స్పిరిట్స్ ముగింపు ధర రూ.2,526 ధర ప్రకారం చూస్తే ఈ షేర్ల విక్రయ విలువ రూ.18.25 కోట్లుగా ఉంటుంది. విజయ మాల్యా ఆధ్వర్యంలోని యూబీహెచ్ఎల్కు 41,88,556 (2.88 శాతం వాటా) యునెటైడ్ స్పిరిట్స్ షేర్లు ఉన్నాయి.వీటిల్లో 17,13,820(1.8 శాతం వాటా) షేర్లను యూబీహెచ్ఎల్ తనఖా పెట్టింది. బ్యాంకులకు రూ.9,000 కోట్లు చెల్లించాల్సి ఉండగా విజయ్ మాల్యా ఈ నెల 2న భారత్ నుంచి వెళ్లిపోవడం, ఆ తర్వాత ఆయనపై పలు కేసులు నమోదవుత్ను నేపథ్యంలో ఈసీఎల్ ఫైనాన్స్ ఈ తనఖా షేర్లను విక్రయించింది. కాగా బీఎస్ఈలో యునెటైడ్ స్పిరిట్స్ షేర్ ధర 2.3 శాతం లాభపడి రూ.2,586 వద్ద ముగిసింది. -
అందుకే మీతో మాట్లాడను...
మీడియాపై విజయ్ మాల్యా వ్యాఖ్యలు బెంగళూరు: వివిధ వివాదాలతో కొన్నాళ్లుగా వార్తల్లో ఉంటున్న పారిశ్రామిక దిగ్గజం విజయ్ మాల్యా తాజాగా యునెటైడ్ స్పిరిట్స్ (యూఎస్ఎల్) వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మీడియాపై కస్సుబుస్సులాడారు. యూఎస్‌ఎల్‌లో వాటాలు తగ్గించుకుంటున్నారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ప్రస్తుతం బ్యాంకులకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బకాయిల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టినట్లు మాల్యా చెప్పారు. ఏ విధంగా వాటాలు తగ్గించుకోబోతున్నారన్న ప్రశ్నలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రశ్నలెలా ఉన్నాయంటే.. నేనో కొత్త సూట్ కొనుక్కుంటున్నాను అంటే.. ఎక్కడ కొంటున్నాను.. టైలరు ఎవరు లాంటి ప్రశ్నలు మీరు వెంటనే సంధిస్తారు. వాటీజ్ దిస్ యా? నేను ఒక విషయం చెప్పాను. అంతే. దాన్ని మీ ఇష్టమొచ్చినట్లు మార్చేసి, వక్రభాష్యం చెప్పాలనుకోవడం సరికాదు. అందుకే మీడియాతో నేను మాట్లాడను. ఒక్క మాట మాట్లాడితే దానికి పది అర్థాలు వెతుకుతారు’ అంటూ మాల్యా వ్యాఖ్యానించారు. అటు, ఆయన్ను యూఎస్ఎల్ చైర్మన్‌గా తొలగించాలంటూ సమావేశంలో తీర్మానించవచ్చన్న వార్తలపై స్పందిస్తూ.. ‘మీడియాలో వచ్చే కథనాలపై నేను ఎందుకు స్పందించాలి. ఎవరో ఏదో ఊహాజనితంగా రాసేస్తారు. మొత్తం మీడియా అంతా దాన్ని పట్టుకుని రకరకాల ప్రశ్నలు వేస్తుంది. ఇది కరెక్టేనా’ అని ప్రశ్నించారు. రిటైర్మెంటా.. ఆలోచిద్దాం.. మరికొద్ది రోజుల్లో 60వ పడిలోకి అడుగెట్టనున్న మాల్యా .. రిటైర్మెంట్పైనా తనదైన రీతిలో స్పందించారు. యూఎస్ఎల్ బోర్డు నుంచి ఎప్పుడు రిటైర్ అవుతారన్న విలేఖరుల ప్రశ్నలపై మాట్లాడుతూ.. అరవై ఏళ్లు వచ్చాకా ఆలోచిస్తానన్నారు. ‘మీరు ప్రతి మాటకు వక్రభాష్యాలు చెబుతారు. సాధారణంగా 60 ఏళ్లు వచ్చాకా రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని, జీవితాన్ని ఆస్వాదించాలని అప్పుడెప్పుడో నేను చెప్పాను. ఇలా ఆలోచించడంలో తప్పేమీ లేదు. ప్రస్తుతం చాలా మంది నేను అరవయ్యో పడిలోకి అడుగుపెడుతున్నానని గుర్తు చేస్తున్నారు. అయితే, నేను ఇప్పుడే రిటైర్ కావడం లేదు. 60 ఏళ్లు రానివ్వండి అప్పుడు ఆలోచిద్దాం’ అని పేర్కొన్నారు. 1955 డిసెంబర్ 18న జన్మించిన మాల్యా మరికొద్ది రోజుల్లోనే అరవయ్యో పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. -
మాల్యా ఒప్పందం పరిశీలనలో డయాజియో
న్యూఢిల్లీ/లండన్: యునెటైడ్ స్పిరిట్స్ (యూఎస్ఎల్) చైర్మన్ హోదా నుంచి విజయ్ మాల్యాను తప్పించేందుకు కసరత్తు చేస్తున్న డయాజియో గతంలో ఆయనతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పరిశీలిస్తోంది. మాల్యా, ఆయనకు చెందిన యూబీ గ్రూప్ పట్ల నిర్వర్తించాల్సిన విధులను పరిశీలిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఒప్పందం ప్రకారం యూఎస్ఎల్ చైర్మన్‌గా తనను కొనసాగించేందుకు డయాజియో మద్దతు పలికి తీరాల్సిందేనని మాల్యా చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఎగవేతల్లాంటివేవీ లేకపోతేనే ఒప్పంద నిబంధనలు వర్తిస్తాయని యూఎస్‌ఎల్‌లో మెజారిటీ వాటాలున్న డయాజియో తెలిపింది. ఈ నేపథ్యంలోనే డీల్ విధివిధానాలను పరిశీలిస్తున్నట్లు వివరించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తదితర అనుబంధ సంస్థలకు అక్రమంగా నిధుల (రూ.1,337 కోట్లు) మళ్లించారన్న ఆరోపణల మీద యూఎస్ఎల్ చైర్మన్, డెరైక్టర్ హోదాల నుంచి మాల్యాను తప్పించేందుకు డయాజియో చర్యలు ప్రారంభించింది. యూబీ షేర్ల పతనం: యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్‌గా విజయ్ మాల్యా వైదొలగాలన్న డిమాండ్ నేపథ్యంలో యునెటైడ్ బ్రూవరీస్ గ్రూప్‌కు చెందిన వివిధ షేర్లు సోమవారం పతనమయ్యాయి. ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహించడం లేని కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ షేర్ ధర కూడా తగ్గిపోయింది. -
యూబీ రుణాలపై డియాజియో దర్యాప్తు
ముంబై: యూబీ గ్రూప్ కంపెనీలకు యునెటైడ్ స్పిరిట్స్ అందించిన రుణాలపై దర్యాప్తునకు యూకే దిగ్గజం డియాజియో నిర్ణయించడంతో ఈ కంపెనీ షేరు 5% పతనమైంది. బీఎస్ఈలో యునెటైడ్ స్పిరిట్స్ రూ. 2,279 వద్ద ముగిసింది. ఒక దశలో దాదాపు 7% దిగజారి రూ. 2,226 వద్ద కనిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఈలో 4% వరకూ క్షీణించి రూ. 2,300 వద్ద నిలిచింది. రెండు ఎక్స్ఛేంజీల్లోనూ కలిపి 2 లక్షలకుపైగా షేర్లు ట్రేడయ్యాయి. డియాజియో ఇటీవల యునెటైడ్ స్పిరిట్స్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వెరసి గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాలపై దర్యాప్తునకు యునెటైడ్ స్పిరిట్స్ బోర్డ్ ద్వారా తాజాగా ఆదేశించింది. కాగా, యూబీ గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యాను యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. నష్టాల నేపథ్యం గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో యునెటైడ్ స్పిరిట్స్ రూ. 4,489 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. వీటిలో రూ. 1,013 కోట్లను డౌట్ఫుల్ రుణాలుగా చూపించగా, స్కాటిష్ అనుబంధ సంస్థ వైట్ అండ్ మెకే విక్రయానికి సంబంధించి రూ. 3,236 కోట్ల ప్రత్యేక నష్టాన్ని యునెటైడ్ స్పిరిట్స్ నమోదు చేసింది. తాజాగా కంపెనీ బోర్డు ఈ అంశాలపై దర్యాప్తును చేపట్టనుంది. దీనిలో భాగంగా కంపెనీ అధికారులు, సలహాదారులను ప్రశ్నించనున్నట్లు డియాజియో తెలిపింది. పూర్తిస్థాయి అనుబంధ సంస్థలకు సంబంధించి 2013 మార్చి31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం వరకూ ఉన్న రుణాలు, డిపాజిట్లు తదితర అంశాలను దర్యాప్తులో పరిగణనలోకి తీసుకోనున్నట్లు కంపెనీ బోర్డ్ తెలిపింది. -
ఐడీబీఐ బ్యాంక్‌కు సీబీఐ నోటీసు
న్యూఢిల్లీ/ముంబై: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ రుణం ఇవ్వడంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు ప్రారంభించింది. బ్యాంకుకు ఎంక్వైరీ నోటీసు జారీ చేసింది. ఆర్థిక భారంతో సర్వీసులు నిలిచిపోయిన విజయ్‌మాల్యా నియంత్రణలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ రూ.950 కోట్ల రుణం మంజూరు చేసింది. ఇంతభారీ మొత్తం రుణం మంజూరు చేయడంలో విశ్వసనీయత కొరవడిందన్నది సీబీఐ నోటీసుల సారాంశంగా తెలుస్తోంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నెట్‌వర్త్ ప్రతికూలంగా ఉన్నప్పుడు రూ.950 కోట్ల భారీ రుణాన్ని ఐడీబీఐ బ్యాంక్ ఎలా మంజూరు చేసిందో తేలాల్సి ఉందని సీబీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇందుకోసమే ప్రాథమిక విచారణ (పీఈ)కు నోటీసులు జారీ అని తెలిపారు. వివరణ పంపుతాం: బ్యాంక్ సీఎండీ కాగా తాజా వ్యవహారంపై ఐడీబీఐ బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ) ఎంఎస్ రాఘవన్ వివరణ ఇచ్చారు. ‘‘దీని గురించి సమాచారం అంతా ఉంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలను సీబీఐ కోరింది. వాటికి మేము రానున్న కొద్ది రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంది. గతంలో కూడా ఈ తరహాలోనే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కోరడం జరిగింది. బ్యాంకు కూడా సమాధానాలు పంపింది. ఇక్కడ దాయడానికి ఏమీ లేదు. కన్సార్షియం లేదా మల్టిప్లై బ్యాంకింగ్‌లో భాగంగా రుణాలను బ్యాంక్ సమకూర్చింది’’ అని ఆయన అన్నారు. సిండికేట్ బ్యాంక్ నేపథ్యం... ప్రాధాన్యత నిబంధనలకు విరుద్ధంగా కంపెనీల రుణ పరిమితి పెంచేందుకు లంచం తీసుకున్న కేసులో సిండికేట్ బ్యాంక్ సీఎండీ ఎస్.కె.జైన్‌తో పాటు మరో ఏడుగురి అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో సీబీఐ తాజా నోటీసులకు ప్రాధాన్యత ఏర్పడింది. భూషణ్ స్టీల్ కంపెనీ సిండికేట్ బ్యాంకుకు కోట్లాది రూపాయల రుణాలకు సంబంధించిన వాయిదాలను చెల్లించకపోయిన్పటికీ ఆ కంపెనీ రుణ పరిమితిని పెంచేందుకు రూ.50 లక్షల కోసం సంప్రదింపులు జరుపుతున్న జైన్‌ను సీబీఐ అధికారులు ఇటీవలే అరెస్ట్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాం కుల్లో పాలనాపరమైన కొన్ని సమస్యలున్నాయని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవలి పాలసీ విధాన ప్రకటన సందర్భంలోనూ పేర్కొన్నారు. రుణాల మంజూరులో మరింత పారదర్శకత అవసరమన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలన వ్యవస్థపై మరోమారు దృష్టిసారించి లోపాలను సరిదిద్దాల్సి ఉందన్నారు. రుణ బకాయిల్లో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ 2012 అక్టోబర్ నుంచీ కార్యకలాపాలను నిలిపివేసింది. ఎస్బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల బృం దానికి కేఎఫ్ఏ దాదాపు రూ.7,000 కోట్ల బకాయి ఉంది. దీనిలో ఎస్బీఐ వాటా దాదాపు 1,600 కోట్లు. -
మూడు వారాల కనిష్టం
251 పాయింట్లు పతనం 25,063 వద్ద ముగిసిన సెన్సెక్స్ ఆయిల్, రియల్టీ రంగాలు బోర్లా అదే బాటలో బ్యాంకింగ్, మెటల్ మళ్లీ భారీగా పెరిగిన టర్నోవర్ 7,493కు దిగిన నిఫ్టీ-76 పాయింట్లు డౌన్ సహజవాయువు ధరల పెంపు నిర్ణయాన్ని కేంద్రం 3 నెలలు వాయిదా వేయడంతో ఆయిల్ రంగ షేర్లు దెబ్బతిన్నాయి. మరోవైపు జూన్ డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల ముగింపు కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించడంతో కొనుగోళ్లు కరువయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 251 పాయింట్లు నష్టపోయి 25,063 వద్ద ముగిసింది. గత వారం రోజుల్లో ఇదే గరిష్ట పతనంకాగా, ఒక దశలో కనిష్టంగా 25,021ను తాకింది. ఇక నిఫ్టీ కూడా 76 పాయింట్లు క్షీణించింది. 7,500 పాయింట్ల కీలక స్థాయికి దిగువన 7,493 వద్ద నిలిచింది. మంగళవారంనాటి స్థాయిలో మరోసారి ఎక్స్ఛేంజీలలో టర్నోవర్ భారీగా పుంజుకుంది. ఎన్ఎస్ఈ ఎఫ్‌అండ్‌వోలో రూ. 4.29 లక్షలకోట్లకుపైగా నమోదుకాగా, బీఎస్ఈలో రూ. 2.31 లక్షల కోట్లు జరిగింది. వెరసి మొత్తం టర్నోవర్ రూ. 6.83 లక్షల కోట్లకు చేరింది. ఇది మార్కెట్ చరిత్రలో రెండో అత్యధిక టర్నోవర్ కావడం విశేషం! వర్షాభావ పరిస్థితులపై వాతావరణ శాఖ తాజా అంచనాలు కూడా సెంటిమెంట్‌ను దెబ్బకొట్టినట్లు అంచనా. ఓఎన్జీసీ, ఆర్ఐఎల్ డీలా..: ఆయిల్ దిగ్గజాలలో ఓఎన్జీసీ 6% పతనంకాగా, ఆర్ఐఎల్ 4% దిగజారింది. పెట్రోనెట్ ఎల్ఎన్జీ, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, ఆయిల్ ఇండియా, బీపీసీఎల్ 5-2% మధ్య నీర సించాయి. బీఎస్ఈ ఆయిల్ ఇండెక్స్ 4% పడిపోగా, రియల్టీ 3% క్షీణించింది. రియల్టీ షేర్లలో డీబీ దాదాపు 7% పతనంకాగా, యూనిటెక్, డీఎల్ఎఫ్, అనంత్‌రాజ్, ఇండియాబుల్స్, హెచ్‌డీఐఎల్ 4-3% మధ్య నష్టపోయాయి. కాగా, బ్యాంకింగ్, మెటల్ రంగాలు సైతం 1% చొప్పున నష్టపోయాయి. ఎఫ్ఐఐల అమ్మకాలు..: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 602 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. ట్రేడైన షేర్లలో 1,539 నష్టపోగా, 1,490 లాభపడ్డాయి. మిడ్ క్యాప్స్‌లో ఎస్ఈ ఇన్వెస్ట్మెంట్స్, శ్రేయుంజ్, ఎడిల్వీజ్ ఫైనాన్షియల్, బీఈఎంఎల్, సియట్, మహీంద్రా సీఐఈ, జిందాల్ స్టీల్ 7-4% మధ్య క్షీణించాయి. అయితే మరోవైపు కేశోరాం, బాష్, దివాన్ హౌసింగ్, శ్రేయీ ఇన్ఫ్రా, టాటా ఎలక్సీ, ఎస్సార్ ఆయిల్, హెచ్‌సీసీ, ఫినొలెక్స్ ఇండస్ట్రీస్, అబాన్ ఆఫ్‌షోర్, పేజ్ ఇండస్ట్రీస్, జీఎస్పీఎల్, యూనికెమ్ 8.5-4.5% మధ్య పుంజుకున్నాయి.