యునెటైడ్ స్పిరిట్స్ తనఖా షేర్లు విక్రయం
న్యూఢిల్లీ: యునెటైడ్ బ్రూవరీస్ (హోల్డింగ్)లిమిటెడ్(యూబీహెచ్‌ఎల్) తనఖా పెట్టిన యునెటైడ్ స్పిరిట్స్ షేర్లను ఈసీఎల్ ఫైనాన్స్ సంస్థ విక్రయించింది. తాము తనఖాగా పెట్టిన 72,250 యునెటైడ్ స్పిరిట్స్ షేర్లను ఈసీఎస్ ఫైనాన్స్ గురువారం విక్రయించిందని బీఎస్‌ఈకి యూబీహెచ్‌ఎల్ నివేదించింది. గురువారం నాటి యునెటైడ్ స్పిరిట్స్ ముగింపు ధర రూ.2,526 ధర ప్రకారం చూస్తే ఈ షేర్ల విక్రయ విలువ రూ.18.25 కోట్లుగా ఉంటుంది. విజయ మాల్యా ఆధ్వర్యంలోని యూబీహెచ్‌ఎల్‌కు 41,88,556 (2.88 శాతం వాటా) యునెటైడ్ స్పిరిట్స్ షేర్లు ఉన్నాయి.వీటిల్లో 17,13,820(1.8 శాతం వాటా) షేర్లను యూబీహెచ్‌ఎల్ తనఖా పెట్టింది. బ్యాంకులకు రూ.9,000 కోట్లు చెల్లించాల్సి ఉండగా విజయ్ మాల్యా ఈ నెల 2న భారత్ నుంచి వెళ్లిపోవడం, ఆ తర్వాత ఆయనపై పలు కేసులు నమోదవుత్ను నేపథ్యంలో ఈసీఎల్ ఫైనాన్స్ ఈ తనఖా షేర్లను విక్రయించింది. కాగా బీఎస్‌ఈలో యునెటైడ్ స్పిరిట్స్ షేర్ ధర 2.3 శాతం లాభపడి రూ.2,586 వద్ద ముగిసింది.