వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో మార్కెట్లు
Published Wed, Aug 3 2016 4:01 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 284 పాయంట్లు నష్టంతో దగ్గర, నిఫ్టీ 78 పాయింట్ల నష్టంతో 8,544 దగ్గర ముగిసాయి గ్లోబల్ వీక్ నెస్, భారీ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా వరుసగా నాలుగో రోజుకూడా సూచీలన్నీ పతనం దిశగా పయనించాయి. దీంతో సెన్సెక్స్, 28 వేల దిగువకు, నిఫ్టీ 86 వేల దిగువకు పడిపోయాయి. జీఎస్ టీబిల్లుపై అనిశ్చితి తొలగకపోవడంతో బుధవారం నాటి ఈక్విటీ మార్కెట్లు నెగిటివ్ గా స్పందించాయి. ఈ నాటి ట్రేడింగ్లో భారీ అమ్మకాల ఒత్తిడికి లోనైనరంగాల్లో ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఉన్నాయి.
మరోవైపు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జీఎస్ టీ బిల్లును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఒకే దేశం ఒకే పన్ను విధానానికి మద్దతు తెలిపాలని సభ్యులను కోరారు. చర్చ కొనసాగుతోంది. కాగా బిల్లుపై కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం వేడివేడి వ్యాఖ్యలు చేయడం మార్కెట్లపై ప్రభావం చూపింది. బిల్లులో మరిన్ని సవరణలు చేయాల్సి ఉన్నదంటూ చిదంబరం పేర్కొనడంతో చివర్లో అమ్మకాలు పెరిగాయి. అన్ని రంగాలూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. కాగా, ఐటీ సెక్టార్ స్థిరంగా ఉంది. ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ 2.5 శాతం పడిపోగా, ఆటో, రియల్టీ, మీడియా, బ్యాంకింగ్ 1.8-0.7 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో భెల్, ఐటీసీ, టాటా మోటార్స్, మారుతీ, ఐషర్ మోటార్స్, అరబిందో, పవర్‌గ్రిడ్, రిలయన్స్, టీసీఎస్ 3.7-2 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే మరోవైపు ప్రోత్సాహకర క్యూ1 ఫలితాలతో హెచ్‌సీఎల్ టెక్ 3 శాతం ఎగసింది. ఈ బాటలో ఇన్‌ఫ్రాటెల్, సిప్లా, ఏషియన్ పెయింట్స్, బాష్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, యస్‌బ్యాంక్ 2-0.5 శాతం మధ్య బలపడ్డాయి.
అయితే ఈ మధ్య కాలంలో భారీ గా లాభపడిన స్టాక్ మార్కెట్లు కన్ సాలిడేషన్ పీరియడ్ లో ఉన్నాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ఇది మార్కెట్లకు ఆరోగ్యకరమైన సంకేతమని బ్రోకరేజ్ సర్వీస్ నిపుణుడు ప్రదీప్ హాట్ చందాని తెలిపారు. నిఫ్టీ ప్రస్తుత స్థాయినుంచి కిందికి జారితే 8450 స్థాయి ప్రధానమద్దతని తెలిపారు.
Advertisement
Advertisement