Global Weakness
-
భారీగా తగ్గిన పసిడి ధర
సాక్షి, న్యూఢిల్లీ : గత రెండురోజులుగా చుక్కల్ని తాకిన పుత్తడి ధర భారీగా దిగి వచ్చింది. బడ్జెట్లో 10 నుంచి 12.5 శాతం దిగుమతి సుంకం ప్రతిపాదన అనంతరం నింగికెగిసిన బంగారం ధరలు మంగళవారం భారీగా క్షీణించాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రా. పసిడి ధర రూ. 600 పడిపోయింది. వెండి ధర రూ. 48 తగ్గి, కిలో ధర రూ. 38,900 పలుకుతోంది. అంతర్జాతీయంగా బలహీన ధోరణి, బలపడిన డాలరు, దేశీయంగా జ్యుయల్లర్స్నుంచి తగ్గిన డిమాండ్ తదితర పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు దిగి వచ్చాయని ఎనలిస్టులు చెబుతున్నారు. ఢిల్లీలో 99.9 స్వచ్ఛత గల పది గ్రా. బంగారం ధర సోమవారం నాటి రూ. 35, 470 తో పోలిస్తే 600 తగ్గి రూ. 34870గా ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా పది గ్రాముల బంగారం ధర 98 రూపాయిలు క్షీణించి 34,381 వద్ద ఉంది. అయితే సావరిన్ గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. -
బంగారం మరింత దిగి వస్తుందా?
సాక్షి, న్యూఢిల్లీ: డిమాండ్‌లేక వన్నె తగ్గుతున్న పసిడి శనివారం మరింత వెలవెలబోయింది. బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర. రూ. 350లు క్షీణించింది. తద్వారా పూర్తి స్వచ్ఛత గత పది గ్రా. బంగారం ధర 33770 వద్ద 34వేల రూపాయల కిందికి చేరింది. గత రెండు రోజులుగా పసిడి ధరలు 570 రూపాయిలు తగ్గింది. స్థానిక బంగారు వర్తకం దారులు, అంతర్జాతీయ బలహీన సంకేతాలతో పుత్తడి ధరలు తగ్గుముఖం పట్టాయని బులియన్‌వర్గాలు పేర్కొన్నాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా పసిడి ధరలు కీలక మద్దతు స్థాయికి దిగజారడంతో ఇది మరింత దిగి వచ్చే అవకాశం ఉందని భావించారు. కిలోవెండి ధరకూడా 40వేల రూపాయల దిగువకు పడిపోయింది. ఏకంగా రూ.730 క్షీణించి కేజీ ధర రూ. 39,950గా ఉంది. అంతర్జాతీయంగా 1.52 శాతం పతనమై ఔన్స్ బంగారం ధర 1293 వద్ద 1300 డాలర్ల దిగువకు చేరింది. మరో విలువైన మెటల్ వెండి కూడా 2.47 శాతం పతనమైంది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత గల పుత్తడి రూ.310 నష్టపోయింది. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో కూడా పది గ్రాముల పసిడి ధర రూ.324 పతనమై రూ. 32,657 వద్ద ఉంది. వెండి 758 రూపాయలు క్షీణించి 38,376 వద్ద కొనసాగుతోంది. -
బంగారం ధర తగ్గింది
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పడిపోయాయి. బులియన్ మార్కెట్లో వరుసగా మూడవ రోజు కూడా పసిడి నష్టపోయింది. పది గ్రాముల బంగారం ధర 300 రూపాయలు క్షీణించి 31,600 రూపాయలకు చేరుకుంది. స్థానిక నగల దుకాణదారుల నుంచి గిరాకీ తగ్గడం, విదేశీ మార్కెట్లో బలహీన ధోరణి నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నట్టు బులియన్ ట్రేడర్లు తెలిపారు. ఎంసీఎక్స్ మార్కెట్లో కూడా పడిన పసిడి ధర 286 రూపాయలు పతనమై రూ. 30,545వద్ద ఉంది. వెండి ధర కూడా ఇదే బాటలో ఉంది. డిమాండ్ క్షీణించిన కారణంగా 100 రూపాయలు తగ్గిన కిలో వెండి రూ .40,500 పలుకుతోంది. వారపు ఆధారిత డెలివరీ ధర రూ. 145 కు రూ. 39,535 కి చేరుకుంది. పారిశ్రామిక యూనిట్లు, నాణెల తయారీదారుల ద్వారా డిమాండ్ బాగా తగ్గిందని ట్రేడర్లు చెప్పారు. దేశ రాజధానిలో, 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛతగల పది గ్రాముల బంగారం ధర మరో రూ. 300 నష్టపోయి వరుసగా రూ .31,600, రూ.31,450 లుగా నమోదైంది. కాగా గత రెండు రోజుల్లో విలువైన మెటల్ 190 రూపాయలు కోల్పోయింది. సావరిన్ ఎనిమిది గ్రాముల బంగారం ధర రూ .24,800 వద్ద ఉంది. బలహీనమైన గ్లోబల్ ధోరణి, అమెరికా పేరోల్స్ డేటా , ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపు అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా బంగారం 0.37 శాతం పడిపోయి 1,293.10 డాలర్లకు చేరుకుంది. -
భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు
ముంబై : బలహీనమైన అంతర్జాతీయ పరిణామాలతో సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 522.91 పాయింట్లకు పైగా పతనంతో ప్రారంభమైన సెన్సెక్స్, 28,354 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ సైతం 142.55 పాయింట్ల నష్టంతో 8,724 వద్ద నమోదవుతోంది. అంతర్జాతీయ ఈక్విటీస్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి, దేశీయ మార్కెట్లకు ఎసరు పెట్టింది. యూఎస్, యూరోపియన్ మార్కెట్లు శుక్రవారం ముగింపులో భారీగా పతనమయ్యాయి. డౌ జోన్స్ ఇండస్ట్రీయల్ కనీసం 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. జూన్ 24 తర్వాత ఇదే అతిపెద్ద సింగిల్ డే నష్టం. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు, దేశీయ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇటీవల రికార్డు స్థాయిల్లో నమోదవుతున్న స్టాక్ సూచీలు కరెక్షన్కు గురయ్యే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లాభాల స్వీకరణ చోటు చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు కొంత స్తబ్ధత లేదా క్షీణత ఉంటుందంటున్నారు.జూన్ 25న 7,940గా ఉన్న నిఫ్టీ సెప్టెంబర్ 8కు 9000లకు చేరువలోకి వచ్చిందని, ఈ నేపథ్యంలో భారీ కరెక్షన్ చోటు చేసుకుంటుందని పేర్కొంటున్నారు. మరోవైపు ఈ వారంలో వెలువడే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలపై పెట్టుబడిదారులు దేశీయ మార్కెట్లలో ఎక్కువగా దృష్టిసారించారు. అటు నేటి ట్రేడింగ్‌లో రూపాయి సైతం బలహీనపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసల నష్టంతో 66.88గా ప్రారంభమైంది. అంతర్జాతీయ సంకేతాలతో రూపాయి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని, నెగిటివ్‌గా ట్రేడ్ అవుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 66.50 నుంచి 67 శ్రేణిలో కదలాడే అవకాశమున్నట్టు పేర్కొంటున్నారు. -
వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 284 పాయంట్లు నష్టంతో దగ్గర, నిఫ్టీ 78 పాయింట్ల నష్టంతో 8,544 దగ్గర ముగిసాయి గ్లోబల్ వీక్ నెస్, భారీ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా వరుసగా నాలుగో రోజుకూడా సూచీలన్నీ పతనం దిశగా పయనించాయి. దీంతో సెన్సెక్స్, 28 వేల దిగువకు, నిఫ్టీ 86 వేల దిగువకు పడిపోయాయి. జీఎస్ టీబిల్లుపై అనిశ్చితి తొలగకపోవడంతో బుధవారం నాటి ఈక్విటీ మార్కెట్లు నెగిటివ్ గా స్పందించాయి. ఈ నాటి ట్రేడింగ్‌లో భారీ అమ్మకాల ఒత్తిడికి లోనైనరంగాల్లో ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఉన్నాయి. మరోవైపు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జీఎస్ టీ బిల్లును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఒకే దేశం ఒకే పన్ను విధానానికి మద్దతు తెలిపాలని సభ్యులను కోరారు. చర్చ కొనసాగుతోంది. కాగా బిల్లుపై కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం వేడివేడి వ్యాఖ్యలు చేయడం మార్కెట్లపై ప్రభావం చూపింది. బిల్లులో మరిన్ని సవరణలు చేయాల్సి ఉన్నదంటూ చిదంబరం పేర్కొనడంతో చివర్లో అమ్మకాలు పెరిగాయి. అన్ని రంగాలూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. కాగా, ఐటీ సెక్టార్ స్థిరంగా ఉంది. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ 2.5 శాతం పడిపోగా, ఆటో, రియల్టీ, మీడియా, బ్యాంకింగ్ 1.8-0.7 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో భెల్, ఐటీసీ, టాటా మోటార్స్, మారుతీ, ఐషర్ మోటార్స్, అరబిందో, పవర్‌గ్రిడ్, రిలయన్స్, టీసీఎస్ 3.7-2 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే మరోవైపు ప్రోత్సాహకర క్యూ1 ఫలితాలతో హెచ్‌సీఎల్ టెక్ 3 శాతం ఎగసింది. ఈ బాటలో ఇన్ఫ్రాటెల్, సిప్లా, ఏషియన్ పెయింట్స్, బాష్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, యస్‌బ్యాంక్ 2-0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఈ మధ్య కాలంలో భారీ గా లాభపడిన స్టాక్ మార్కెట్లు కన్ సాలిడేషన్ పీరియడ్ లో ఉన్నాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ఇది మార్కెట్లకు ఆరోగ్యకరమైన సంకేతమని బ్రోకరేజ్ సర్వీస్ నిపుణుడు ప్రదీప్ హాట్ చందాని తెలిపారు. నిఫ్టీ ప్రస్తుత స్థాయినుంచి కిందికి జారితే 8450 స్థాయి ప్రధానమద్దతని తెలిపారు.