సాక్షి, న్యూఢిల్లీ: డిమాండ్‌లేక వన్నె తగ్గుతున్న పసిడి శనివారం మరింత వెలవెలబోయింది. బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర. రూ. 350లు క్షీణించింది. తద్వారా పూర్తి స్వచ్ఛత గత పది గ్రా. బంగారం ధర 33770 వద్ద 34వేల రూపాయల కిందికి చేరింది. గత రెండు రోజులుగా పసిడి ధరలు 570 రూపాయిలు తగ్గింది.
స్థానిక బంగారు వర్తకం దారులు, అంతర్జాతీయ బలహీన సంకేతాలతో పుత్తడి ధరలు తగ్గుముఖం పట్టాయని బులియన్‌వర్గాలు పేర్కొన్నాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా పసిడి ధరలు కీలక మద్దతు స్థాయికి దిగజారడంతో ఇది మరింత దిగి వచ్చే అవకాశం ఉందని భావించారు.
కిలోవెండి ధరకూడా 40వేల రూపాయల దిగువకు పడిపోయింది. ఏకంగా రూ.730 క్షీణించి కేజీ ధర రూ. 39,950గా ఉంది. అంతర్జాతీయంగా 1.52 శాతం పతనమై ఔన్స్ బంగారం ధర 1293 వద్ద 1300 డాలర్ల దిగువకు చేరింది. మరో విలువైన మెటల్ వెండి కూడా 2.47 శాతం పతనమైంది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత గల పుత్తడి రూ.310 నష్టపోయింది.
అటు ఎంసీఎక్స్ మార్కెట్‌లో కూడా పది గ్రాముల పసిడి ధర రూ.324 పతనమై రూ. 32,657 వద్ద ఉంది. వెండి 758 రూపాయలు క్షీణించి 38,376 వద్ద కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment