
ఢిల్లీలో ధర రూ.88,500
న్యూఢిల్లీ: రోజు వ్యవధిలో బంగారం ధరలు మళ్లీ అప్‌ట్రెండ్ దిశగా నడిచాయి. మంగళవారం ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర రూ.300 పెరగడంతో 10 గ్రాములకు రూ.88,500కు చేరింది. 99.5% స్వచ్ఛత బంగారం కూడా రూ.300 పెరిగి రూ.88,100కు చేరుకుంది. గత శుక్రవారం బంగారం రూ.1,300 పెరిగి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ.89,400 నమోదు చేయగా, సోమవారం అమ్మకాల ఒత్తిడికి రూ.1,200 నష్టంతో రూ.88,200కు దిగొచ్చింది.
అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా బంగారం లాభపడినట్టు ఆల్ ఇండియా సఫారా అసోసియేషన్ తెలిపింది. వెండి ధర సైతం కిలోకి రూ.800 లాభపడి రూ.99,000కు చేరుకుంది. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లోనూ బంగారం, వెండి లాభపడ్డాయి. ఏప్రిల్ నెల గోల్డ్ కాంట్రాక్ట్ రూ.435 పెరిగి రూ.84,490కు.. వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ రూ.439 పెరిగి రూ.96,019కు చేరాయి.
అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 16 డాలర్లు ఎగసి 2,912.50 డాలర్లను తాకింది. సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఎలాంటి మార్పులు చేయాలనుకోవడం లేదంటూ ఫెడ్ సభ్యుడు ప్యాట్రిక్ హార్కర్ చేసిన హాకిష్ వ్యాఖ్యలు బంగారం మరింత ర్యాలీ చేయకుండా అడ్డుపడినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment