Profit-Taking
-
లాభాల స్వీకరణకు అవకాశం
ముంబై: గత తొమ్మిది ట్రేడింగ్ సెషన్లలో సూచీలు ఐదుశాతం ర్యాలీ చేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం డేటా, ఆర్బీఐ మినిట్స్, కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఇతర స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్‌కు దిశానిర్ధేశం చేయనున్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు పనితీరు, అంతర్జాతీయ పరిణామాలు ట్రెండ్‌ను నిర్దేశించడంలో కీలకం కానున్నాయి. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు, బాండ్లపై రాబడులు తదితర సాధారణ అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన గతవారంలో సెన్సెక్స్ 598 పాయింట్లు, నిఫ్టీ 229 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ‘‘సాంకేతికంగా నిఫ్టీకి దిగువున 17,550 వద్ద కీలక మద్దతు స్థాయి ఉంది. కొనుగోళ్లు కొనసాగితే ఎగువున 18వేల స్థాయి వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న కీలక పరిణామాల దృష్ట్యా పరిమిత శ్రేణిలో కదలాడొచ్చు. ముఖ్యంగా ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలు అందుకోలేకపోవడంతో టెక్నాలజీ రంగం ఒత్తిడికి లోనుకావచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ► కార్పొరేట్ ఫలితాల ప్రభావం మార్కెట్ ముందుగా ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ల క్యూ4 ఆర్థిక ఫలితాలను స్పందించాల్సి ఉంటుంది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్‌తో సహా 50కి పైగా కంపెనీలు తమ నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఎగుమతి ఆధారిత కంపెనీలపై అంతర్జాతీయ ప్రతికూలతలు ప్రభావం ఏ స్థాయిలో ఉందో మార్చి త్రైమాసిక ఫలితాల ద్వారా తెలుసుకునేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అలాగే ఆయా కంపెనీల యాజమాన్య అవుట్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్ష్ణు్ణంగా పరిశీలించే వీలుంది. ► స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం మార్చి డబ్ల్యూపీ ద్రవ్యోల్బణ డేటా సోమవారం(నేడు) విడుదల అవుతుంది. మరుసటి రోజు మంగళవారం చైనా తొలి క్వార్టర్ జీడీపీ వృద్ధి, పారిశ్రామి కోత్పత్తి డేటాతో పాటు యూరోజోన్ ఫిబ్రవరి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ గణాంకాలు వెల్లడి కానున్నా యి. ఇక బుధవారం జపాన్ ఫిబ్రవరి పారిశ్రామి కోత్పత్తి, యూరోజోన్ మార్చి ద్రవ్యోల్బణ విడుదల అవుతుంది. జపాన్ మార్చి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, అమెరికా ఇళ్ల అమ్మకాలు గురువారం విడుదల కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం జపా న్ మార్చి ద్రవ్యోల్బణం, యూరోజోన్ తయారీ రంగ సర్వీసు, అమెరికా తయారీ రంగ సర్వీసు డేటా వెల్లడి కానుంది. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడికి ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. ► విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు గత ఆర్థిక సంవత్సరం మొత్తం అమ్మకాలకే మొగ్గు చూపిన విదేశీ ఇన్వెస్టర్లు 2023–24ని సానుకూలంగా ప్రారంభించారు. ఈ నెలతో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఇప్పటివరకు భారత ఈక్విటీ మార్కెట్లలో రూ. 8,767 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్ల నుంచి రూ. 1,085 కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నారు. ‘‘భారత ఈక్విటీ మార్కెట్ల వాల్యూయేషన్ ప్రీమియం దశ నుంచి దిగిరావడంతో ఎఫ్‌పీఐలు తిరిగి కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇటీవలి అమెరికా ఫెడ్ మినిట్స్ నివేదిక రాబోయే పాలసీ సమావేశంలో యూఎస్ 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని సంకేతమిచ్చింది. దానివల్ల ఎఫ్‌పీఐ ధోరణి అస్థిరంగా ఉండొచ్చు’’అని మార్నింగ్ స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు. -
Stock Market: లాభాల స్వీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ మార్కెట్లలో ఈ వారం లాభాల స్వీకరణ జరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. సూచీల రికార్డు ర్యాలీతో అనేక షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా (శుక్రవారం) స్టాక్ ఎక్చ్సేంజీలకు సెలవు. ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు మొగ్గు చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘నిఫ్టీ 17,350 స్థాయిని నిలుపుకుంటే మరిన్ని లాభాలకు అవకాశం ఉంది. అప్‌ట్రెండ్ కొనసాగితే 17,500–17,600 శ్రేణిని పరీక్షించవచ్చు. దిగువ స్థాయిలో 17,260 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 16,600 వద్ద మరో కీలక మద్దతు ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ తెలిపారు. సూచీల కదలికకు ఇవే కీలకం.. దేశీయంగా స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలే సూచీల గమనాన్ని నిర్ధేశిస్తాయని వారంటున్నారు. ఫెడ్ ట్యాపరింగ్, కరోనా కేసుల నమోదు వార్తలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చు. అలాగే డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు, విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు తదితర సాదారణ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారింవచ్చు. సానుకూలతలూ ఉన్నాయ్... జీడీపీతో సహా ఇటీవల కేంద్రం విడుదల విడుదలు చేసిన స్థూల ఆరి్థక గణాంకాలన్నీ మార్కెట్ వర్గాలను మెప్పించాయి. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లో తిరిగి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ అంశాలతో అంతర్లీనంగా సెంటిమెంట్ సానుకూలంగానే ఉంది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు దేశీయంగా అన్ని రంగాల షేర్లలో విస్తృత స్థాయిలో కొనుగోళ్లు జరగడంతో గతవారంలో సెన్సెక్స్ 2005 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 618 పాయింట్లను ఆర్జించిన సంగతి తెలిసిందే. భారత్ వైపు ఎఫ్ఐఐల చూపు ... భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. గడిచిన ఆగస్టులో మొత్తం రూ.16,459 కోట్లు కొనుగోళ్లు జరిపారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.2,083 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.14,376 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. డెట్ విభాగంలో ఆగస్టు పెట్టుబడులు ఈ ఏడాదిలోనే అత్యధికం కావడం విశేషం. ‘‘భారత్, అమెరికా బాండ్ ఈల్డ్స్ మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది. డాలర్ రూపాయి స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈక్విటీ మార్కెట్ అధిక విలువ వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ పరిణామాలను విదేశీ ఇన్వెస్టర్లు డెట్ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశాలుగా మలుచుకున్నారు. అని జియోజిత్ ఫైనాన్స్ సరీ్వసెస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ హెడ్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. పబ్లిక్ ఇష్యూ బాటలో వ్యాప్కోస్ జల్ శక్తి శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహించే పీఎస్‌యూ వ్యాప్కోస్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. మార్చికల్లా ఇష్యూను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా ప్రభుత్వం వ్యాప్కోస్లో 25 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉంది. ఇదే యోచనలో నేషనల్ సీడ్స్ : కాగా.. ఇదే ఐపీఓ బాటలోనే మరో పీఎస్‌యూ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్(ఎన్ఎస్సీ)లోనూ 25 శాతం వాటాను ఆఫర్ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. 2021–22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని ప్రతిపాదించిన విషయం విదితమే. -
ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. సానుకూల ప్రపంచ మార్కెట్లు, బడ్జెట్ అంచనాల నేపథ్యంలో లాభాలతో ప్రారంభమైనా చివరికి సెన్సెక్స్ 3 పాయింట్లు తగ్గి 26,211 వద్ద నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 8,035 వద్ద ముగిశాయి. మిడ్ సెషన్ లో కొంత మెరుగ్గా ఉన్నా చివర్లో అమ్మకాల వెల్లువతో ఫ్లాట్ గా స్థిరపడింది. లో లెవల్స్ లో కొనుగోళ్ళతో గత రెండు రోజులుగా బలహీనపడ్డ రియల్టీ ఈ రోజు పుంజుకుంది. మొదట లాభాలతో మురిపించిన ఫార్మా, ఎఫ్ఎంసీజీ ,పీఎస్‌యూ బ్యాంక్ సెక్టార్ స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇన్ఫ్రాటెల్, కోల్ ఇండియా, ఐడియా, ఇండస్ఇండ్, టెక్ మహీంద్రా, అరబిందో, జీ, బాష్, డాక్టర్ రెడ్డీస్, విప్రో లాభాల్లోనూ, టాటా మోటార్స్ డీవీఆర్, యస్‌బ్యాంక్, రిలయన్స్, హీరోమోటో, పవర్‌గ్రిడ్, అంబుజా, హిందాల్కో, టాటా స్టీల్, టీసీఎస్ నష్టాల్లోనూ ముగిశాయి. అటు డాలర్ మారకపు విలువలో రూపాయి బాగా బలహీనపడింది. 11పైసల నష్టంతో రూ68.17 వద్ద ఉంది. మరోవైపు బంగారం మాత్రం సాంకేతికంగా కీలకమైన స్తాయికి పైన స్థిరంగా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లోపుత్తడి పది గ్రా. రూ. 79 లాభపడి రూ. 27,249 వద్ద ఉంది. -
వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 284 పాయంట్లు నష్టంతో దగ్గర, నిఫ్టీ 78 పాయింట్ల నష్టంతో 8,544 దగ్గర ముగిసాయి గ్లోబల్ వీక్ నెస్, భారీ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా వరుసగా నాలుగో రోజుకూడా సూచీలన్నీ పతనం దిశగా పయనించాయి. దీంతో సెన్సెక్స్, 28 వేల దిగువకు, నిఫ్టీ 86 వేల దిగువకు పడిపోయాయి. జీఎస్ టీబిల్లుపై అనిశ్చితి తొలగకపోవడంతో బుధవారం నాటి ఈక్విటీ మార్కెట్లు నెగిటివ్ గా స్పందించాయి. ఈ నాటి ట్రేడింగ్‌లో భారీ అమ్మకాల ఒత్తిడికి లోనైనరంగాల్లో ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఉన్నాయి. మరోవైపు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జీఎస్ టీ బిల్లును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఒకే దేశం ఒకే పన్ను విధానానికి మద్దతు తెలిపాలని సభ్యులను కోరారు. చర్చ కొనసాగుతోంది. కాగా బిల్లుపై కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం వేడివేడి వ్యాఖ్యలు చేయడం మార్కెట్లపై ప్రభావం చూపింది. బిల్లులో మరిన్ని సవరణలు చేయాల్సి ఉన్నదంటూ చిదంబరం పేర్కొనడంతో చివర్లో అమ్మకాలు పెరిగాయి. అన్ని రంగాలూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. కాగా, ఐటీ సెక్టార్ స్థిరంగా ఉంది. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ 2.5 శాతం పడిపోగా, ఆటో, రియల్టీ, మీడియా, బ్యాంకింగ్ 1.8-0.7 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో భెల్, ఐటీసీ, టాటా మోటార్స్, మారుతీ, ఐషర్ మోటార్స్, అరబిందో, పవర్‌గ్రిడ్, రిలయన్స్, టీసీఎస్ 3.7-2 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే మరోవైపు ప్రోత్సాహకర క్యూ1 ఫలితాలతో హెచ్‌సీఎల్ టెక్ 3 శాతం ఎగసింది. ఈ బాటలో ఇన్ఫ్రాటెల్, సిప్లా, ఏషియన్ పెయింట్స్, బాష్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, యస్‌బ్యాంక్ 2-0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఈ మధ్య కాలంలో భారీ గా లాభపడిన స్టాక్ మార్కెట్లు కన్ సాలిడేషన్ పీరియడ్ లో ఉన్నాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ఇది మార్కెట్లకు ఆరోగ్యకరమైన సంకేతమని బ్రోకరేజ్ సర్వీస్ నిపుణుడు ప్రదీప్ హాట్ చందాని తెలిపారు. నిఫ్టీ ప్రస్తుత స్థాయినుంచి కిందికి జారితే 8450 స్థాయి ప్రధానమద్దతని తెలిపారు.