
సాక్షి, ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద విమాన యాన సంస్థ జెట్ ఎయిర్వేస్ (ఇండియా) లిమిటెడ్ క్యూ 2 ఫలితాల్లో ఢమాల్ అంది. గురువారం ప్రకటించిన రెండవ త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం 91శాతం క్షీణించింది. భారీగా పెరిగిన ఇంధన వ్యయం కంపెనీ లాభాలను దారుణంగా దెబ్బతీసింది.
గురువారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో జెట్‌ఎయిర్ వేస్ చాలా నిరాశ పర్చింది. సెప్టెంబరు 30 తో ముగిసిన త్రైమాసికంలో నికరలాభం రూ .49.63 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ .549 కోట్లగా ఉంది. మొత్తం ఆదాయం 59శాతం క్షీణిం చి రూ.131.57కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ. 320కోట్లను సాధించింది. మొత్తం సేల్స్ గతం క్వార్టర్‌లోని రూ. 5772 కోట్లతో పోలిస్తే ఈ క్వార్టర్‌లో రూ.5758 కోట్లకు పడిపోయింది. మొత్తం వ్యయం 9.2 శాతం పెరిగి రూ .5,709 కోట్లకు పెరిగింది. విమాన ఇంధన వ్యయం 17 శాతం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment