శుక్రవారం ఉదయం(డిసెంబర్ 24, 2021) గ్లోబల్ మార్కెట్‌లో ఫలితాలు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. అయితే కాసేపటికే స్వల్ఫ నష్టాలు, ఆపై లాభంతో ఊగిసలాట కనిపిస్తోంది.
డిసెంబర్ 24 ఉదయం గ్లోబల్ క్యూస్ సానుకూల సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్ మొదలైంది. లాభాలతో మొదలైన స్వల్ఫ నష్టాలు, ఆ వెంటనే స్వల్ఫ లాభాలతో స్టాక్ సూచీలు కదలాడుతున్నాయి. ఉదయం 9గం.23ని. వద్ద సెన్సెక్స్ 48 పాయింట్ల లాభంతో 57, 364 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 27 పాయింట్ల స్వల్ప లాభంతో 17, 100 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ సానుకూల ప్రభావం చూపెట్టినప్పటికీ.. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో మార్కెట్ ఊగిసలాటలో ట్రేడ్ అవుతోంది.
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టీసీఎస్, విప్రో, ఐవోసీ లాభాల్లో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్‌లాండ్ బ్యాంక్, సన్ ఫార్మా, టాటా క్జూమర్ ప్రొడక్ట్స్, ఐసీఐసీఐ బ్యాంకులు నష్టాల బాట పట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment