
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కలవరం మొదలైంది. ఇప్పటి వరకు రెండు కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఒమిక్రాన్ సోకినవారు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులే. సోమాలియా, కెన్యా నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినట్లు అధికారులు పరీక్షల్లో గుర్తించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ.హరీశ్‌రావు స్పందిస్తూ.. ప్రజలెవరూ ఆందోళనకు గురికావద్దని, ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రాణభయం లేదని పేర్కొన్నారు.
అందరూ కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 98 శాతం పూర్తి అయిందని తెలిపారు. ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని పేర్కొన్నారు. తెలంగాణలో రెండు డోసుల వ్యాక్సినేషన్ 64 శాతం మందికి వేశామని తెలిపారు. బూస్టర్ డోసులను అందించాలని కేంద్రాన్ని కోరామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment