సాక్షి, న్యూఢిల్లీ: ఒమిక్రాన్ భయాలతో వణికిపోతున్న వేళ భారత్‌పై కోవిడ్ మరోసారి పంజా విసిరింది. గడిచిన 24 గంటల్లో 22,775 కేసులు నమోదయ్యాయి. గత 275 రోజుల్లో ఇదే అత్యధికం. వైరస్ బాధితుల్లో 8,949 మంది కోలుకోగా.. 406 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది కేరళ (353)కు చెందినవారే ఉన్నారు. భారత్‌లో ప్రస్తుతం 1,04,781 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఒమిక్రాన్ అప్‌డేట్
దేశంలో కొత్తగా 161 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1431 కి చేరినట్టు ఆరోగ్య శాఖ శనివారం నాటి హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. బాధితుల్లో 488 మంది కోలుకున్నట్టు తెలిపింది. 454 కేసులతో మహారాష్ట్ర, 351 కేసులతో ఢిల్లీ, 118 కేసులతో తమిళనాడు, 115 కేసులతో గుజరాత్, 109 కేసులతో కేరళ తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment