
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి రోజురోజుకీ అధికమవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 75 మందికి ఒమిక్రాన్ సోకినట్టు వెల్లడైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 653కు చేరింది. బాధితుల్లో 186 కోలుకున్నారని ఆరోగ్య సంక్షేమ శాఖ మంగళవారం నాటి బులెటిన్‌లో పేర్కొంది. 167 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో.. 165 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉన్నాయి.
కోవిడ్ అప్‌డేట్
గడిచిన 24 గంటల్లో భారత్‌లో 6,358 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తం బాధితుల్లో 6,450 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడ్డవారిలో 293 మంది మృతి చెందారు. దేశంలో 75,456 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 98.40 శాతంగా ఉన్నట్టు ఆరోగ్య సంక్షేమ శాఖ బులెటిన్‌లో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment