న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భారత్‌లోనూ ఈ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. మరోవైపు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా 94 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు భారత్‌లో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 1,525కి చేరింది. 560మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 460, ఢిల్లీలో 351 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. దేశంలో 23 రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది.
భారత్‌లో గడిచిన 24 గంటల్లో 27,553 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకముందు రోజుతో పోలిస్తే కొత్త కేసుల్లో 21శాతం పెరుగుదల కనిపిస్తుంది. ఇక ఒక్క రోజే 284 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,48,89,132కి చేరింది. ఇప్పటి వరకు 4,81,770 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,22,801 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
చదవండి: పడగ విప్పిన ఒమిక్రాన్!
Comments
Please login to add a commentAdd a comment