
న్యూడిల్లీ: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గుబులు పుట్టిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలతో పాటు పలు రాష్ట్రాలలో కేసులు పెరుగుదల గణనీయంగా ఉంది. తాజాగా దేశంలో 309 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 1270కు చేరింది. మహారాష్ట్ర అత్యధికంగా 450కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీలో 320 పాజటివ్ కేసులతో రెండో స్థానంలో ఉంది. కేరళలో 109, గుజరాత్‌లో 97, రాజస్థాన్‌లో 69, తెలంగాణలో 62, తమిళనాడులో 46,కర్ణాటకలో 34 మంది ఒమక్రాన్ బాధితులు ఉన్నారు.
ఇప్పటి వరకు భారత్‌లో 374మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. 23 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసులు కూడా అధికంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16,764 మంది కోవి్ బారిన పడగా.. 220 మంది మహమ్మారితో మరణించారు.
చదవండి: ఒక్కరోజులో 24.39 లక్షలు.. ఒక్క గంటలో 2.79 లక్షలు.. ఐటీ ఫైలింగ్‌లో రికార్డ్ !
Comments
Please login to add a commentAdd a comment