లండన్: కరోనా వైరస్‌లో(సార్స్–కోవ్–2) కొత్తగా పుట్టుకొచ్చిన బీఏ.2.75.2 అనే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ప్రమాదకరంగా పరిణమిస్తున్నట్లు స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్ పరిశోధకులు గుర్తించారు. ఇది మనుషుల రక్తంలోని ప్రతిరక్షకాల (యాంటీబాడీలు) నుంచి సమర్థంగా తప్పించుకున్నట్లు తేల్చారు. అంతేకాకుండా ఇప్పుడు అందుబాటులో ఉన్న కోవిడ్–19 యాంటీబాడీ చికిత్సలను కూడా తట్టుకుంటున్నట్లు చెప్పారు. ఈ పరిశోధన వివరాలను లాన్సెట్ అంటువ్యాధుల పత్రికలో ప్రచురించారు.
ప్రస్తుత శీతాకాలంలో కరోనా మహమ్మారి ముప్పు పొంచి ఉందని, అందుకే ముందుజాగ్రత్తగా అప్‌డేటెడ్ టీకాలు తీసుకోవాలని, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని పరిశోధకులు సూచించారు. కరోనా ఒమిక్రాన్‌లోని బీఏ.2.75 అనే వేరియంట్ ఉత్పరివర్తనం చెందడంతో బీఏ.2.75.2 ఉప వేరియంట్ పుట్టినట్లు కనిపెట్టారు. ఈ ఏడాది మొదట్లోనే ఇది బయటపడింది. కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికైతే తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నప్పటికీ భవిష్యత్తులో ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేమన్నది పరిశోధకులు మాట. కోవిడ్–19 బారిన పడే అవకాశం అధికంగా ఉన్నవారికి యాంటీవైరల్ ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది.
ఇదీ చదవండి: BioNTech: త్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్!
Comments
Please login to add a commentAdd a comment