Lancet study
-
The Lancet Planetary Health journal: ఊపిరి తీస్తున్న వాయు కాలుష్యం
న్యూఢిల్లీ: ఆయువు పోయాల్సిన వాయువు ప్రాణాలు తోడేస్తోంది. వాయువులో ప్రాణాంతకమైన కాలుష్య కారకాలు కలుస్తున్నాయి. ఊపిరి పీలిస్తే శరీరంలోకి చేరిపోయి, అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఇండియాలోని పది అతిపెద్ద నగరాల్లో సంభవిస్తున్న రోజువారీ మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన పరిమితి కంటే హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లోని గాలిలో అత్యంత సూక్ష్మమైన ‘పీఎం 2.5’ ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ పత్రిక స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో చాలా మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతున్నట్లు తెలియజేసింది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఉద్గారాలు గాలిని విపరీతంగా కలుషితం చేస్తున్నాయని పేర్కొంది. అధ్యయనం వివరాలను పత్రికలో ప్రచురించారు. 2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ధూళి కణాలను ‘పీఎం 2.5 కణాలు’ అంటారు. → భారతదేశంలోని పెద్ద నగరాల్లో నిత్యం వెలువడుతున్న పీఎం 2.5 ధూళి కణాలతో మరణాల ముప్పు నానాటికీ పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించారు. → ఇండియాలో వాయు కాలుష్యంపై వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీలోని సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్‌తోపాటు పలువురు అంతర్జాతీయ పరిశోధకులు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా, పుణే, సిమ్లా, వారణాసి నగరాల్లో 2008 నుంచి 2019 దాకా ఈ అధ్యయనం నిర్వహించారు. → క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 ధూళి కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరుగుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా మరణాల మప్పు 2.7 శాతం పెరుగుతున్నట్లు తేల్చారు. → ప్రపంచ ఆరోగ్య సంస్థ విధివిధానాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 కణాలు 15 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం లేదు. అంతకంటే మించితే ముప్పు తప్పదు. → భారత వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 ధూళి కణాలు 60 మైక్రోగ్రాముల లోపు ఉండే ప్రమాదం అంతగా ఉండదు. కానీ, ప్రస్తుతం 75 మైక్రోగ్రాముల కంటే అధికంగానే ఉంటున్నట్లు తేలింది. → క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల రేటు సగటున 3 శాతం దాకా పెరుగుతున్నట్లు గుర్తించారు. → స్థానికంగా వెలువడే ఉద్గారాలు, కాలుష్యంతో పీఎం 2.5 కణాల ఉత్పత్తి పెద్ద ఎత్తున జరుగుతోంది. అందుకే స్థానికంగా కాలుష్యాన్ని సమర్థవంతంగా కట్టడి చేస్తే మరణాల ముప్పు చాలావరకు తగ్గుతుందని సైంటిస్టులు సూచిస్తున్నారు. -
భారతీయుల్లో సగంమంది అన్‌ఫిట్టే! 60 ఏళ్లు పైబడినవారు బెటర్!
మన దేశంలో దాదాపు సగంమంది ఫిజికల్‌గా ఫిట్‌గా లేరట. భారతీయుల్లో 50 శాతం మంది శారీర శ్రమ అన్న ఊసే ఎత్తడం లేదని తేలింది. గ్లోబల్ హెల్త్ జర్నల్ లాన్సెట్ నిర్వహించిన స్టడీలో ఈ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, 2022లో భారతదేశంలోని దాదాపు 50శాతం మంది తగినంత వ్యాయామం చేయడం లేదు. కనీసం వారానికి 150 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయట్లేదని తేలింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సూచనల ప్రకారం, పద్దెనిమిదేళ్లు పైబడిన వారు(అడల్ట్స్) వారానికి 150 నిమిషాలు మోస్తరు ఫిజికల్ యాక్టివిటీ లేదంటే 75 నిమిషాలు తీవ్రమైన ఫిజికల్యాక్టివిటీ చేయాలి. దీన్ని ఆధారంగా చేసుకుని 2000-2022 మధ్యకాలంలో 197 దేశాల్లో లాన్సెట్ సర్వే చేసింది. దక్షిణాసియా ప్రాంతంలో మహిళల్లో తగినంత శారీరక శ్రమ లేకపోవడం పురుషుల కంటే సగటున 14శాతం ఎక్కువ. 42 శాతంగా పురుషులతో పోలిస్తే, తగిన శారీరక శ్రమ చేయని మహిళల సంఖ్య 57శాతంగా ఉంది.అంతేకాదు 2000 సంవత్సరంలో 22శాతం భారతీయులు శారీరంగా దృఢంగా ఉండగా, 2010 నాటికి ఇది 34 శాతానికి, 2022 నాటికి 50 శాతానికి పెరిగిందని తెలిపింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఇది 60 శాతం దాటుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా, 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న స్త్రీపురుషులిరువురిలోనూ శారీరక శ్రమ పెరగడం గమనార్హం.కాగా, ప్రపంచవ్యాప్తంగా 31.3 శాతం మంది పెద్దలు (18 ఏళ్లు పైబడిన వారు) ఫిజికల్లీ అన్ ఫిట్‌గా ఉన్నారని స్టడీలో తేలింది. ఈ విషయంలో ఫస్ట్ ప్లేస్‌లో ఆసియా పసిఫిక్ రీజియన్, రెండో స్థానంలో దక్షిణాసియా ఉందని లాన్సెట్ పరిశోధకులువెల్లడించారు. -
Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
న్యూఢిల్లీ: మానవాళికి శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవితకాలం పెరుగుతున్నట్లు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి వెల్లడించింది. 2022 నుంచి 2050 మధ్య పురుషుల్లో 4.9 సంవత్సరాలు, మహిళల్లో 4.3 సంవత్సరాలు పెరుగుతుందని తేల్చింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్, ఎవాల్యుయేషన్(ఐహెచ్ఎంఈ) నిర్వహించిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్(జీబీడీ)–2021 అధ్యయనం వివరాలను లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు. ‘‘మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా సగటు జీవితకాలం ఐదేళ్ల దాకా పెరుగుతుంది. కానీ అదే సమయంలో వ్యాధుల ముప్పు కూడా బాగా పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటివి ఎక్కువ ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా స్థూలకాయం, అధిక రక్తపోటు వంటివి బాగా వేధిస్తాయి’’ అని అధ్యయనం హెచ్చరించింది. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం ద్వారా ఈ ముప్పును వీలైనంతగా తగ్గించుకోవచ్చని అధ్యయనం సూచించింది. అధ్యయనం ఇంకా ఏం తేలి్చందంటే... → సగటు జీవితకాలం పురుషుల్లో ఐదేళ్లు, మహిళల్లో నాలుగేళ్లు పెరుగుతుంది. స్త్రీలలో 71.1 నుంచి 76 ఏళ్లకు, పురుషుల్లో 76.2 నుంచి 80.5 ఏళ్లకు పెరుగుతుంది. → పూర్తి ఆరోగ్యవంతమైన జీవితకాలం ప్రపంచవ్యాప్తంగా సగటున 2.6 ఏళ్లు పెరుగుతుంది. ఇది 2022లో 64.8 ఏళ్లుండగా 2050 నాటికి 67.4 ఏళ్లకు చేరుతుంది. → భారత్‌లో 2050 నాటికి పురుషుల సగటు జీవిత కాలం 75 ఏళ్లకు కాస్త పైకి, మహిళల్లో 80 ఏళ్లకు చేరుకుంటుంది. → మన భారతదేశంలో ఆరోగ్యవంతమైన జీవితకాలం స్త్రీ పురుషులిద్దరిలోనూ సమానంగానే ఉంటుంది. 2050 నాటికి 65 ఏళ్లు దాటేదాకా ఆరోగ్యంగా జీవిస్తారు. → జీబీడీ–2021 అధ్యయనం కోసం ప్రపంచవ్యాప్తంగా 11,000 సంస్థల సహకారం తీసుకున్నారు. 204 దేశాల నుంచి 371 రకాల వ్యాధులకు సంబంధించిన అంచనాలు, 88 రిస్క్ ఫ్యాక్టర్లను పరిగణనలోకి తీసుకున్నారు. → ప్రపంచవ్యాప్తంగా వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిపై జనంలో అవాగాహన పెరుగుతుండడం సగటు జీవితకాలం పెరుగుదలకు దోహదపడుతోంది. → జీవితకాలం పెరుగుదల విషయంలో ప్రపంచ దేశాల మధ్య అసమానతలు చాలావరకు తగ్గుతున్నట్లు గుర్తించామని ఐహెచ్ఎంఈ డైరెక్టర్ క్రిస్ ముర్రే చెప్పారు. → సగటు జీవనకాలం ప్రస్తుతం తక్కువగా ఉన్న దేశాల్లో 2050 నాటికి బాగా పెరగనుందన్నారు. హృద్రోగాలు, కరోనాతో పాటు తీవ్రమైన అంటు రోగాలతో పాటు పౌష్టికాహార లోపం తదితరాలను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుండటమే అందుకు కారణమని ముర్రే చెప్పారు. → భావి తరాలు స్థూలకాలం, అధిక రక్తపోటుతో బాగా బాధపడే ఆస్కారముందని అభిప్రాయపడ్డారు. -
ఆయుర్దాయానికి కోవిడ్ కోత
కరోనా కోరల్లో చిక్కి యావత్ ప్రపంచం విలవిల్లాడిన ఘటన ఇప్పటికీ చాలా మందికి పీడకలే. అధునాతన కోవిడ్వ్యాక్సిన్లతో ఎలాగోలా కోవిడ్‌పై యుద్ధంలో గెలిచామని సంతోషపడేలోపే కరోనా మహమ్మారి మనుషుల ఆయుర్దాయాన్ని తగ్గించేసిందన్న చేదు నిజం తాజాగా బయటపడింది. 2019–2021 కాలంలో ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఆయుష్షు దాదాపు రెండు సంవత్సరాలు తగ్గిపోయిందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ కష్టాల నుంచి తెరిపినపడి ఎలాగోలా మళ్లీ సాధారణ జీవితం గడుపుతున్నాం కదా అని సంబరపడుతున్న ప్రజానీకానికి ఇది పిడుగుపాటులాంటి వార్తే. లాన్సెట్ అధ్యయనంలోని ముఖ్యాంశాలు ► 2019 డిసెంబర్లో తొలిసారిగా కోవిడ్ వ్యాధికారక కరోనా వైరస్ విస్తృతి బయటపడ్డాక తొలి రెండేళ్లు అంటే 2020, 2021 సంవత్సరాల్లో జనాభా ఆయుర్దాయం ఎలా ఉంది అనే అంశాలపై తాజా అధ్యయనం సమగ్ర వివరాలను వెల్లడించింది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే 84 శాతం దేశాల్లో ఆయుర్దాయం తగ్గింది. ఈ కాలంలో ప్రజల ఆయుర్దాయం 1.6 సంవత్సరాలు తగ్గిపోయింది. ► మెక్సికో సిటీ, పెరూ, బొలీవియా వంటి చోట్ల ఆయుఃక్షీణత మరింత ఎక్కువగా నమోదైంది. కరోనా తొలినాళ్లలో టీనేజర్లు మినహాయించి మిగతా అన్ని వయసుల వాళ్లు ఎక్కువగా మృత్యువాత పడ్డారని వార్తలొచ్చాయి. అందులో నిజం లేదని ఈ అధ్యయనం కుండబద్దలు కొట్టింది. ► ప్రపంచవ్యాప్తంగా టీనేజీ, యుక్త వయసు వాళ్లలో కోవిడ్ మరణాల రేటు ఎక్కువగానే ఉందని పేర్కొంది. ► ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు తగ్గడం విశేషం. 2019తో పోలిస్తే 2021లో ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు 7 శాతం తగ్గాయి. అంటే మరణాలు 5,00,000 తగ్గాయని అధ్యయనం వెల్లడించింది. ► దక్షిణాసియా, ఆఫ్రికా చిన్నారుల పేరిట కోవిడ్ శాపమనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి నలుగురు చిన్నారుల్లో ఒకరు దక్షిణాసియాలోనే చనియారు. ప్రతి నలుగురిలో ఒకరు సహారా ఆఫ్రికా ప్రాంతంలో ప్రాణాలు వదిలారు. ► అధ్యయనంలో భాగంగా మొత్తం జనాభాలో 15 ఏళ్లుపైబడిన వారు ఎంత మంది? వారిపై కోవిడ్ ప్రభావం, ఆయుర్దాయం వంటి అంశాలను విశ్లేషించారు. వీరిలో 2019–2021 కాలంలో పురుషుల్లో 22 శాతం, మహిళల్లో 17 శాతం మరణాల రేటు పెరగడం ఆందోళనకం ► 2020, 2021 సంవత్సరాల్లో మొత్తంగా 13.1 కోట్ల మంది మరణించారు. అందులో కోవిడ్ సంబంధ మరణాలు ఏకంగా 1.6 కోట్ల పైమాటే. ► గతంలో ఎన్నడూ లేని విధంగా జోర్డాన్, నికరాగ్వా వంటి దేశాల్లో కోవిడ్ మరణాలు భారీగా నమోదయ్యాయి. ► దక్షిణాఫ్రికాలోని క్వాజూలూ–నాటల్, లింపోపో వంటి చోట్ల ఆయుర్దాయం దారుణంగా తగ్గిపోయింది ► కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న/ కోవిడ్ బారిన పడి కూడా బార్బడోస్, న్యూజిలాండ్, ఆంటిగ్వా, బార్బుడా వంటి దేశాల్లో తక్కువ మరణాలు నమోదవడం విశేషం. ► కోవిడ్ వల్ల ఆయుర్దాయం కొంత తగ్గినప్పటికీ దశాబ్దాలుగా అందుబాటులోకి వస్తున్న నూతన వైద్య విధానాల కారణంగా 1950 నుంచి చూస్తే ఆయుర్దాయం మెరుగ్గానే ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Countdown on Health and Climate Change: ఎండ దెబ్బకు ఐదు రెట్ల మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా పెరుగుతున్న ఎండల తీవ్రతతో మానవాళికి పెనుముప్పు పొంచి ఉందని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. భానుడి ప్రతాపం ఇదే మాదిరి పెరుగుతూ ఉంటే వచ్చే 27 ఏళ్లలో అంటే 2050 నాటికి ఎండల తీవ్రతకు మరణించే వారి సంఖ్య ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంది. తాజాగా, లాన్సెట్ ‘కౌంట్ డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ ఛేంజ్’పై 8వ వార్షిక నివేదిక విడుదల చేసింది. గాలి, నీరు పరివర్తనం వల్ల తలెత్తే ప్రమాదాలపై ప్రధానంగా ఈ నివేదిక దృష్టి సారించింది. ఆయిల్, గ్యాస్ వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టవద్దని ప్రభుత్వాలు, కంపెనీలకు సూచించింది. 2022లో దాదాపు 86 రోజుల పాటు తీవ్రమైన వేడిమిని ఎదుర్కోవలసి వచి్చందని పేర్కొంది. ఇందులో 60 శాతానికిపైగా ఘటనలకు మానవ కార్యకలాపాలే బాధ్యత అని తెలిపింది. జీవ ఇంధనాలపై పెట్టుబడులు పెట్టే వివిధ కంపెనీల తీరును కూడా లాన్సెట్ నివేదికలో ఎండగట్టింది. జల, వాయు సంబంధిత దుష్పరిణామాలను నిలువరించేందుకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు సరిపోవని లాన్సెట్ కౌంట్ డౌన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మరీనా రొమానెలో హెచ్చరించారు. ఎండ తీవ్రత వల్ల వ్యవస్థకు కలుతున్న నష్టంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణం దెబ్బతినడం వల్ల నీరు, వ్యవసాయ ఉత్పత్తులపై కూడా ప్రతికూల ప్రభావం పడి, ప్రపంచ వ్యాప్తంగా పోషకాహార లోపం సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అంచనా వేశారు. కేవలం ఎండ తీవ్రత కారణంగా 2041–60మధ్య కాలంలో 52.49కోట్ల మంది ఆహార భద్రత ముప్పు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. 2050 వరకు ప్రాణాంతక వ్యాధుల సంఖ్య పెరగొచ్చని కూడా లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఐదు రెట్ల మరణాలు.. ఆందోళన కలిగిస్తున్న తాజా నివేదిక
శిలాజ ఇంధనాల నిర్మూలనకు సాహసోపేతమైన చర్యలు తీసుకోకుంటే వాతావరణ సంక్షోభం మరింత మంది జీవితాలను ప్రమాదంలో పడేస్తుందని తాజా నివేదిక ఒకటి ఆందోళన కలిగిస్తోంది. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. వాతావరణ చర్యను ఆలస్యం చేయడం వల్ల 2050 నాటికి ఉష్ణ సంబంధిత మరణాలు దాదాపు ఐదు రెట్లు పెరుగుతాయని ప్రముఖ సైన్స్ జర్నల్ లాన్సెట్‌లో నవంబర్ 14న ప్రచురితమైన వార్షిక కౌంట్‌డౌన్ నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మానవుల ఆరోగ్యం శిలాజ ఇంధనాల నిర్మూలనపైనే ఆధారపడి ఉందని పేర్కొంది. మానవాళికి ముప్పు ఓ వైపు మానవాళి ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నప్పటికీ, వాతావరణ మార్పులతో వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు కానీ, బ్యాంకులు కానీ, కంపెనీలు కానీ మేల్కోవడం లేదని, శిలాజ ఇంధనాల వినియోగాన్ని, విస్తరణను ప్రోత్సహిస్తూనే ఉన్నాయని నివేదిక రూపకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలు చమురు, గ్యాస్ ఉత్పత్తి ప్రణాళికల విస్తరణ, ఫైనాన్సింగ్‌తో శిలాజ ఇంధనంవైపు పయనిస్తూ మానవ మనుగడకు ముప్పు తెస్తున్నాయని లాన్సెట్ కౌంట్‌డౌన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రధాన రచయిత మరీనా రొమనెల్లో సీఎన్ఎన్ వార్తా సంస్థతో పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకూ నష్టమే ప్రపంచం శిలాజ ఇంధనాలపై ఆధారపడటం కొనసాగితే , దాని పర్యవసానాలు మానవ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు కూడా విపత్తుగా మారవచ్చని రోమనెల్లో నొక్కిచెప్పారు. 1800ల చివరిలో పారిశ్రామిక పూర్వ యుగం నుంచి ఈ గ్రహం ఇప్పటికే దాదాపు 1.2 డిగ్రీల సెల్సియస్ వేడెక్కింది. ఇది 2 డిగ్రీలకు చేరుకుందంటే ప్రపంచ దేశాలు 50 శాతం కార్మిక సామర్థ్యాన్ని నష్టపోతాయని, తద్వారా అపారమైన ఆర్థిక నష్టాలకు దారి తీస్తుందని నివేదిక హెచ్చరించింది. -
కరోనాతో మంచాన పడ్డవారికి... లాంగ్ కోవిడ్ ముప్పు!
న్యూఢిల్లీ: కరోనా రోగుల్లో వారం పాటు, ఆపై మంచానికి పరిమితమైన వారిలో లాంగ్ కోవిడ్ లక్షణాలు ప్రస్ఫుటంగా కని్పస్తున్నట్టు తాజా పరిశోధనలో తేలింది. వారిలో చాలామంది కనీసం రెండేళ్లపాటు విపరీతమైన ఒంటి నొప్పులు తదితర లక్షణాలతో బాధపడుతున్నారట. లాన్సెట్ రీజనల్ హెల్త్ యూరప్ జర్నల్ అధ్యయనం ఈ మేరకు తేలి్చంది. లింగ, వయో తదితర భేదాలకు అతీతంగా అందరిలోనూ ఇది సమానంగా కనిపించినట్టు వివరించింది. కరోనాతో రెండు నెలలకు, అంతకుమించి ఆస్పత్రిపాలైన వారిలో ఈ సమస్యలు, లక్షణాలు మరింత ఎక్కువగా తలెత్తినట్టు పేర్కొంది... ఇలా చేశారు... ► అధ్యయనం కోసం స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్‌ల్లో 64,880 మంది వయోజనులను ఎంచుకున్నారు. ► వీరంతా 2020 ఏప్రిల్ నుంచి 2022 ఆగస్టు మధ్య నానారకాల కొవిడ్ తరహా శారీరక సమస్యలను ఎదుర్కొన్నవారే. ► అందరూ పూర్తిగా, లేదా పాక్షికంగా కరోనా టీకాలు వేయించుకున్నవారే. ► వీరిలో 22 వేల మందికి పైగా కరోనా కాలంలో ఆ వ్యాధితో బాధపడ్డారు. ► వీరిలోనూ 10 శాతం మంది కనీసం ఏడు రోజులు, అంతకంటే ఎక్కువ సమయం పాటు మంచాన పడ్డారు. ఇలా మంచాన పడ్డవారిలో చాలామంది ఇతరులతో పోలిస్తే 37 శాతం ఎక్కువ లాంగ్ కోవిడ్ లక్షణాలతో సతమతమయ్యారు. అవేమిటంటే... ► శ్వాస ఆడకపోవడం ► ఛాతీ నొప్పి ► తల తిప్పడం ► తలనొప్పి ► మంచాన పడ్డ వారితో పోలిస్తే ఇతరుల్లోనూ ఇలాంటి లక్షణాలు తలెత్తినా వాటి తీవ్రత మాత్రం అంత ఎక్కువగా లేదు. లాంగ్ కోవిడ్ అంటే... ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం కోవిడ్ సోకిన మూడు నెలల తర్వాత దాని తాలూకు లక్షణాలు తిరగబెట్టి కనీసం రెండు నెలలు, ఆ పైనకొనసాగితే దాన్ని లాంగ్ కోవిడ్‌గా పేర్కొంటారు. ► కోవిడ్ బారిన పడ్డ వారిలో కనీసం 10 నుంచి 20 శాతం మందిలో లాంగ్ కోవిడ్ తలెత్తినట్టు పలు అధ్యయనాల్లో తేలింది. ‘‘లాంగ్ కోవిడ్ ప్రజారోగ్యానికి పెద్ద సమస్యగా మారింది. అంతర్జాతీయంగా ఎంతోమంది దీని బారిన పడ్డారు’’అని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ డాక్టోరల్ స్టూడెంట్ ఎమిలీ జోయ్స్ వివరించారు. ‘అందుకే కోవిడ్ తాలూకు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావంపై ఓ కన్నేసి ఉంచాలి. కనీసం రెండేళ్ల దాకా శారీరక మార్పులు, సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉండాలి’అని సూచించారు. -
యాంటీబయోటిక్స్ కూడా పనిచేయవా?
గుండెల నిండా హాయిగా గాలి పీల్చుకోవాలంటే భయం. మాస్కు లేకుండా ఇల్లు కదలాలంటే భయం, భయం శరీరాన్ని, మెదడుని ఆక్రమించిన కలుషిత గాలి ఇప్పుడు వ్యాధుల నుంచి బయటపడేసే సంజీవిని లాంటి యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్‌పై ప్రభావం చూపిస్తోంది. వాయు కాలుష్యంతో యాంటీబయోటిక్స్ పని చేయడం లేదని, ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య పెరిగిపోతోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఢిల్లీకి చెందిన సమత వయసు 40 సంవత్సరాలు. ఒకరోజు హఠాత్తుగా శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఆస్తమా అటాక్ అయింది. ఇంట్లో ఎవరికీ లేని ఆస్తమా ఎందుకొచ్చిందా అని ఆందోళనతో ఉంటే మందులు పని చెయ్యకపోవడంతో కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోయారు. చివరికి ఆస్పత్రిలో చేరితే వైద్యులు అతి కష్టమ్మీద ఆమె ప్రాణాలు కాపాడగలిగారు. దీనికంతటికీ కారణం వాయు కాలుష్యం. వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం గాల్లో కలిసిపోయి మనుషుల ఊపిరితిత్తులు, గుండె, మెదడుకి పాకుతోంది. వాయు కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు, గుండె వ్యాధులు, కేన్సర్, చివరికి ఆయుఃప్రమాణాలు క్షీణిస్తాయనే మనకి తెలుసు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధులకు సంజీవనిలా ఉపయోగపడే యాంటీబయోటిక్స్ పని చేయకుండా వాయుకాలుష్యం చేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది పెరిగిపోతే భవిష్యత్‌లో మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనలున్నాయి. కలుషిత గాలితో వచ్చే అనర్థాల్లో తాజాగా యాంటీబయోటిక్ నిరోధకత పెరిగిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని లాన్సెట్ హెల్త్ జర్నల్ అధ్యయనాన్ని ప్రచురించింది. చైనా, యూకేకు చెందిన శాస్త్రవేత్తలు వాయు కాలుష్యం ప్రభావాలపై వివిధ సంస్థలు సేకరించిన గణాంకాల ఆధారంగా యాంటీబయోటిక్స్ పనిచేయకపోవడం అతి పెద్ద పెనుముప్పుగా మారనుందని హెచ్చరించారు. 2000 నుంచి 2018 మధ్య కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ ఎని్వరాన్‌మెంట్ ఏజెన్సీ, వరల్డ్ బ్యాంక్ సహా 116 దేశాల డేటాను సేకరించి అధ్యయనం చేశారు. ► గాల్లోని సూక్ష్మాతి సూక్ష్మ ధూళి కణాలు పీఎం 2.5 వల్ల యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోతోంది. గాలిలో కాలుష్యం 10శాతం పెరిగితే యాంటీబయోటిక్‌ను నిరోధించే సామర్థ్యం 1.1% పెరుగుతోంది ► ప్రపంచవ్యాప్తంగా 703 కోట్ల మంది ప్రజలు పీఎం 2.5 దు్రష్పభావాలను ఎదుర్కొంటున్నారు. ► గాల్లో పీఎం 2.5 ధూళి కణాలు మనుషుల వెంట్రుక కంటే 30 రెట్లు చిన్న కణాలతో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా యాంటీబయోటిక్ నిరోధకతను ఇవి ఎంత ప్రభావితం చూపిస్తున్నాయన్నది అర్థం చేసుకోవడం దుర్లభంగా మారింది. ► యాంటీబయోటిక్స్ పనిచెయ్యకపోవడానికి ప్రధాన కారణం వాటిని మితి మీరి వాడడం అయినప్పటికీ వాయు కాలుష్యమూ మనుషుల శరీరంలో యాంటీబయోటిక్ నిరోధక బ్యాక్టీరియాను పెంచుతోంది. ► ఆస్పత్రులు, వ్యవసాయ క్షేత్రాలు, వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు వంటి వాటి నుంచి యాంటీబయోటిక్‌లు పని చెయ్యకుండా చేసే కలుషిత గాలి ఎక్కువగా వెలువడుతున్నట్టు అధ్యయనం వివరించింది. ప్రాణం పోసే యాంటీబయోటిక్ ప్రాణమెలా తీస్తుంది? యాంటీబయోటిక్స్‌ని మితి మీరి వాడకం వల్ల శరీరంలో సహజసిద్ధమైన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటోంది. దీనివల్ల సూపర్ బగ్స్ ఏర్పడి మంచి బ్యాక్టీరియాను తినేస్తున్నాయి. ఫలితంగా వ్యాధులు సోకినప్పుడు మందులు వేసుకున్నా పని చేయకుండా పోతున్నాయి. యాంటీబయోటిక్స్ పని చెయ్యకపోవడం వల్ల ప్రస్తుతం ఏడాదికి లక్ష మంది మరణిస్తున్నారు. 2050 నాటికి ఈ కారణంతో ప్రపంచ దేశాల్లో అత్యధికమరణాలు సంభవించే ముప్పు ఉంది. -
Lancet Study: 2050 కల్లా మధుమేహ బాధితులు 130 కోట్లు
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 130 కోట్ల మంది వరకు మధుమేహం బారినపడే అవకాశం ఉన్నట్లు లాన్సెట్ చేపట్టిన ఓ అధ్యయనం తేల్చింది. 1990–2021 మధ్య కాలంలో 204 దేశాలు, ప్రాంతాల్లో మరణాలు, అశక్తత, డయాబెటిస్ వ్యాప్తి వంటి అంశాలకు సంబంధించి 27 వేలకు పైగా రకాల గణాంకాల ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టినట్లు లాన్సెట్ తెలిపింది. 2050 నాటికి మధుమేహం వ్యాప్తి సామాజిక, భౌగోళిక అంశాలు, ఒబేసిటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే మోడల్‌ను అనుసరించినట్లు వివరించింది. ప్రజలు తమ ఆరోగ్య విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపింది. ఎక్కువ మందికి టైప్–2నే టైప్–1, టైప్–2 డయాబెటిస్‌లలో వచ్చే మూడు దశాబ్దాల్లో టైప్–2 బాధితులే ఎక్కుమంది ఉంటారని సర్వేలో వెల్లడైంది. టైప్–1 అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి, దీనివల్ల శరీరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేదు. ఇది ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. టైప్–2 డయాబెటిస్తో ఇన్సులిన్ నిరోధకత క్రమంగా పెరుగుతుంటుంది. ఈ పరిస్థితి ఎక్కువగా పెద్దల్లో కనిపిస్తుంది. ముందుగానే గుర్తించి, దీనిని నివారించవచ్చు. అప్రమత్తతే ఆయుధం డయాబెటిస్తో సంబంధం ఉన్న అనేక సమస్యల కారణంగా ఈ సర్వేలో తేలిన వివరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మధుమేహ బాధితులు గుండెజబ్బు, గుండెపోటు, కంటి చూపు కోల్పోవడం, పాదాలకు అల్సర్లు వంటివి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అవగాహన లేకపోవడం, సరైన చికిత్స లేకపోవడం వల్ల చాలా మంది ఈ సమస్యల బారిన పడతారు. మధుమేహం ప్రమాదాన్ని పెంచేవి సాధారణంగా వయస్సు, ఊబకాయం. ఎక్కువ బీఎంఐకి అధిక–క్యాలరీ ఉత్పత్తులు, అల్ట్రా–ప్రాసెస్డ్ ఆహారం, కొవ్వు, చక్కెర, జంతు ఉత్పత్తుల వినియోగం. వీటితోపాటు తగ్గిన శారీరక శ్రమ డయాబెటిస్‌కు కారణాలుగా ఉన్నాయి. జన్యు సంబంధమైన కారణాలతోపాటు అనారోగ్యకర జీవన శైలితో కూడా మధుమేహం బారినపడే ప్రమాదముంది. జాగ్రత్తలు మేలు.. ► ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పాటించాలి. ► ఎక్కువ రిస్క్ ఉన్న వారు ఫైబర్ ఎక్కువగా ఉండే, తృణ ధాన్యాలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ► ఒకే చోట గంటల కొద్దీ కూర్చోరాదు. అప్పుడప్పుడు నడక వంటి వాటితో శారీరక శ్రమ అలవాటు చేసుకోవాలి. ► రోజులో కనీసం అరగంటపాటు వ్యాయామం చేయాలి. బరువు పెరక్కుండా జాగ్రత్తపడాలి. ► దాహం అతిగా అవుతున్నా, నీరసంగా ఉన్నా, తెలియకుండానే బరువు కోల్పోతున్నా, కంటి చూపు మందగించినా, తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన వైద్య చికిత్సలు తీసుకోవాలి. -
ఐదు బ్యాక్టీరియాలకు.. భారత్‌లో 6.8 లక్షల మంది బలి
న్యూఢిల్లీ: ఈ.కోలి. ఎస్ నిమోనియా, కె.నిమోనియా, ఎస్.ఏరియస్, ఎ.మౌమనీ. ఈ ఐదు రకాల బ్యాక్టీరియాలు 2019లో భారత్‌లో ఏకంగా 6.8 లక్షల మంది ఉసురు తీశాయని లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. ‘‘2019లో ప్రపంచం మొత్తమ్మీద సంభవించిన మరణాలకు గుండె సంబంధిత వ్యాధుల తర్వాత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లే రెండో అతి పెద్ద కారణంగా నిలిచాయి. ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకటి వీటి ఫలితమే. 33 రకాల సాధారణ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు 77 లక్షల మరణాలకు కారణమయ్యాయి. వీటిలోనూ కేవలం ఐదు బ్యాక్టీరియాల వల్ల సగానికి పైగా మరణాలు సంభవించాయి’’ అని అధ్యయనం పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా బ్యాక్టీరియాలను అదుపు చేయడం తక్షణావసరమని హెచ్చరించింది. ‘‘పటిష్టమైన ఆరోగ్య, వ్యాధి నిర్ధారణ వ్యవస్థల నిర్మాణం, మెరుగైన అదుపు చర్యలు, యాంటీబయాటిక్‌ల వాడకాన్ని గరిష్ట స్థాయికి పెంచడం వంటి చర్యలు చేపట్టాలి’’ అని వాషింగ్టన్ వర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ డైరెక్టర్, అధ్యయన కర్త క్రిస్టోఫర్ ముర్రే సూచించారు. చాలా ఇన్ఫెక్షన్లు తదితరాలకు మనకిప్పటిదాకా కారణాలు తెలియకపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. పలు గణాంకాలతో పాటు 3.43 కోట్ల మంది వైద్య రికార్డులను పరిశీలించారు. ‘‘2019లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 1.37 కోట్ల ఇన్ఫెక్షన్ సంబంధిత మరణాల్లో సగానికి పైగా బ్యాక్టీరియానే కారణం. 77 లక్షల బ్యాక్టీరియా సంబంధిత మరణాల్లో మూడొంతులకు పైగా శ్వాస, రక్త, ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్లే. బ్యాక్టీరియాల్లో ఒక్క ఎస్.ఏరియస్ రకమే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 1.1 కోట్ల మరణాలకు కారణమైంది. వయసుపరంగా కూడా 15 ఏళ్ల పై బడ్డ వారిలో అత్యధికంగా 9.4 లక్షల మందిని ఇది బలి తీసుకుంది’’ అని పరిశోధకులు తేల్చారు. సహారా ఆఫ్రికా ప్రాంతంలో అత్యధికంగా ప్రతి లక్ష మంది జనాభాకు 230 మంది బ్యాక్టీరియాకు బలైనట్టు వివరించారు. అదే పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా వంటి సంపన్న ప్రాంతాల్లో ఈ సంఖ్య అత్యల్పంగా ప్రతి లక్ష మందికి 52గా ఉందని చెప్పారు. ఇదీ చదవండి: Bruce Lee Death Reason: ఓవర్‌గా వాటర్ తాగితే.. బ్రూస్లీలా మరణం ఖాయమంటున్న పరిశోధకులు! -
భారత్‌లో 2 నిమిషాలకు ఒకరు దుర్మరణం.. మేల్కోపోతే వినాశనమే!
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతోనూ చాలా దేశాల్లో తిండి దొరకని పరిస్థితులు తెలెత్తాయి. అయితే, అంతుకు మించిన విపత్తు మనకు తెలియకుండానే ప్రాణాలను హరిస్తోంది. మనం చేసుకుంటున్న కర్మకు ఫలితేమేనంటూ శాస్త్రవేత్తలు బల్ల గుద్ది చెబుతున్నారు. పెరుగుతున్న కాలుష్యం కారణంగా భూతాపం(గ్లోబల్ వార్మింగ్) పెరిగిపోయి.. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బొగ్గు, చమురు, గ్యాస్‌కు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ పెరిగి.. విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది ఓ పరిశోధన. శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఒక్క భారత్‌లోనే 2 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని తాజాగా నివేదిక ‘ద లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్’ హెచ్చరించింది. ఈ నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ వంటి 50 సంస్థలకు చెందిన 99 మంది నిపుణులు రూపొందించారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తూ ఆరోగ్య కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు సూచించారు. శిలాజ ఇంధనాలకు రాయితీలు ఇస్తూ.. వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే.. ఆహార భద్రత, అంటు వ్యాధుల వ్యాప్తి, ఉష్ణోగ్రత వల్ల కలిగే వ్యాధులు, విద్యుత్తు సంక్షోభం, గాలి కాలుష్యం వల్ల మరణాలు వంటివి పెరిగిపోయి మహా విపత్తు తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు తక్షణం చర్యలు చేపట్టకపోతే జరిగేది వినాశనమేనని హెచ్చరించారు. ► శిలాజ ఇంధనాల వాడకంతో ఏర్పడే కాలుష్యం కారణంగా భారత్‌లో గత ఏడాది 2020లో ఏకంగా 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదిక వెల్లడించింది. అది ప్రతి 2 నిమిషాలకు 1.2 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు.. చైనాలో 3,80,000 మరణాలు సంభవించగా, ఐరోపాలో 1,17,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 32 వేల మంది మరణించారు. ► ప్రస్తుతం ప్రపంచ దేశాలు అవలంభిస్తున్న తీరుతో ఈ శతాబ్దం చివరి నాటికి భూతాపం 2.7 డిగ్రీల సెల్సియస్ పెరగనుంది. ప్రస్తుతం 1.1 డిగ్రీ సెల్సియస్ పెరిగినందుకే వడగాలులు, వరదలు, తుపాన్లతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. మరి ఆ స్థాయి ఉష్ణోగ్రతకు చేరుకుంటే పరిస్థితి దారుణంగా ఉండనుంది. ► వాతావరణ మార్పులు, గాలి కాలుష్యం కారణంగా ఎక్కువ నష్టం జరుగుతోందని నివేదిక వెల్లడించింది. శిలాజ ఇంధానలను వాడటం వల్ల గ్రీన్‌హౌజ్ గ్యాస్ గాల్లో కలిసి ప్రాణాలను హరించివేస్తోందని పేర్కొంది. గాలి కాలుష్యం కారణంగా శరీరంలోని ప్రతి అవయవం దెబ్బతింటున్నట్లు స్పష్టం చేసింది. గాలి నాణ్యత పీఎం 2.5గా ఉన్న అమెరికాలోనే గత ఏడాది 32వేల మంది మరణించారని ఆందోళన వ్యక్తం చేసింది. ► ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు శిలాజ ఇంధనాలకు రాయితీలు ఇస్తున్నాయి. అందులో కొన్ని దేశాల్లో ఆరోగ్య రంగానికి మించి శిలాజ ఇంధానల కోసం ఖర్చు చేస్తున్నాయి. 2019లో 69 దేశాలు 400 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. భారత్ 43 బిలియన్ డాలర్లు, చైనా 35 బిలియన్ డాలర్లు, ఐరోపాలోని 15 దేశాలు ఒక్కో దేశానికి ఒక్కో బిలియన్ డాలర్ల చొప్పును రాయితీలు కల్పిస్తున్నాయి. అమెరికా 20 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. దీంతో శిలాజ ఇంధనాల వాడకం పెరిగిపోతోంది. దీంతో కాలుష్యం పెరగటం, పర్యావరణ మార్పులు చోటు చేసుకుని వినాశనాన్ని కొనితెచ్చుకుంటున్నామని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: షాకింగ్.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ -
ప్రమాదకరంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్.. శీతాకాలంలో విజృంభణ!
లండన్: కరోనా వైరస్‌లో(సార్స్–కోవ్–2) కొత్తగా పుట్టుకొచ్చిన బీఏ.2.75.2 అనే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ప్రమాదకరంగా పరిణమిస్తున్నట్లు స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్ పరిశోధకులు గుర్తించారు. ఇది మనుషుల రక్తంలోని ప్రతిరక్షకాల (యాంటీబాడీలు) నుంచి సమర్థంగా తప్పించుకున్నట్లు తేల్చారు. అంతేకాకుండా ఇప్పుడు అందుబాటులో ఉన్న కోవిడ్–19 యాంటీబాడీ చికిత్సలను కూడా తట్టుకుంటున్నట్లు చెప్పారు. ఈ పరిశోధన వివరాలను లాన్సెట్ అంటువ్యాధుల పత్రికలో ప్రచురించారు. ప్రస్తుత శీతాకాలంలో కరోనా మహమ్మారి ముప్పు పొంచి ఉందని, అందుకే ముందుజాగ్రత్తగా అప్డేటెడ్ టీకాలు తీసుకోవాలని, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని పరిశోధకులు సూచించారు. కరోనా ఒమిక్రాన్‌లోని బీఏ.2.75 అనే వేరియంట్ ఉత్పరివర్తనం చెందడంతో బీఏ.2.75.2 ఉప వేరియంట్ పుట్టినట్లు కనిపెట్టారు. ఈ ఏడాది మొదట్లోనే ఇది బయటపడింది. కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికైతే తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నప్పటికీ భవిష్యత్తులో ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేమన్నది పరిశోధకులు మాట. కోవిడ్–19 బారిన పడే అవకాశం అధికంగా ఉన్నవారికి యాంటీవైరల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఇదీ చదవండి: BioNTech: త్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్! -
యాంటీ‘భయో’టిక్స్!
సాక్షి, హైదరాబాద్: తుమ్మినా..దగ్గినా..నీరసమున్నా..ఆయాసమున్నా.. వొళ్లు నొప్పులు.. వైరల్ జ్వరం.. ఏదైనా ఒక్కటే మందు..యాంటీబయాటిక్. ఇలా చిన్నాచితకా రోగానికీ యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటం చాలామందికి అలవాటై పోతోంది. చివరి అస్త్రంగా వాడాల్సిన వాటిని తొలిదశలోనే వాడేస్తున్నారు. వైద్యులు సూచించక పోయినా కొందరు సొంతంగా వాడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల, నిజంగా అవసరమైనప్పుడు వాడినా అవి పనిచేయని పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంటే అప్పటికే మనుషుల్లో వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ క్రిములకు యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే శక్తి (యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్) వచ్చి ఉంటుందన్న మాట. వ్యవసాయ పంటలకు విచ్చలవిడిగా పురుగుమందులను (యాంటీబయాటిక్స్) చల్లుతున్నారు. అధిక పాల ఉత్పత్తి కోసం పాడి పశువులకు ఇంజెక్షన్లు (యాంటీబయాటిక్స్) ఇస్తున్నారు. ఈ విధమైన ఆహారం, పాలు తీసుకోవడం ద్వారా అప్పటికే మానవ శరీరంలో అధిక శాతం యాంటీబయాటిక్స్ ఉంటున్నాయని అధ్యయనాలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. 280 కోట్ల యాంటీబయాటిక్స్ ప్యాక్‌ల విక్రయం దేశంలో 2019లో 85 రకాలకు సంబంధించిన 280 కోట్ల యాంటీబయాటిక్స్ ప్యాక్‌లు అమ్ముడుపోయినట్లు లాన్సెట్ జర్నల్ తెలిపింది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, బోస్టన్ యూనివర్సిటీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యాంటీబయాటిక్స్‌పై చేసిన అధ్యయనం ఇటీవల లాన్సెట్‌లో ప్రచురితమైంది. ఇందులో 28 యాంటీబయాటిక్స్‌ను అత్యవసర మందుల జాబితాలో పెట్టారు. మిగితావి సాధారణ జాబితాలో ఉన్నాయి. కేంద్ర ఔషధ నాణ్యత నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) అనుమతి ఇచ్చిన యాంటీబయాటిక్స్ కేవలం 19 శాతమే కాగా మిగిలిన 81 శాతం రాష్ట్రాల ఔషధ నియంత్రణ సంస్థల పరిధిలో అమ్ముతున్నారు. వాస్తవానికి దేశంలోని చాలా కాంబినేషన్ యాంటీబయాటిక్స్‌ను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. రెండు మూడురకాలకు చెందిన యాంటీ బయాటిక్స్‌ను కలిపి (కాంబినేషన్) వాడటం సరైంది కాదని పేర్కొంది. కాంబినేషన్ మందులను కుష్టు, క్షయ వంటి వ్యాధులకు వాడాలి. కానీ మన వద్ద చిన్న చిన్న రోగాలకు కూడా కాంబినేషన్ ఔషధాలు వాడుతున్నారు. ఒకటి అవసరమైనచోట రెండు వాడటం వల్ల కూడా ఆ మందు పనిచేయని పరిస్థితి వస్తుంది. అయినా కంపెనీలు ఇష్టమొచ్చినట్లుగా మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. ఔషధాల నియంత్రణలో ఉన్న లోపాలను ఆధారం చేసుకొని దందా నిర్వహిస్తున్నాయి. అమ్ముడవుతున్న యాంటీబయాటిక్స్‌లో 85–90 శాతం ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రాక్టీషనర్లు రాస్తున్నవేనని అధ్యయనం తేల్చిచెప్పింది. ఆహారం ద్వారానే అత్యధిక శాతం యాంటీబయాటిక్స్! ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనం ప్రకారం మన దేశంలో మాంసం, పాలు, పాల పదార్థాలు, గుడ్లు, వివిధ రకాల పంటల (ఆహార పదార్ధాలు) వినియోగం ద్వారా 80 శాతం యాంటీబయాటిక్స్ మానవ శరీరంలోకి వెళ్తున్నాయని తేల్చింది. చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు బ్లడ్ ఇన్ఫెక్షన్లుగా మారితే, అక్కడున్న పెన్సిలిన్‌కు సంబంధించిన యాంటిబయాటిక్కు లొంగని పరిస్థితులు 65 శాతం ఉంటున్నట్లు తెలిపింది. దీంతో డోసు ఎక్కువున్న యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే ఉదర ఇన్ఫెక్షన్ బ్లడ్ ఇన్ఫెక్షన్గా మారితే.. యాంటీబయాటిక్స్‌కు లొంగని పరిస్థితులు 85 శాతం ఉంటున్నట్లు పేర్కొంది. శుభ్రత పాటించకపోవడంతో చేటు యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటానికి ఇన్ఫెక్షన్లే ప్రధాన కారణం. ఇప్పటికీ 54 శాతం ఇళ్లల్లో శుచీ శుభ్రత పాటించడం లేదు. సబ్బుతో చేతిని కడుక్కోలేని స్థితి ఉన్న ఇళ్లు 32 శాతం ఉన్నాయి. నీటి వసతి లేని ఆసుపత్రులు ఆరు శాతం ఉన్నాయి. పారిశుధ్యం సరిగా పాటించని ఆసుపత్రులు 22 శాతం ఉన్నాయి. వ్యర్థాలను సరిగా నిర్వీర్యం చేయని ఆసుపత్రులు 27 శాతం ఉన్నాయి. ఇలాంటి కారణాల వల్ల ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. వివిధ దశల్లో 90 రకాల వ్యాక్సిన్లు యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించేలా, ఇన్ఫెక్షన్ రాకుండా చూసేలా ప్రపంచవ్యాప్తంగా 90 రకాల వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉంది. చాలారకాల యాంటీబయాటిక్స్‌కు లొంగని, మొండి ఇన్ఫెక్షన్లకు కారణమైన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లు రాకుండా నిరోధించేందుకు ఈ వ్యాక్సిన్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్నాయి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
47 శాతం యాంటీబయోటిక్స్‌కు అనుమతుల్లేవ్
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రైవేట్ రంగంలో యాంటీబయోటిక్స్ వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ అనుమతులు లేని యాంటీబయోటిక్స్‌ను సైతం వైద్యులు యాంటీబయోటిక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు. 2019లో దేశంలో ఉపయోగించిన వాటిలో 47 శాతానికి పైగా యాంటీబయోటిక్స్‌కు ఎలాంటి అనుమతులు లేవని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ, న్యూఢిల్లీలోని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను ‘లాన్సెట్ రీజినల్ హెల్త్–సౌత్‌ఈస్టు ఆసియా’ జర్నల్‌లో ప్రచురించారు. 2019లో అత్యధికంగా అజిత్రోమైసిన్ 500 ఎంజీ ట్యాబ్లెట్‌ను 7.6 శాతం మంది, సెఫిక్సైమ్ 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను 6.5 శాతం మంది ఉపయోగించినట్లు అధ్యయనంలో తేలింది. ఇదంతా ప్రైవేట్ రంగంలో సాగిందే. ప్రభుత్వ రంగంలో వాడిన యాంటీబయోటిక్స్‌ను ఇందులో చేర్చలేదు. అనుమతుల్లేని యాంటీబయోటిక్స్ ఫార్ములేషన్స్లో తొలి మూడు స్థానాల్లో సెఫాలోస్పారిన్స్, మాక్రోలైడ్స్, పెన్సిల్సిన్స్ ఉన్నాయి. ఇండియాలో యాంటీబయోటిక్స్ వాడకంపై నిఘా పెట్టేందుకు సరైన వ్యవస్థలు లేవని హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్లో కన్సల్టింగ్ ఫిజీషియన్, డయాబెటాలిజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ హరికిషన్ బూగూరు చెప్పారు. అనుమతి లేని ఔషధాలను విచ్చలవిడిగా వాడితే రోగులకు ముప్పు తప్పదని హెచ్చరించారు. -
కరోనా సోకిన రెండేళ్ల వరకు మానసిక సమస్యలు
లండన్: కోవిడ్ రోగుల్లో రెండేళ్ల తర్వాత కూడా మానసిక, నరాలకు సంబంధించిన వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని లాన్సెట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీ 12.5 లక్షల మంది కరోనా రోగులపై నిర్వహించిన అధ్యయనం వివరాలను లాన్సెట్ సైక్రియాట్రి జనరల్ తన తాజా సంచికలో ప్రచురించింది. కరోనా సోకినప్పుడు శ్వాసకోశ సంబంధింత వ్యాధులతో పాటుగా రెండేళ్ల వరకు సైకోసిస్, డిమెన్షియా, బ్రెయిన్ ఫాగ్ వంటి కొనసాగుతున్నాయని అధ్యయనం తేల్చింది. చిన్నారుల్లో కంటే పెద్దవారిలోనే ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టు పేర్కొంది. మానసిక, నరాలకు సంబంధించిన వ్యాధులు కోవిడ్ సోకిన మొదటి ఆరు నెలల్లోనే వచ్చి రెండేళ్ల వరకు ఉంటున్నాయని అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్ పాల్ హరిసన్ వివరించారు. -
Covid-19: దిమాక్ ఖరాబ్ చేస్తున్న కరోనా
లండన్: కరోనా వచ్చి పోయింది, మానసికంగా ఒడిదుడుకులకు గురైనా పర్వాలేదుగానీ ఓ గండం దాటేశాం అనుకుంటున్న వాళ్లకు.. కొత్త కొత్తగా వస్తున్న నివేదికలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. శ్వాస కోశ వ్యవస్థ.. అంతర్గత అవయవాల పని తీరును డ్యామేజ్ చేయడం వరకే వైరస్ ప్రభావం ఆగిపోలేదు. పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్.. మెదడుపైనా దీర్ఘకాలం ప్రభావం చూపెడుతోందని తాజా అధ్యయనాల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వివిధ దేశాల నుంచి సుమారు పన్నెండున్నర లక్షల మంది పేషెంట్ల ఆరోగ్య నివేదికల ఆధారంగా.. లాన్సెట్ సైకియాట్రీ జర్నల్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. ఇంత భారీ సంఖ్యలో ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ఇదే మొదటిది. వీళ్లలో శ్వాస కోశ, హృదయ, ఎముకల సంబంధిత సమస్యల కంటే.. మెదడు మీదే కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందని గుర్తించారు. COVID-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, ప్రాణాలతో బయటపడినవారు నాడీ సంబంధిత, సైకియాట్రిక్ సమస్యల బారినపడుతున్న ప్రమాదం ఎక్కువగా ఉందని ఆధారాలు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. బ్రెయిన్ ఫాగ్.. ఇబ్బందికర పరిస్థితి. పనుల మీద దృష్టిసారించకపోవడం. విషయాల్ని గుర్తుంచుకోకపోవడం. చుట్టూ ఉన్న విషయాలను పట్టించుకోకపోవడం.. మీ మీద మీకే విరక్తి కలగడం. ఎపిలెప్సీ.. బ్రెయిన్ యాక్టివిటీ అబ్నార్మల్గా ఉండడం. అసాధారణ ప్రవర్తన. వీటితో పాటు మూర్ఛ సంబంధిత సమస్యలూ వెంటాడుతున్నాయి. డిప్రెషన్, యాంగ్జైటీ రూపంలో స్థిమితంగా ఉండనివ్వడం లేదు. వైరస్ బారినపడి కోలుకున్నవాళ్లలో.. ఆరు నెలల నుంచి రెండేళ్లపాటు మానసిక రుగ్మతలు కొనసాగడం గుర్తించినట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పౌల్ హారిసన్ వెల్లడించారు. కొవిడ్-19 తర్వాతే ఎందుకిలా జరుగుతుంది?.. ఇది ఇంకెంత కాలం సాగుతుంది?.. సమస్యలను అధిగమించడం ఎలా? అనే వాటిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని ఆయన అంటున్నారు. ఇదీ చదవండి: షియోమి వారి కుంగ్ ఫూ రోబో! -
లిక్కర్ తాగితే ఆరోగ్యానికి మేలేనటా.. అది ఎలాగంటే!
లండన్: ఆల్కాహాల్ తీసుకోవటం వల్ల ఆరోగ్యం చెడిపోతుందని వైద్యులు చెబుతుంటారు. తాగి ఇంటికొస్తే పెద్దలు తిడతారు. అయితే.. మద్యం తాగితే ఆరోగ్య ప్రయోజనాలు సైతం ఉన్నాయని లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం తేల్చింది. అవునండి అది నిజమేనటా? లిక్కర్ తాగితే చాలా రోగాలు దరిచేరవటా! కానీ, దానికో షరతు ఉంది. మీరు 40 ఏళ్ల వయసు దాటి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటే.. చిన్న గ్లాస్ రెడ్ వైన్, బీరు బాటిల్, విష్కి లేదా ఇతర లిక్కర్‌ను ప్రామాణిక మోతాదులో తీసుకోవచ్చని తేల్చింది. దాంతో గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు, గుండపోటు, మధుమేహం వంటివి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని వెల్లడించింది. మరోవైపు.. వృద్ధులతో పోలిస్తే యువత ఆల్కాహాల్ తీసుకోవటం ద్వారా ఎక్కువ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. 15-39 ఏళ్ల వయసు వారు లిక్కర్ తీసుకోవటం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవటా. ప్రస్తుతం మద్యం సేవిస్తున్నవారిలో వీరి వాటానే ఎక్కువ. ఈ వయసు వారిలోనే 60 శాతానికిపైగా ఆల్కాహాల్ సంబంధిత సమస్యలకు గరువుతున్నట్లు అధ్యయనం తేల్చింది. బైక్ ప్రమాదాలు, ఆత్మహత్యలు, దాడులు ఎక్కువగా జరుగుతున్నట్లు పేర్కొంది. 'యువత ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. 40 ఏళ్లు పైబడిన వారు కొద్దిగా లిక్కరు తీసుకోవటం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. యువత ఆల్కహాల్‌కు దూరంగా ఉంటారని నమ్మకం లేకపోయినప్పటికీ.. మా అధ్యయనంతో కొంత వరకైనా మారుతారనే నమ్మకం ఉంది.' అని పేర్కొన్నారు వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎమ్మాన్యూయెల్ గాకిడో. మహిళలు, పురుషుల్లో ఆల్కహాల్ తీసుకుంటే వచ్చే ముప్పుపై అధ్యయనం చేశారు పరిశోధకులు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వంటి 22 సమస్యలపై.. వ్యాధులతో ప్రపంచ వ్యయం 2020 డేటాను వినియోగించుకున్నారు. 15-95 ఏళ్ల వయసువారిపై పరిశోధన.. 1990- 2020 మధ్య 15-95 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, ఆడవారిపై అధ్యయనం చేశారు పరిశోధకులు. 2020 గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ డేటాను ఉపయోగించి హృదయ వ్యాధులు, క్యాన్సర్లతో సహా 22 ఆరోగ్య ఫలితాలపై ఆల్కహాల్ వినియోగం ప్రమాదాన్ని పరిశీలించారు. 204 దేశాల్లో ఈ పరిశోధన చేపట్టారు. 40-60 ఏళ్ల మధ్య ఉన్నవారు రోజుకు ప్రామాణిక మేతాదులో సగం తీసుకోవటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తేల్చారు. 65 ఏళ్లు పైబడిన వారిలో రోజులో మూడు ప్రామాణిక మోతాదులకన్నా ఎక్కువ మోతాదు తీసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరోవైపు.. 15-39 వయసు వారు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే రోజుకు ప్రామాణిక మోతాదులో 0.136 వంతు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే.. మహిళలకు రోజుకు 0.273గా ఉన్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: 11ఏళ్ల తర్వాత హాలిడే.. ఎగ్జైట్మెంట్లో తాగి విమానంలో రచ్చ రచ్చ.. -
మద్యపానంతో హాని... యువతకే ఎక్కువ!
వాషింగ్టన్: మద్యపానంతో వయసు మళ్లిన వారితో పోలిస్తే యువతకే అనారోగ్య ముప్పు ఎక్కువట! మద్యం సేవనంపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నిపుణుల పరిశోధన ఫలితాలను లాన్సెట్ జర్నల్‌లో శుక్రవారం ప్రచురించారు. 15–39 ఏళ్ల వారిలో ఆల్కహాల్ వల్ల ఆరోగ్యానికి రిస్క్ అధికంగా ఉంటున్నట్లు పరిశోధనలో తేలింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 40 ఏళ్లు దాటి, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనివారు పరిమితంగా మద్యం తీసుకుంటే కార్డియో వాస్క్యులర్ జబ్బులు, గుండెపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు తగ్గుతున్నట్లు వెల్లడయ్యింది. ఒకటి నుంచి రెండు పెగ్గులకే పరిమితం అయితే మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. 15–39 ఏళ్ల పురుషులు ఆల్కహాల్ సేవిస్తే ఆరోగ్యపరంగా నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని తేల్చిచెబుతున్నారు. మద్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు వంటి ఘటనల్లో బాధితులుగా మారుతున్నది ఎక్కువ శాతం 15–39 ఏళ్ల వయసు విభాగంలో ఉన్నవారేనని గుర్తుచేస్తున్నారు. ‘‘మేమిచ్చే సందేశం ఏమిటంటే.. యువత మద్యం జోలికి అస్సలు వెళ్లొద్దు. 40 ఏళ్లు దాటినవారు చాలాపరిమితంగా మద్యం తీసుకోవచ్చు. దానివల్ల వారికి ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలున్నాయి’’ అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ ఎమ్మానుయేల్ గాకిడౌ చెప్పారు. -
భారత్‌లో వ్యాక్సిన్లతో... 42 లక్షల ప్రాణాలు నిలిచాయి
లండన్: కరోనా మహమ్మారిని వ్యాక్సిన్లు సమర్థంగా ఎదుర్కొంటున్నాయని, వాటివల్ల 2021లో భారత్ 42 లక్షల మరణాలను నివారించిందని ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. యూకేలోని లండన్‌లో ఇంపీరియల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు కోవిడ్–19 వాస్తవ మరణాలను, డిసెంబర్ 8, 2020, డిసెంబర్ 8, 2021 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగే వ్యాక్సినేషన్‌ను సరిపోల్చి చూస్తూ ఈ లెక్కలు వేశారు. భారత్‌లో 42 లక్షలకు పైగా మరణాలను నివారించినట్టు ఆ అధ్యయనం తెలిపింది. ‘‘భారత్‌కు సంబంధించినంత వరకు ఈ ఏడాది కాలంలో 42,10,000 మరణాలను నివారించగలిగిందని మాకు అంచనాలున్నాయి’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ ఒలివర్ వాట్సన్ చెప్పారు. 2 కోట్ల ప్రాణాలు పోయేవి కరోనా మరణాల విషయంలో అధికారిక లెక్కలకి, వాస్తవ ఫలితాలకు మధ్య భారీ తేడా ఉన్నట్టు విమర్శలున్నాయి. కరోనాతో 189 దేశాల్లో 3.14 కోట్ల మంది మరణిస్తారని అనుకుంటే వ్యాక్సిన్లు రావడం వల్ల వారిలో 1.98 కోట్ల మంది ప్రాణాలు కాపాడుకోగలిగామని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రతీ దేశంలో 40శాతం మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొని ఉండి ఉంటే 5.99 లక్షల మరణాలు తప్పేవని అధ్యయనం పేర్కొంది. 17 వేలకు పైగా కేసులు న్యూఢిల్లీ : దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి. కేవలం ఒక్క రోజులోనే 30శాతం కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 17,336 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నాలుగు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. కరోనాతో ఒక్క రోజులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. -
భారత్‌లో కాలుష్యకాటుకు 24 లక్షలమంది బలి
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో కాలుష్యం కారణంగా 2019లో 23.5 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించాయని లాన్సెట్ జర్నల్ పేర్కొంది. ప్రపంచ దేశాలన్నింటిలో 2019లో సంభవించిన కాలుష్య మరణాలు భారత్‌లోనే అత్యధికమని తెలిపింది. కాలుష్య మరణాల్లో అత్యధికం (16.7 లక్షలు) వాయుకాలుష్యం వల్ల జరిగాయని, వాయుకాలుష్య మరణాల్లో అత్యధిక మరణాలు(9.8 లక్షలు) పీఎం2.5 కాలుష్యకాల వల్ల సంభవించాయని వివరించింది. గాలిలో 2.5 మైక్రాన్లు, అంతకన్నా తక్కువ సైజుండే కణాలను పీఎం 2.5 కాలుష్యకాలంటారు. మిగిలిన వాయు కాలుష్య మరణాలు గృహసంబంధిత వాయు కాలుష్యకాల వల్ల సంభవించినట్లు తెలిపింది. భారత్‌లో 2019లో నీటి కాలుష్యంతో 5 లక్షలు, పారిశ్రామిక కాలుష్యంతో 1.6 లక్షల మంది మరణించారని తెలిపింది. ప్రపంచం మొత్తం మీద 2019లో అన్ని రకాల కాలుష్యాలతో 90 లక్షల మంది మరణించినట్లు నివేదిక తెలిపింది. వీటిలో అత్యధికంగా (66.7 లక్షలు) వాయుకాలుష్యం వల్లనే సంభవించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉందని నివేదిక రూపకర్త రిచర్డ్ చెప్పారు. 2015 నుంచి మాత్రమే దేశాలు కాలుష్య నివారణ బడ్జెట్‌ను స్వల్పంగా పెంచుతున్నాయన్నారు. గంగా మైదానంలో అధికం భారత్‌లో వాయు కాలుష్యం గంగా– సింధు మైదాన ప్రాంతం (ఉత్తర భారతం)లో అధికమని నివేదిక తెలిపింది. ఇళ్లలో బయోమాస్ తగలబెట్టడం వల్ల వాయుకాలుష్య మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. దేశ వాతావరణంలో కాలుష్య కారకాలు 2014లో గరిష్ఠంగా ఉన్నాయని, ఆ తర్వాత కాస్త తగ్గినట్లు కనిపించినా తిరిగి వీటి సరాసరి పెరుగుతోందని తెలిపింది. భారత్‌లో జాతీయ వాయు శుభ్రతా కార్యక్రమం సహా పలు కార్యక్రమాలను ప్రభుత్వం కాలుష్య నివారణకు చేపట్టిందని, కానీ భారత్‌లో వాయుకాలుష్య నివారణకు బలమైన కేంద్రీయ వ్యవస్థ లేదని నివేదిక తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన ప్రమాణాల కన్నా భారత వాతావరణంలో కాలుష్యకాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అయితే సాంప్రదాయక కాలుష్యకాల వల్ల మరణాలు 2000 సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం 50 శాతం వరకు తగ్గినట్లు తెలిపింది. ఇదే సమయంలో కాలుష్యం వల్ల ఆర్థిక నష్టం జీడీపీలో ఒక్క శాతానికి పెరిగిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం వల్ల జరిగిన ఆర్థిక నష్టం 46లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేసింది. అంతర్జాతీయంగా కాలుష్యాల వల్ల మరణాలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా 7వ స్థానంలో ఉంది. 2015లో చైనాలో 18 లక్షల మంది కాలుష్యంతో మరణించగా, ఈ సంఖ్య 2019లో 21.7 లక్షలకు పెరిగిందని నివేదిక తెలిపింది. -
భారత్‌లో కరోనా మరణాలు 40 లక్షలు?
లండన్/న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో భారత్‌లో రెండేళ్లలో ఏకంగా 40.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ అంచనా వేసింది. అధికారిక లెక్కల్లోకి రాని కోవిడ్ మృతుల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే టాప్‌లో ఉందని పేర్కొంది. 2020 జనవరి–2021 డిసెంబర్ మధ్య మరణించిన వారి సంఖ్య కేంద్రం వెల్లడించిన లెక్కల కంటే ఏకంగా 8 రెట్లు ఎక్కువని తెలిపింది. 2021 డిసెంబర్ 31 నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో 22.3 శాతం భారత్‌లోనే ఉన్నాయని తెలిపింది. రెండేళ్ల కాలంలో కరోనా మృతులపై 191 దేశాల గణాంకాలతో లాన్సెట్ నివేదిక రూపొందించింది. గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 59.4 లక్షల మంది కరోనాకు బలైనట్టు అధికారిక గణాంకాలున్నాయి. కానీ వాస్తవానికి 1.82 కోట్ల మంది మరణించినట్టు అధ్యయనంలో తేలినట్టు లాన్సెట్ వెల్లడించింది. భారత్‌లో కరోనాతో రెండేళ్లలో 4.89 లక్షల మంది మరణించినట్టు కేంద్రం వెల్లడించిందని, కానీ వాస్తవానికి 40.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్టు తేలిందని వివరించింది. భారత్ తర్వాత అమెరికా (11.3 లక్షల మరణాలు), రష్యా (10.7 లక్షలు), మెక్సికో (7.98 లక్షలు), బ్రెజిల్ (7.36 లక్షలు), ఇండోనేసియా (7.36 లక్షలు), పాకిస్తాన్ (6.64 లక్షలు) ఉన్నట్టుగా వివరించింది. తప్పుడు సమాచారం: కేంద్రం లాన్సెట్ లెక్కల్ని కేంద్రం కొట్టిపారేసింది. ఆ సంస్థ విశ్లేషణలు, అంచనాలు ఊహాజనితాలని విమర్శించింది. కరోనా మరణాల లెక్కలు సేకరించే పద్ధతిలో తప్పులు దొర్లాయని ఆ నివేదిక రచయితలే అంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
ఈ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనది: లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవాగ్జిన్ కోవిడ్ టీకా అత్యంత సమర్థంగా పని చేస్తోందని, పూర్తిగా సురక్షితమైనదని లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక వెల్లడించింది. రెండు డోసులు తీసుకున్న వారిలో ఈ వ్యాక్సిన్ 77.8 శాతం సామర్థ్యంతో పని చేస్తోందని తెలిపింది. ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలను లాన్సెట్ వైద్య నిపుణులు విశ్లేషించి నివేదిక రూపొందించారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 2 వారాల్లో యాంటీబాడీలు సమృద్ధిగా వచ్చాయని, దుష్ప్రభావాలు కనబడలేదంది. కోవాగ్జిన్ తీసుకుంటే కరోనా తీవ్రంగా సోకకుండా 93.4%, సాధారణంగా సోకకుండా 77.8%తో పని చేస్తోందని తెలిపింది. డెల్టా వేరియెంట్ నుంచి 65.2% సామర్థ్యంతో రక్షణ కల్పిస్తోందని పేర్కొంది. టీకా ఇచ్చిన వారంలో తలనొప్పి, అలసట, జ్వరం, ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి తప్ప ఎలాంటి రియాక్షన్లు లేవని స్పష్టం చేసింది. గత ఏడాది నవంబర్ 16 నుంచి ఈ ఏడాది మే 17 వరకు మూడోదశ ప్రయోగాలు జరిగాయి. భారత్‌లోని 25 ఆస్పత్రుల్లో 18–97 ఏళ్ల 16,973 మందికి టీకాను ప్రయోగాత్మకంగా ఇచ్చారు. టీకా తీసుకున్న తర్వాత కరోనా సోకిన వారు ఆస్పత్రి పాలవడం, మరణించడం జరగలేదని లాన్సెట్ జర్నల్ తెలిపింది. ఈ నివేదికపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ బలరాం భార్గవ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మెడికల్ జర్నల్‌లో కోవాగ్జిన్ ఫలితాలు వచ్చాయంటే అదెంత సమర్థంగా పని చేస్తోందో అర్థమవుతుందన్నారు. కోవాగ్జిన్‌పై లాన్సెట్ నిపుణుల పరిశోధనల్లో తేలిన అంశాలు టీకా అభివృద్ధిలో తమ చిత్తశుద్ధిని, డేటా ఇవ్వడంలో పారదర్శకతను వెల్లడిస్తోందని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా అన్నారు. కాగా లాన్సెట్ జర్నల్ ఈ నివేదిక ప్రాథమికమైనదని, మరింత డేటా వచ్చాక పూర్తి నివేదిక ప్రచురిస్తామని వివరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఇటీవల అనుమతులిచ్చింది. -
టీకా తీసుకున్న వారి ద్వారా కూడా కరోనా వ్యాప్తి
లండన్: కోవిడ్–19 వైరస్ నుంచి రక్షణ కోసం టీకా రెండు డోసులు తీసుకున్న వారి నుంచి కూడా ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతున్నట్టు లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక వెల్లడించింది. అయితే, వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే టీకా తీసుకున్న వారిలో వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నట్టు తెలిపింది. యూకేలోని ఇంపీరియల్ కాలేజీ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తల అధ్యయనం ఫలితాలను లాన్సెట్ వెలువరించింది. ‘‘టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడా వైరస్ సోకుతోంది. అయితే వారు త్వరగానే కోలుకుంటున్నారు. కానీ వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించేవారు వ్యాక్సిన్ తీసుకోకపోతే మహమ్మారి వారిని బాగా వేధిస్తోంది’’ అని ఆ నివేదిక వెల్లడించింది. ‘‘కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో వ్యాక్సిన్లే అత్యంత కీలకం. మన చుట్టూ ఉన్నవారు టీకా వేసుకున్నారు, మనకేం కాదులే అన్న ధీమా పనికిరాదు. టీకా వేసుకున్న వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది’’ అని అధ్యయనం సహ రచయిత ప్రొఫెసర్ అజీ లల్వానీ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నప్పటికీ కరోనా కేసులు పెరిగిపోవడానికి ఇదే కారణమని వివరించారు. టీకా రెండో డోసు తీసుకున్న 3 నెలల తర్వాత నుంచి వారికి వైరస్ సోకి ఇతరులకు వ్యాపిస్తున్నట్లు గుర్తించామన్నారు. -
వేర్వేరు సంస్థల టీకాలు..
లండన్: కోవిడ్ టీకా రెండు డోసుల్లోనూ ఆస్ట్రాజెనెకా(కోవిషీల్డ్)ను తీసుకున్న వారితో పోలిస్తే ఒక డోసు ఆస్ట్రాజెనెకా, ఎంఆర్ఎన్ఏ ఆధారంగా తయారు చేసిన టీకా మరో డోసు తీసుకుంటే మహమ్మారి ముప్పు తక్కువగా ఉంటోందని స్వీడన్లో చేపట్టిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ మేరకు చేపట్టిన ‘మిక్స్ అండ్ మ్యాచ్’అధ్యయనం ఫలితాలు సోమవారం లాన్సెట్ రీజినల్ హెల్త్–యూరప్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వెక్టార్ ఆధారిత ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న 65 ఏళ్లు పైబడిన వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడంతో స్వీడన్లో ఈ టీకా వినియోగాన్ని నిలిపివేశారు. దీంతో, అప్పటికే ఆస్ట్రాజెనెకా మొదటి డోసుగా తీసుకున్న వారికి, ఎంఆర్ఎన్ఏ ఆధారిత టీకాను రెండో డోసుగా తీసుకోవచ్చని నిపుణులు సిఫారసు చేశారు. దీంతో కొందరు రెండో డోసుగా ఫైజర్/ మోడెర్నా టీకాను తీసుకున్నారు. ఇలా, స్వీడన్లో వేర్వేరు డోసులు తీసుకున్న సుమారు 7 లక్షల మంది నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ సర్వే జరిగింది. ‘వెక్టార్ బేస్డ్ టీకా ఆస్ట్రాజెనెకాను మొదటి డోసుగా, ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్‌ను రెండో డోసుగా తీసుకున్న వారిలో కోవిడ్ ముప్పు తగ్గుతోందని గమనించాం’అని పరిశోధకులు చెప్పారు. ఈ అధ్యయనంలో ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వ్యాక్సిన్లను కలిపి తీసుకున్న వారిలో కోవిడ్ ఇన్ఫెక్షన్ ముప్పు 67% తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించారు. అదే, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా వ్యాక్సిన్లను వేర్వేరు డోసులుగా తీసుకున్న వారిలో, అసలు టీకా తీసుకోని వారితో పోలిస్తే కోవిడ్ ముప్పు 79% వరకు తగ్గుతున్నట్లు గుర్తించారు. రెండు డోసుల్లోనూ ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్) టీకా తీసుకున్న వారికి కోవిడ్ ముప్పు 50%మాత్రమే తగ్గుతున్నట్లు కూడా గుర్తించామన్నారు. -
మెడలు వంచే మేటి తరుణం!
కరోనా వైరస్ మన మధ్య ఇక స్థిరపడబోతోందా? దాంతో మనిషి శాశ్వత సహజీవనం ఖరారై నట్టేనా? రాను రాను ప్రభావం తగ్గి మహమ్మారి కాస్త అంటువ్యాధిగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయా? డెంగ్యూ, మలేరియా, ఇతర ఫ్లూ జ్వరాల్లాగే ఇదీ సాధారణమవుతోందా? ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ ప్రశ్నల్ని రేకెత్తిస్తున్నాయి. సమాధానం ఇదమి ద్దంగా చెప్పలేకపోవడానికి... తరచూ రూపం–స్వభావం మార్చుకుంటూ వైరస్ పుట్టిస్తున్న కొత్త వైవిధ్యాలు (వేరియంట్స్) ఒక కారణమైతే, వేర్వేరు దేశాల్లో, ప్రాంతాల్లో, కాలాల్లో వైరస్ ప్రభావా నికి తలెత్తుతున్న విభిన్న పరిణామాలు మరో కారణం! కొన్ని చోట్ల వైరస్ వ్యాప్తి వేగంగా, ప్రభావం తీవ్రంగా, మరణాల రేటు అధికంగా ఉంటోంది. అదింకా ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. మరికొన్ని చోట్ల ప్రభావం తక్కువగా, వ్యాధి వ్యాప్తి, కేసుల సంఖ్య నామమాత్రంగా ఉంటోంది. వ్యాధి సోకిన వారు ఆస్పత్రిపాలు కావాల్సిన పరిస్థితులు కూడా అరుదుగానే వస్తున్నాయి. ఇందుకు, ఇతరేతర కారణాలతో పాటు రెండు డోసుల టీకా ప్రక్రియ పూర్తయి ఉండటం కూడా కారణమేనని పలు అధ్యయనాలు వెల్లడించాయి. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ‘లాన్సెట్’ అ«ధ్యయనంతో పాటు అమె రికా ‘వ్యాధి నివారణ–నియంత్రణ కేంద్రం’ (సీడీసీ) పరిశోధన ఫలితాలూ ఇదే చెప్పాయి. విశ్వ వ్యాప్తంగా.. టీకాలిచ్చే ప్రక్రియలో వ్యత్యాసాలున్నాయి. ఇవి వైరస్ ప్రభావం హెచ్చు–తగ్గులకు కార ణమవుతున్నాయి. మరోపక్క, వైరస్ కొత్త వైవిధ్యాలు ఈ సమీకరణాలను తలకిందులు చేస్తున్న ఘటనలూ నమోదవుతున్నాయి. రెండు డోసులు తీసుకున్న వారినీ డెల్టా ప్లస్ పలుచోట్ల వేధించింది. అభివృద్ధి చెందిన సమాజాల్లో ఇది కొంత ఆందోళన రేపింది. రెండు డోసుల టీకా వేసుకొని కూడా వారు మూడో, నాలుగో (బూస్టర్) డోస్‌కు పరుగులు తీస్తున్నారు. ఇక అభివృద్ధి చెందుతున్న, చెందని చాలా దేశాల్లో టీకా ప్రక్రియ ఇంకా మందకోడిగానే సాగుతోంది. వ్యాధి వ్యాప్తి–ప్రభావాలు, మహమ్మారిని ఎదుర్కొనే ఉమ్మడి పోరు... ఇట్లా ఎలా చూసినా ఈ అంతరాలు, అసమానతలు మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో) హెచ్చరిస్తూనే ఉంది. సామూహిక రోగ నిరోధకత బలపడేందుకు, వైవిధ్యాలకు వెళ్లనీకుండా వైరస్‌ను కట్టడి చేసేందుకు... ఏకరీతి టీకా విధానం మంచిదని ఆ సంస్థ భావన! కానీ, అమెరికా, చైనా, ఇజ్రాయిల్, బెహరాన్... వంటి దేశాలు అధికారికంగానే బూస్టర్ డోస్‌కు అనుమతించాయి. ఇది, ఇప్పటికింకా రెండు డోసులు దక్కని వారిని కలతకు గురిచేస్తోంది. ‘రెండు డోసుల’ సామర్థ్యంపై పలువురిలో సందేహాలనూ రేపుతోంది. ఇకపై అసంఖ్యాకంగా కరోనా వైరస్ వైవిధ్యాలకు గల ఆస్కారాన్ని శాస్త్రవేత్తలు, ఇతర నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఇప్పటికే, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, డెల్టా ప్లస్... ఇలా పలు వైవిధ్యాలు వెలుగు చూశాయి. కోవిడ్ రెండో అలలో బి.1.621 వైవిధ్యం భారత్‌తో సహా పలు దేశాల్లో విధ్వం సమే సృష్టించింది. అమెరికా, కెనడా, ఐరోపా దేశాలు, చివరకు చైనా కూడా డెల్టా ప్లస్‌తో కష్టాల నెదు ర్కొన్నాయి. ఇప్పుడు సి.1.2 గురించిన హెచ్చరికలు వస్తున్నాయి. గడచిన ఏడాదిన్నర కాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 22 కోట్ల మంది కోవిడ్ వ్యాధిబారిన పడ్డట్టు లెక్కలున్నాయి. 45 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇవి ప్రామాణిక లెక్కలు కావని, ఇంకా వెలుగుచూడని గణాంకాలూ ఉన్నాయని డబ్లు్యహెచ్‌వో కూడా అంగీకరిస్తోంది. స్థూలంగా ఒకవైపు కరోనా మహ మ్మారి ప్రభావం తగ్గినట్టు కనిపిస్తున్నా, మరోవైపు వివిధ దేశాల్లో రెండో, మూడో, నాలుగో అలలు చెలరేగుతున్నాయి. దీంతో మానవాళి భయాందోళనలు వీడి కొంతకాలంపాటు జాగ్రత్తలు పాటిస్తూ ఉండటం మంచిదని వైరాలజిస్టులు, నిపుణులు చెబుతున్నారు. పరిణామాల్ని నిశితంగా గమనిస్తూ, కోవిడ్ నిబంధనావళిని విధిగా పాటిస్తూ, టీకా ప్రక్రియను వేగిర పరుస్తూ... ముందుకు సాగడం మంచిదనే స్థూలాభిప్రాయం వ్యక్తమౌతోంది. జీవితంతో పాటు జీవనోపాధులూ ముఖ్యమే కనుక ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసే కార్యాచరణ వేగవంతం చేయాలనే సూచనలు వస్తున్నాయి. భారత్‌లో బడులు, ఇతర విద్యాసంస్థలు చాలా వరకు మొదలయ్యాయి. వర్తక, వాణిజ్య, ఉత్పత్తి, సేవా, క్రీడా, వినోద కార్యకలాపాలూ క్రమంగా వేగం పుంజుకుంటున్నాయి. ఒకవైపు కోవిడ్–19 రెండో అల మందగిస్తూ, మూడో అల హెచ్చరికలు వస్తున్న సంధికాలమిది. అల రాకకు సంబంధించి నిర్దిష్టంగా కొన్ని సంకేతాలూ ఉన్నాయి. కేరళ వంటి రాష్ట్రాల్లో అసాధారణ సంఖ్యలో కేసులొస్తున్నాయి. రోజుకు 45–47 వేల కొత్త కేసులు దేశ వ్యాప్తంగా నమోదవుతుంటే, అక్కడే 30 వేలకు పైగా ఉంటున్నాయి. దేశంలో టీకాలిచ్చే ప్రక్రియ ఆశించిన స్థాయిలో లేకున్నా... ఆశాజన కంగానైతే ఉంది. కిందటి వారం 4.5 కోట్ల డోసులు, ఒకే రోజు కోటికి పైగా డోసులు ఇచ్చి కొత్త ఆశలు కల్పించారు. మళ్లీ ఎందుకో ఈ ప్రక్రియ ఢీలా పడింది. వైద్యం, అందుకవసరమైన సదు పాయాల పరంగా ఒక నిర్దిష్ట వ్యవస్థ ఇప్పటికే ఏర్పడింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ సంస్థలు తాజా సమాచారంతో ఎప్పటికప్పుడు విధివిధానాలు పురమాయి స్తుంటే, మూడో అల ఎదుర్కోవడానికి రాష్ట్రాలు సన్నద్దతతోనే ఉన్నాయి. ఇక పౌర సమాజం అప్ర మత్తంగా ఉండటమే ఎంతో ముఖ్యమైంది. నాణ్యమైన మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటిం చడం, ఎప్పటికప్పుడు శానిటైజర్లతో శుభ్రత పాటించడం వంటి కోవిడ్ సముచిత వర్తన (సీఏబీ)తో ప్రతివ్యక్తీ వ్యవహరించి వైరస్‌ను బలహీనపరచాలి. మహమ్మారిని సాధారణ అంటువ్యాధి కింద మార్చే అవకాశాన్ని చేజారనీయొద్దు! -
ఏడాది దాటినా లక్షణాలు
బీజింగ్: కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన వారిలో.. వ్యాధి తగ్గిన ఏడాది తర్వాత కూడా లక్షణాలు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింంది. చైనాలోని వుహాన్‌లో జరిగిన ఈ అధ్యయనం శుక్రవారం ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైంది. కరోనా సోకినప్పటి నుంచి 12 నెలల పాటు 1,276 మందిపై ఈ అధ్యయనం చేసినట్లు వుహాన్‌లోని చైనా–జపాన్ ప్రెండ్షిప్ హాస్పిటల్ ప్రొఫెసర్ బిన్ కావ్ తెలిపారు. అధ్యయనంలో ఉన్న చాలా మంది కరోనా నుంచి బాగానే కోలుకున్నప్పటికీ, వ్యాధి ముదిరి ఐసీయూ వరకు వెళ్లిన రోగులకు మాత్రం ఏడాది తర్వాత కూడా లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. 2020 జనవరి 7 నుంచి మే 29 మధ్య డిశ్చార్జ్ అయిన వారిపై ఈ ప్రయోగం జరిగిందని పేర్కొన్నారు. ఆరోగ్యంగా లేరు.. కరోనా సోకిన వారిని, సోకని వారిని పోల్చి చూస్తే వ్యాధి సోకిన వారు ఏడాది తర్వాత కూడా వ్యాధి సోకని వారిలా ఆరోగ్యంగా లేరని లాన్సెట్ జర్నల్ తెలిపింది. కరోనా నుంచి కోలుకోవడానికి కొందరికి ఏడాదికి పైగా పడుతుందని ఈ అధ్యయనంద్వారా వెల్లడైనందున, కోవిడ్ అనంతరం ఆరోగ్య సేవలు అందించే వ్యవస్థల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న రోగులకు సంబంధించిన ఆరోగ్య వివరాలను ఆరు నెలల తర్వాత మొదటి సారి, పన్నెండు నెలల తర్వాత రెండో సారి సేకరించినట్లు వెల్లడించింది. లక్షణాలేవంటే.. కరోనా సోకి నయమైన వారిలో చాలా మందికి ఏ లక్షణాలు లేకుండా పోగా, సగం మందిలో మాత్రం పలు లక్షణాలు అధ్యయనకర్తలు గుర్తించినట్లు లాన్సెట్ వెల్లడించింది. నీరసంగా ఉండటం, కండరాల బలహీనతలు అత్యంత ఎక్కువగా కనిపించినట్లు లక్షణాలని తెలిపింది. ఆరు నెలల తర్వాత సగం మందిలో ఈ లక్షణాలు కనిపించగా, ఏడాది తర్వాత ఇవి ప్రతి అయిదు మందిలో ఒకరికి పరిమితమయ్యాయని పేర్కొంది. పన్నెండు నెలల తర్వాత కూడా ప్రతి ముగ్గురిలో ఒకరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. లక్షణాలు కనిపించిన వారిలో.. కరోనా సోకిన సమయంలో ఐసీయూ వరకు వెళ్లి ఆక్సిజన్ ట్రీట్మెంట్ పొందిన వారు అత్యధికంగా ఉన్నట్లు వెల్లడించింది. పరీక్షలివే.. 349 మందికి లంగ్ ఫంక్షన్ టెస్టు (ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష) నిర్వహించామని, వారిలో 244 మందికి 12 నెలల తర్వాత కూడా అదే పరీక్షను తిరిగి నిర్వహించినట్లు పరిశోధకులు తెలిపారు. ఆరు నెలల సమయంలో నిర్వహించిన పరీక్షలో వచ్చిన ఫలితాలే సంవత్సరం తర్వాత కూడా వచ్చాయని, ఏ మాత్రం మెరుగు పడలేదని తాము గుర్తించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మరో 353 మందికి ఆరు నెలల తర్వాత సీటీ స్కాన్ చేయగా, వారిలో సగం మంది ఊపిరితిత్తులు అసహజ పనితీరును చూపినట్లు తెలిపారు. అనంతరం 12 నెలల తర్వాత 118 మందికి సీటీ స్కాన్ నిర్వహించగా, అసహజ పనితీరు తగ్గినట్లు గుర్తించామని తెలిపారు. మహిళల్లోనే ఎక్కువ.. పురుషులతో పోలిస్తే మహిళల్లో నీరసం, కండరాల బలహీనత 1.4 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని లాన్సెట్ జర్నల్ తెలిపింది. ఆందోళన, కుంగుబాటు వంటివి కూడా పురుషులతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువగా మహిళల్లో నమోదైందని చెప్పింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ పురుషులతో పోలిస్తే మహిళల్లో 12 నెలల తర్వాత కూడా ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా నమోదైందని పేర్కొంది. స్టెరాయిడ్స్ తీసుకున్న వారిలో కూడా 1.5 రెట్లు ఎక్కువ లక్షణాలు కనిపించినట్లు తెలిపింది. అయితే ఈ పరిశోధన మొత్తం ఒకే ఆస్పత్రిలో చేరిన వారిపై జరిగిందని, అందువల్ల అన్ని ప్రాంతాలకు దీన్ని వర్తింపజేయలేమని పరిశోధనలో పాల్గొన్న జియోయింగ్ గున్ అభిప్రాయపడ్డారు. అధ్యయనం సాగిందిలా.. అధ్యయనంలో భాగంగా ఆస్పత్రికి చెందిన నిపుణులు కరోనా నుంచి కోలుకున్న వారితో రెండు సార్లు ముఖాముఖి సమావేశాలను నిర్వహించారు. భౌతిక పరీక్షలు, ల్యాబ్ పరీక్షలు, ఆరు నిమిషాల నడక పరీక్ష వంటి పలు టెస్టులను జరిపారు. కరోనా తగ్గిన 185, 349వ రోజున ఈ ముఖాముఖిలను, పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. అధ్యయనంలో పాల్గొన్న వారి సగటు వయసు 57 ఏళ్లుగా ఉందని స్పష్టం చేశారు. కరోనా తగ్గిన తర్వాత ఆరు నెలలకు 68 శాతం మందిలో కరోనా లక్షణాలు కొనసాగాయని, ఏడాది తర్వాత అది 49 శాతానికి తగ్గిందన్నారు. అంటే ఏడాది తర్వాత కూడా సగం మందికి కరోనా లక్షణాలు కొనసాగినట్లు తేలిందని పరిశోధనలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. -
‘సైలెంట్ కిల్లర్’తో జాగ్రత్త.. భారత్‌లో 30 శాతం మంది బాధితులు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య నిపుణులు ‘సైలెంట్ కిల్లర్’గా పరిగణిస్తున్న ‘హైపర్ టెన్షన్’ (బీపీ) అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. దేశంలోని 30 శాతం మంది ‘అధిక రక్తపోటు’తో బాధపడుతున్నారని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో వెల్లడైంది. 1990 నుంచి 2019 వరకు 184 దేశాల్లో 10 కోట్ల మందిపై నిర్వహించిన పరిశోధనలను శాస్త్రవేత్తలు విశ్లేషించిన సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకున్న అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇంపీరియల్ కాలేజీ ఆఫ్ లండన్, భారత్‌లోని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు సహా వివిధ దేశాల శాస్త్రవేత్తల సహకారంతో సాగిన ఈ అధ్యయనంలో హైబీపీ వల్ల వచ్చే హార్డ్ ఎటాక్, కిడ్నీ, గుండె జబ్బులకు... ఏటా ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మరణాలకు లంకె ఉన్నట్లు తేలింది. చదవండి: పండగలప్పుడు జరభద్రం! ప్రపంచస్థాయిలో 1990తో పోల్చితే 2019కల్లా బీపీ సమస్యల విషయంలో మహిళలు, పురుషుల సంఖ్య రెట్టింపైనట్లు వెల్లడైంది. బీపీ సమస్యను తగ్గిస్తే 40 శాతం స్ట్రోక్స్, 50 శాతం దాకా హార్ట్ ఫెయిల్యూర్స్ తగ్గుతాయని గతంలోనే కొన్ని అధ్యయనాలు స్పష్టం చేశాయి. బీపీతో ముడిపడిన అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ‘సాక్షి’తో క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ ఎ.నవీన్‌రెడ్డి, కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి వారి అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే... మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలితోనే.. గతంలో 50–60 ఏళ్లు దాటిన వాళ్లలోనే హైబీపీ సమస్యలొచ్చేవి. ఇప్పుడు 25–30 ఏళ్లలోని చాలామంది బీపీ సమస్యను ఎదుర్కొంటున్నారు. వయసుతోపాటు ఒత్తిళ్లు, షుగర్, ఎండోక్రైనాలజీ, కిడ్నీల పరిస్థితి తదితరాలను బట్టి వేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. ప్రధానంగా ఆహార అలవాట్లు, జీవనశైలి విధానమే వాటన్నింటిపై ప్రభావం చూపుతోంది. చేస్తున్న ఉద్యోగాలను బట్టి రాత్రి బాగా పొద్దుపోయాక పడుకోవడం, పగటిపూట ఎప్పుడో నిద్రలేవడం, పొగ తాగడం, మద్యపానం, ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడంతో ఊబకాయులుగా మారి ఎక్కువ మంది బీపీ బారినపడుతున్నారు. మెదడు, గుండె, కిడ్నీలు, లివర్, కళ్లు ఇలా ప్రతి అవయవంపై బీపీ ప్రభావం చూపుతుంది. జీవనశైలి పద్ధతులను మార్చుకోకుండా బీపీని నియంత్రించలేం. బీపీకి నడక చాలా మంచి మందు. 90 శాతం వరకు కారణాలు లేకుండానే బీపీ వస్తుంది. దీనినే ‘ఎసెన్షియల్ హైపర్ టెన్షన్’ అని పిలుస్తాం. – డా. ఎ.నవీన్‌రెడ్డి, క్రిటికల్‌కేర్ నిపుణుడు,నవీన్‌రెడ్డి హాస్పిటల్ -
పిల్లలపై కోవిడ్ ప్రభావం తక్కువే: లాన్సెట్ జర్నల్
లండన్: చిన్నారులపై కోవిడ్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు యూకేలో భారీ అధ్యయనం జరిగింది. కోవిడ్ సోకిన చిన్నారుల్లో అత్యధిక శాతం మందిలో కరోనా లక్షణాలు ఆరు రోజులకు మించి ఉండట్లేదని తాజా పరిశోధనలో తేలింది. ఈ అధ్యయన వివరాలు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనను లండన్‌లోని కింగ్స్ కాలేజ్ నిపుణులు 2020 సెప్టెంబర్ 1 నుంచి 2021 ఫిబ్రవరి 22 వరకూ జరిపారు. జోయ్ కోవిడ్ స్టడీ అనే స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా చిన్నారుల తల్లిదండ్రులు, టీనేజర్ల నుంచి సమాచారం సేకరించారు. మొత్తం మీద 17 ఏళ్ల లోపు ఉన్న రెండున్నర లక్షల మంది యూకే చిన్నారుల మీద ఈ ప్రయోగం జరిగింది. కరోనా సోకిన చాలా మంది చిన్నారుల్లో లక్షణాలు లేవని అధ్యయనంలో తేలింది. మొత్తంమీద అధిక శాతం చిన్నారులు కేవలం నాలుగు వారాల్లో పూర్తిగా కోలుకున్నారని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్ ఎమ్మా చెప్పారు. నీరసమే లక్షణం.. కోవిడ్ సోకిన చిన్నారుల్లో అత్యంత ఉమ్మడిగా కనిపించిన అంశం నీరసంగా ఉండటమేనని పరిశోధనలో పాల్గొన్న తల్లిదండ్రులు తెలిపారు. 84 శాతం మంది పిల్లల్లో నీరసం కనిపించినట్లు పేర్కొన్నారు.8వారాలు దాటిన తర్వాత కూడా కోవిడ్ లక్షణాలు ఉన్న పిల్లలు కేవలం 2శాతం మాత్రమే కావడం గమనార్హం. కరోనా వైరస్ సోకి కోలుకున్న తర్వాత చిన్నారుల్లో జలుబు కొనసాగిందని అధ్యయనంలో తేలింది. మహమ్మారి తర్వాత పరిస్థితుల్లో చిన్నారులను సురక్షితంగా కాపాడుకోవడానికి ఈ లక్షణాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని తెలిపారు. -
203 లక్షణాలతో ‘లాంగ్ కోవిడ్’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి మానవాళిపై ఇంకా సవాళ్లు విసురుతూనే ఉంది. కరోనా నుంచి కోలుకున్నాక సుదీర్ఘ కాలం పాటు శరీరంలోని పది అవయవ వ్యవస్థల్లో (ఆర్గాన్ సిస్టమ్స్) 203 లక్షణాలు ప్రబలంగా కనిపిస్తున్నట్లు లాన్సెట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పటివరకు అంతగా బయటపడని కొత్త అలర్జీలు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు, కంటిచూపు మందగించడం, వినికిడి శక్తి బలహీన పడటం, ముఖ పక్షవాతం వంటి కొత్త సమస్యలు వెలుగులోకి వచ్చాయి. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తల ఆధర్యంలో మొత్తం 56 దేశాల్లో లాంగ్ కోవిడ్‌తో బాధపడుతున్న దాదాపు 4 వేల మందిపై ఈ పరిశోధన జరిపారు. భవిష్యత్‌లో వచ్చే కరోనా వేవ్‌లను ఎదుర్కోవడంతో పాటు వైద్య వ్యవస్థపై కోవిడ్–19కు సంబంధించిన ప్రభావాలు, పరిణామాలను అంచనా వేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. 35 వారాలకు పైగానే.. కరోనా నుంచి బయటపడ్డాక పూర్తిగా కోలుకునేందుకు 91 శాతం పైగా మందికి 35 వారాలకు పైగా పడుతున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. మొత్తం 4 వేల మందిలో రెండున్నర వేల మంది 6 నెలల దాకా కోవిడ్‌కు సంబంధించిన కొన్ని లక్షణాలతో బాధపడినట్లు తేల్చింది. కోవిడ్ తగ్గాక 4 వారాలు అంతకుమించి ఎక్కువ కాలానికి అనారోగ్య సమస్యలు, కరోనా లక్షణాలున్న వారిని ‘లాంగ్ కోవిడ్’తో బాధపడుతున్న వారిగా యూఎస్ ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ పేర్కొన్న విషయం తెలిసిందే. లాంగ్ కోవిడ్ లక్షణాల్లో అలర్జీలు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు, కంటిచూపు మందగించడం, వినికిడి శక్తి బలహీనపడటం, ముఖ పక్షవాతం, ‘సీజర్స్’, ‘అనాఫైలాక్సిస్’ వంటి కొత్త లక్షణాలు బయటపడ్డాయి. సాధారణంగా ఎక్కువమంది నీరసం, అలసట, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, తగ్గిపోవడం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు, జలుబు, తలనొప్పి, మహిళల రుతుక్రమంలో మార్పులు, వివిధ శారీరక బలహీనతలు, లైంగికపరమైన సమస్యలు, రుచి, వాసన కోల్పోవడం తదితర లక్షణాలతో బాధపడుతున్నారని స్పష్టం చేసింది. మన దగ్గరా ఎక్కువగానే.. మన దగ్గర ప్రధానంగా ఉపిరితిత్తులు, మానసిక, గుండె, నరాల సంబంధిత, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, మెట్లు ఎక్కేటప్పుడు, బరువులు ఎత్తేటప్పుడు ఆయాసం వంటి లాంగ్ కోవిడ్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. గతంలో అస్తమా, అలర్జీ ఇతర సమస్యలు లేనివారిలోనూ కోవిడ్ కారణంగా కొత్తగా అలర్జిక్ బ్రాంకైటిస్ లక్షణాలు కన్పిస్తున్నాయి. ఆయాసం, పిల్లి కూతలు, ఛాతీపై బరువు, దగ్గు, వంటి లక్షణాలు దీర్ఘకాలం ఉంటున్నాయి. నోటితో గాలి తీసుకోవాల్సి రావడం, చేతులు, కాళ్లు కొంకర్లు పోవడం, బుగ్గలు, పెదాలపై తిమ్మిర్లు రావడం, గుండె దడ, కలత నిద్ర, నిద్రలేమి, దురదలు వంటి సమస్యలతో మా వద్దకు వస్తున్నారు. – డా.వీవీ రమణప్రసాద్, పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్, కిమ్స్ ఆస్పత్రి -
మందుబాబులు జర భద్రం.. గతేడాది 7.4 లక్షల మందికి క్యాన్సర్
వాషింగ్టన్: ఆల్కహాల్ వినియోగానానికి, ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చాలా దగ్గరి సంబంధం ఉందన్న విషయం తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. 2020వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నమోదైన క్యాన్సర్ కేసులలో 7.4 లక్షలకుపైగా కేసులకు మద్యం వినియోగంతో సంబంధం ఉందని ఈ అధ్యయనంలో స్పష్టమైంది. ఈ అధ్యయన ఫలితాలు తాజాగా 'ద లాన్సెట్ ఆంకాలజీ' అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. గతేడాది కొత్తగా బయటపడ్డ క్యాన్సర్ కేసులలో 4 శాతం కేసులు ఆల్కహాల్ వినియోగంతో ప్రత్యక్ష సంబంధం ఉందని తేలింది. దీంతో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల్లో ప్రాణాంతక వ్యాధికి, అల్కహాల్‌కు ఉన్న సంబంధం గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అంటున్నారు. ఇందుకు ప్రభుత్వాల జోక్యాలు పెరగాలని వారు సూచించారు. ఇక గతేడాది నమోదైన ఆల్కహాల్ అసోషియేటెట్ క్యాన్సర్ కేసులలో మహిళలతో(23 శాతం) పోల్చుకుంటే పురుషులు(77 శాతం) చాలా ఎక్కువ శాతంలో ఉన్నారని అధ్యయనంలో వెల్లడైంది. ఇక క్యాన్సర్ రకాల విషయానికి వస్తే ఆల్కహాల్ అసోషియేటెడ్ క్యాన్సర్ కేసులలో అన్నవాహిక, లివర్, బ్రెస్ట్ క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయని తేలింది. -
కోవిడ్ పుట్టుక ప్రకృతిసిద్ధమే!
న్యూఢిల్లీ: కరోనా ఎలా వచ్చిందో, దేని ద్వారా వచ్చిందోననే అంశంపై భిన్నవాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. చాలామంది ఈ వైరస్ చైనాలోని ఒక ల్యాబ్‌లో ఉత్పన్నమైందని భావిస్తున్నా, ఈ వాదనకు తగ్గ శాస్త్రీయ ఆధారాలు దొరకలేదు. అయితే ఈ వైరస్ ప్రకృతిలోనే సహజంగా ఉద్భవించిందని ద లాన్సెట్ జర్నల్‌లో కొందరు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు బయాలజిస్టులు, వైరాలజిస్టులు, డాక్టర్లు, ఎకాలజిస్టులు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. తాజాగా జరిపిన పరిశోధనల్లో వైరస్ ప్రకృతిసిద్ధంగా ఉత్పన్నమైందనేందుకు బలమైన సాక్ష్యాలు లభించాయని అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా ఈ వైరస్ ల్యాబ్ నుంచి వచ్చిందనేందుకు ఎలాంటి సైంటిఫిక్ సాక్ష్యాలు లేవని గుర్తు చేసింది. గతేడాది లాన్సెట్ ప్రచురించిన నివేదికలో సైతం ఈ బృందం ల్యాబ్ లీకేజీ వాదనలను తోసిపుచ్చింది. పరిశోధన అవసరం: ల్యాబ్ లీకేజ్‌పై ఆరోపణలతో ఎలాంటి ప్రయోజనం లేదని, గబ్బిలాల నుంచి మనిషికి వైరస్ సోకిన విధానంపై పరిశోధన ద్వారానే తదుపరి ప్రమాదాలు నివారించగలమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో వాదోపవాదాలను పక్కనబెట్టి శాస్త్రీయ పరిశోధనా మార్గాన్ని అనుసరించినప్పుడే భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కోగలమని తెలిపారు. వైరస్ పుట్టుకపై శాస్త్రీయ పరిశోధన కోసం డబ్లు్యహెచ్‌ఓ, ఇతర సంస్థలు చైనా నిపుణులతో కలిసి లోతైన పరిశోధన సాగించాలని సూచించారు. ఈ విషయమై స్పష్టమైన వివరాలు తెలియడానికి సంవత్సరాలు పట్టవచ్చని, కానీ ప్రపంచ శాస్త్రీయ సమాజం తప్పక ఈపని చేయాలని తెలిపారు. అధ్యయనంలో బోస్టన్ యూనివర్సిటీ, మేరీలాండ్ యూనివర్సిటీ, గ్లాస్గోవ్ యూనివర్సిటీ, ద వెల్కమ్ ట్రస్ట్, క్వీన్స్లాండ్ యూనివర్సిటీతో పాటు పలు సంస్థలకు చెందిన సైంటిస్టులు పాల్గొన్నారు. -
కోవిడ్ ముప్పు: అత్యవసర చర్యలపై లాన్సెట్ కీలక హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: ఇపుడిపుడే కరోనా సెకండ్‌వేవ్‌నుంచి కోలుకుంటున్న దేశ ప్రజలను థర్డ్‌వేవ్ పొంచి ఉందన్న అంచనాలు వణికిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ భారత ప్రభుత్వానికి కీలక హెచ్చరికలు చేసింది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని లాన్సెట్ మెడికల్ జర్నల్ హెచ్చరించింది. రానున్న కోవిడ్-19 ముప్పుపై అత్యవసర చర్యలు చేపట్టాల్సిందిగా హెచ్చరికలు జారీ చేసింది.ఆరోగ్య సేవలు, కీలక ఔషధాలపై పాదర్శకత, జాతీయంగా ఒకే ధరల విధానం ఉండాలని లాన్సెట్‌లో 21 మంది నిపుణులు సూచించారు. కరోనావైరస్ ఉధృతి తగ్గుతున్న తరుణంలో అన్ని రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియ షురూ అయిన తరుణంలో ది లాన్సెట్ వెబ్సైట్ 8 రకాల సూచనలను చేసింది. బయోకాన్ కిరణ్ మజుందార్ షా, టాప్ సర్జన్ డాక్టర్ దేవి శెట్టితో కూడిన 21 మంది ఈ చర్యలను సిఫారసు చేశారు. లాన్సెట్ సూచనలు 1. అవసరమైన ఆరోగ్య సేవలను వికేంద్రీకరించబడాలి. కేసుల సంఖ్య, అందుతున్న సేవలు జిల్లా నుండి జిల్లాకు చాలా తేడాలున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో ఒకే విధానం ఆమోద యోగ్యం కాదు. 2. అంబులెన్సులు, ఆక్సిజన్, అవసరమైన మందులు , ఆసుపత్రి సంరక్షణ లాంటి ముఖ్యమైన ఆరోగ్య సేవల ధరలపై పారదర్శక, జాతీయ ధర విధానం, ధరలపై నియంత్రణ ఉండాలి. కొన్ని రాష్ట్రాల్లో చేసినట్లుగా ప్రజలందరికీ ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమా పథకాలను అమలు చేయాలి. 3. కోవిడ్ కేసులు, నిర్వహణపై వాస్తవ సమాచారాన్ని మాత్రమే అందించాలి. పూర్తి స్పష్టతతో, ఆధారాల తో అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా వైరస్‌పై అవగాహన, చికిత్స ఇతర సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయాలి. ఈ సమాచారం స్థానిక పరిస్థితులు, క్లినికల్ ప్రాక్టీస్‌లు ఉన్న స్థానిక భాషల్లోఉండాలి. హోం ఐసోలేషన్, చికిత్స, ప్రాధమిక సంరక్షణపై జిల్లా ఆసుపత్రుల్లో తగిన విధానాలుండాలి. 4. ఆరోగ్యం రంగానికి సంబంధించి ప్రైవేటు రంగంతో సహా అన్ని రంగాలలో అందుబాటులో ఉన్న అన్ని మానవ వనరులను కరోనా సంక్షోభ సమయంలో వినియోగించుకోవాలి. ప్రత్యేకించి తగినంత వ్యక్తిగత రక్షణ పరికరాలు, క్లినికల్ ఇంటర్వెన్షన్స్ బీమా, మానసిక ఆరోగ్య మద్దతు వాడకంపై మార్గదర్శకత్వాలను అనుసరించాలి. 5. ప్రాధాన్యత సమూహాలకు టీకా అందించడంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ మోతాదుల వినియోగానికి నిర్ణయం తీసుకోవాలి. దీన్ని మార్కెట్ యంత్రాగాలకు ఏమాత్రం వదిలిపెట్టకుండా ప్రజా ప్రయోజనాలకనుగుణంగా వ్యవహరించాలి. 6. ప్రజల భాగస్వామ్యం, చొరవే కోవిడ్ నియంత్రణకు కీలకం. కరోనా నియంత్రణ, ఇతర అభివృద్ధి కార్యకలాపాలలో ప్రజల భాగస్వామ్యంతో ముంబై బాగా పనిచేసింది. ముంబైలో ముఖ్యంగా గ్రామీణ పౌర సమాజం చారిత్రాత్మక పాత్ర పోషించింది. (కరోనా సంక్షోభం: గూగుల్ మరోసారి భారీ సాయం) 7. ప్రభుత్వ డేటా సేకరణ, మోడలింగ్‌లో పారదర్శకంగా ఉంటూ రానున్న వారాల్లో కేసుల ఉధృతికి ఆయా జిల్లాలను ముందస్తుగా సిద్ధం చేయాలి. ఆరోగ్య సంరక్షణ విధానాలను బలోపేతం చేయడం, బాధితుల వయసు, జండర్ ఆసుపత్రిలో చేరిక, మరణాల రేట్లు, కమ్యూనిటీ-స్థాయిలో టీకాలు, చికిత్స ప్రోటోకాల్స్, దీర్ఘకాలిక ఫలితాలపై కమ్యూనిటీ-ఆధారిత ట్రాకింగ్ అవసరం. (Vaccine: గేమ్ ఛేంజర్, కార్బెవాక్స్ వచ్చేస్తోంది!) 8. అలాగే కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారికి, అట్టడుగువర్గాల వారికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చేస్తున్నట్లుగా నగదు బదిలీ ద్వారా ఆర్థిక మద్దతునందించాలి. తద్వారా ఆయా కుటుంబాల్లో జీవనోపాధి కోల్పోవడం వల్ల కలిగే తీవ్ర బాధలు, అనారోగ్య ముప్పును తగ్గించాలి. సంఘటిత రంగంలోని సంస్థలు కార్మికులందరినీ పనిలో కొనసాగించేలా చూడాలి. ఆర్థిక రంగం తిరిగి పుంజుకున్న తరువాత ఈ సంస్థలకు పరిహారం అందించేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలి. తద్వారా కాంట్రాక్టులతో సంబంధం లేకుండా ఆయా కంపెనీల యజమానులు కార్మికులకు ఉద్యోగ రక్షణ కల్పించేలా చూడాలి. చదవండి: టాప్-5 ఐటీ కంపెనీల్లోనే 96 వేల ఉద్యోగాలు: నాస్కామ్ -
పిల్లలపై... థర్డ్‌వేవ్ ప్రభావానికి ఆధారాల్లేవ్!
న్యూఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనేందుకు ఇంతవరకు సరైన ఆధారాల్లేవని లాన్సెట్ కోవిడ్–19 కమిషన్ ఇండియా టాస్క్‌ఫోర్స్ నివేదిక తేల్చిచెప్పింది. ‘భారతీయ పిల్లల్లో కోవిడ్ 19’ అనే అంశంపై పరిశోధన జరిపేందుకు లాన్సెట్ ఇండియా సంస్థ ఎయిమ్స్‌లోని ప్రముఖ పీడియాట్రిషన్ల్ల(చిన్నపిల్లల వైద్య నిపుణులు)తో కూడిన ఒక బృందాన్ని ఏర్పరిచింది. ఈ బృందం పిల్లలలో థర్డ్‌వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందనేందుకు ఆధారాలేమీ లభించలేదని వివరించింది. ‘కోవిడ్ సోకిన చిన్నారుల్లో ఎక్కువమంది ఎలాంటి లక్షణాలను కనబరచరు(ఎసింప్టమాటిక్), మిగిలినవారిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తాయి. వీరిలో అధికులు స్వల్ప జ్వరం, శ్వాస సమస్యలు, ఉదర సమస్యలు ఎదుర్కొంటారు. వయసులవారీగా చూస్తే లక్షణాలు చూపే పిల్లల సంఖ్య వయసు పెరిగేకొద్దీ పెరుగుతుంది’అని బృంద నివేదిక తెలిపింది. లక్షలో ఒక్కరు.. అధ్యయన వివరాలను అనువర్తిస్తే లక్షమంది పిల్లల్లో కేవలం 500 మంది మాత్రమే ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో 2 శాతం మంది మాత్రమే మరణించడం జరిగింది. ‘లక్ష మంది పిల్లల్లో కోవిడ్ మరణాలు కేవలం ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి’ అని బృందం సభ్యుడు డాక్టర్ సుశీల్ కాబ్రా చెప్పారు. ‘ గణాంకాల ప్రకారం చూస్తే కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువని కానీ, పిల్లలు తీవ్ర అనారోగ్యం పాలవుతారనేందుకు కానీ సరైన ఆధారాలేవీ లేవు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో వ్యాధి తీవ్రత తక్కువ, మరణాల రేటు కూడా తక్కువే’ అని వివరించారు. ఒబేసిటీ, ఆస్థమా, శ్వాస సమస్యలు, పెరుగుదల సమస్యలు, గుండె సమస్యలు, కాన్సర్, ఇమ్యునిటీ వ్యాధులు రిస్కు కారకాలని నివేదిక తెలిపింది. అలాగే తీవ్రత తక్కువని నిర్లక్ష్యం చేయకుండా, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి మౌలిక వసతులు పెంచడం, ఆక్సీజన్ సరఫరా అంతరాయం లేకుండా చూసుకోవడం, మందుల కొరత నివారించడం తదితర చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు సూచించింది. -
Covid-19: వారిపై రెండో దశ ప్రభావం తక్కువే!
సాక్షి, అమరావతి: తొలి దశ కోవిడ్ సమయంలో ఇంటి వద్దే వైద్యం పొందిన వారిలో రెండో దశ కోవిడ్ ప్రభావం అంతగా కనిపించడం లేదని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆ సమయంలో ఆస్పత్రికి వెళ్లక తప్పని వారిలోనే రెండో దశ కోవిడ్ అనేక సమస్యలకు కారణమవుతోంది. అంతర్జాతీయ మెడికల్ జర్నల్.. లాన్సెట్ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. గతేడాది మొదటి దశ కోవిడ్ సమయంలో స్వల్ప లక్షణాలున్నవారిలో ఎక్కువ మంది ఆస్పత్రి బాట పట్టలేదు. ఇంటి వద్దే 14 రోజులు ఉండి.. వైద్యులు సూచించిన మందులు వాడి కోలుకున్నారు. భారత్‌లాంటి దేశాల్లో ఇలా కోలుకున్నవారి రేటు ఎక్కువగానే ఉంది. అయితే.. కొంతమంది పరిస్థితి ఇబ్బందిగా ఉండటంతో ఆస్పత్రులకు వెళ్లారు. అప్పుడప్పుడే కరోనాకు వైద్యం అందుబాటులోకి వస్తున్న సమయంలో తెలియకుండానే ఆస్పత్రులు ఇచ్చిన మందులు వాడాల్సి వచ్చింది. ఇవి ఆ తర్వాత యాంటీబాడీస్‌పై కొంత ప్రతికూల ప్రభావం చూపాయని లాన్సెట్ అధ్యయనం స్పష్టం చేసింది. రెండో దశలో ప్రభావం అధ్యయనంలో భాగంగా మన దేశంలో తాజాగా కోవిడ్ పాజిటివ్‌గా తేలిన 8,983 మందిని, నెగిటివ్ వచ్చిన 80,893 మందిని పరిశీలించారు. వారందించిన వివరాలను బట్టి.. తొలి దశ కోవిడ్‌లో ఇంటి వద్ద చికిత్స పొంది.. రెండో దశలో కోవిడ్ బారిన పడిన వారిలో 91 శాతం మందికి నెగిటివ్ వచ్చాక పెద్దగా సమస్యలు లేవు. అయితే.. వీరిలో కొంతమంది రెండో దశలో వైద్య సేవలకు ఆస్పత్రులకు వెళ్లారు. వీరికి భవిష్యత్‌లో ఎలా ఉంటుందనేది అధ్యయనం చేయాల్సి ఉంది. ఇక మొదటి దశలో ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న ఎక్కువ మంది రెండో దశలో కోవిడ్ నెగిటివ్ వచ్చినా ఎక్కువగా మైగ్రేన్, శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు. స్వల్ప లక్షణాలుండి.. ఇంటి వద్దే మందులతో తగ్గే అవకాశం ఉంటే.. దానికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని తాజా వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. చదవండి: Andhra Pradesh: జూలై 15 నాటికి కరోనా తగ్గుముఖం! -
రెండు వేర్వేరు టీకాలు కలిపి తీసుకోవచ్చా..!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి కట్టడి కోసం పలు దేశాలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే సరిపడా టీకాలు లేకపోవడంతో అనుకున్న మేర ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న టీకాల్లో రెండు వేర్వేరు డోసులు తీసుకోవచ్చా.. అనే కోణంలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపట్టారు. ఇలా చేయడం వల్ల ప్రయోజనం కన్నా దుష్ప్రభావాలే ఎక్కువగానే ఉన్నట్లు తాజా పరిశోధనల్లో తెలిసింది. ఇలా రెండు వేర్వేరు టీకా డోసులు తీసుకోవడం వల్ల తీవ్ర ప్రమాదం లేనప్పటికీ.. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నందున రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను తీసుకోకపోవడమే ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వేర్వేరు వ్యాక్సిన్లకు చెందిన రెండు డోసులను తీసుకున్న వారిలో తక్కువ నుంచి ఓ మోస్తరుగా దుష్ప్రభావాలు కనిపిస్తున్నట్లు ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా నివేదిక వెల్లడించింది. ఇవి తొలిడోసు తీసుకున్నప్పుడు కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉండవచ్చని పేర్కొంది. రెండు టీకాలు కలిసినప్పుడు కనిపించే లక్షణాలపై ఇవి ఆధారపడి ఉంటాయని వెల్లడించింది. ఇలాంటి దుష్ప్రభావాలు తరచుగా కనిపిస్తున్నాయని.. కాకపోతే ఇవి తర్వగానే తగ్గిపోతున్నట్లు ఈ వ్యాక్సిన్ మిక్సింగ్ ప్రయోగాలకు అధ్యక్షత వహించిన డాక్టర్ మాథ్యూ స్నేప్ పేర్కొన్నారు. 830 మందిపై ప్రయోగాలు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనాకు అందుబాటులోకి వచ్చిన టీకాలు అన్ని రెండు డోసులుగా తీసుకోవాల్సినవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు వేర్వేరు వ్యాక్సిన్లను రెండు మోతాదుల్లో తీసుకోవడంపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లను మొదటి డోసులో ఒకటి, రెండో డోసులో మరో వ్యాక్సిన్‌ను ఇచ్చి పరీక్షిస్తోంది. ఇలా 830 మంది వాలంటీర్లకు 28 రోజుల వ్యవధిలో వేర్వేరు డోసులను ఇచ్చింది. ఈ ప్రయోగాలను తొలుత ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలపై మొదలుపెట్టగా.. ఈ రెండు టీకాలను నాలుగు కాంబినేషన్లలో ఇచ్చి ప్రయోగాలు చేసింది. వేర్వేరు టీకాలతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ.. ఇలా రెండు వ్యాక్సిన్లను నాలుగు కాంబినేషన్లలో ఇవ్వగా.. ఒకేరకమైనా టీకా రెండు డోసులు తీసుకున్న వారితో పోలిస్తే రెండు వేర్వేరు టీకాలు తీసుకున్న వారిలో సైడ్ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండడం గుర్తించామని తాజా నివేదిక వెల్లడించింది. వారిలో తీవ్ర జ్వరం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించాయి అని తెలిపింది. ఆస్ట్రాజెనికా తొలి డోసు, ఫైజర్ రెండో డోసు తీసుకున్న వారిలో 34 శాతం మందిలో జ్వరం వంటి దుష్ప్రభావాలు కనిపించాయి. రెండు డోసులు ఆస్ట్రాజెనికా తీసుకున్నవారిలో కేవలం 10శాతం మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. ఇక ఫైజర్ తొలిడోసు, ఆస్ట్రాజెనెకా రెండో డోసు తీసుకున్న 41 శాతం మందిలో ప్రతికూల ప్రభావాలు కనిపించగా.. ఫైజర్‌లో రెండు డోసులు తీసుకున్న వారిలో కేవలం 21శాతం దుష్ప్రభావాలు కనిపించాయి. అయితే, ఇవి ఆసుపత్రుల్లో చేరేంత తీవ్రంగా లేవని పరిశోధకులు స్పష్టం చేశారు. వీటిపై మరింత విస్తృత పరిశోధన చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. టీకాలను మార్చి తీసుకోవద్దు.. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేర్వేరు టీకాలు తీసుకోవడంపై ఇప్పటి వరకు ఎటువంటి నిబంధనలూ లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రాలు (సీడీసీ) ఒకే వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకోవాలని మాత్రమే సూచిస్తున్నాయి. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కూడా రెండు డోసులూ ఒకే వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తోంది. వేర్వేరు వ్యాక్సిన్ డోసులు కేవలం ప్రయోగాల దశల్లోనే ఉన్నాయి. అవి కూడా కేవలం ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలపై మాత్రమే ఇలాంటి ప్రయోగాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వేర్వేరు వ్యాక్సిన్లను కాంబినేషన్‌తో తీసుకోకూడదని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వ్యక్తులు రెండో డోసు ఇతర రాష్ట్రాలు/జిల్లాల్లో తీసుకోవాల్సి వస్తే తప్పకుండా అదే వ్యాక్సిన్ తీసుకోవాలని భారత ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. చదవండి: కరోనా: ఆ టీకా ఒక్క డోసుతో 80 శాతం మరణాల రేటు తగ్గుదల! -
కళ్లు తెరవండి..లేదంటే 10 లక్షల మరణాలు: లాన్సెట్ హెచ్చరిక
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో రెండో దశలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావంపై ఇప్పటికే పలు నివేదికలు ఆందోళన రేపుతున్నాయి. తాజాగా దేశంలో కరోనా అధ్వాన పరిస్థితులపై ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్ సంచలన విషయాలను వెల్లడించింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ ది లాన్సెట్‌లో శుక్రవారం ప్రచురించిన సంపాదకీయంలో కరోనా కారణంగా ఆగస్టు 1 నాటికి భారతదేశంలో 10 లక్షల మరణాలు నమోదు కానున్నాయంటూ అంచనా వేసింది. దీనిలో భాగంగా మే 4వ తేదీ నాటికి దేశంలో వెలుగు చూసిన 2కోట్లకు పైగా కేసులు, సంభవిస్తున్న మరణాలను గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో సరైన నియంత్రణ చర్యలు తీసుకోకపోతే ఆగస్టు 1వ తేదీ నాటికి 10 లక్షల మరణాలు సంభవిస్తాయని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనా వేసిందని లాన్సెట్ తెలిపింది. ఒకవేళ ఇదే జరిగితే ఈ జాతీయ విపత్తుకు కేంద్రీంలోని మోదీ సర్కారే బాధ్యత వహించాలని పేర్కొంది. అంతేకాదు ఈ సంక్షోభ సమయంలో విమర్శలకు తొక్కిపెట్టడానికి, ప్రయత్నించిన తీరు క్షమించరానిదని లాస్సెట్ వ్యాఖ్యానించింది. భారతదేశంలో కోవిడ్-19 అత్యవసర పరిస్థితులున్నాయని తెలిపింది. ఒక పక్క బాధితులతో ఆసుపత్రులన్నీనిండిపోతున్నాయి. మరోపక్క మందులు, బెడ్లు, ఆక్సిజన్ అందక రోగులు అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి. చివరికి చికిత్స అందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు మహమ్మారి బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అసలు కోవిడ్ నియంత్రణకు మోదీ సర్కార్ ఎటువంటి చర్యలు చేపట్టడంలేదని మండిపడింది. ఏప్రిల్ వరకు కూడా కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌తో సమావేశం కాలేదంటేనే ప్రభుత్వ నిబద్దత అర్ధమౌతోందంటూ చురకలు వేసింది. తద్వారా భారత్ తన ప్రారంభ విజయాలను తానే నాశనం చేసుకుందని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ సంక్షోభం ఏర్పడిందంటూ విమర్శలు గుప్పించింది. అనేక హెచ్చరిక సంకేతాలు ఉన్నప్పటికీ, మతపరమైన ఉత్సవాలు (కుంభమేళా) రాజకీయ ర్యాలీలు వంటి సూపర్-స్ప్రెడర్ కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే కేంద్రంపై వ్యతిరేకత వ్యక్తం చేసిన ట్వీట్లను తొలగించాలని ట్విటర్‌కు ఆదేశాలు ఇచ్చిందని పేర్కొంది. ఈ సమయంలో భారత్ గతంలో సాధించిన విజయాల పట్ల కాకుండా ప్రస్తుతం పరిస్థితులకనుగుణంగా మేల్కోవాలని, బాధ్యతాయుతమైన నాయకత్వం, పాదర్శకతతో కూడిన పాలనను అందించాలని కోరింది. ఇప్పటికైనా భారతదేశం తన టీకా సరఫరాను పెంచాలని, కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో టీకాను విరివిగా అందించాలని తెలిపింది. కరోనా వైరస్ విస్తరణ రేటును అరికట్టాల్సిన అవసరం ఉందని కూడా ఇది పేర్కొంది. ఇందుకోసం ఖచ్చితమైన డేటాను సకాలంలో ప్రచురించాలి. అసలు ఏమి జరుగుతుందో ప్రజలకు ఖచ్చితంగా చెప్పాలి. మహమ్మారి విస్తరణను నిలువరించేందుకు దేశవ్యాప్త లాక్డౌన్ సహా, టీకా, మాస్క్, భౌతిక దూరం, స్వచ్చంధ నిర్బంధం, పరీక్షల ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని హితవు పలికింది. చదవండి: కరోనా విలయం: డీఆర్డీవో డ్రగ్‌కు గ్రీన్ సిగ్నల్ శుభవార్త: త్వరలోనే నాలుగో వ్యాక్సిన్?! -
Coronavirus India Highlights: మూడు రెట్లు వేగంగా
సాక్షి, నేషనల్ డెస్క్: దేశాన్ని కరోనా కసిగా కాటేస్తోంది. మొదటి వేవ్ తర్వాత దాని కోరలు పీకామని భావించాం కానీ, అనూహ్యమైన రీతిలో మూడు రెట్ల వేగంతో విషం కక్కుతోంది. రోజు రోజుకీ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. మొదటి వేవ్‌లో రికార్డులన్నీ ఇప్పుడు తుడిచిపెట్టుకుపోతున్నాయి. కరోనా పడగ నీడలో బిక్కు బిక్కుమంటూ కాలం నెట్టుకొస్తున్నాం. ఫస్ట్ వేవ్ తర్వాత దేశంలో సెకండ్ వేవ్ ఎలా విజృంభిస్తోందో చూద్దాం. కరోనా మొదటి వేవ్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంతో కొంత మేర విస్తరించింది. ప్రతీ రాష్ట్రంలోనూ హాట్‌స్పాట్స్ ఉన్నాయి. కానీ రెండో వేవ్ వచ్చేసరికి కొన్ని రాష్ట్రాల్లోనే వైరస్ లోడు అధికంగా ఉంది. ఇండియా టాస్క్‌ఫోర్స్ సభ్యుల లాన్సెట్ కోవిడ్–19 కమిషన్ ఈ వారంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం మొదటి వేవ్‌లో నమోదైన కేసుల్లో 50 శాతం 40 జిల్లాల్లో బయటపడితే, రెండో వేవ్‌లో సగం కేసులు 20 జిల్లాల్లోనే వెలుగు చూశాయి. 2020 ఆగస్టు–సెప్టెంబర్ మధ్య కరోనా మొదటి వేవ్ ఉధృతరూపం దాల్చినపుడు 75 శాతం కేసులు 60–100 జిల్లాలోనేయి. అదే సెకండ్ వేవ్‌లో మార్చి–ఏప్రిల్ నెలలో నమోదైన కేసుల్లో 75 శాతం కేసులు 20–40 జిల్లాల్లోనే బయటకొచ్చాయి. లక్షణాల్లేకుండా చుట్టేస్తోంది గత ఏడాది తొలిసారిగా జనవరిలో కేరళలో తొలికేసు వచ్చింది. చైనా నుంచి దిగుమతి అయిన వైరస్ మాత్రమే అందరికీ సోకింది. కానీ రెండో దశ మొదలైనప్పట్నుంచి వైరస్ జన్యుక్రమం మార్చుకొని విశ్వరూపం చూపిస్తోంది. బ్రిటన్, దక్షిణాఫ్రికా మ్యుటేషన్లతో పాటు రెండుసార్లు జన్యుక్రమం మార్చుకున్న భారత్ వైరస్ సార్స్ కోవ్–2 ద్వారా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సెకండ్‌వేవ్‌లో అత్యధికుల్లో లక్షణాలు కనపడటం లేదు. దాంతో తెలియకుండానే వీరు ఇతరులకు వైరస్‌ను అంటిస్తున్నారు. అంతేకాదు కొన్ని కేసుల్లో కరోనా నేరుగా ఊపిరితిత్తుల పైనే దాడి చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రాణాల మీదకి వస్తోంది. యువతపై ప్రభావం కరోనా మొదటి వేవ్ పెద్దల్ని కాటేస్తే సెకండ్ వేవ్‌లో యువతకి ఎక్కువగా సోకుతోంది. ఢిల్లీలోని కరోనా రోగుల్లో 65 శాతం మంది 45 కంటే తక్కువ వయసు ఉన్న వారేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఇక మహారాష్ట్ర, కర్ణాటకలో సగం కేసులు 30–40 ఏళ్ల మధ్య వయసున్న వారినే సోకుతున్నాయి. మొదటి వేవ్‌లో కరోనా మరణాల్లో 60 ఏళ్లకు పైబడిన వారే 88శాతం మంది ఉన్నారు. ఇక కేసులు కూడా 60 శాతానికిపైగా 50 ఏళ్ల వయసున్న వారికే సోకింది. మొదటి వేవ్‌లో చిన్నపిల్లలకు కరోనా సోకిన కేసులు అరుదు. కానీ ఈసారి మార్చి నెలలోనే 80 వేల మంది చిన్నారులు కరోనా బారినపడ్డారు. వ్యాక్సినేషన్ సాగుతున్నా తగ్గని జోరు మొదటి దశలో కరోనా వ్యాక్సిన్‌పై ప్రయోగాలు మాత్రమే జరిగాయి. కానీ రెండో వేవ్ వచ్చేసరికి వ్యాక్సినేషన్ మొదలైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్, సీరమ్ సంస్థ తయారు చేస్తున్న ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ వ్యాక్సిన్లను 45 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ ఇస్తున్నారు. ఇప్పటివరకు 12 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. నాడు అవగాహన లేమి.. నేడు నిర్లక్ష్యం కరోనా మొదటి వేవ్‌లో ఈ వైరస్‌పై ఎవరికీ అవగాహన లేదు. లాక్డౌన్, క్వారంటైన్, మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్లు పూసుకోవడం అన్నీ కొత్త. దీంతో గత ఏడాది లాక్డౌన్ ఎత్తేశాక జూలై– సెప్టెంబర్ మధ్య కేసులు తారాస్థాయికి చేరుకున్నాయి. రెండో వేవ్ సమయానికి ప్రజల్లో అవగాహన వచ్చినప్పటికీ వ్యాక్సిన్ వచ్చిందన్న ధీమా, కరోనా నిబంధనల్ని గాలికి వదిలేయడం, ప్రభు త్వం కూడా ఆర్థిక నష్టం జరగకూడదన్న ఉద్దేశం తో అన్ని రకాల కార్యక్రమాలకు అనుమతినివ్వడం, 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మార్చి నుంచి కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా రెండో వేవ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. మొదటి వేవ్‌లో ఒక కరోనా రోగిని కలుసుకున్న వారిలో 30 నుంచి 40% మందికి వైరస్ సోకే అవకాశాలుంటే, రెండో వేవ్‌లో 80 నుంచి 90% మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యే అవకాశాలున్నాయి - డాక్టర్ రణదీప్ గులేరియా, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ -
లాన్సెట్ సంచలన నివేదిక: గాలి ద్వారానే కోవిడ్ అధిక వ్యాప్తి
వాషింగ్టన్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి గాలి ద్వారానే చాలా తీవ్రంగా వ్యాపిస్తోందట. వస్తువులను ముట్టుకోవడం కంటే.. వైరస్ నిండి ఉన్న గాలిని పీల్చుకోవడం వల్లే వైరస్ క్రిములు ఒకరి నుంచి మరొకరికి చేరుతున్నాయని బ్రిటన్, అమెరికా, కెనడా సైంటిస్టులు సంయుక్తంగా చేసిన అధ్యయంనలో వెల్లడైంది. అందుకే కరోనాను గాలి ద్వారా వ్యాపించే వైరస్ (ఎయిర్ బోర్న్) అని ప్రకటించాలని వారు సూచిస్తున్నారు. గాలి ద్వారా కరోనా వ్యాప్తి అధికంగా ఉందనేందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నట్లు వారు స్పష్టం తెలిపారు. యుద్ధ ప్రాదికన చర్యలు చేపట్టి కరోనా వ్యాప్తిని అడ్డుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఇతర వైరస్ పీడిత దేశాలకు వారు సూచనలు చేశారు. రీసెర్చ్‌లో భాగంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ట్రిష్ గ్రీన్ హాల్గ్ ఆధ్వర్యంలోని ఆరుగురు సైంటిస్టుల బృందం వైరస్ వ్యాప్తికి సంబంధించిన పలు జర్నల్స్‌ను సమీక్షించారు. గాలి ద్వారానే కోవిడ్ అధిక మొత్తంలో వ్యాప్తి చెందుతున్నట్టు బలమైన ఆధారాలు ఉన్నాయని లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన తమ అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. సైంటిస్టుల నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. కరోనా గాలి ద్వారానే వేగంగా వ్యాప్తి ►మనుషుల ప్రవర్తన, ఇంటరాక్షన్, గది సైజు వెంటిలేషన్ వంటి అంశాలు వైరస్ వ్యాప్తిలో కీలకం. ►మనుషులు ఒకరినొకరు కలుసుకోకుండా క్వారంటైన్లో ఉన్నా కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. ►ఎవరైతే దగ్గకుండా, తుమ్మకుండా ఉన్నారో వాళ్ళలో కూడా ఎటువంటి సింప్టమ్స్ లేకపోయినా, 33 నుంచి 59 శాతం ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అనడానికి ఇదో కారణం. ►బయట కంటే కూడా ఇంట్లో నాలుగు గోడల మధ్య లో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ►కరోనా రాకుండా ఉండడానికి చాలా చోట్ల పీపీఈ కిట్స్ ని ధరించారు. అలా ధరించిన ప్రదేశాలలో కూడా ఇన్ఫెక్షన్లు ఉంటాయి. ►నిపుణులు కనుగొన్న దాని ప్రకారం గాలిలో మూడు గంటల పాటు ఈ వైరస్ ఉంటుంది. ►కరోనా వైరస్ ఎయిర్ ఫిల్టర్ లలో, శుభ్రం చేసినప్పటికీ ఆసుపత్రుల బిల్డింగ్ మూలల్లో వైరస్ తిష్ట వేసుకుని ఉంటుంది. ►పెంపుడు జంతువుల ఆవాసాల్లో కూడా కరోనా వైరస్ గుర్తింపు. ►ఇది గాలి ద్వారా వ్యాపించే వైరస్ కాదని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు ( చదవండి: గడ్డకడుతున్న రక్తం.. అమెరికాలో జాన్సన్ టీకా నిలిపివేత ) -
యాంటీబాడీలు అందరిలో ఒకేలా ఉండవు
సింగపూర్: కరోనా వైరస్‌పై పోరాడే యాంటీ బాడీలు కొందరిలో దశాబ్దం పాటు ఉండవచ్చునని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వ్యక్తుల్లో రోగనిరోధక వ్యవస్థ పని చేసే తీరుని బట్టి యాంటీ బాడీలు ఎన్నాళ్లు శరీరంలో ఉంటాయో ఆధారపడి ఉంటుందని లాన్సెట్ మైక్రోబ్ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి శరీరంలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ (ఎన్ఏబీ) తక్కువ స్థాయిలో ఉత్పత్తి అయినప్పటికీ టీ సెల్స్ , రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా పని చేస్తున్నప్పడు వారికి మళ్లీ వైరస్ సోకే అవకాశాలు గణనీయంగా తగ్గిపోయినట్టుగా నివేదిక స్పష్టం చేసింది. సింగపూర్‌లోని డ్యూక్–ఎన్‌యూఎస్ మెడికల్ స్కూలుకి చెందిన శాస్త్రవేత్తలు ఆరు నుంచి తొమ్మిది నెలలు పాటు 164 మంది కోవిడ్ రోగులకు రక్త పరీక్షలు నిర్వహిస్తూ వారిలో కరోనా వైరస్‌పై పోరాటంలో ఎన్ఏబీ, టీ సెల్స్, రోగ నిరోధక వ్యవస్థ పని తీరు వంటివన్నీ అంచనా వేస్తూ వచ్చారు. అధ్యయనంలో పాల్గొన్న వారిని అయిదు కేటగిరీలుగా విభజించారు. యాంటీ బాడీలు అసలు ఉత్పత్తి కాని వారు 11.6శాత మంది ఉంటే, యాంటీ బాడీలు ఉత్పత్తి అయినప్పటికీ అవి త్వరగా క్షీణించిన వారి శాతం 26.8గా ఉంది. 29 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు నెమ్మదిగా క్షీణించడం కనిపించింది. ఇక 1.8శాతం మందిలో యాంటీబాడీలు స్థిరంగా కొనసాగుతూ ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా వైరస్ సోకినప్పటికీ, వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయన్నది వారి రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని డ్యూక్ వర్సిటీ ప్రొఫెసర్ లిన్ఫా వెల్లడించారు. -
ఆస్ట్రాజెనెకా సురక్షితం.. ప్రభావవంతం
వాషింగ్టన్: యూకే వ్యాప్తంగా ఫైజర్ బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తమ భాగస్వామ్యంలో అభివృద్ధి చేందుతోన్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిడ్‌కు వ్యతిరేకంగా ఎంతో సమర్థవంతంగా పని చేస్తుందని తెలిపారు. డోసేజ్ ప్రకారం ఇది 62 శాతం, 70 శాతం, 90 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. తమ ఫేస్ 3 డాటాని పలువురు ప్రసిద్ధ శాస్త్రవేత్తలు పరిశీలించారని.. మొత్తం మీద తమ వ్యాక్సిన్ 70.4శాతం సామార్థ్యం కలిగి ఉన్నట్లు సైంటిస్ట్‌ల బృందం వెల్లడించదని తెలిపారు. దాదాపు 20 వేల మందికి పైగా అధునాతన పరీక్షల పూర్తి ఫలితాలను పరిశీలించిన స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం ఈ నివేదిక రూపొందించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ అత్యవసర వినియోగం.. అనుమతులు జారీ చేయడం వంటి కీలక అంశాలన్ని ఈ డాటా మీదనే ఆధారపడతాయన్నారు. అంతేకాక తమ ఫేజ్ 3 డాటాను స్టడీ చేసి లాన్సెట్ ఓ నివేదక విడుదల చేసిందని.. దాని ప్రకారం ఆస్ట్రాజెనెకా కోవిడ్19-కు వ్యతిరేకంగా ఎంతో సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ డైరెక్టర్, ట్రయల్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్ ప్రొఫెసర్ ఆండ్రూ పొలార్డ్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు మేం ఫేజ్ 3 ట్రయల్ డాటా తాత్కాలిక విశ్లేషణలను ప్రచురించాము. ఈ కొత్త వ్యాక్సిన్ మంచి సేఫ్టీ రికార్డ్, కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పని చేయగల సామార్థ్యం కలిగి ఉన్నట్లు ఈ విశ్లేషణలు వెల్లడించాయి’ అన్నారు. అయితే ఏ డోస్ సురక్షితం.. ఏ వయసుల వారి మీద ఎంత డోస్ ఎఫెక్టివ్‌గా పని చేస్తుందనే పలు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇంకా లభించలేదని లాన్సెట్ నివేదిక పేర్కొంది. ఇక గత నెల రిలీజ్ చేసిన తాత్కాలిక ట్రయల్ రిజల్ట్స్ ఆధారంగా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ సమర్థత స్థాయిలను మూడు రకాలుగా విభజించారు. మొత్తం సమర్థత స్థాయి 70 శాతంగా ఉండగా.. 62 శాతం తక్కువ సమర్థత స్థాయిగా ఉండగా.. 90 శాతం అధిక సమర్థత స్థాయిగా ఉంది. ట్రయల్స్ సమయంలో వ్యాక్సిన్ డోసుల విషయంలో పొరపాటు జరగడంతో సమర్థత స్థాయిలోల తేడా వచ్చినట్లు తెలిపారు. (చదవండి: బ్రిటన్‌లో ఫైజర్ టీకా మొదలు) ఇక లాన్సెట్ 1,367 మంది ఫలితాలను విశ్లేషించి మంగళవారం ఓ నివేదిక విడుదల చేసింది. వీరిలో సగం డోసు.. పూర్తి డోసు తీసుకున్నవారు కూడా ఉన్నారు. ఇక వీరిలో కొందరిలో వ్యాక్సిన్ కోవిడ్ బారి నుంచి 90 శాతం రక్షణ కల్పిస్తున్నట్లు వెల్లడయ్యింది. అయితే ఇంత తక్కువ మంది సమాచారంతో ఓ ముగింపుకు రావడం కష్టం అంటున్నారు సైంటిస్టులు. ఇక ఈ డాటా ప్రకారం లో/స్టాండర్డ్ డోస్ లక్షణాలు బహిర్గతం కానీ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో సమర్థవంతంగా పని చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. చివరగా ఈ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిడ్-19కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తుంది. దీన్ని తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ తీవ్రం కావడం లేదు.. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం రావడం వంటి పరిస్థితులు తలెత్తడం లేదు. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఎంతో సురక్షితం.. బాగా తట్టుకోగలదు అని నిరూపితమయ్యింది అని లాన్సెట్ వెల్లడించింది. (చదవండి: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ముందుగా మనకే!) ఈ సందర్భంగా ఆస్ట్రాజెనెకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాస్కల్ సోరియట్ మాట్లాడుతూ.. ‘మేము ముందస్తు అనుమతి పొందడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెగ్యులేటరీ అధికారులకు ఈ డాటాను సమర్పించడం ప్రారంభించాము. త్వరలోనే ప్రపంచ స్థాయిలో వందల మిలియన్ల డోసులను ఎటువంటి లాభాపేక్ష లేకుండా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము’ని తెలిపారు. భద్రత పరంగా, వ్యాక్సిన్‌కు సంబంధించిన ఒక తీవ్రమైన ప్రతికూల సంఘటన ఉంది మరియు మరొకటి - అధిక ఉష్ణోగ్రత - ఇప్పటికీ పరిశోధించబడుతోంది. -
మన ఆయుర్దాయం మరో పదేళ్లు!
న్యూఢిల్లీ: భారతీయుల ఆయుర్దాయం పదేళ్లకు పైగా పెరిగిందని లాన్సెట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. 1990 నుంచి 2019 మధ్య భారతీ యుల ఆయుఃప్రమాణాలు పెరిగినప్పటికీ రాష్ట్రా నికీ, రాష్ట్రానికీ మధ్య తీవ్ర వ్యత్యాసాలు ఉన్నా యని పేర్కొంది. 1990లో 59.6 సంవత్సరాలుగా ఉన్న ఆయుర్దాయం 2019 నాటికి 70.8 ఏళ్లకు పెరిగినట్టుగా లాన్సెట్ జర్నల్ ప్రచురించిన అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో మనుషుల ప్రాణాలు తీసే 286 వ్యాధులు ఎలా ప్రబలుతున్నాయో, మరో 369 వ్యాధుల తీవ్రత ఎలా ఉందో అంచనా వేసి సగటు ఆయుః ప్రమాణాలను అధ్యయనకారులు లెక్కించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తల్లో ఒకరైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, గాంధీనగర్‌కి చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ గోలి భారతీయుల్లో ఆయుర్దాయం పెరిగినంత మాత్రాన వారి ఆరోగ్యాలు మెరుగుపడ్డాయని చెప్పలేమన్నారు. చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల తో బాధపడుతూనే బతుకులీడుస్తున్నారని చెప్పారు. ► 1990లో 59.6 సంవత్సరాలుగా ఉన్న సగటు ఆయుర్దాయం 2019 నాటికి 70.8 ఏళ్లకి పెరిగింది. ► కేరళలో సగటు ఆయుర్దాయం అత్యధికంగా 77.3 సంవత్సరాలు కాగా, ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా 66.9 ఏళ్లుగా ఉంది. ► భారత్‌లోని వ్యాధుల్లో 58% ఒకరి నుంచి మరొకరికి సంక్రమించని వ్యాధులే (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) ప్రబలుతున్నాయి ► గత 30 ఏళ్లలో గుండె, ఊపిరితిత్తులుæ, మధుమేహం, కండరాలకు సంబంధించిన వ్యాధులు అధికమయ్యాయి. ► 2019లో వాయుకాలుష్యం (16.7 లక్షల మృతులు), అధిక రక్తపోటు (14.7 లక్షలు), ► పొగాకు వినియోగం (12.3 లక్షలు), పౌష్టికాహార లోపం (11.8 లక్షలు) మధుమేహం (11.8 లక్షలు) కారణంగా మరణాలు ఎక్కువగా సంభవించాయి. ► దక్షిణాది రాష్ట్రాల్లో అధిక రక్త పోటు కారణంగా 10–20 శాతం మంది అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఊబకాయంతో కరోనా తీవ్రం భారత్‌తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ప్రజల ఆయుర్దాయాలు పెరిగాయని, అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయని అ«ధ్యయనం సహరచయిత గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ అలీ మొక్దాద్ చెప్పారు. ఊబకాయం, డయాబెటిస్ వంటి వాటితో కరోనా వైరస్ ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని చెప్పారు. భారత్‌లో ఒకప్పుడు మాతా శిశు మరణాలు అత్యధికంగా ఉండేవని, అవిప్పుడు బాగా తగ్గుముఖం పట్టాయన్నారు. -
2050 నాటికి యూఎస్, చైనా సరసన భారత్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభంలో మాంద్యంలోకి జారుకున్న భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తాజా అధ్యయనం కీలక విషయాన్ని ప్రచురించింది. 2050 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా తరువాత భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడవ అతిపెద్దదిగా అవతరిస్తుందని లాన్సెట్ పత్రిక ప్రచురించిన ఒక అధ్యయనం తెలిపింది. తద్వారా జపాన్ను వెనక్కు నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడవ స్థానానికి ఎగబాకనుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం, ప్రపంచంలో భారతదేశం ఐదవ స్థానంలో ఉంది. తరువాత ఫ్రాన్స్, యూకే ఉన్నాయి. (ఆర్థికశాస్త్రంలో నోబెల్ విజేతలు వీరే) ప్రపంచంలోని దేశాలలో శ్రామిక జనాభా గురించి ఒక అధ్యయనం జరిగింది. 2017లో భారతదేశం ప్రపంచంలో ఏడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని పేర్కొంది. ఈ ప్రాతిపదికన 2030 నాటికి భారతదేశం నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఈ అధ్యయనం తెలిపింది. 2030 నాటికి చైనా, జపాన్ భారత్ కంటే ముందంజలో ఉంటాయని తెలిపింది. చైనా, భారతదేశంలో శ్రామిక జనాభా బాగా క్షీణించినట్లు లాన్సెట్ వెల్లడించింది ఈ సమయంలో, నైజీరియాలో శ్రామిక జనాభా పెరుగుతుందని తెలిపింది. అయినప్పటికీ, శ్రామిక జనాభా పరంగా భారతదేశం అగ్రస్థానంలో ఉంటుంది. 2100 వరకు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శ్రామిక జనాభాగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని నీతీ ఆయోగ్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఇప్పటికే అంచనా వేశారు. కోవిడ్-19 మహమ్మారి చాలా వ్యాపారాలను నష్టాల్లోకి నెట్టివేసింది. దీంతో ఈ సంవత్సరం, ఏప్రిల్-జూన్ కాల త్రైమాసికంలో జీడీపీ 23.9శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. చదవండి: మూడోరోజూ భగ్గుమన్న బంగారం -
కరోనాపై లాన్సెట్ తాజా హెచ్చరికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై లాన్సెట్ సంచలన హెచ్చరికలు చేసింది. కరోనా మహమ్మారి పరిస్థితిపై ప్రభుత్వసానుకూల ధోరణిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) శాస్త్రీయ ఆధారాల నుంచి పక్కకుపోతోందని లాన్సెట్ మెడికల్ జర్నల్ సంపాదకీయంలో పేర్కొంది. ఫలితంగా ప్రజలకు తప్పుడు సంకేతాలు అందడమే కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వారిని నిరోధిస్తుందని, ఇది మరింత సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించింది. శాస్త్రీయ ఆధారాలనుంచి తప్పుకోవడంతోపాటు రాజకీయంగా ప్రేరేపితమైన ధోరణిగా వ్యాఖ్యనించడం గమనార్హం. దేశంలో మహమ్మారి పరిస్థితిపై ప్రభుత్వం చాలా పాజిటివ్ ధోరణితో ఉందని ఆరోపించింది. పెరుగుతున్న కరోనా సంక్షోభం మధ్య వాస్తవాలను దాచి, ప్రజల్లో తప్పుడు ఆశలను కల్పించవద్దని దేశ నాయకులకు పిలుపునిచ్చింది. అసలు నిజాలు చెప్పకుండా, కప్పివుంచడం అంటే ఆరోగ్య సంక్షోభాన్ని తీవ్రంగా పరిగణించకుండా ప్రజలను నిరోధించcడమేనని వ్యాఖ్యానించింది. నివారణ చర్యల పట్ల ప్రజల్లో అనిశ్చితికి దారి తీయడమే కాకుండా, ప్రజారోగ్య కార్యక్రమాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని లాన్సెట్ పేర్కొంది. ఆశావాదాన్ని ప్రోత్సహించే ఒత్తిడికి దేశ శాస్త్రీయ సంస్థలు కూడా ప్రభావితమయ్యాయని తెలిపింది. మహమ్మారి ప్రారంభం తగిన సాక్ష్యాలు లేనప్పటికీ యాంటీ మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ న్వాడకంపై ఐసీఎంఆర్ పాత్రను ప్రశ్నించింది.అలాగే స్వదేశీ వ్యాక్సిన్ కోవాక్సిన్ టీకాను ఆగస్టు 15లోగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్న ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ ప్రకటనను కూడా తప్పుబట్టింది. ఇది వివాదాస్పదంగా ఉందని సంపాదకీయం పేర్కొంది. ఇతర దేశాల కంటే తక్కువ మరణాల రేటు ఉందని భారత ప్రభుత్వం వాదించడాన్ని లాన్సెట్ సవాలు చేసింది. కేసులు,మరణాల డేటా పారదర్శకతను తప్పుబట్టింది ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో మరణాల రేటు 1.8 శాతంగా నివేదించినా, ఈ సంఖ్యలు పోల్చదగినవా కావా అని తెలుసుకోవడం కష్టంగా ఉందంటూ సందేహాలను వ్యక్తం చేసింది. మహమ్మారిని నిలువరించే సామర్థ్యం భారతదేశానికి ఉందనీ, కానీ నాయకులు శాస్త్రీయ ఆధారాలను, నిపుణుల సలహాలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని తెలిపింది. వైద్యం, మందులు, ప్రజారోగ్యం, పరిశోధన, తయారీలో తగినంత నైపుణ్యం ఉందని పేర్కొంది. తప్పుడు ఆశావాదాన్ని ప్రజలకు అందించకుండా వీటన్నింటిని ఉపయోగించాలని, గౌరవించాలని హితవు పలికింది. అయితే కరోనా నిర్వహణకు సంబంధించి కొన్ని అంశాలపై ప్రభుత్వం స్పందించిన తీరును ప్రశంసించింది. -
రష్యా వ్యాక్సిన్‌తో యాంటీబాడీల వృద్ధి
మాస్కో : స్పుత్నిక్ వీ పేరుతో రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ ఆరంభ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రాబట్టిందని మెడికల్ జర్నల్ లాన్సెట్ పేర్కొంది. ఈ వ్యాక్సిన్ పరీక్షలో పాల్గొన్నవారందరిలో కరోనా వ్యాక్సిన్‌ను నిరోధించే యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయని తెలిపింది. స్పుత్నిక్-వీ పనితీరుపై విమర్శకులకు ఈ పరీక్షలో వెల్లడైన అంశాలే సమాధానమని రష్యా వ్యాఖ్యానించింది. ఈ ఏడాది జూన్-జులైలో వ్యాక్సిన్‌పై నిర్వహించిన రెండు దశల పరీక్షలో పాల్గొన్న 76 మందిలోనూ కోవిడ్-19ను ఎదుర్కొనే యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని, ఏ ఒక్కరిలోనూ తీవ్ర సైడ్ఎఫెక్ట్స్ కనిపించలేదని లాన్సెట్ పేర్కొంది. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌గా చెబుతున్న ఈ వ్యాక్సిన్‌కు ఆగస్ట్‌లోనే దేశీయ వినియోగానికి రష్యా అనుమతించిన సంగతి తెలిసిందే. చదవండి : రష్యా వ్యాక్సిన్ : నెలకు 60 లక్షల డోసులు కోవిడ్-19 నుంచి రక్షణ కల్పిస్తూ దీర్ఘకాల భద్రత, సమర్ధతల గురించి నిర్ధారణ చేసుకునేందుకు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌పై భారీస్ధాయిలో సుదీర్ఘ పరీక్షలు అవసరమని లాన్సెట్ పేర్కొంది. కాగా ఈ వ్యాక్సిన్ పూర్తిస్దాయిలో పరీక్షలు చేపట్టి, అంతర్జాతీయంగా ఆమోదం లభించే వరకూ స్పుత్నిక్ వీని వాడరాదని పలువురు నిపుణులు హెచ్చరించారు. అయితే అంతర్జాతీయ పత్రిక లాన్సెట్‌లో తొలిసారిగా రష్యన్ వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు ప్రచురించడం, 40,000 మందిపై గతవారం పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో తమ వ్యాక్సిన్‌పై అనుమానాలు పటాపంచలవుతాయని సీనియర్ రష్యన్ అధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు కోవిడ్-19 నిరోధానికి తొలి వ్యాక్సిన్‌ను ప్రకటించిన రష్యా భారీస్ధాయిలో వ్యాక్సిన్ తయారీకి సన్నద్ధమవుతోంది. సంవత్సరం చివరి నాటికి నెలకు 20 లక్షల డోసులను ఉత్పత్తి చేస్తూ క్రమంగా నెలకు 60 లక్షల డోసులకు సామర్ధ్యాన్ని పెంచుతామని పరిశ్రమల మంత్రి డెనిస్ మంతురోవ్ వెల్లడించారు -
అత్యంత ప్రమాదకర జిల్లాల రాష్ట్రాలివే!
సాక్షి, న్యూఢిల్లీ :10 లక్షలకు పైగా కేసులతో దేశంలో కరోనా ప్రకంపనలు రేగుతుండగా తాజా అధ్యయనం మరో సంచలన విషయాన్ని వెల్లడించింది. దేశంలో ప్రమాదకర రాష్ట్రాల జాబితాను ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ ప్రకటించింది. మధ్యప్రదేశ్, బిహార్, తెలంగాణలోని అధిక జిల్లాలు అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తంగా తొమ్మిది పెద్ద రాష్ట్రాల్లోని అనేక జిల్లాలు కూడా ఇదే దశలో ఉన్నట్టు తెలిపింది. ది లాన్సెట్ జర్నల్ లోని అధ్యయనం ప్రకారం, కోవిడ్-19 మహమ్మారికి ఎక్కువగా ప్రభావితమయ్యే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, బిహార్, తెలంగాణ జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల జిల్లాలోని హౌసింగ్, పరిశుభ్రత, ఆరోగ్య వ్యవస్థ లాంటి అనేక ముఖ్య సూచికలను పరిగణనలోకి తీసుకొని ఈ అంచనాకు వచ్చినట్టు తెలిపింది. ఢిల్లీలోని పాపులేషన్ కౌన్సిల్‌కు చెందిన రాజీబ్ ఆచార్యతో సహా ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ మూడు రాష్ట్రాల తరువాత జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్ కరోనాకు అధికంగా ప్రభావితం కానున్నాయి. తమ అధ్యయనంలో వైరస్ వ్యాప్తి, కేసుల సంఖ్య, మరణాలు, సామాజిక, ఆర్ధిక ప్రభావాలతో సహా సంక్రమణ పరిణామాలను పరిశీలించినట్టు తెలిపింది. ఈ జాబితాలో అతి తక్కువ ప్రభావం గల రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. అరుణాచల్ ప్రదేశ్ , హిమాచల్ ప్రదేశ్ కూడా తక్కువ ప్రభావిత రాష్ట్రాలుగా ఉన్నాయి. మహమ్మారి ప్రభావం అంచనా, వనరుల కేటాయింపులో ఆయా ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, రిస్క్ తగ్గించే వ్యూహాలను అవలంబించడంలో తమ అధ్యయనం సహాయపడుతుందని భావిస్తున్నామని అధ్యయన వేత్తలు పేర్కొన్నారు -
10 వేల జనాభాకు 8 మందే డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్ : మన దేశంలో ప్రతీ 10 వేల జనాభాకు ఎనిమిది మంది కంటే కొంచెం తక్కువగానే డాక్టర్లు ఉన్నారని ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ తెలిపింది. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాల పరిస్థితిని విశ్లేషిస్తూ, భారత్‌లో పరిస్థితిపైనా తాజాగా విడుదల చేసిన నివేదికలో అనేక అంశాలను ప్రస్తావించింది. భారతదేశంలో మూడు నెలల లాక్డౌన్ సడలింపుల తరువాత కేసులు మరింతగా పెరుగుతున్నాయని తేల్చిచెప్పింది. ఆ నివేదిక ప్రకారం... మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలు అత్యధికంగా కరోనాతో దెబ్బతిన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రభా విత ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లోనూ గణనీయమైన సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. (ఆన్లైన్ ఈ ‘లైన్’లో) కాబట్టి మున్ముందు వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందడానికి అవకాశాలున్నాయని తేల్చిచెప్పింది. ‘దీనికి ప్రధాన కారణం లాక్డౌన్ సమయంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో దేశవ్యాప్తంగా వైఫల్యం జరిగింది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించలేద’ని ల్యాన్సెట్ ఘాటైన విమర్శలు చేసింది. వైద్య ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పన, పునర్నిర్మాణం జరగలేదు. వైద్య, ఆరోగ్య సిబ్బంది నియామకం జరగలేదు. దీనిపై ఇప్పటికైనా దృష్టిసారించాలని, రాబోయే నెలల్లో కరోనా వైరస్‌ను అంతం చేయడానికి ఇది కీలకమని ల్యాన్సెట్ వ్యాఖ్యానించింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే అమెరికా, బ్రెజిల్‌తోపాటు భారతదేశంలోనూ జూన్ 26 నుండి జూలై 3 వరకు లక్షకన్నా ఎక్కువ కొత్త కేసులు నమోదు కావడాన్ని ల్యాన్సెట్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. పేదలపై పంజా... కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అందులో ఎక్కువగా పేదలను కాటేస్తోంది. ప్రపంచ జనాభాలో 66 శాతం మంది పేదలున్నారు. ఆ వర్గాలను మరింత పేదలుగా మార్చే దుస్థితి కరోనా కారణంగా ఏర్పడిందని ల్యాన్సెట్ పేర్కొంది. కరోనా రష్యాలో కూడా ఉధృతంగా కొనసాగుతోంది. ఇది మధ్య ఆసియా గుండా మధ్యప్రాచ్యం, భారత ఉపఖండంలోకి ప్రవేశించేలా ఒక బలమైన గొలుసుకట్టును ఏర్పరుచుకుంది. ఆదర్శంగా సౌదీ అరేబియా... సౌదీ అరేబియా కరోనా నేపథ్యంలో ఆరోగ్యరంగానికి మరింత బడ్జెట్‌ను కేటాయించింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పడకల సామర్థ్యాన్ని విస్తరించింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగులకు ఉచిత ప్రవేశం కల్పించడానికి వందలాది జ్వరం క్లినిక్‌లను ప్రారంభించింది. ఆరోగ్య సిబ్బందికి అవసరమైన ప్రత్యేక శిక్షణ కల్పించిందని ల్యాన్సెట్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఐదు నెలల తరువాత కూడా వైరస్ సంక్లిష్టత కొనసాగుతూనే ఉందని తెలిపింది. -
మూత పెడితేనే మటాష్!
కరోనా.. తుమ్మితే వస్తుంది.. దగ్గితే వస్తుంది. రోగి ముట్టుకున్నవి ముట్టుకుంటే వస్తుంది.. ఇవన్నీ మనకు తెలిసినవే.. అందుకే మాస్కులు, శానిటైజర్లు వాడుతున్నాం.. అయితే.. షేర్డ్, పబ్లిక్ టాయిలెట్ల వినియోగంలో సరైన జాగ్రత్తలు పాటించకున్నా వస్తుందా? వస్తుందనే అంటున్నారు చైనాలోని యాంగ్జౌ వర్సిటీ పరిశోధకులు.. అలా రాకుండా ఉండాలంటే.. టాయిలెట్(వెస్ట్రన్) మూత పెట్టాకే.. ఫ్లష్ చేయాలని సూచిస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే.. ఓసారి కోవిడ్ వచ్చి.. చికిత్స అనంతరం నెగెటివ్ వచ్చినవారి మలంలో 4, 5 వారాల వరకూ వైరస్ తాలూకు అవశేషాలు ఉంటాయట. దీనికి సంబంధించి గత నెల్లో ‘లాన్సెట్’ జర్నల్‌లో ఓ పరిశోధన కూడా ప్రచురితమైంది.. ఈ నేపథ్యంలో ముఖ్యంగా షేర్డ్, పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మూత పెట్టకుండా ఫ్లష్ చేయడం వల్ల.. ఒకేసారి వేగంగా నీళ్లు వచ్చి.. సుడిగుండంలా ఏర్పడుతుంది.. ఆ సమయంలో వైరస్ మేఘంలాంటిది నీటిపైన 3 అడుగుల దూరం వరకూ ఏర్పడుతుందని సదరు వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ‘ఇది గాల్లో ఒక నిమిషం పాటు ఉంటుంది. తర్వాత చుట్టుపక్కల పరుచుకుంటుంది. తద్వారా వైరస్ వేరొకరికి వ్యాప్తి చెందే అవకాశముంటుంది. దీన్ని నివారించాలంటే మూత పెట్టాకే ఫ్లష్ చేయాలి.. దీని వల్ల వైరస్ బయటకు రాదు. ఆరోగ్యవంతులైనవారు టాయిలెట్ ఉపయోగిస్తే.. సమస్యే లేదు.. కోవిడ్ రోగులు లేదా కరోనా వచ్చి తగ్గినవాళ్లు ఉపయోగించినప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది’ అని వర్సిటీ పరిశోధకులు తెలిపారు. పైగా.. సామాన్య జనానికి ఈ మార్గంలోనూ వైరస్ వస్తుందన్న విషయం పెద్దగా తెలీదని.. వారికి అవగాహన పెంచాల్సిన అవసరముందని చెప్పారు. ఇకపై కరోనా రోగిలో వైరస్ పూర్తిగా పోయిందా లేదా అన్నది తెలుసుకునేందుకు మల పరీక్షలు కూడా చేస్తే మంచిదని వారు సూచిస్తున్నారు. సో.. ఇకపై షేర్డ్, పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించేటట్లయితే.. జాగ్రత్తలు పాటించడం మరువద్దు సుమా.. -
ప్రతీ అయిదుగురిలో ఒకరికి కోవిడ్ ముప్పు
లండన్: ప్రపంచ జనాభాలో ప్రతీ అయిదుగురిలో ఒకరికి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో సోకే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దాదాపుగా 170 కోట్ల మంది కరోనా ముప్పులో ఉన్నారని ఆ అధ్యయనం చెప్పింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం నివేదికని ప్రఖ్యాత లాన్సెట్ గ్లోబల్ హెల్త్ మ్యాగజైన్ ప్రచురించింది. ప్రపంచ జనాభాలో 22 శాతం మంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని, వారికి కోవిడ్–19 సోకితే అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆ అధ్యయనం హెచ్చరించింది. ఏయే వ్యాధులంటే.. టైప్ 2 డయాబెటిస్, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వైరస్ ప్రమాదం అధికంగా ఉంటుంది. ఈ వ్యాధుల్లో ఏ ఒక్కటి ఉన్నా వారికి కరోనా వైరస్ సోకితే చాలా ప్రమాదంలో పడతారని శాస్త్రవేత్తలు తెలిపారు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్, వివిధ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన గణాంకాల్ని విశ్లేషించి ఎంత మంది కోవిడ్ ముప్పులో ఉన్నారో శాస్త్రవేత్తలు అంచనాకొచ్చారు. ముప్పు ఎవరికంటే .. ప్రపంచ జనాభాలో 34.9 కోట్ల మంది అంటే నాలుగు శాతానికి పైగా జనాభాకి వైరస్ సోకితే ఆస్పత్రిలో చేర్చించాల్సిన అవసరం ఉందని లాన్సెట్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న వారిలో 20 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న వారు 5శాతం మంది ఉంటే, 70 ఏళ్లకు పై బడిన వారు 66 శాతం మంది ఉన్నారు. పురుషుల్లో 6శాతం మంది, మహిళల్లో 3 శాతం మందికి ముప్పు అధికంగా ఉంది. వృద్ధ జనాభా అధికంగా ఉన్న ఐరోపా దేశాలు, ఎయిడ్స్ వంటి వ్యాధులు విజృంభించే ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, మధుమేహం వ్యాధి అధికంగా ఉన్న చిన్న దేశాలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న దేశాల్లో వైరస్ ప్రభావం చూపించే అవకాశ ముందని అధ్యయనకారులు వివరించారు. -
‘2 మీటర్ల సామాజిక దూరం తప్పనిసరి’
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్నప్పటికి వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 2 లక్షల మార్కును దాటగా... ఈ ఒక్క రోజే 8 వేల పై చిలుకు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉండగా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికి లాక్డౌన్ ఎత్తివేత దిశగా కేంద్రం అడగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్రత, కనీసం 2 మీటర్ల భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి చర్యలు కరోనా బారి నుంచి మనల్ని కాపాడతాయని ప్రసిద్ధ లాన్సెట్ జర్నల్ ఓ నివేదికను విడుదల చేసింది. 16 దేశాలలో దాదాపు 172 అధ్యయనాలను సమీక్షించిన తర్వాత ఈ నివేదికను వెల్లడించింది. దానిలోని అంశాలు.. మాస్క్, సామాజిక దూరం అన్ని కలిస్తేనే.. వైరస్ వ్యాప్తి కట్టడి కోసం భౌతిక దూరం, మాస్క్ ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి అంశాలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయని నివేదిక వెల్లడించింది. అయితే ఇందులో ఏ ఒక్కటి ఒంటరిగా కరోనాను కట్టడి చేయలేదని.. వీటన్నింటిని పాటిస్తేనే వైరస్ వ్యాప్తిని నిరోధించగలమని నివేదిక తెలిపింది. అంతేకాక వ్యాధి సోకిన వారి నుంచి మీటరు దూరం లోపల ఉన్న వ్యక్తికి వైరస్ సోకే అవకాశం 12.8 శాతంగా ఉండగా.. మీటరు కంటే ఎక్కువ దూరం(2మీటర్లు)లో ఉన్నప్పుడు వ్యాప్తి కేవలం 2.6 శాతంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.ఫేస్ మాస్క్ ధరించిన వారికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం 3.1 శాతం ఉండగా.. ధరించని వారికి 17.4 శాతంగా ఉంది. అలానే ఫేస్ షీల్డ్స్, గ్లాసెస్ వాడటం వలన వైరస్ వ్యాప్తి 5.5 శాతం తగ్గిందని.. వాడకపోవడం వల్ల 16 శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. మాస్క్ ఎలాంటిది అయినా పర్వాలేదు.. గుడ్డ మాస్క్‌లు, ఆపరేషన్ మాస్క్‌లు, ఎన్-95 మాస్కులు.. ఇలా ఏది వాడినా మంచిదే అని నివేదిక తెలిపింది. కాకపోతే ఎక్కువ పొరలు ఉన్న మాస్క్ ధరించడం మరింత శ్రేయస్కరం అని పేర్కొంది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం కిర్బీ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ రైనా మాక్ ఇంటైర్ మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ సడలించాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు మాస్క్‌ను తప్పనిసరి చేయాలి. ఈ మాస్క్‌లు కూడా నీటిని పీల్చుకోని వస్త్రంతో.. ఎక్కువ పొరలు ఉన్న వాటిని వాడేలా ప్రోత్సహించడం ఎంతో ముఖ్యం’ అన్నారు. భారత్‌ను కాపాడే అస్త్రాలు ఇవే.. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో వ్యక్తిగత శుభ్రత, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల ద్వారా మాత్రమే కేసుల సంఖ్యను తగ్గించగలమని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్, డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఆఫీసులో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, బయట ఉన్నా వీటిని పాటించడం మాత్రం మర్చిపోవద్దన్నారు గులేరియా. (అత్యధికం : 24 గంటల్లో 8909 తాజా కేసులు) తుంపర్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులను పరిశీలిస్తే.. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లు.. కళ్లు, ముక్కు, గొంతు ద్వారా ప్రవేశించి వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నట్లు తెలుస్తుంది. కానీ దీన్ని నిరూపించేందుకు శాస్త్రీయమైన ఆధారాలు లేవని నివేదిక తెలిపింది. -
హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్‌పై నిషేధం
వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సోమవారం కీలక ప్రకటన చేసింది. కరోనా కట్టడి కోసం వినియోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ డ్రగ్ వాడకం వల్ల కోవిడ్-19 రోగుల చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉందంటూ లాన్సెట్ నివేదిక వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ వర్చువల్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం ఈ యాంటీ మలేరియా డ్రగ్‌ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. సాలిడారిటీ ట్రయల్ అని పిలవబడే ఎగ్జిక్యూటివ్ గ్రూప్‌లో అనేక దేశాల్లోని వందలాది ఆస్పత్రులు కరోనా పేషంట్లను చేర్చుకుని వారి మీద రకరకాల ప్రయోగాలు జరుపుతున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా వీరికి హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్‌ను వాడుతున్నారు. (హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై యూఎస్ హెచ్చరిక) ఈ నేపథ్యంలో సేఫ్టీ మానిటరింగ్ బోర్డు భద్రతా డాటాను సమీక్షించే వరకు సాలిడారిటీ ట్రయల్స్‌లో కరోనా రోగుల మీద క్లోరోక్విన్ డ్రగ్ వాడకాన్ని తాత్కలికంగా నిలిపివేయనున్నట్లు టెడ్రోస్ ప్రకటించారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ సాధారణంగా ఆర్థరైటిస్‌కు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. కాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా పలువురు ప్రముఖులు ఈ ఔషధాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గత వారం బ్రెజీల్ ఆరోగ్యమంత్రి ఒకరు తేలికపాటి కోవిడ్-19 కేసులకు చికిత్స చేయడానికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు యాంటీ మలేరియా క్లోరోక్విన్‌ను ఉపయోగించాలని సిఫారసు చేశారు. అయితే ఈ రెండు మందుల వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు, ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని లాన్సెట్ అధ్యయనం హెచ్చరించింది.(మలేరియా మందు భేష్!) -
కేరళ వైపు ప్రపంచ దేశాల చూపు
తిరువనంతపురం: ప్రాణాంతక నిఫా వంటి వైరస్లు, వరదలు వంటి ప్రకృతి బీభత్సాలను ఎదుర్కొన్న అనుభవం కేరళకి బాగా కలిసి వచ్చింది. భారత్‌లో తొలి కేసు నమోదైన రాష్ట్రమైన కేరళ రికవరీలోనూ ముందుంది. ఇక్కడ జనసాంద్రత ఎక్కువ. చదరపు కిలోమీటర్‌కి 860 మంది వరకు నివసిస్తారు. విదేశీ రాకపోకలు ఎక్కువే. గల్ఫ్ దేశాలలో కేరళ కార్మికులే ఎక్కువ. ఇక చైనాలోని వూహాన్లో చదువుకునే వైద్య విద్యార్థులు అధికభాగం కేరళ వారే. 60 ఏళ్ల వయసు పై బడిన జనాభా 12 శాతం. ఫ్రంట్‌లైన్ ఉద్యోగులు ఎక్కువే. అయినా కరోనా కట్టడి చర్యల్లో కేరళలో అధికార లెఫ్ట్ ప్రభుత్వం ప్రపంచ దేశాల మన్ననలు అందుకుంటోంది. ఐక్యరాజ్య సమితి కేరళని భళా అంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కేరళని చూసి పాఠాలు నేర్చుకోవాలని చెప్పింది. లాన్సెట్ జర్నల్‌దీ అదే మాట. సమన్వయంతో సగం విజయం చైనాలోని వూహాన్ నుంచి కేరళలోని త్రిసూర్కి వచ్చిన వైద్య విద్యార్థినికి జనవరి 18న కరోనా పాజిటివ్ వచ్చిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయి వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేయడంతో సగం విజయం సాధించినట్టయింఇ. తొలి కేసు నమోదైన వెంటనే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఉన్న అయిదు విమానాశ్రయాల్లో అంబులెన్స్‌లు, అత్యవసర కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లా ఆసుపత్రులను సిద్ధం చేసింది. కరోనా పాజిటివ్ ఎవరికైనా సోకితే వెంటనే వాళ్లంతా ఎవరెవరిని కలిశారో గూగుల్ మ్యాప్ సహకారంతో వెతికి పట్టుకొని మరీ పోలీసులు క్వారంటైన్ చేసేవారు. విపత్తుల సమయంలో ప్రజల్ని తరలించడానికి ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలు ఈ సంక్షోభ సమయంలో కేరళని ఆదుకున్నాయి. ప్రతీ గ్రామాల్లోనూ వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. దీనివల్ల సమాచారం అందించుకోవడం సులభమైపోయింది. కేరళ ఆరోగ్య మంత్రి శైలజ స్వయంగా కరోనా రోగులతో మాట్లాడి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనాపై యుద్ధానికి రూ.20 వేల కోట్లు నైరుతి రుతుపవనాలు మొట్టమొదట తాకే కేరళలో వ్యాధులు కూడా ఎక్కువే. ఫ్లూ, డెంగ్యూ వంటి జ్వరాలు అక్కడ సర్వసాధారణం. అందుకే కొత్త వైరస్ ఏది వచ్చినా ప్రభుత్వం అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తుంది. ఆరోగ్య రంగానికి బడ్జెట్లో నిధులు భారీగా కేటాయిస్తుంది. ఇప్పుడు కరోనా దాడి మొదలవగానే అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రూ.20వేల కోట్ల రూపాయలు కేటాయించింది. పీపీఈ కిట్స్, మందులు పెద్ద మొత్తంలో తెప్పించింది. మాస్క్‌లు, శానిటైజర్లు భారీగా తయారు చేసింది. మానసిక ఆరోగ్యం కోసం ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. కేరళ సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం కావడం.. విద్యాధికులే ఎక్కువ ఉండడంతో కరోనా ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకొని ప్రజలంతా క్రమశిక్షణతో భౌతిక దూరం పాటించారు. అందరినీ మానసికంగా సిద్ధం చేశాక కేంద్ర ప్రభుత్వం కంటే ముందే మార్చి 11న ముఖ్యమంత్రి పి. విజయన్ లాక్డౌన్ ప్రకటించారు. గత రెండు వారాలుగా కేరళలో రోజుకి ఒకటీ రెండు కేసులు కంటే ఎక్కువ నమోదు కాకపోవడం ఆ రాష్ట్రం సాధించిన ఘన విజయంగా చెప్పుకోవాలి. ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీ కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి వలస కూలీలకు, నిలువ నీడలేని వారికి ఆహార పొట్లాలు అందిస్తోంది. ఉపాధి పనులు కోల్పోయిన వారికి బియ్యం, పప్పు, నూనె, ఇతర నిత్యావసరాలు ఇంటింటికీ వెళ్లి పంచేపనిలో ఉంది. 28 రోజుల క్వారంటైన్ కరోనా అనుమానితుల్ని అన్ని రాష్ట్రాల్లోనూ 14 రోజుల క్వారంటైన్లో ఉంచితే కేరళ ముందుజాగ్రత్తగా 28 రోజులు క్వారంటైన్లో ఉంచింది. అదే సరైన చర్యని ఇప్పుడు రుజువు అవుతోంది. 20 నుంచి 25 రోజుల తర్వాత కూడా కరోనా లక్షణాలు బయటకు వచ్చే కేసులు ఉన్నాయి. } కేరళలో అధికార వికేంద్రీకరణ ఎక్కువగా కనిపిస్తుంది. గ్రామాల స్థాయిలో స్థానిక మండళ్లు, సమర్థంగా పనిచేసే మున్సిపాల్టీలు, వరదలు వంటి విపత్తుల్ని ఎదుర్కొనే యంత్రాంగం ఇప్పుడు బాగా కలిసి వచ్చింది. – జాకబ్ జాన్, ఆర్థికవేత్త ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే కేరళ ఆరోగ్యం, విద్యా రంగం మీద అత్యధికంగా ఖర్చు చేసింది. అందరికీ ఆరోగ్యం కోసం మూడు అంచెల విధానం అమల్లో ఉంది. ఆ వ్యవస్థ కరోనాపై అపారమైన పోరాట పటిమ ప్రదర్శిస్తోంది. – బి. ఇక్బాల్, ప్రభుత్వ సలహాదారు, వైరస్ల నియంత్రణ మండలి -
ఆరోగ్యరంగానికి ‘అవినీతి’ రోగం!
సాక్షి, హైదరాబాద్ : ఆరోగ్య రంగంలో అవినీతి పేద రోగు లకు శాపమవుతోంది. అభివృద్ధి చెందుతున్న, తక్కువ ఆదాయ దేశాల్లో ముఖ్యంగా ఈ పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య భవిష్యత్‌కు అవినీతి అతి పెద్ద ముప్పుగా పరిణమించిందని ‘లాన్సెట్’ సంస్థ అధ్యయనం తేల్చింది. ఆధునిక వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా, ప్రజలకు చేర్చడంలో అవినీతి ప్రతిబంధకంగా మారిందని తెలిపింది. ఆరోగ్య రంగానికి భారీగా విదేశీ సాయం లభిస్తుండటంతో అవినీతి మరింత పెచ్చుమీరిందని పేర్కొంది. అవినీతి పేదలకు మరింత హానిగా తయారైందని అభిప్రాయపడింది. ఇతర రంగాల్లో కన్నా ఆరోగ్య రంగంలో అవినీతి చాలా ప్రమాదకరమైందని విశ్లేషించింది. వ్యాధులను నియంత్రించడానికి జరిగే ప్రయత్నాలన్నింటినీ అవినీతి బలహీనపరుస్తుందని తెలిపింది. ఆరోగ్య రంగం అవినీతికి ఆకర్షణీయమైన రంగంగా మారిందని అభిప్రాయపడింది. సార్వత్రిక ఆరోగ్య కవరేజీని చేరుకోవడానికి చేసే ప్రయత్నాలకు అవినీతి అడ్డుగా తయారైందని తెలిపింది. వైద్య సిబ్బంది గైర్హాజరు కూడా అవినీతే ఆరోగ్య రంగంలో అవినీతిని లాన్సెట్ ఆరు రకాలుగా విభజించింది. 1) ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు తమ వైద్య సేవలను పక్కనపెట్టి ప్రైవేట్ ప్రాక్టీసులో నిమగ్నమై ఉండటాన్ని మొదటి రకం అవినీతి అని లాన్సెట్ పేర్కొంది. సర్కారు వారికి డబ్బు చెల్లిస్తున్నా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించాల్సిన సమయంలో వేరే చోట పనిచేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారని తెలిపింది. జవాబుదారీతనం, కఠిన చర్యలు లేకపోవటంతో ఈ పరిస్థితి నెలకొందని అభిప్రాయపడింది. 2) ఆరోగ్య రంగంలో రోగుల నుంచి అనధికారికంగా వసూలు చేయడం రెండో రకం అవినీతి అని పేర్కొంది. 3) మందులను పక్కదారి పట్టించడం వంటివి మూడో రూపం అవినీతి కిందకు వస్తాయి. 4) వైద్య సేవల్లో అవినీతి నాలుగో రూపం కిందకు వస్తుంది. వైద్య సేవల ఖర్చులను పెంచడం ద్వారా రోగులను ప్రమాదంలో పడేస్తారు. అనేక దేశాల్లో సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా బాధితులపై భారం మోపుతున్నారు. చికిత్సలు, రిఫరల్స్ పద్ధతుల్లో రోగుల నుంచి డబ్బు వసూలు చేయడం కూడా అవినీతి కిందకే వస్తుంది. ఈ అవినీతి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో జరుగుతుంది. 5) అవినీతి ఐదో రూపం పక్షపాతం. వైద్య సేవల్లో రికమండేషన్లు లేదా సామాజిక హోదా కలిగిన వారికి మరింత ఆరోగ్య సంరక్షణ కల్పించడం వంటివి దీని కిందకు వస్తాయి. దీంతో సాధారణ రోగులు తీవ్రంగా నష్టపోతారు. 6) అవినీతి ఆరో రూపం డేటా తారుమారు. అంటే వైద్య సేవలు చేయకుండానే చేసినట్లు రికార్డులు సృష్టించడం, మోసపూరిత చర్యలకు పాల్పడటం. టీకా వంటి ప్రజారోగ్య కార్యకలాపాల్లో ఇది ఎక్కువగా జరుగుతుంది. దీనిలో నిర్దిష్ట వైద్య కార్యక్రమాల కోసం డేటాను పదేపదే ఎక్కువగా చూపుతారు. ఆరోగ్య రంగంలో వ్యక్తిగత అవినీతి కార్యకలాపాలు చిన్న స్థాయిలో కనిపిస్తాయి. కానీ అవి లక్షలాది మంది రోగులపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని లాన్సెట్ తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఉచితంగా ఇవ్వాల్సిన మందులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కానీ అవి రోగులకు అందుబాటులోకి రావడం లేదని తెలిపింది. రాష్ట్రంలో ఇది అవినీతి కాదా..? ఆరోగ్య రంగంలో అవినీతిపై లాన్సెట్ అధ్యయనం తెలంగాణలోని కొందరు అధికారుల తీరును కూడా వేలెత్తి చూపే అంశంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో తొమ్మిది జిల్లాల పరిధిలో జిల్లా స్థాయి ఆసుపత్రుల నిర్మాణానికి సర్కారు నడుం బిగించింది. దీనిలో భాగంగా గద్వాల, మహబూబాబాద్, నారాయణపేట, నిర్మల్, కొమురంభీం, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగులోని ఏరియా ఆసుపత్రులను జిల్లా ఆసుపత్రులుగా నిర్మించనుంది. వాటిల్లో అధునాతన మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 576.78 కోట్ల నిధులను ప్రతిపాదించగా, ప్రభుత్వం రూ. 214.12 కోట్లకు ఇప్పటికే అనుమతించింది. జిల్లా ఆసుపత్రులను నిర్మించే బాధ్యతను తెలంగాణ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) తీసుకుంటుంది. ఈ నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్ట్‌ను నియమిస్తారు. నిబంధనల ప్రకారం ఆర్కిటెక్ట్‌కు ఒక శాతం కమీషన్ ఇస్తారు. కానీ ఒక అధికారి తనకు సంబంధించిన ఒక ఆర్కిటెక్ట్‌కు అనుమతి ఇవ్వాలని, అంతేగాకుండా 5 శాతం కమీషన్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. అంటే రూ.కోట్లు చేతులు మారే అవకాశముంది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఒక శాతం మాత్రమే ఆర్కిటెక్ట్‌కు కమీషన్ కింద ఇస్తామని, అంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవని టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆర్కిటెక్ట్ కమీషన్ పెంచితే రోగులకు ఇచ్చే మౌలిక సదుపాయాల కల్పనలో రాజీపడాల్సిందే. ఇది కూడా ఆరోగ్య రంగంలో అవినీతిగానే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
శారీరక శ్రమకు దూరంగా యువత
సాక్షి, హైదరాబాద్ : ఆడుతూ పాడుతూ శారీరకంగా అలసిపోవాల్సిన యువత.. ఎల క్ట్రానిక్ ప్రపంచంలో మునిగిపోతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటు న్నారు. ప్రపంచంలో ప్రతి ఐదుగురు టీనేజర్లలో నలుగురు సరైన వ్యాయామం చేయ ట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని ‘ది లాన్సెట్’అనే సంస్థ 146 దేశాల్లో నిర్వహించిన సర్వేలో వెల్లడించింది. ముఖ్యంగా 11–17 ఏళ్ల వయసు గల విద్యా ర్థులపై ఈ సర్వే నిర్వహించింది. భారత్‌లో 72% మంది ఈ వయసు వారు వ్యాయామం చేయకపోవడంతో చురుగ్గా ఉండట్లేదని తేల్చింది. శారీరక శ్రమను పెంచడానికి అత్యవసర చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఎముకలు, కండరాలు పటిష్టంగా ఉండాలంటే ఈ వయసులో కనీసం రోజుకు గంటపాటు కఠిన లేదా మితమైన వ్యాయామాలు చేయాలని సిఫార్సు చేసింది. దీంతో జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా పిల్లలను కాపాడుకోవచ్చని తెలిపింది. యువతకు ఆడుకునే హక్కుందని, ఆ హక్కును కల్పించాలని ఈ సర్వే సూచించింది. బాలుర కంటే బాలికల్లో మరీ తక్కువ ‘బాలుర కంటే బాలికల్లో శారీరక శ్రమ ఇంకా తక్కువగా ఉంది. వారిని ఇంటికే పరిమితం చేయడం, బయటకు పంపడానికి అనువైన వాతావరణం లేకపోవడం వంటివి కారణాలు కనిపించాయి. సాంస్కృతిక సంప్రదాయాలు, భద్రతాపరమైన అంశాలు బాలికలకు ప్రతికూలంగా మారుతున్నాయి. బాలికల శ్రమ విషయంలో మన దేశం సహా బంగ్లాదేశ్ అత్యంత వెనుకబడి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2001లో బాలురలో 80 శాతం మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటే, ఇప్పుడు 78 శాతానికి తగ్గింది. కానీ బాలికల్లో శారీరక శ్రమకు దూరంగా ఉన్నవారు.. అప్పుడూ ఇప్పుడూ 85 శాతం మందే ఉండటం గమనార్హం. అన్ని దేశాలు కౌమార దశలోని పిల్లల శారీరక శ్రమపై తమ విధానాలను అభివృద్ధి చేయాలి. అందుకు అవసరమైన వనరులను కేటాయించాలి’అని లాన్సెట్ నివేదిక కోరింది. డిజిటల్ టెక్నాలజీ కారణంగా ఎలక్ట్రానిక్ పరికరాలపై టీనేజర్లు ఎక్కువ సమయం గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఆట స్థలాలేవీ? తెలంగాణలో 5 వేల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా, వాటిల్లో 15 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు 95 శాతం స్కూళ్లల్లో ఆట స్థలాలున్నాయి. అయితే రాష్ట్రంలో 10,549 ప్రైవేటు స్కూళ్లు ఉండగా, వాటిల్లో 31.21 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. 8,044 ప్రైవేటు స్కూళ్లల్లో మైదానాలు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కానీ కాగితాలపైనే అవి ఉన్నాయని, 50 శాతం పైగా ప్రైవేటు స్కూళ్లల్లో ఆట స్థలాలు లేవని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 404 ఉండగా, 1,500 ప్రైవేట్ జూనియర్ కాలేజీలున్నాయి. వాటిల్లో 10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 80 శాతం ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో మైదానాల్లేవు. కారణంగా విద్యార్థులు ఆటలు ఆడటం కష్టమవుతోంది. దీంతో పిల్లలపై జీవనశైలి వ్యాధులు దాడి చేస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం దేశంలో 10–19 ఏళ్ల మధ్య పిల్లల్లో 5 శాతం మంది బీపీతో బాధపడుతుండగా, తెలంగాణలో ఏకంగా 6.7 శాతం ఉండటం ఆందోళనకరం. అదే వయసు పిల్లల్లో మధుమేహంతో బాధపడేవారు దేశంలో 0.6 శాతం మంది ఉండగా, తెలంగాణలో 1.1 శాతం మంది ఉన్నారు. ఆ వయసు పిల్లల్లో దేశంలో తెలంగాణ బీపీ విషయంలో 5వ స్థానం, మధుమేహంలో 9వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 8.6 శాతం మంది ప్రీ డయాబెటిక్‌తో బాధపడుతున్నారని తేల్చింది. -
2050 నాటికిమలేరియాకు చెక్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న మలేరియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి మరో 30 సంవత్సరాలు పడుతుందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న సగం దేశాలు మలేరియా నుంచి విముక్తి పొందాయని మిగిలిన దేశాల్లో 2050 నాటికి ఈ వ్యాధిని అరికట్టవచ్చునని ఆ నివేదిక తెలిపింది. 2017లో మలేరియా కేసుల్లో ప్రపంచంలో భారత్ నాలుగో స్థానంలో ఉందని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 4 శాతం భారత్‌కు చెందినవే కావడం ఆందోళన పుట్టిస్తోంది. నివేదిక ఎలా ? ప్రపంచవ్యాప్తంగా మలేరియా వ్యాధి నిర్మూలనకు పరిశోధనలు చేస్తున్న నిపుణులు, బయోమెడికల్ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, ఆరోగ్య నిపుణులు మొత్తం 40 మంది అభిప్రాయాలను తీసుకున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాలు వ్యాధి నిర్మూలనకు అమలు చేస్తున్న వ్యూహాలు, కేటాయిస్తున్న నిధులు వంటివి క్రోడీకరించి, విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. నివేదిక ఏం చెప్పిందంటే ► 2017లో ప్రపంచంలో 21.9 కోట్ల మలేరియా కేసులు వెలుగులోకి వస్తే, అందులో కోటి కేసులు భారత్‌లో నమోదయ్యాయి. అందులోనూ 71 శాతం తమిళనాడులో నమోదయ్యాయి. ► భారత్‌కు చెందిన పట్టణాల్లో మలేరియా వ్యాధికారక దోమలు వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ► భారత్‌లో పట్టణీకరణ కారణంగా నిర్మాణాలు జరిగే ప్రాంతాలు, చెరువులు, కాల్వలు వంటి చోట్ల దోమలు బాగా వృద్ధి చెంది మలేరియా వ్యాపిస్తోంది. ► భారత్‌లో ఆరోగ్యానికి ప్రజలు తమ జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల కూడా మొండి వ్యాధులు దూరం కావడం లేదు. ► 2000 సంవత్సరం తర్వాత మలేరియా వ్యాధి మరణాలు 60 నుంచి 36 శాతానికి తగ్గిపోయాయి. ► నిధుల కొరత కారణంగ్లా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాకు చెందిన 55 దేశాల్లో మలేరియా విజృంభిస్తోంది. ► ఇప్పటికీ ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ► 2017లో మొత్తం మరణాల్లో 85శాతం 25 దేశాల్లోనే నమోదయ్యాయి. ► పేదరికం కారణంగా మలేరియా నిర్మూలనకు నిధులు కేటాయించలేక ఆఫ్రికా దేశాల్లో ఇంకా మరణాలు సంభవిస్తున్నాయి. ► ప్రాంతాలవారీగా, దేశాల వారీగా, అంతర్జాతీయంగా పటిష్టమైన చర్యల్ని తీసుకుంటేనే ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించగలం ► ప్రపంచ దేశాలన్నీ ప్రతీ ఏడాది 200 కోట్ల అమెరికా డాలర్ల నిధులు కేటాయిస్తేనే మలేరియా నిర్మూలన సాధ్యమవుతుంది. ► ప్రస్తుత ఆవిష్కరణలను బట్టి 2050 నాటికి ఈ వ్యాధి ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా కనిపించదు. -
దేశంలో హై బీపీ పెరిగిపోతోంది
లండన్: దేశంలో హై బీపీతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. 2015 నాటికి దేశంలో దాదాపు 20 కోట్ల మందికి హై బీపీ ఉన్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. చైనాలో అత్యధికంగా 22.60 కోట్ల మంది దీనితో బాధపడుతున్నారు. హై బీపీ ఉన్న వారిపై చేసిన అధ్యయన కథనాన్ని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు. గత 40 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా హై బీపీ ఉన్నవారు రెట్టింపయ్యారు. 2015 నాటికి 113 కోట్లమందికి హై బీపీ ఉంది. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారు. హై బీపీ వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదముందని, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 75 లక్షల మంది దీనివల్ల మరణిస్తున్నారని అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే దీని ప్రభావం ఎక్కువగా ఉంది. అందులోనూ ఆసియాలోనే తీవ్రత ఎక్కువ. గతేడాది ప్రపంచంలో మొత్తం 113 కోట్ల మందికి హై బీపీ ఉండగా, వీరిలో దక్షిణాసియాలో 23 శాతం, తూర్పు ఆసియాలో 21 శాతం మంది ఉన్నారు. మహిళలతో పోలిస్తే పరుషులే ఎక్కువ మంది దీని బారినపడ్డారు. హై బీపీ ఉన్నవారు తక్కువమంది ఉన్న యూరప్ దేశాల్లో బ్రిటన్ ప్రథమ స్థానంలో ఉంది. అలాగే అమెరికా, కెనడా, దక్షిణా కొరియాల్లో కూడా దీని ప్రభావం చాలా తక్కువ.