వేర్వేరు సంస్థల టీకాలు.. | Mix-and-match vaccines highly effective against COVID-19 | Sakshi
Sakshi News home page

వేర్వేరు సంస్థల టీకాలు..

Published Tue, Oct 19 2021 4:17 AM | Last Updated on Tue, Oct 19 2021 5:30 AM

Mix-and-match vaccines highly effective against COVID-19 - Sakshi

లండన్‌: కోవిడ్‌ టీకా రెండు డోసుల్లోనూ ఆస్ట్రాజెనెకా(కోవిషీల్డ్‌)ను తీసుకున్న వారితో పోలిస్తే ఒక డోసు ఆస్ట్రాజెనెకా, ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారంగా తయారు చేసిన టీకా మరో డోసు తీసుకుంటే మహమ్మారి ముప్పు తక్కువగా ఉంటోందని స్వీడన్‌లో చేపట్టిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ మేరకు చేపట్టిన ‘మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌’అధ్యయనం ఫలితాలు సోమవారం లాన్సెట్‌ రీజినల్‌ హెల్త్‌–యూరప్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వెక్టార్‌ ఆధారిత ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న 65 ఏళ్లు పైబడిన వారిలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించడంతో స్వీడన్‌లో ఈ టీకా వినియోగాన్ని నిలిపివేశారు.

దీంతో, అప్పటికే ఆస్ట్రాజెనెకా మొదటి డోసుగా తీసుకున్న వారికి, ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత టీకాను రెండో డోసుగా తీసుకోవచ్చని నిపుణులు సిఫారసు చేశారు. దీంతో కొందరు రెండో డోసుగా ఫైజర్‌/ మోడెర్నా టీకాను తీసుకున్నారు. ఇలా, స్వీడన్‌లో వేర్వేరు డోసులు తీసుకున్న సుమారు 7 లక్షల మంది నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ సర్వే జరిగింది.

‘వెక్టార్‌ బేస్డ్‌ టీకా ఆస్ట్రాజెనెకాను మొదటి డోసుగా, ఎంఆర్‌ఎన్‌ఏ బేస్డ్‌ వ్యాక్సిన్‌ను రెండో డోసుగా తీసుకున్న వారిలో కోవిడ్‌ ముప్పు తగ్గుతోందని గమనించాం’అని పరిశోధకులు చెప్పారు. ఈ అధ్యయనంలో ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌ వ్యాక్సిన్లను కలిపి తీసుకున్న వారిలో కోవిడ్‌ ఇన్ఫెక్షన్‌ ముప్పు 67%  తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించారు. అదే, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా వ్యాక్సిన్లను వేర్వేరు డోసులుగా తీసుకున్న వారిలో, అసలు టీకా తీసుకోని వారితో పోలిస్తే కోవిడ్‌ ముప్పు 79% వరకు తగ్గుతున్నట్లు గుర్తించారు.  రెండు డోసుల్లోనూ ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్‌) టీకా తీసుకున్న వారికి కోవిడ్‌ ముప్పు 50%మాత్రమే తగ్గుతున్నట్లు కూడా గుర్తించామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement