రష్యా వ్యాక్సిన్‌తో యాంటీబాడీల వృద్ధి | Lancet Published Results Of Russias Vaccine Early Stage Trials | Sakshi
Sakshi News home page

విమర్శకుల నోళ్లుమూయించాం : రష్యా

Published Fri, Sep 4 2020 5:55 PM | Last Updated on Fri, Sep 4 2020 8:09 PM

Lancet Published Results Of Russias Vaccine Early Stage Trials - Sakshi

మాస్కో : స్పుత్నిక్‌ వీ పేరుతో రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఆరంభ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రాబట్టిందని మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ పరీక్షలో పాల్గొన్నవారందరిలో కరోనా వ్యాక్సిన్‌ను నిరోధించే యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయని తెలిపింది. స్పుత్నిక్‌-వీ పనితీరుపై విమర్శకులకు ఈ పరీక్షలో వెల్లడైన అంశాలే సమాధానమని రష్యా వ్యాఖ్యానించింది. ఈ ఏడాది జూన్‌-జులైలో వ్యాక్సిన్‌పై నిర్వహించిన రెండు దశల పరీక్షలో పాల్గొన్న 76 మందిలోనూ కోవిడ్‌-19ను ఎదుర్కొనే యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని, ఏ ఒక్కరిలోనూ తీవ్ర సైడ్‌ఎఫెక్ట్స్‌ కనిపించలేదని లాన్సెట్‌ పేర్కొంది. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌గా చెబుతున్న ఈ వ్యాక్సిన్‌కు ఆగస్ట్‌లోనే దేశీయ వినియోగానికి రష్యా అనుమతించిన సంగతి తెలిసిందే. చదవండి : రష్యా వ్యాక్సిన్‌ : నెలకు 60 లక్షల డోసులు

కోవిడ్‌-19 నుంచి రక్షణ కల్పిస్తూ దీర్ఘకాల భద్రత, సమర్ధతల గురించి నిర్ధారణ చేసుకునేందుకు స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌పై భారీస్ధాయిలో సుదీర్ఘ పరీక్షలు అవసరమని లాన్సెట్‌ పేర్కొంది. కాగా ఈ వ్యాక్సిన్‌ పూర్తిస్దాయిలో పరీక్షలు చేపట్టి, అంతర్జాతీయంగా ఆమోదం లభించే వరకూ స్పుత్నిక్‌ వీని వాడరాదని పలువురు నిపుణులు హెచ్చరించారు. అయితే అంతర్జాతీయ పత్రిక లాన్సెట్‌లో తొలిసారిగా రష్యన్‌ వ్యాక్సిన్‌ ప్రయోగ ఫలితాలు ప్రచురించడం, 40,000 మందిపై గతవారం పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో తమ వ్యాక్సిన్‌పై అనుమానాలు పటాపంచలవుతాయని సీనియర్‌ రష్యన్‌ అధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు కోవిడ్‌-19 నిరోధానికి తొలి వ్యాక్సిన్‌ను ప్రకటించిన రష్యా భారీస్ధాయిలో వ్యాక్సిన్‌ తయారీకి సన్నద్ధమవుతోంది. సంవత్సరం చివరి నాటికి నెలకు 20 లక్షల డోసులను ఉత్పత్తి చేస్తూ క్రమంగా నెలకు 60 లక్షల డోసులకు సామర్ధ్యాన్ని పెంచుతామని పరిశ్రమల మంత్రి డెనిస్‌ మంతురోవ్‌ వెల్లడించారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement