కోవిడ్ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన రష్యన్ శాస్త్రవేత్తలలో ఒకరైన ఆండ్రీ బోటికోవ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కోవిడ్ వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వీ'ని రూపొందించడంలో సహకరించిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తలలో ఆయన ఒకరు. 47 ఏళ్ల బోటికోవ్ తన అపార్ట్‌మెంట్‌లోనే విగతజీవిగా కనిపించాడు. అతను గామాల్యే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మ్యాథ్‌మెటిక్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా పనిచేస్తున్నట్లు రష్య స్థానిక మీడియా పేర్కొంది.
ఆయన చేసిన కృషికి గానూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ఫాదర్‌ల్యాండ్ అవార్డుతో సత్కరించారు. 2020లో స్పుత్నిక్ వీ అనే కోవిడ్ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన 18 మంది శాస్త్రవేత్తలలో ఆయన ఒకరు. ఐతే ఆయన్ను ఎవరో బెల్ట్‌తో హింసించి హతమార్చినట్లు కొందరు చెబుతున్నారు. ఈ మేరకు హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రష్యా దర్యాప్తు అథారిటీ పేర్కొంది.
ఐతే ఈ ఘటన జరిగిన కొద్దిగంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు రష్యా ఫెడరల్ ఇన్విస్టిగేటివ్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. అతను విచారణలో నేరాన్ని అంగీకరించాడని అతనికి నేర చరిత్ర కూడా ఉన్నట్లు ఇన్విస్టిగేటివ్ ఏజెన్సీ వెల్లడించింది.
(చదవండి: కరోనా మహమ్మారి మూలాల గురించి మీకు తెలిసిందే చెప్పండి!)
Comments
Please login to add a commentAdd a comment