Sputnik
-
రష్యా స్పుత్నిక్–5 టీకా సృష్టించిన సైంటిస్టు హత్య
మాస్కో: రష్యా కోవిడ్ టీకా స్పుత్నిక్–5 సృష్టికర్తల్లో ఒకరైన అగ్రశ్రేణి శాస్త్రవేత్త ఆండ్రీ బొటికోవ్ (47) హత్యకు గురయ్యారు. మాస్కోలోని అపార్టుమెంట్లోనే గురువారం గుర్తు తెలియని వ్యక్తులు బెల్టుతో గొంతు నులిమి చంపారు. గమలెయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మేథమేటిక్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా ఉన్నారు. ఇక్కడే మరో 18 మంది శాస్త్రవేత్తలతో కలిసి 2020లో స్పుత్నిక్ వీ టీకాను రూపొందించారు. హత్యకు పాల్పడిన 29 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రష్యా ఫెడరల్ దర్యాప్తు కమిటీ శనివారం వెల్లడించింది. ఆండ్రీ బొటికోవ్తో చిన్న విషయమై తలెత్తిన తగాదాతోనే ఈ నేరానికి పాల్పడినట్లు అతడు అంగీకరించాడని కూడా తెలిపింది. నిందితుడికి నేర చరిత్ర ఉందని పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎన్నదగిన పరిశోధనలు జరిపిన వైరాలజిస్ట్ ఆండ్రీ బొటికోవ్ను 2021లో అధ్యక్షుడు పుతిన్ ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ది ఫాదర్లాండ్’పురస్కారంతో సత్కరించారు. -
కోవిడ్ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త మృతి.. అసలేం జరిగింది?
కోవిడ్ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన రష్యన్ శాస్త్రవేత్తలలో ఒకరైన ఆండ్రీ బోటికోవ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కోవిడ్ వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వీ'ని రూపొందించడంలో సహకరించిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తలలో ఆయన ఒకరు. 47 ఏళ్ల బోటికోవ్ తన అపార్ట్మెంట్లోనే విగతజీవిగా కనిపించాడు. అతను గామాల్యే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మ్యాథ్‌మెటిక్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా పనిచేస్తున్నట్లు రష్య స్థానిక మీడియా పేర్కొంది. ఆయన చేసిన కృషికి గానూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ఫాదర్ల్యాండ్ అవార్డుతో సత్కరించారు. 2020లో స్పుత్నిక్ వీ అనే కోవిడ్ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన 18 మంది శాస్త్రవేత్తలలో ఆయన ఒకరు. ఐతే ఆయన్ను ఎవరో బెల్ట్‌తో హింసించి హతమార్చినట్లు కొందరు చెబుతున్నారు. ఈ మేరకు హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రష్యా దర్యాప్తు అథారిటీ పేర్కొంది. ఐతే ఈ ఘటన జరిగిన కొద్దిగంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు రష్యా ఫెడరల్ ఇన్విస్టిగేటివ్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. అతను విచారణలో నేరాన్ని అంగీకరించాడని అతనికి నేర చరిత్ర కూడా ఉన్నట్లు ఇన్విస్టిగేటివ్ ఏజెన్సీ వెల్లడించింది. (చదవండి: కరోనా మహమ్మారి మూలాల గురించి మీకు తెలిసిందే చెప్పండి!) -
స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ తయారీ.. హెటిరోకు అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 నివారణలో వాడే స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ తయారీ, విక్రయానికై హైదరాబాద్ కంపెనీ హెటిరో బయోఫార్మాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. భారత్‌లో అత్యవసర వినియోగానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) నుంచి ఈ మేరకు ఆమోదం పొందామని కంపెనీ సోమవారం ప్రకటించింది. దేశీయ మార్కెట్లో నేరుగా వ్యాక్సిన్‌ను విక్రయించడానికి సంస్థకు ఈ ఆమోదం వీలు కలిపిస్తుంది. 18 సంవత్సరాల పైబడిన వారికి కోవిడ్–19 నివారణ కోసం 0.5 మిల్లీలీటర్ల ఒకే మోతాదులో ఈ వ్యాక్సిన్‌ను ఇస్తారు. భారత్‌లో స్థానికంగా తయారైన ఉత్పత్తికి.. తయారీ, మార్కెటింగ్ ఆమోదం పొందిన మొదటి బయోఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో కావడం విశేషం. దేశంలో ప్రస్తుతం ఆమోదం పొందిన అన్ని ఇతర వ్యాక్సిన్లు రెండు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. భారత్‌లో సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ కోవిడ్–19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుమతి మంజూరు చేసింది. స్పుత్నిక్ లైట్ ఔషధ పరీక్షల్లో కోవిడ్–19ను తట్టుకునే స్థాయిలో అధిక యాంటీబాడీలను చూపిందని హెటిరో క్లినికల్ డెవలప్మెంట్, మెడికల్ అఫైర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ శుభదీప్ సిన్హా ఈ సందర్భంగా తెలిపారు. -
సింగిల్ షాట్ ‘స్పుత్నిక్’కు అత్యవసర అనుమతి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణ కోసం అభివృద్ధి చేసిన సింగిల్–డోసు స్పుత్నిక్ లైట్ టీకాకు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదివారం ట్విటర్లో ప్రకటించారు. స్పుత్నిక్–5 టీకా తరహాలోనే స్పుత్నిక్ లైట్ టీకా పని చేస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. దీంతో డ్రగ్ రెగ్యులేటర్‌లోని నిపుణుల కమిటీ శనివారం ఈ మేరకు అనుమతులు జారీ చేసినట్లు సమాచారం. త్వరలో డీసీజీఐ పూర్తి స్థాయిలో తుది అప్రూవల్ ఇవ్వనుందని తెలుస్తోంది. స్పుత్నిక్ లైట్‌తో భారత్‌లో వ్యాక్సిన్ల సంఖ్య 9కి చేరింది. DCGI has granted emergency use permission to Single-dose Sputnik Light COVID-19 vaccine in India. This is the 9th #COVID19 vaccine in the country. This will further strengthen the nation's collective fight against the pandemic. — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) February 6, 2022 చదవండి: సూది, నొప్పి లేకుండా కరోనా వ్యాక్సిన్.. మనదేశంలోనే! -
రష్యాకు ఊహించని దెబ్బ.. భారత్‌లో పడిపోయిన డిమాండ్
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి నియంత్రణ కోసం రష్యా స్పుత్నిక్–వి పేరుతో కరోనా టీకాను అభివృద్ధి చేసింది. భారత్‌లో ఈ టీకా పంపిణీ బాధ్యతలను డాక్టర్ రెడ్డిస్ ల్యాబోరేటరీస్ సంస్థ స్వీకరించింది. దేశంలో ఈ ఏడాది మే నెలలో దీన్ని ఆవిష్కరించారు. అయితే, కేవలం ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉన్న స్పుత్నిక్–వి వ్యాక్సిన్‌కు డిమాండ్ పడిపోయిందని వైద్య వర్గాలు చెప్పాయి. అందుకే ప్రైవేట్ ఆసుపత్రులు ఈ టీకా ఆర్డర్లను రద్దు చేస్తున్నాయని తాజాగా వెల్లడించాయి. మిగతా ఇతర సంస్థల టీకాలతో పోలిస్తే స్పుత్నిక్–వీను మైనస్ 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం సమస్యగా మారింది. ఇండియాలో ప్రస్తుతం ఒక్కో డోసుకు రూ.948 చొప్పున ధర ఉంది. దీనిపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అదనం. మరోవైపు కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం ఉచితంగానే ఆయా టీకాలను ప్రజలకు అందజేస్తోంది. నిత్యం లక్షలాది డోసులు వేస్తోంది. స్పుత్నిక్–వి పట్ల ఆదరణ తగ్గడానికి ఇది మరో కారణమని చెప్పొచ్చు. చదవండి: Noida Twin Towers Case : ఒక్క టవరే కూల్చండి.. ప్లీజ్ -
నకిలీ కోవిడ్-19 వ్యాక్సిన్లను గుర్తించడం ఎలా..?
ప్రస్తుతం కరోనా మహమ్మరిని ఎదుర్కొనే ఆయుధం ఏదైనా ఉంది అంటే అది ఒక వ్యాక్సిన్ మాత్రమే. అయితే, కొందరు నెరగాళ్లు ఈ వ్యాక్సిన్లను కూడా విడిచి పెట్టడం లేదు. వ్యాక్సిన్లకు నకిలీ వ్యాక్సిన్లను సృష్టించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఈ నకిలీ వల్ల ప్రజలు భారీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే, వీటి కట్టడి దిశగా కేంద్ర రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. వ్యాక్సిన్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్న నకిలీ కోవిడ్-19 వ్యాక్సిన్లకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) కూడా ఆందోళన చెందుతుంది. (చదవండి: Google: వెతుకులాట.. అలా మొదలైంది) ఇటీవల, ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికాలలో ఆస్ట్రాజెనెకా/ఆక్స్ ఫర్డ్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల డూప్లికేట్ వెర్షన్లను కనుగొన్నట్లు డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. అందుకే, ఈ నకిలీ కోవిడ్ వ్యాక్సిన్లను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతానికి, భారతీయ మార్కెట్లో కరోనా వైరస్ అరికట్టడం కోసం దేశంలో మూడు వ్యాక్సిన్లను వినియోగిస్తున్నాము. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాక్సిన్, రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి. ఈ వ్యాక్సిన్లు ఒరిజినల్ లేదా నకిలీదా అని చెక్ చేయడం కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిషీల్డ్ కోవిషీల్డ్ బాటిల్ ఈ క్రింది వివరాలు ఉండాలి ఎస్ఐఐ ప్రొడక్ట్ లేబుల్ ట్రేడ్ మార్క్ తో బ్రాండ్ పేరు(కోవిషీల్డ్) ఉండాలి జనరిక్ పేరు ఫాంట్ అన్ బోల్డ్ గా ఉంటుంది "(రీకాంబినెంట్)" అదే ఫాంట్ తో జనరిక్ పేరు దిగువ ఉంటుంది. సీజీఎస్ సేల్ స్టాంప్ కొరకు కాదు. ఎస్ఐఐ లోగో కచ్చితంగా ఉండాలి. లేబుల్ కలర్ షేడ్ ముదురు ఆకుపచ్చరంగులో ఉంటుంది. అల్యూమినియం ఫ్లిప్ ఆఫ్ సీల్ అనేది ముదురు ఆకుపచ్చరంగులో ఉంటుంది. కొవాక్సిన్ బుడ్డి లేబుల్ మీద డీఎన్ఎ వంటి నిర్మాణం ఉంటుంది. కోవాక్సిన్ స్పెల్లింగ్ "ఎక్స్"లో గ్రీన్ కలర్ ఉంటుంది. కొవాక్సిన్ స్పెల్లింగ్ పై హోలో గ్రాఫిక్ ఎఫెక్ట్ ఉంటుంది. భారతదేశంలో ఇప్పటి వరకు 68 కోట్లకు పైగా కోవిడ్-19 వ్యాక్సిన్లు ఇచ్చారు. ఇందులో 18-44 ఏళ్ల వయసున్న వ్యక్తులకు 26.99 కోట్ల ఫస్ట్ డోస్, మే 1న వ్యాక్సినేషన్ డ్రైవ్ ఫేజ్-3 ప్రారంభమైనప్పటి నుంచి వారికి 3.35 కోట్ల రెండో డోసులుఇచ్చారు. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు 60 కోట్లకు పైగా డోసులను సరఫరా చేసింది. -
వారికి స్పుత్నిక్ వీ సింగిల్ డోసు చాలు..
న్యూఢిల్లీ: కరోనా సోకి కోలుకున్న వారికి స్పుతి్నక్ వీ వ్యాక్సిన్ సింగిల్ డోసు సరిపోతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. అర్జెంటీనా వేదికగా జరిపిన ఈ పరిశోధనలో కరోనా సోకిన వారు స్పుత్నిక్ వీ రెండో డోసు తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉన్నట్లు కనిపించలేదని పరిశోధకులు చెప్పారు. ఈ పరిశోధన సైన్స్ డైరెక్ట్ జర్నల్‌లో ప్రచురితమైంది. అయితే రెండో డోసు కూడా వేసుకుంటే యాంటీబాడీలు పెరగడంతో పాటు న్యూట్రలైజింగ్ సామర్థ్యం పెరుగుతుందని స్పష్టం చేశారు. సింగిల్ డోసు పూర్తయిన 21 రోజుల తర్వాత పరిశీలించగా పెద్దగా ప్రభావం లేదని నివేదిక తెలిపింది. ఒక్క డోసు వ్యాక్సిన్‌తోనే ఏకంగా 94శాతం ప్రభావం ఉంటోందని, అందువల్ల రెండో డోసు తీసుకున్నప్పటికీ పెద్ద మార్పు లేదని నివేదికలో పేర్కొన్నారు. అర్జెంటీనాలోని ఆరోగ్య కార్యకర్తలపై ఈ పరిశోధన చేశారు. -
గుడ్ న్యూస్ : త్వరలో స్పుత్నిక్-వీ కమర్షియల్ లాంచ్
సాక్షి, ముంబై: దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ల కొరతపై అనేక విమర్శల కొనసాగుతున్న సమయంలో డాక్టర్ రెడ్డీస్ కీలక విషయాన్ని ప్రకటించింది. రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ కమర్షియల్ లాంచ్ నిలిచిపోలేదని స్పష్టం చేసింది. రాబోయే వారాల్లో వాణిజ్యపరంగా ఇది అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఈ మేరకు డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ ఒక ప్రకటన విడదుల చేసింది. దీంతో వ్యాక్సినేషన్ ప్రకక్రియ మరింత బలోపేతమవుతుందని పేర్కొంది. కాగా 91.6 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని భావిస్తున్న స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను మే 14న సాఫ్ట్ పైలట్ ప్రాతిపదికన డాక్టర్ రెడ్డీస్ భారతదేశంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆగస్టు, డిసెంబర్ మధ్య కాలంలో దేశంలో స్థానికంగా ఉత్పత్తి చేసిన దిగుమతి చేసుకున్న 100 మిలియన్ల స్పుత్నిక్ -వీ డోస్‌లను అందించాలని భారత ప్రభుత్వం ఆశిస్తోంది. -
త్వరలోనే ఉచితంగా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల్లో రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ఒకటి. ఈ టీకా ఒక్కో డోసు ధర రూ.1,145గా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ వ్యాక్సిన్ కూడా ఉచితంగా లభించ నుంది. ఒకపక్క థర్డ్ వేవ్.. మరోపక్క డెల్టా ప్లస్ వేరియంట్ భయాలు వెంటాడుతున్న తరుణంలో దేశ ప్రజలకు మరో వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులోకి రానుండటం శుభపరిణామం. టైమ్స్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ కూడా త్వరలో ప్రభుత్వ కేంద్రాలలో ఉచితంగా లభించనుంది ప్రస్తుతం, దేశంలో సీరం ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కోవాక్సిన్ ప్రభుత్వ కేంద్రాలలో ఉచితంగా లభిస్తోంది. ఇపుడిక ఈ జాబితాలో రష్యా వ్యాక్సిన్ కూడా చేరనుండటం విశేషం. దేశంలో అత్యవసర వినియోగానికి రెగ్యులేటరీ అనుమతి పొందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ప్రభుత్వ కేంద్రాల్లోనూ ఉచితంగా లభించే అవకాశం ఉందని కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ప్రెసెడింట్ డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు. తమ వ్యాక్సిన్‌ను సైతం ఉచితంగా అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నామని, అయితే టీకా సరఫరాపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. దీంతో దేశంలోవ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోనుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం వ్యాక్సిన్ సరఫరాలో కీలకంగా ఉన్న కోవీషీల్డ్, కోవాక్సిన్‌తోపాటు, స్పుత్నిక్-వీ, మోడర్నా, జైడస్ క్యాడిలాతో, రోజువారీ టీకాల పంపిణీ 8 నుంచి 10 మిలియన్లకు పెంచవచ్చన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి, 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించినట్టు అరోరా చెప్పారు. -
స్పుత్నిక్ వి కోసం ఎదురు చూస్తున్నారా? మీకో గుడ్‌న్యూస్!
సాక్షి, న్యూఢిల్లీ: రష్యాకు చెందిన కోవిడ్-19వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ తయారీకి ఢిల్లీకి చెందిన ఫార్మ సంస్థ పనాసియా బయోటెక్ అనుమతి సాధించింది. దేశంలోఈ వ్యాక్సిన్ తయారీకి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) పనాసియా బయోటెక్‌కు లైసెన్స్ మంజూరు చేసింది. తద్వారా సంవత్సరానికి 100 మిలియన్ మోతాదులను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అంచనా. స్పుత్నిక్-వీ వ్యాక్సీన్‌ను తయారుచేసే తొలి సంస్థగా తమ కంపెనీ అవతరించిందని పనాసియా ఆదివారం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డి వద్ద పనాసియా ప్లాంట్‌లో తయారైన తొలి రౌండ్ వ్యాక్సిన్లు నాణ్యత నియంత్రణా ప్రమాణాలను ఇప్పటికే విజయవంతంగా పాస్ అయినట్టు కంపెనీ ప్రకటన తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్‌ను విక్రయిస్తున్న రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్)తో భాగస్వామ్యం చేసుకున్న ఆరు కంపెనీలలో పనాసియా బయోటెక్ ఒకటి అని పనాసియా బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ జైన్ అన్నారు. ఈ టీకా ధర మోతాదు రూ.1,145గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వార్తలతో సోమవారం నాటి మార్కెట్లో పనాసియా బయోటెక్ 12 శాతానికి పైగా ర్యాలీ అయింది. కాగా అత్యవసర వినియోగానికి స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌కు ఏప్రిల్ 12 న డీసీజీఐ అనుమతినిచ్చింది. మే 14న తొలి డోస్‌ను అందించగా, సాఫ్ట్ లాంచ్‌లో భాగంగా విశాఖపట్నం, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, బడ్డి, చెన్నై, మిర్యాలగుడ, కొల్లాపూర్లతో సహా పలు భారతీయ నగరాల్లో ఈ వ్యాక్సిన్‌ను అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ 67 దేశాలలో అనుమతి లభించగా మొత్తం జనాభా 3.5 బిలియన్లకు పైగా టీకాలను అందించారు. హ్యూమన్ ఎడెనోవైరస్ ప్లాట్‌ఫాంపై రూపొందించిన ఈ వ్యాక్సీన్‌ను రష్యాలోని గమలేయా నేషనల్ సెంటర్ అభిృవృద్ధి చేసిన సంగతి తెలిసిందే. రెండు-మోతాదుల వ్యాక్సిన్ తీవ్రమైన కరోనా నివారణలో 91.6 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ ప్రకటించింది. అయితే ఈ టీకా మార్కెటింగ్‌కోసం ఇప్పటికే ఆర్డీఐఎఫ్తో జతకట్టిన డాక్టర్ రెడ్డీస్ పనాసియా మోతాదులను కూడా మార్కెట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
సామాన్యునికి అందుబాటులో లేని స్పుత్నిక్ - వి వ్యాక్సిన్
-
స్పుత్నిక్ లైట్‌కి నో
న్యూఢిల్లీ/హైదరాబాద్: సింగిల్ డోస్ కోవిడ్ టీకా ‘స్పుత్నిక్ లైట్’ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి నిరాకరించింది. దీనికి సంబంధించి నిపుణుల కమిటీ చేసిన సిఫారసులను డీసీజీఐ ఆమోదించింది. స్పుత్నిక్ లైట్’ టీకా ‘స్పుత్నిక్ వీ’ టీకాలోని కాంపొనెంట్ 1కి సమానమేనని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. ఈ టీకాకు సంబంధించి భద్రత, రోగ నిరోధక శక్తిని పెంపొందించే విషయంలో క్లినికల్ ట్రయల్స్ డేటా తగినంత లేదని పేర్కొంది. నిపుణుల కమిటీ సిఫారసులను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెబ్సైట్లో గురువారం పోస్ట్ చేశారు. స్పుత్నిక్ లైట్ అత్యవసర వినియోగానికి అనుమతించాలని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ డీసీజీఐకి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. చదవండి: జాగ్రత్తగా ఉంటే మూడో వేవ్ రాకపోవచ్చు.. -
మరో 9 నగరాల్లో స్పుత్నిక్-వీ వ్యాక్సిన్.. జాబితాలో విశాఖ, మిర్యాలగూడ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి చికిత్సలో డీఆర్డీవో రూపొందించిన కీలక డ్రగ్‌ను ఇటీవల విడుదల చేసిన దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ మరో శుభవార్త అందించింది. స్పుత్నిక్-వీ టీకాలు ఇక నుంచి మరో 9 నగరాల్లో అందబాటులోకి వస్తాయని డాక్టర్ రెడ్డీస్ సంస్థ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ జాబితాలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, చెన్నై, విశాఖపట్నం, బడ్డీ, కోల్హాపూర్, మిర్యాలగూడ నగరాలు ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం పైలట్ పద్ధతిలో టీకాలను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను .. మన దేశంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. కాగా, ఈ టీకాను మొదట హైదరాబాద్‌లో విడుదల చేశారు. అయితే ప్రస్తుతం స్పుత్నిక్-వీ టీకాలను కోవిన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం లేదు. పైలట్ లాంచింగ్ ప్రక్రియ తుది దశలో ఉన్నదని, రెండు డోసుల టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు రెడ్డీస్ ల్యాబ్ తెలిపింది. కాగా, మైనస్ 18డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద స్పుత్నిక్ వీ టీకాలను నిల్వ చేస్తారు. The #SputnikV vaccine will be available in 9 more cities across India, including Bengaluru, Mumbai, Chennai, Visakhapatnam, Baddi, Kolhapur and Miryalaguda.👇https://t.co/fIuXV2XDJP — Sputnik V (@sputnikvaccine) June 17, 2021 చదవండి: భారత ట్విటర్ ఎండీని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు -
టీకా టెక్నాలజీ బదిలీకి సిద్ధం
సెయింట్ పీటర్స్బర్గ్ (రష్యా): రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ స్పుత్నిక్–వీ తయారీకి భారతీయ కంపెనీలు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాక్సిన్ టెక్నాలజీ బదిలీకి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. విదేశాల్లో కూడా టీకా ఉత్పత్తిని విస్తృతం చేస్తామన్నారు. వ్యాక్సిన్ టెక్నాలజీని పంచుకోవడానికి సిద్ధమైన ఏకైక దేశం రష్యాయేనని చెప్పారు. అమెరికా, భారత్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన అంతర్జాతీయ వార్తా సంస్థల సీనియర్ ఎడిటర్లతో పుతిన్ శనివారం ఆన్లైన్లో సంభాషించారు. పీటీఐ, అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్ తదితర సంస్థల ఎడిటర్లతో మాట్లాడుతూ స్పుత్నిక్– వీ సమర్థతపై వస్తున్న ఆరోపణల్ని తోసిపుచ్చారు. 97.6 శాతం సామర్థ్యంతో తమ వ్యాక్సిన్ పని చేస్తోందని స్పష్టం చేశారు. యూరప్ దేశాల్లో వ్యాక్సిన్ కంపెనీల మధ్య పోటీ, వాణిజ్యపరమైన కారణాల వల్ల స్పుత్నిక్– వీ రిజిస్ట్రేషన్‌లో జాప్యం జరుగుతోందని అన్నారు. ఇప్పటికే 66 దేశాల్లో స్పుత్నిక్– వీని విక్రయిస్తున్నామని, తమ వ్యాక్సిన్ మంచి మార్కెట్ ఉందన్నారు. స్పుత్నిక్– వీ వ్యాక్సిన్ తయారీకి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి డీసీజీఐ ప్రాథమిక అనుమతులు ఇచ్చిన నేపథ్యంలోనే పుతిన్ టెక్నాలజీని పంచుకోవడానికి సిద్ధమని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఈ వ్యాక్సిన్ పంపిణీ బాధ్యతల్ని చేపట్టింది. మరోవైపు అమెరికా సహా కొన్ని దేశాలు కరోనా సంక్షోభానికి చైనాయే కారణమని నిందిస్తున్న అంశంపై అడిగిన ప్రశ్నకు పుతిన్ సమాధానమిస్తూ ఇప్పటికే ఈ విషయంపై చాలా ఎక్కువగా తాను మాట్లాడానని, కొత్తగా చెప్పడానికి ఏమీలేదన్నారు.సంక్షోభాన్ని ఎప్పుడూ రాజకీయం చేయకూడదని హితవు పలికారు. మోదీ, జిన్‌పింగ్ బాధ్యతాయుత నాయకులు భారత్, చైనా సరిహద్దు వివాదాల్ని ఆ రెండు దేశాలే పరిష్కరించుకోవాలని పుతిన్ వ్యాఖ్యానించారు. మూడోదేశం ఈ అంశంలో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎంతో బాధ్యత కలిగిన నాయకులని... సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునే సామర్థ్యం వారికుందని అభిప్రాయపడ్డారు. రష్యా, చైనాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం... భారత్, రష్యాల రక్షణ బంధంపై ప్రభావం చూపిస్తుందా అని అడిగిన ప్రశ్నకు భారత్‌తో కూడా తమకు బలీయమైన బంధం ఉందని అన్నారు. రష్యా, భారత్ మధ్య బంధం నమ్మకం అనే పునాది మీద ఏర్పడిందని, దానికొచ్చే ఇబ్బందేమీ లేదని చెప్పారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌లు క్వాడ్ పేరుతో ఒక బృందంగా ఏర్పడడం, భారత్ అందులో భాగస్వామ్యం కావడంపై రష్యా విదేశాంగ మంత్రి బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై పుతిన్ మాట్లాడుతూ ఏ దేశంతో సన్నిహితంగా మెలగాలి, ఎంతవరకు సంబంధాల్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకునే హక్కు ప్రతీ సార్వభౌమ దేశానికి ఉంటుందని, దానిని ఎవరూ కాదనలేరని వ్యాఖ్యానించారు. -
స్పుత్నిక్ వీ: సీరంకు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌వేవ్‌తో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం మరో ఊరటనిచ్చింది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీకి అతిపెద్ద టీకా తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)కు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతినిచ్చింది. మహారాష్ట్ర పుణేలోని హడాస్పార్ తయారీ కేంద్రంలో ఈ టీకాను పరీక్షించి, విశ్లేషించి, తయారు చేస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందుకు సీరంకు ప్రాథమిక అనుమతినిచ్చామనీ, తయారీకి కొన్ని నెలలు పడుతుందని వెల్లడించింది. అయితే ఈ టీకాలను విక్రయించుకునేందుకు సీరం అనుమతి లేదని వెల్లడించాయి. దేశీయంగా అదర్ పూనావాలా నేతృత్వంలోని సీరం ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా టీకా కోవీషీల్డ్‌ను తయారు చేస్తోంది. వ్యాక్సిన్ తయారీకి రష్యాలోని మాస్కోలో ఉన్న గమాలియా పరిశోధనా సంస్థ, సీరంతో జత కట్టింది. దీనికి సంబంధించిన పత్రాలను ఆ కంపెనీ ఇటీవల డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. వ్యాక్సిన్ తయారీకి డీసీజీఐ అనుమతి ఇవ్వడంతో జెనెటిక్ మానిపులేషన్ రివ్యూ కమిటీ (ఆర్సీజీఎం) సీరమ్‌కు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. సెల్ బ్యాంక్‌ను దిగుమతి చేసుకోవడం, వైరస్ స్టాక్ వివరాలను ఎలా సేకరించి భద్రపరుస్తారన్న విషయం ఆర్సీజీఎంకు తెలపాలి. అయితే ఈ అనుమతుల కోసం సీరమ్ గత నెల 18నే ఆర్సీజీఎమ్కు దరఖాస్తు పెట్టుకుంది. కాగా భారతదేశంలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లతో పోలిస్తే స్పుత్నిక్ వీ టీకా 91.6 శాతం సామర్థ్యం ఉందని గమాలియా ఇదివరకే ప్రకటించింది. చదవండి: vaccine: మినహాయింపులపై సీరం కీలక వ్యాఖ్యలు -
కరోనా: మరో గుడ్ న్యూస్ చెప్పిన డా.రెడ్డీస్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి చికిత్సలో డీఆర్డీవో రూపొందించిన కీలక డ్రగ్‌ను ఇటీవల విడుదల చేసిన దేశీయ ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ మరో శుభవార్త అందించింది. రష్యాకు చెందిన సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ లైట్ టీకాను దేశంలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ ప్రతినిధి రాయిటర్స్‌కు తెలిపారు. గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన ఈ సింగిల్-డోస్ వ్యాక్సిన్‌ను రష్యా ఇప్పటికే ఆమోదించింది. అనేక దేశాలలోదీని ట్రయల్స్ కొన సాగుతున్నాయి. స్పుత్నిక్ లైట్ టీకాను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు రష్యా తయారీదారు, దాని భారతీయ భాగస్వామ్య కంపెనీలతో సహా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని నియంత్రణ సంస్థ అధికారులను ఇటీవల ఆదేశించింది. అనుకున్నట్టుగా అనుమతులు మంజూరైతే, దేశంలో అందుబాటులోకి రానున్న తొలి సింగిల్ డోస్ టీకా స్పుత్నిక్-వీ లైట్ కానున్నది. ఈ నేపథ్యంలో రెగ్యులేటరీ ఆమోదం కోరుతూ వచ్చే రెండు వారాల్లో కంపెనీ దరఖాస్తు చేయనుంది. స్పుత్నిక్ వ్యాక్సిన్ వెబ్సైట్ ప్రకారం సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ టీకా 79.4 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించింది. కాగా రష్యన్ స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ అత్యవసర ఉపయోగానికి సంబంధించి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీజఐ) నుండి అనుమతి పొందిన మూడవ టీకాగా నిలిచిన సంగతి తెలిసిందే. డాక్టర్ రెడ్డి లాబ్స్ ఈ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుంటోంది. దీంతో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ టీకాను వినియోగిస్తున్నారు. అలాగే వచ్చే నెల మధ్యలో దేశంలో వాణిజ్యపరంగా ప్రారంభించాలని భావిస్తున్న ఈ రెండు డోసుల స్పుత్నిక్- వీ వ్యాక్సిన్ సరఫరా కోసం కూడా రెడ్డీస్ అటు కేంద్రం, ఇటు ప్రైవేటు రంగాలతో చర్చిస్తోంది. చదవండి: కరోనా మూలాలు కనుక్కోండి: లేదంటే మరిన్ని మహమ్మారులు బుల్ రన్: రాందేవ్ అగర్వాల్ సంచలన అంచనాలు వ్యాక్సిన్: మందుబాబులకు పరేషాన్! -
స్పుత్నిక్–వి పంపిణీ హక్కులు ఎవరికీ ఇవ్వలేదు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్పుత్నిక్–వి వ్యాక్సిన్ బ్రాండ్ సంరక్షణ బాధ్యత తమ సంస్థకే ఉందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ స్పష్టం చేసింది. పంపిణీ హక్కులు ఏ కంపెనీకి అప్పగించలేదని శుక్రవారం వెల్లడించింది. తొలి 25 కోట్ల డోసుల పంపిణీ బాధ్యత తమదేనని తెలిపింది. ఈ మేరకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తో (ఆర్డీఐఎఫ్) కలిసి డాక్టర్ రెడ్డీస్ సంయుక్త ప్రకటన వెలువరించింది. ‘జూన్ మధ్యలో స్పుత్నిక్–వి వ్యాక్సిన్ వాణిజ్యపరమైన విడుదల నేపథ్యంలో భాగస్వామ్యం కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో నేరుగా చర్చిస్తున్నాం. వ్యాక్సిన్ కోసం పలు కంపెనీలు, థర్డ్ పార్టీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టుగా ఆధారాలు లేని నివేదికలు, వాదనలు కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. నివాస సంఘాలకు వ్యాక్సిన్ సరఫరాకు ఏ కంపెనీతో మేము భాగస్వామ్యం కుదుర్చుకోలేదు. మా తరఫున వ్యాక్సిన్ సరఫరాకు ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదు. అనధికార వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. కంపెనీ ప్రతినిధులమంటూ ఎవరైనా సంప్రదిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి. స్పుత్నిక్–వి పేరుతో మోసాలకు పాల్పడే వ్యక్తులపట్ల చట్టపరమైన చర్యలు తీసు కుంటున్నాం. అనధికార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు, నకిలీ ఉత్పత్తులకు కంపెనీ బాధ్యత వహించదు’ అని డాక్టర్ రెడ్డీస్ స్పష్టం చేసింది. -
వ్యాక్సిన్ సరఫరాకు స్పుత్నిక్-వి అంగీకారం: కేజ్రీవాల్
ఢిల్లీ: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం పావులు కదుపుతుంది. ఇందులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను ఢిల్లీకి సరఫరా చేసేందుకు తయారీదారులు అంగీకరించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తెలిపారు. అయితే ఎంత మొత్తంలో రాష్ట్రానికి వ్యాక్సిన్ సరఫరా చేస్తారనేదానిపై క్లారిటీ లేదని ఆయన తెలిపారు. కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. '' స్పుత్నిక్-వి తయారీదారులతో ఇప్పటికే చర్చలు జరిపాం. వారు వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు అంగీకరించారు. అయితే ఎంత మొత్తం ఇస్తారనేదానిపై స్పష్టత రాలేదు. మంగళవారం కూడా మరోసారి తయారీదారులతో మా అధికారులు చర్చలు జరిపారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చుసి తమ రాష్ట్ర ప్రజలకు అందించవచ్చిన కేంద్రం తెలిపింది. వ్యాక్సిన్ సరఫరాపై అనేక రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించినా ఒక్క తయారీ సంస్థ కూడా ముందుకు రావడం లేదు. కానీ ఈ విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది. ఇప్పటివరకు ఒక్క రాష్ట్రానికి కూడా వ్యాక్సిన్ డోస్‌ను అందించలేదు. ప్రస్తుతం వ్యాక్సిన్ అవసరాన్ని కేంద్రం గుర్తించాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఇక లాక్‌డౌన్‌ను నిరవధికంగా కొనసాగించే ఆలోచన లేదు. అలా చేయడం వల్ల ఆర్ధిక, వ్యాపార కార్యకలపాలు దెబ్బతింటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెలాఖరున లాక్‌డౌన్‌పై ఒక నిర్ణయం తీసుకుంటాం.'' అని తెలిపారు ఇక దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ సత్ఫలితాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగో రోజు రెండువేల కన్నా తక్కువ కేసులే నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1491 మంది కరోనా బారీన పడగా.. 130 మంది కరోనాతో మృతి చెందారు. కాగా కరోనా పాజిటివిటీ రేటు రెండు నెలల కనిష్టానికి పడిపోయి 1.93 శాతంగా నమోదైంది. అయితే ప్రస్తుతం ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం రేపుతున్నాయి. మే 23న 200లకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. మే 24, 25న 100 కంటే తక్కువ కేసులు నమోదవగా.. తాజాగా బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారి సంఖ్య 600కు చేరినట్లు సమాచారం. చదవండి: ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కేసుల కలకలం -
భారత్‌లో స్పుత్నిక్ టీకా తయారీ మొదలు
న్యూఢిల్లీ: రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్), భారత ఔషధ దిగ్గజం పనాసియా బయోటెక్‌లు స్పుత్నిక్–వి కోవిడ్ వ్యాక్సిన్ తయారీని భారత్‌లో ప్రారంభించాయి. ఈ మేరకు రెండు సంస్థలు సంయుక్తంగా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని బద్ది వద్ద ఉన్న పనాసియా బయోటెక్ తయారీకేంద్రం వద్ద వ్యాక్సిన్‌ను ఉత్పత్తిని మొదలుపెట్టినట్లు తెలిపాయి. వ్యాక్సిన్ తయారు చేశాక నాణ్యతను పరీక్షించేందుకు రష్యాలోని గమాలియా సెంటర్‌కు పంపిస్తామని తెలిపాయి. ఏడాదికి 10 కోట్ల స్పుత్నిక్ వ్యాక్సిన్ డోసులను తయారు చేసేందుకు ఆర్డీఐఎఫ్, పనాసియాల మధ్య ఏప్రిల్‌లోనే ఒప్పందం కుదిరినట్లు తెలిపింది. భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించి వైరస్‌ను రూపుమాపడమే తమ లక్ష్యమని ఆర్డీఐఎఫ్ చీఫ్ క్రిమిల్ దిమిత్రివ్ చెప్పారు. భారత్‌లో స్పుత్నిక్ అత్యవసర వినియోగానికి గత నెలలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: కేరళ మంత్రుల్లో 60% మందిపై క్రిమినల్ కేసులు..13 మంది కోటీశ్వరులే ) -
Corona virus: వేర్వేరు టీకాలు ఇవ్వొచ్చా!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ను రెండు డోసుల్లో... రెండు వేర్వేరు సంస్థలకు చెందిన టీకాలు అదించొచ్చా అనే అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన కోవిడ్–19 బృందం (వర్కింగ్ గ్రూపు) అధ్యయనం చేయనుంది. త్వరలోనే దేశంలోకి కొత్త వ్యాక్సిన్లు వస్తున్న నేపథ్యంలో వేర్వేరు టీకాలపై దేశంలో అధ్యయనం చేయనున్నట్లు వర్కింగ్ గ్రూపు హెడ్ ఎన్కే అరోరా తెలిపారు. ఇప్పటికే దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు అందిస్తుండగా త్వరలోనే స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో రెండు డోసుల్లో రెండు వేర్వేరు టీకాలు అందిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో నిర్ధారణ కోసమే అధ్యయనం చేస్తున్నట్లు అరోరా పేర్కొన్నారు. జులై నాటికి స్పుత్నిక్ లభ్యత దేశంలో పెరగనుందని, అప్పటి నుంచి జాతీయ టీకాల కార్యక్రమంలో చేర్చుతామని తెలిపారు. (చదవండి: NGO: శ్మశానాల్లో అధిక వసూళ్లా?) -
Photo Feature: ‘పరీక్ష’ కాలం.. తుపాను కల్లోలం
కోవిడ్ విజృంభణ నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. మరోవైపు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వి వ్యాక్సిన్ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. కరోనా కష్టాలతో విలవిల్లాడుతున్న ప్రజలను ‘టౌటే’ పెను తుపాను వణికించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ విధ్వంసం సృష్టించింది. -
హైదరాబాద్‌లో స్పుత్నిక్ టీకాలు షురూ!
బంజారాహిల్స్: రష్యా తయారీ స్పుత్నిక్–వి టీకాల కార్యక్రమం హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో తొలిడోసును డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఫార్మా సంస్థకు చెందిన ఒక ఉద్యోగికి వేశారు. మన దేశంలో ప్రస్తు తం స్పుత్నిక్ టీకాలను రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఆ సంస్థతో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ భాగస్వా మ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం రెడ్డీస్ ల్యాబ్స్ దిగుమతి చేసుకున్న మొదటి బ్యాచ్ 1.50 లక్షల స్పుత్నిక్ డోసులను వేయనున్నామని, నెల రోజుల వ్యవధిలో మొత్తంగా 10 లక్షల డోసులు రానున్నా యని అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి వెల్లడించారు. తమ నెట్వర్క్ వ్యాప్తం గా టీకా కేంద్రాలను తెరిచి, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అపోలో హాస్పిటల్స్, అపోలో క్లినిక్స్ సహా 60కిపైగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆస్పత్రి ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ డివిజన్ అధ్యక్షుడు కె.హరిప్రసాద్ తెలిపారు. రెడ్డీస్ ల్యాబ్స్ బ్రాండెడ్ మార్కెట్స్ సీఈవో ఎంవీ రమణ మాట్లాడుతూ.. తొలి బ్యాచ్ టీకాను హైదరాబాద్, విశాఖలో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని, త్వరలోఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతాలో మొదలుపెడతామని వెల్లడించారు. -
నేటి నుంచి స్పుత్నిక్ - వి వ్యాక్సినేషన్
-
కరోనా వ్యాక్సిన్: రాష్ట్రానికి 60 వేల స్పుత్నిక్–వి డోసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటివరకు కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.. అత్యవసర కేటగిరీలో స్పుత్నిక్–వి వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనుంది. ఇప్పటికే ఈ మేరకు కేంద్రం ఆమోదం తెలిపింది. తాజాగా ఆదివారం ప్రత్యేక విమానంలో రెండో విడతగా 60 వేల టీకా డోసులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. తొలి విడతగా 1.5 లక్షల డోసుల స్పుత్నిక్–వి టీకాను ఈ నెల 1న ఇక్కడికి వచ్చాయి. వాటిని పంపిణీ చేసేందుకు హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలీలో ఉన్న సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీ ఈ నెల 13న అనుమతిచ్చింది. దీంతో టీకాల పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ రెడ్డీస్ సంస్థ చేపట్టింది. కాగా, భారత్‌లో ఈ టీకా తయారీ ని దశల వారీగా ఏడాదికి 850 మిలియన్ డోసులకు పెంచేందుకు సన్నాహాలు జరుగుతు న్నాయి. త్వరలో సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేం దుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. భారత్‌లో స్పుత్నిక్–వి తయారీ, పంపిణీకి ‘రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్’తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. డాక్టర్ రెడ్డీస్ కస్టమ్ ఫార్మా సర్వీసెస్ వ్యాపార విభా గానికి అధిపతి దీపక్ సప్రా తొలి స్పుత్నిక్–వి డోసు తీసుకున్నారు. -
కరోనా వ్యాక్సిన్: స్పుత్నిక్–వి భేష్.. సామర్థ్యం ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో కరోనాను ఎదుర్కొనేందుకు భారత్‌లో ఇంకో టీకా అందుబాటులోకి వచ్చేసింది. రష్యాలోని గమలేయా సంస్థ అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వి వ్యాక్సిన్ ఇకపై భారత్‌లోనూ తయారుకానుంది. ప్రస్తుతానికి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న టీకాలనే భారత్‌లో వినియోగిస్తున్నాం. కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లతో పోలిస్తే స్పుత్నిక్–వి కొంచెం భిన్నమైన టీకా. నిర్వీర్యం చేసిన కరోనా వైరస్‌తో కోవాగ్జిన్ టీకా తయారైతే.. కోవిషీల్డ్‌లో కరోనా వైరస్ కొమ్ములను పోలిన వాటిని వినియోగించారు. ఈ రెండు పద్ధతుల కంటే భిన్నంగా స్పుత్నిక్–వి తయారైంది. రెండు డోసుల ఈ టీకాలో రెండు వేర్వేరు అడినోవైరస్‌లను ఉపయోగించారు. సాధారణ జలుబుకు కారణమైన ఏడీ26, ఏడీ5 వైరస్‌లతో రెండు డోసులు సిద్ధమవుతాయి. తొలిడోసులో ఏడీ26 వైరస్ ఉంటే.. రెండో డోసులో ఏడీ5 వైరస్ ఉంటుంది. ఈ మిశ్రమం వల్ల శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తి మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కోవాగ్జిన్ విషయంలో రెండు డోసుల మధ్య అంతరం 4 నుంచి 6 వారాలైతే.. కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి 12 నుంచి 16 వారాలు. బ్రిటన్‌లో 8 వారాల గడువు తర్వాతే రెండో డోస్ ఇస్తున్నారు. స్పుత్నిక్–వి విషయానికి వచ్చేసరికి మూడు వారాల వ్యవధిలోనే రెండో డోసు ఇచ్చేయొచ్చని చెబుతున్నారు. కోవాగ్జిన్ టీకా సామర్థ్యం 83 శాతం ఉంటే.. కోవిషీల్డ్ సామర్థ్యం 70 నుంచి 90 శాతమని అందుబాటులో ఉన్న గణాంకాలు చెబుతున్నాయి. స్పుత్నిక్–వి సామర్థ్యం 91.6 శాతం అని తయారీదారులు స్పష్టం చేస్తున్నారు. దుష్ప్రభావాలు ఉంటాయా? కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచంలో తొలిసారిగా తయారైన వ్యాక్సిన్‌గా స్పుత్నిక్–వి రికార్డు సృష్టించింది. గతేడాది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుమార్తెలు ఇద్దరూ ఈ వ్యాక్సిన్ తీసుకున్నారని, వారికి తేలికపాటి జ్వరం తప్ప ఎలాంటి దుష్ప్రభావాలు కన్పించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇది అందరికీ వర్తిస్తుందని కచ్చితంగా చెప్పలేం. మానవ ప్రయోగాల సందర్భంగా నమోదు చేసిన వివరాల ప్రకారం స్పుత్నిక్–వి తీసుకున్న వారిలో కొందరికి తలనొప్పి, నిస్సత్తువ, జలుబు టీకా తీసుకున్న ప్రాంతంలో నొప్పి లాంటి లక్షణాలు కన్పించాయి. అయితే ఇవన్నీ కొంత కాలంలోనే సర్దుకున్నాయని తెలుస్తోంది. ఇంతకు మించిన తీవ్రమైన దుష్ప్రభావాలేవీ ఇప్పటివరకు నమోదు కాలేదు. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 557 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం 29% క్షీణించి రూ. 557 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ.781 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 4,336 కోట్ల నుంచి రూ. 4,608 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నికర లా భం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) రూ. 2,026 కోట్ల నుంచి రూ. 1,952 కోట్లకు తగ్గింది. అయితే, నికర అమ్మకాలు మాత్రం రూ. 16,357 కోట్ల నుంచి రూ. 18,420 కోట్లకు పెరిగాయి. 2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 25 మేర తుది డివిడెండ్ ఇవ్వాలని బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. కొత్త ఉత్పత్తులపై మరింత దృష్టి.. ఉత్పాదకతను పెంచుకోవడం, కొంగొత్త ఉత్పత్తుల ఆవిష్కరణపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ కో–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. కోవిడ్–19కి సంబంధించి స్పుత్నిక్–వి టీకాను దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని, అలాగే కోవిడ్–19 చికిత్సలో తోడ్పడే పలు ఔషధాలను అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమెరికా అవినీతి నిరోధక చట్టాలకు విరుద్ధంగా పలు దేశాల్లో తమ కంపెనీ తరఫున హెల్త్‌కేర్ నిపుణులకు చెల్లింపులు జరిపినట్లు వచ్చిన ఆరోపణల మీద స్వయంగా విచారణ చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. ఇదే విషయాన్ని అటు అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్‌కి, న్యాయ శాఖకు, ఇటు సెబీకి తెలిపింది. గ్లోబల్ జనరిక్స్ 6 శాతం అప్.. క్యూ4లో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 3,639 కోట్ల నుంచి రూ. 3,873 కోట్లకు చేరింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఔషధాల ధరల తగ్గుదల కారణంగా ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 1,750 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో ఉత్తర అమెరికా మార్కెట్లో డీఆర్ఎల్ 6 కొత్త ఔషధాలు ప్రవేశపెట్టింది. మరోవైపు, యూరప్ మార్కెట్లో ఆదాయాలు 15 శాతం పెరగ్గా, భారత్‌లో 23 శాతం పెరిగాయి. అటు వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 10 శాతం వృద్ధి చెందింది. ఇక ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు క్యూ4లో వార్షికంగా 10 శాతం వృద్ధితో రూ. 790 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ షేరు 2% క్షీణించి రూ. 5,196 వద్ద ముగిసింది. -
మరో గుడ్‌న్యూస్: త్వరలోనే సింగిల్ డోస్ వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ శుక్రవారం లాంచ్ చేసింది. త్వరలోనే ఇది మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో తొలిడోస్‌ను హైదరాబాద్‌లో వేసింది కూడా. ఈ క్రమంలో మరో గుడ్ న్యూస్‌ను ఫార్మా దిగ్గజం వెల్లడించింది. కరోనా నివారణలో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) స్పుత్నిక్-వీ సింగిల్-డోస్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వీ లైట్’ను త్వరలో భారత్‌కు తీసుకురావాలని యోచిస్తోంది. ఈ సందర్భంగా వర్చువల్ సమావేశంలో ఆర్డీఐఎఫ్ సీఈఓ కిరిల్ డిమిత్రోవ్ మాట్లాడుతూ, త్వరలోనే భారతదేశంలో స్పుత్నిక్-వీ లైట్‌ను కూడా లాంచ్ చేయాలని భావిస్తున్నామన్నారు. అదే జరిగితే సింగిల్ డోస్ స్పుత్నిక్-వీ లైట్ దేశంలో విడుదలైన తొలి టీకా అవుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా, జాన్సన్ అండ్ జాన్సన్ మాత్రమే సింగిల్-మోతాదు వ్యాక్సిన్ తీసుకొచ్చింది. స్థానిక సరఫరా ప్రారంభమైనప్పుడు టీకా ధర తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది దేశంలో 850 మిలియన్లకు పైగా టీకాలను ఉత్పత్తి చేయాలని రష్యా భావిస్తోందని డిమిత్రోవ్ చెప్పారు. (సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ వచ్చేసింది: రష్యా) మరోవైపు దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న సమయంలో భారతీయులు ఆరోగ్యంగాసురక్షితంగా ఉండేలా దేశీయ టీకా డ్రైవ్‌కు తోడ్పడటం తమ అతిపెద్ద ప్రాధాన్యత అని సంస్థ కో-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ వెల్లడించారు.అత్యంత ప్రభావవంతమైన ఈ టీకా తయారీని త్వరలోనే దేశంలో మొదలవుతుందన్నారు. 91.6 శాతం ప్రభావవంతమైన ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెండింటి కంటే ఎక్కువ సమర్థత రేటు దీని సొంతమని తెలిపారు. డబుల్ డోస్ స్పుత్నిక్-వీ ని భారత మార్కెట్లో విడుదల చేసిది. టీకా ధర మోతాదుకు రూ .995.(రూ .948 + 5శాతం జీఎస్టీ)గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. చదవండి: కోవిడ్ మరణాల లెక్కలు: ఐహెచ్ఎంఈ షాకింగ్ స్టడీ దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ ధర ఎంతంటే? -
ఊరట: స్పుత్నిక్-వీ తొలి డోస్ హైదరాబాద్‌లోనే
సాక్షి, హైదరాబాద్: దేశంలో రెండో దశలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో ఊరటనిచ్చే సమాచారం స్పుత్నిక్-వీ టీకా స్వీకరణ షురూ కావడం. రెండు వారాల క్రితమే మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చినా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి మాత్రం రాలేదు. మరో వారంలో దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మొట్టమొదటి డోసు హైదరాబాద్‌లోనే వేయడం శుభపరిణామం. స్పుత్నిక్-వీ టీకాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ ప్రారంభమైందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించింది. ఈ టీకా ఒక్కో డోసు ఖరీదు (జీఎస్టీతో కలిపి) రూ.995 గా నిర్ణయించింది. ఈ సమాచారాన్ని డా.రెడ్డీస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మే 1నే మన దేశంలోకి స్పుత్నిక్-వీ ఫస్ట్ కన్సైన్మెంట్లు వచ్చినా, మే 13న భారతదేశ సెంట్రల్ డ్రగ్ లేబొరేటరీ రెగ్యులేటరీ క్లియరెన్స్ అనుమతి లభించింది. దేశంలోని మరో ఆరు వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో కలిసి టీకా పంపిణీ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ఈ సందర్భంగా వెల్లడించింది. చదవండి : దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ ధర ఎంతంటే? -
భారత్ లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ధర నిర్ణయం
-
దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ ధర ఎంతంటే?
సాక్షి, న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో దేశంలో అందుబాటులోకి రానున్న రష్యా స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ ధర రూ.995.40గా ఉండనుంది. రష్యానుంచి దిగుమతి చేసుకునే ఈ వ్యాక్సిన్ ధరను డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ శుక్రవారం వెల్లడించింది. దిగుమతి చేసుకున్న మోతాదుల ధరలో మోతాదుకు ఐదు శాతం జీఎస్టీ ఉంటుంది. భారతదేశంలో తయారైతే ఈ టీకా ధర ఇంకా కొంచెం చౌకగా అందుబాటులోకి వస్తుందని డా.రెడ్డీస్ తెలిపింది. వచ్చే వారం నుంచి స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ మార్కెట్లో లభించే అవకాశం ఉందని కేంద్రం గురువారం తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో సీరం ఉత్పత్తి చేస్తున్న ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాలు లభిస్తున్నాయి. వాక్సిన్ కొరత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో రష్యా వాక్సిన్ రాకతో ఆ కొరత తీరే అవకాశం ఉందని భావిస్తున్నారు. 91.6 శాతం సామర్థ్యం కలిగిన స్పుత్నిక్-వీ భారతదేశంలో ఉపయోగం కోసం ఆమోదించబడిన మూడవ టీకా అయిన సంగతి తెలిసిందే. Imported doses of Sputnik V #COVID19 vaccine are presently priced at Rs 948 + 5% GST per dose, with the possibility of a lower price point when local supply begins: Dr. Reddy’s Laboratories pic.twitter.com/bEowM6ZhZY — ANI (@ANI) May 14, 2021 చదవండి : కోవీషీల్డ్ డోసుల గ్యాప్: పూనావాలా స్పందన గుడ్ న్యూస్: స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి కోవిడ్ ఫండ్: క్రిప్టో కరెన్సీ బిలియనీర్ భారీ విరాళం -
స్పుత్నిక్-వీ మరో వారంలో దేశీయ మార్కెట్లోకి
-
గుడ్ న్యూస్: స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న సమయంలో కేంద్రం శుభవార్త చెప్పింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ టీకా త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ వ్యాక్సిన్ భారతదేశానికి చేరుకోనుందని వచ్చే వారం నాటికి మార్కెట్లో లభించే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ విలేకరుల సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకేపాల్ ఈ ప్రకటన చేశారు. ప్రపంచంలోని మొట్టమొదటి వ్యాక్సిన్‌గా భావిస్తున్న స్పుత్నిక్-వీ టీకా స్థానిక ఉత్పత్తి జూలైలో ప్రారంభమవుతుందన్నారు. దాదాపు 15.6 కోట్ల మోతాదులను తయారు చేయవచ్చని అంచనా వేస్తున్నామని తెలిపారు. రష్యాకు చెందిన గమలేయ నేషనల్ సెంటర్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ టీకాను హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ తయారు చేయనుంది. ఎఫ్‌డిఎ, డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన ఏ కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు అయినా భారత్‌లో అనుమతి ఉంటుందని ఒకటి రెండు రోజుల్లో స్పుత్నిక్-వీ టీకాకు దిగుమతి లైసెన్స్ మంజూరు కానుందని పాల్ తెలిపారు దీంతో కోవాగ్జిన్, కోవ్‌షీల్డ్, స్పుత్నిక్-వీ ఈ మూడు వ్యాక్సిన్లకు మాత్రమే దేశంలో విక్రయానికి అనుమతి ఉందని ఆయన తెలిపారు. దేశంలో రెండో దశలో కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయనుంది. చదవండి : కరోనా: సీనియర్ వైద్యుల మూకుమ్మడి రాజీనామా రెండు రోజులుగా ఆకలితో.. అమ్మ, సోదరుడి శవాల పక్కనే -
‘స్పుత్నిక్ లైట్’కు రష్యా అనుమతి
మాస్కో: కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రయోగించడానికి ప్రపంచంలో అధికారికంగా రిజిస్టరయిన మొట్టమొదటి వ్యాక్సిన్ స్పుత్నిక్–వి. దీన్ని రష్యా అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌లోని తొలి కాంపోనెంట్(ఆర్ఏడీ26) స్పుత్నిక్ లైట్. ఈ టీకా ఒక్క డోసు కరోనా వైరస్‌పై 79.4% సమర్థంగా పని చేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. అంటే దాదాపు 80%. ఇతర టీకాల రెండు డోసులు చూపుతున్న ప్రభావం కంటే ఇదే అధికమని సైంటిస్టులు తేల్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలురకాల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవయితే రెండు డోసులు తీసుకోవాలి. స్పుత్నిక్ లైట్ టీకా ఒక్క డోసు చాలని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే స్పుత్నిక్ లైట్ సింగిల్ డోసు వ్యాక్సినేషన్‌కు రష్యా ప్రభుత్వం తాజాగా అనుమతి మంజూరు చేసింది. కరోనా కొత్త రకాలకు(వేరియంట్లు) వ్యతిరేకంగా ఈ టీకా చక్కగా పని చేస్తున్నట్లు గుర్తించారు. స్పుత్నిక్ లైట్ సింగిల్ డోసు తీసుకున్న తర్వాత 28 రోజులకు 91.67 శాతం మంది శరీరంలో యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లు తేల్చారు. ఈ టీకా డోసు తీసుకున్నవారిలో తీవ్ర దుష్పరిణామాలేవీ ఉత్పన్నం కాలేదు. -
సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ వచ్చేసింది: రష్యా
సాక్షి, న్యూఢిల్లీ: రెండో దశలో కరోనా మహమ్మారి శరవేగంతో విస్తరిస్తున్న తరుణంలో రష్యా మరో వ్యాక్సిన్ తీసుకొచ్చినట్టు ప్రకటించింది. కరోనా నివారణకు సంబంధిం సింగిల్ డోస్ స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను ఆమోదించినట్టు వెల్లడించింది. స్పుత్నిక్ ఫ్యామిలీకే చెందిన ఈ సింగిల్-డోస్ ‘స్పుత్నిక్ లైట్’ విప్లవాత్మకమైందని, 80 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని రష్యా అధికారులు తెలిపారు. రెండు మోతాదుల వ్యాక్సిన్ల కంటే స్పుత్నిక్ లైట్ టీకా చాలా ప్రభావవంతమైందని ప్రకటించారు. రష్యా గమలేయ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ 79.4 శాతం ప్రభావవంతంగా ఉందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్) తాజాగా ప్రకటించింది. స్పుత్నిక్ లైట్ మోతాదుకు10 డాలర్ల కంటే తక్కువ ఖర్చు అవుతుందనీ ఒక ప్రకటనలో తెలిపింది. సామూహిక టీకా కార్యక్రమంలో భాగంగా సింగిల్-డోస్ స్పుత్నిక్ లైట్ టీకా 5 డిసెంబర్ 2020 15 ఏప్రిల్ 2021 మధ్య పరీక్షించామని ఆర్డిఐఎఫ్ వెల్లడించింది. ఇంజెక్షన్ ఇచ్చిన తరువాత 28 రోజుల డేటా ప్రకారం ఇది 79.4 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించిందని అధికారికంగా తెలిపింది. చదవండి: సీటీ స్కాన్: ఎయిమ్స్ డైరెక్టర్ వాదలను ఖండించిన ఐఆర్‌ఐఏ Introducing a new member of the Sputnik family - a single dose Sputnik Light! It’s a revolutionary 1-shot COVID-19 vaccine with the 80% efficacy - higher than many 2-shot vaccines. Sputnik Light will double vaccination rates and help to handle epidemic peaks ✌️ pic.twitter.com/BCybe8yYWU — Sputnik V (@sputnikvaccine) May 6, 2021 -
మాస్కో నుంచి హైదరాబాద్ చేరుకున్న స్పుత్నిక్ వ్యాక్సిన్
-
వచ్చేసిందోచ్: హైదరాబాద్ చేరిన స్పుత్నిక్ వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: రష్యా దేశానికి చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు తెలంగాణకు చేరుకున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయానికి శనివారం సాయంత్రం వ్యాక్సిన్ కంటైనర్లు వచ్చాయి. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్ఏసీ)కు రష్యా తయారుచేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ల మొదటి ప్రధాన కన్సైన్మెంట్ చేరుకుంది. కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో ఒక పెద్ద మైలురాయి. ఈ వ్యాక్సిన్ సరుకును ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్ ఫ్రైటర్ విమానంలో దిగుమతి చేసుకుంది. ఈ విమానం సాయంత్రం 4.05 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగింది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారీ ప్రదేశంగా హైదరాబాద్‌కున్న ప్రత్యేక స్థానం దృష్ట్యా, వ్యాక్సిన్ల సంఖ్యలో పెరుగుదలకు అనుగుణంగా జీహెచ్ఏసీ అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది. కొన్నేళ్లల్లో ఈ ప్రాంతం నుంచి 3.5 బిలియన్ల వివిధ రకాల కరోనా వ్యాక్సిన్ల మోతాదులు ఉత్పత్తి అవుతాయని అంచనా. హైదరాబాద్ విమానాశ్రయంలో చేరిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ప్రత్యేకమైన నిర్వహణ అవసరం. వీటిని మైనస్ 20 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం జీహెచ్ఏసీ- డాక్టర్ రెడ్డీస్ సప్లై చైన్ బృందం, కస్టమ్స్ విభాగం, ఎయిర్ కార్గోకు చెందిన నిపుణులతో కలిసి పని చేస్తోంది. స్పుత్నిక్ వి కన్సైన్మెంట్ను సజావుగా నిర్వహించడానికి హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్ వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. మొత్తం 7.5 టన్నుల వ్యాక్సిన్ తెలంగాణకు చేరుకుంది. మొత్తం లక్షా 50 వేల డోసుల వ్యాక్సిన్ హైదరాబాద్ చేరింది. చదవండి: ‘భారత్ కోలుకో’: నయాగారా జలపాతం త్రివర్ణశోభితం చదవండి: సంతలో లస్సీ ప్రాణం మీదకు వచ్చింది.. The first consignment of Russian COVID-19 vaccine #SputnikV arrived in Hyderabad. #IndiaFightsBack pic.twitter.com/rIRbl0d0cf — N Ramchander Rao (@N_RamchanderRao) May 1, 2021 -
మే 1 నుంచి స్పుత్నిక్- వి: మీకు ఈ విషయాలు తెలుసా?
న్యూఢిల్లీ: మరో మూడు రోజుల్లో రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ - వి భారత్‌కు రానుంది. వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు రెడ్డీస్ ల్యాబ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో స్పుత్నిక్- వికి సంబంధించిన వివరాలు.. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ 'స్పుత్నిక్' ను ప్రయోగించింది. అందుకు గుర్తుగా రష్యన్ గవర్నమెంట్ కరోనా వైరస్ వ్యాక్సిన్ కు స్పుత్నిక్ - వి అని నామకరణం చేసింది. దీన్ని అత్యంత ప్రమాదకరమైన ఎబోలా, మెర్స్ వైరస్ లను అరికట్టే వ్యాక్సిన్లను తయారు చేసిన రష్యాకు చెందిన గమలేయా నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది. స్పుత్నిక్- వి వినియోగానికి కేంద్రం అనుమతి వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థ గమలేయా నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ ట్రయల్స్ లో మిగిలిన కరోనా వ్యాక్సిన్ల తరహాలో స్పుత్నిక్ - వి 91.6 శాతం వైరస్ ను అడ్డుకుంటుందని రష్యా ఆరోగ్యశాఖ ప్రకటించింది. అంతేకాదు ఇప్పటికే 3.8 మిలియన్ల మంది ఈ వ్యాక్సిన్ వేయించుకున్నారని, 97.6 శాతం కరోనా వ్యాప్తిని అడ్డుకుంటున్నట్లు తేలిందని చెప్పింది. ఈ ప్రకటన తరువాత రెండు నెలలకే అంటే ఏప్రిల్ 12న స్పుత్నిక్ - వి వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జర్నల్ ఆఫ ఇండియా (డీసీజీఐ) అనుమతులు జారీచేసింది. రెండు డోసులు ఒకేలా ఉండవా? స్పుత్నిక్ - వి అనేది ఆస్ట్రాజెనెకా టీకా తరహాలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి షిఫ్ట్ చేసుకోవచ్చు. కానీ ఇతర కరోనా వ్యాక్సిన్ల తరహా కాకుండా స్పుత్నిక్ -వి విభిన్నం. ఇతర సంస్థలకు చెందిన వ్యాక్సిన్ల రెండు డోసుల మోతాదులు ఒకే విధంగా ఉంటాయి. కానీ స్పుత్నిక్ - వి టీకా మోతాదులు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. అందులో ఒక టీకా డోసు కరోనా వైరస్ కు కారణమయ్యే సార్స్ కోవిడ్ -2 యొక్క స్పైక్ ప్రొటీన్ ను అడ్డుకుంటే, రెండో టీకా డోసు వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుంది. స్పుత్నిక్ - వి ధర ఎంత ? ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన వ్యాక్సిన్ల ధర కంటే స్పుత్నిక్ - వి ధర కాస్త ఎక్కువనే చెప్పుకోవాలి. స్పుత్నిక్ -వి కి పోటీగా ఉన్న ఆస్ట్రాజెనెకా ఒక్కడోస్ ఖరీదు 4డాలర్లుగా ఉంది. స్పుత్నిక్ -వి ధర 10డాలర్లుగా ఉంది. అయితే భారత్ లో మాత్రం వ్యాక్సిన్ ధర పది డాలర్ల కన్నా తక్కువగానే ఉటుందని ఇప్పటికే రష్యా సూచించింది. 60కి పైగా దేశాలకు స్పుత్నిక్ - వి పంపిణీ ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో రష్యా తయారు చేసిన స్పుత్నిక్ - వి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఇప్పటికే స్పుత్నిక్- వి తయారీకి నిధుల్ని సమకూర్చిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (RDIF) మనదేశానికి చెందిన 5 సంస్థలతో 850 మిలియన్ లేదా 85 కోట్ల మోతాదుల వ్యాక్సిన్ తయారీకి ఒప్పందాలు కుదుర్చుకుంది. స్పుత్నిక్- వి పనితీరుపై అనుమానాలా? స్పుత్నిక్- వి క్లినికల్ ట్రయల్స్‌పై అనేక అనుమానాలు నెలకొన్నాయి. గతేడాది ఆగస్ట్ 10 న రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ముగిసిన వెంటనే ఈ వ్యాక్సిన్ వినియోగానికి రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసింది. వాస్తవానికి క్లినికల్ ట్రయల్స్ మూడు దశల్లో జరుగుతాయి. మొదటి దశలో వ్యాక్సిన్ సురక్షితమా? కాదా? ఒకవేళ వ్యాక్సిన్ వినియోగిస్తే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయనేది చెక్ చేస్తారు. ఇక రెండో దశలో ఎంత మోతాదులో ఇవ్వాలి. మూడో దశలో ఎంతమేరకు పనిచేస్తుంది. అసలు పనిచేస్తుందా? లేదా? అని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే అనుమతులు ఇస్తారు. కానీ స్పుత్నిక్ - వి విషయంలో అలా జరగలేదు. రెండో దశ ట్రయల్స్‌లో ఉండగానే అనుమతులు ఇవ్వడంపై వ్యాక్సిన్ వినియోగంపై అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. అదే సమయంలో క్లినికల్ ట్రయల్స్ గురించి వివాదం తలెత్తడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో లాన్సెట్ అనే జర్నల్ తన కథనంలో టీకా సురక్షితంగా ఉండడమే కాదు ప్రభావవంతంగా పని చేస్తోందని పేర్కొంది. మరి త్వరలో భారత్ లో పంపిణీ చేసే ఈ వ్యాక్సిన్ పనితీరు ఎలా ఉండబోతుందనే అంశంపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. -
స్పుత్నిక్–వి వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?
రోజురోజుకూ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో రష్యాకు చెందిన ‘స్పుత్నిక్–వి’ వ్యాక్సిన్‌ను మన దేశంలో వినియోగించేందుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటికే ఇస్తున్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలకు తోడుగా ఈ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానుంది. అసలు ఈ స్పుత్నిక్–వి వ్యాక్సిన్ ఏంటి, దాన్ని ఎలా తయారు చేశారు, ఎలా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎంత వరకు ఉంటాయన్న వివరాలు చూస్తే.. ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ కూడా ఓకే ‘స్పుత్నిక్–వి’ వ్యాక్సిన్‌ను రష్యాకు చెందిన గమేలియా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. కరోనా తొలివేవ్ సమయంలోనే అంటే గతేడాది ఆగస్టులోనే ఈ వ్యాక్సిన్ రష్యాలో రిజిస్టరైంది. మన దేశంలో రెడ్డీస్ ల్యాబ్స్ ఫార్మా సంస్థ ఆ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. రెడ్డీస్ ల్యాబ్స్‌తోపాటు హెటెరో, పనాసీ బయోటెక్, గ్లాండ్, స్టెలిస్, విర్కో ఫార్మా కంపెనీలు మన దేశంలో ఏడాదికి 85 కోట్ల ‘స్పుత్నిక్–వి’ వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయనున్నాయి. మామూలు జలుబు వైరస్ నుంచి.. మనకు సాధారణంగా జలుబును కలిగించే రెండు రకాల అడెనో వైరస్‌లను తీసుకుని బలహీనపర్చి.. వాటికి కరోనా వైరస్ స్పైక్స్లో ఉండే ప్రొటీన్‌ను జోడించి వ్యాక్సిన్‌ను డెవలప్ చేశారు. సాధారణ అడెనోవైరస్లు కావడంతో శరీరం, రోగ నిరోధక వ్యవస్థ అతిగా రెస్పాండ్ కాకుండా.. తగిన యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ అతి తక్కువగా ఉన్నట్టు ఇప్పటికే నిర్ధారించారు. సామర్థ్యం 91.6 శాతం ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న కరోనా వ్యాక్సిన్లలో ఫైజర్ (95.3%), మోడెర్నా (94.1%) ఎఫిషియెన్సీతో పనిచేస్తున్నట్టు గుర్తించారు. వాటి తర్వాత కోవిడ్ వైరస్‌ను అడ్డుకునే సామర్థ్యం ఎక్కువగా ఉన్నది ‘స్పుత్నిక్–వి’ వ్యాక్సిన్‌కే. దీని ఎఫిషియెన్సీని 91.6 శాతంగా నిర్ధారించారు. రెండు డోసులు.. మూడు వారాల తేడా.. స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను అర మిల్లీలీటర్ డోసు చొప్పున 21 రోజుల తేడాతో రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. రెండో డోసు కూడా వేసుకున్నాక శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ఈ వ్యాక్సిన్‌తో 28వ రోజు నుంచి 42వ రోజు మధ్య గరిష్టంగా ఇమ్యూనిటీ ఉంటుందని గుర్తించారు. ఎక్కువ కాలం సేఫ్టీ స్పుత్నిక్ వ్యాక్సిన్ రెండు డోసులు కూడా రెండు వేర్వేరు స్ట్రెయిన్లతో ఉంటాయి. మొదటి డోసులో ఒక రకం, రెండో డోసులో మరో రకం అడెనోవైరస్‌తో డెవలప్ చేసిన వ్యాక్సిన్ ఇస్తారు. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ రెండు సార్లు క్రియాశీలమవుతుంది. యాంటీ బాడీస్ ఎక్కువ కాలం ఉండి, శరీరానికి రక్షణ కల్పిస్తాయి. పొడి రూపంలో వ్యాక్సిన్ స్పుత్నిక్–వి వ్యాక్సిన్ పొడి రూపంలో (డ్రై ఫామ్) సాధారణ ఫ్రిజ్‌లలో 2 నుంచి 8 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయొచ్చు. దానికి డిస్టిల్డ్ వాటర్ కలిపి లిక్విడ్ ఇంజెక్షన్‌గా మార్చితే.. మైనస్ 18 డిగ్రీల వద్ద స్టోర్ చేయాల్సి ఉంటుంది. లేదా రెండు, మూడు గంటల్లోగా లబ్ధిదారులకు వేయాల్సి ఉంటుంది. ఒక్కో డోసు రూ.750! మన దేశంలో స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను ఏ ధరతో సరఫరా చేస్తారన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను 60 దేశాల్లో వినియోగిస్తున్నారు. ఈ లెక్కన సగటు ధర రూ.750 (పది డాలర్లు)గా ఉంది. ఇక్కడ చదవండి: కరోనా సెకండ్‌వేవ్; మళ్లీ తెరపైకి రైల్వేకోచ్‌లు ఆస్పత్రిలో బెడ్ అయినా ఇవ్వండి లేదా చంపేయండి -
'స్పుత్నిక్'కు కేంద్రం పచ్చజెండా
న్యూఢిల్లీ: రష్యా తయారీ స్పుత్నిక్ టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరిం చుకుంది. దేశంలో అత్యవసర వినియోగానికి రష్యా నుంచి స్పుత్నిక్ టీకాను దిగుమతి చేసుకునేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)నుంచి తమకు అనుమతి లభించిందని ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మంగళవారం తెలిపింది. తాజా పరిణామంతో ప్రస్తుతం కొనసా గుతున్న దేశవ్యాప్త వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లకు తోడు మూడో టీకా రానుంది. ‘భారత్‌లో స్పుత్నిక్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి లభించినందుకు సంతో షంగా ఉంది. భారత్‌లో కేసులు పెరుగుతున్న సమయంలో కోవిడ్–19పై పోరులో ఈ టీకా చాలా కీలకంగా మారనుంది. దీనిద్వారా దేశ జనాభాలో సాధ్యమైనంత ఎక్కువ మందికి కోవిడ్ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడనుంది’ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కో– చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. భారత్‌లో ఏడాదికి 850 మిలియ న్ డోసుల స్పుత్నిక్ టీకా ఉత్పత్తి చేయనున్నట్లు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) తెలిపింది. స్పుత్నిక్ వినియోగానికి అనుమ తులిచ్చిన 60వ దేశం భారత్ అని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ దేశాలు అనుమతిం చిన టీకాల్లో స్పుత్నిక్ రెండో స్థానంలో ఉంది. 91.6% ప్రభావవంతం స్పుత్నిక్ టీకా క్లినికల్ ట్రయల్స్, ఉత్పత్తితోపాటు వినియోగానికి అనుమతులు లభించడం భారత్, రష్యాల సంబంధాల్లో మైలురాయి అని ఆర్డీఐఎఫ్ సీఈవో కిరిల్ డిమిట్రియేవ్ అన్నారు. కరోనా వైరస్‌పై స్పుత్నిక్ వ్యాక్సిన్ 91.6 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందనీ, కోవిడ్–19 సీరియస్ కేసుల్లోనూ ఇది రక్షణ కల్పించిందని లాన్సెట్ వంటి ప్రముఖ మెడికల్ జర్నల్స్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయని ఆయన అన్నారు. ఈ వేసవి పూర్తయ్యేలోగా నెలకు 50 మిలియన్ డోసులకు మించి ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్పుత్నిక్ టీకా ఉత్పత్తి అంతా దాదాపు భారత్‌లోనే జరుగుతున్నందున దీనిని భారత్–రష్యా వ్యాక్సిన్‌గా చెప్పుకోవచ్చునని పేర్కొన్నారు. ఒక్కో డోసు టీకా ఖరీదు 10 డాలర్ల లోపే ఉండగా, రెండు డోసుల్లో పనిచేసే ఇతర వ్యాక్సిన్ల కంటే స్పుత్నిక్‌తో రోగనిరోధకత ఎక్కువ కాలం ఉంటుందని తెలిపారు. సాధారణ రిఫ్రిజిరేటర్లలోనూ దీనిని నిల్వ ఉంచవచ్చన్నారు. 850 మిలియన్ డోసుల లక్ష్యం భారత్‌లో స్పుత్నిక్ టీకా క్లినికల్ ట్రయల్స్‌తోపాటు ఉత్పత్తి చేపట్టేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రష్యాకు చెందిన ఆర్డీఐఎఫ్తో గత ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. ఈమేరకు దేశంలో క్లినికల్ ట్రయల్స్ 2, 3వ దశలను నిర్వహించింది. అనుమతులు లభించాక..దేశంలో ఏడాదికి 850 మిలియన్ డోసుల టీకాను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా గ్లాండ్ ఫార్మా, హెటిరో, బయోఫార్మా, పనాసియా బయోటెక్, స్టెలిస్ బయోఫార్మా, విర్చో బయోటెక్ వంటి ప్రముఖ సంస్థలతో ఆర్డీఐఎఫ్ ఒప్పందాలు కుదుర్చుకుంది. -
భారీ ఊరట: మూడో వ్యాక్సిన్ అందుబాటులోకి
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశ ప్రజలకు ఊరటనిచ్చే పరిణామం చోటు చేసుకుంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ కరోనా వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి లభించింది. అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ)కు చెందిన విషయ నిపుణుల కమిటీ(ఎస్ఈసీ) సిఫార్సు మేరకు డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో మూడో కరోనా టీకా అందుబాటులోకి చ్చింది. భారత్‌లో ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ చేసిన విజ్ఞాపనను నిపుణుల కమిటీ పరిశీలించింది. అనుమతి ఇవ్వొచ్చంటూకు సిఫార్సు చేసింది. దీనికి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్పుత్నిక్ టీకా భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. మరోవైపు దేశంలో రెండో దశలో కరోనా వైరస్ కేసుల ఉధృతికొనసాగుతోంది. అయితే దేశవ్యాప్తంగా కేసుల నమోదు బుధవారం స్వల్పంగా తగ్గినప్పటికీ రోజు వారీ కేసుల నమోదు లక్షన్నరు పైనే ఉండటం గమనార్హం. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన 24గంటల్లో 1,61,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 879 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,36,89,453కి, మొత్తం మరణాల సంఖ్య 1,71,058కి చేరింది. మరణాల రేటు 1.26 శాతానికి చేరింది. . కొత్తగా 97,168మంది వైరస్ బారి నుండి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,22,53,697గా ఉంది. కాగా రికవరీ రేటు 89.86శాతానికి తగ్గింది. యాక్టివ్ కేసుల సంఖ్య 12,64,698గా ఉంది. చదవండి : ‘స్పుత్నిక్’ అత్యవసర వినియోగానికి అనుమతివ్వండి క్యా కరోనా: ఒకరా ఇద్దరా.. అందరిదీ అదే పరిస్థితి! -
‘స్పుత్నిక్’ అత్యవసర వినియోగానికి అనుమతివ్వండి
న్యూఢిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ)కు చెందిన విషయ నిపుణుల కమిటీ(ఎస్ఈసీ) సిఫార్సు చేసింది. భారత్‌లో ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సంస్థ చేసిన విజ్ఞాపనను నిపుణుల కమిటీ పరిశీలించింది. అనుమతి ఇవ్వొచ్చంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. డీసీజీఐ సైతం ఆమోదిస్తే స్పుత్నిక్ టీకా భారత్‌లో అందుబాటులోకి వస్తుంది. దేశంలో ప్రజలకు అందే మూడో కోవిడ్–19 టీకా ఇదే అవుతుంది. అన్ని అనుమతులు లభిస్తే స్పుత్నిక్ టీకాను అత్యవసర వినియోగం కోసం రష్యా నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇండియాలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, సరఫరా హక్కులను డాక్టర్ రెడ్డీస్ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు గత ఏడాది సెప్టెంబర్‌లో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్)తో భాగస్వామిగా మారింది. స్పుత్నిక్ వ్యాక్సిన్ 91.6 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో నిర్ధారణ అయ్యింది. డీసీజీఐ భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిని ప్రస్తుతం లబ్ధిదారులకు అందజేస్తున్నారు. -
భారత్‌లో త్వరలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్!
సాక్షి, హైదరాబాద్: భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి కరోనా వైరస్ అంతానికి సంబంధించి స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు కొన్ని వారాల్లోనే అనుమతి లభించవచ్చని ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ భావిస్తోంది. తాజాగా ఒక వెబినార్ సందర్భంగా కంపెనీ ఏపీఐ, సర్వీసెస్ సీఈవో దీపక్ సప్రా ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాక్సిన్ ప్రయోగాలకు సంబంధించిన డేటా ప్రస్తుతం ఔషధ నియంత్రణ సంస్థ వద్ద ఉందని తెలిపారు. 91.6 శాతం సామర్థ్యంతో ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ పనిచేస్తున్నట్టు చెప్పారు. భారత్‌తోపాటు పలు దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తో (ఆర్డీఐఎఫ్) డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. రష్యా, భారత్, యూఏఈతోపాటు ఇతర దేశాల్లోనూ స్పుతి్నక్–వి వ్యాక్సిన్ ఔషధ పరీక్షలు జరిగాయి. -
మార్చిలో ‘స్పుత్నిక్ వి’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19కి సంబంధించి స్పుత్నిక్ వి టీకాను దేశీయంగా మార్చిలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) వెల్లడించింది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయని, ఇవి ముగిశాక అత్యవసర వినియోగం కింద అనుమతుల కోసం (ఈయూఏ) డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకోనున్నామని సంస్థ సీఈవో (ఏపీఐ, ఫార్మా సేవల విభాగం) దీపక్ సప్రా తెలిపారు. తొలుత 12.5 కోట్ల మందికి సరిపడా డోసేజీలను అందుబాటులోకి తేనున్నట్లు శుక్రవారం మూడో ్రౖలె మాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన వివరించారు. ధర విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. రష్యాకి చెందిన గమలేయా నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడీమియాలజీ అండ్ మైక్రోబయాలజీ ఈ çస్పుత్నిక్ వి టీకాను అభివృద్ధి చేసింది. దీన్ని భారత్‌లో పంపిణీ చేసేందుకు, క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో డీఆర్ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. పరిమిత లాభం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో డీఆర్ఎల్ నికర లాభం రూ. 28 కోట్లకు పరిమితమైంది. కొన్ని ఉత్పత్తులకు సంబంధించి ఊహించని విధంగా పోటీ పెరిగిపోవడం, అనూహ్యంగా ధరలు పతనమవడం వంటి ప్రతికూల పరిణామాల కారణంగా దాదాపు రూ. 600 కోట్లు కేటాయించాల్సి రావడం ఇందుకు కారణమని డీఆర్ఎల్ సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ రూ. 538 కోట్ల నష్టం ప్రకటించింది. మరోవైపు, తాజా సమీక్షా కాలంలో ఆదాయం 12 శాతం పెరిగి రూ. 4,397 కోట్ల నుంచి రూ. 4,942 కోట్లకు పెరిగింది. మార్జిన్లను కాపాడుకుంటూ వృద్ధి కొనసాగించగలిగామని సంస్థ సహ చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. కొత్త ఉత్పత్తుల ఊతంతో మెరుగైన అమ్మకాలు నమోదు చేయగలిగామని డీఆర్ఎల్ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. జనరిక్స్ ఆదాయం 13 శాతం అప్.. విభాగాల వారీగా చూస్తే గ్లోబల్ జనరిక్స్ ఆదాయం వార్షికంగా 13 శాతం వృద్ధితో రూ. 4,075 కోట్లుగా నమోదైంది. ఇక ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం ఒక్క శాతం వృద్ధితో రూ. 701 కోట్లకు చేరింది. ఉత్తర అమెరికా మార్కెట్ 9 శాతం (1,739 కోట్లు), భారత మార్కెట్ 26 శాతం వృద్ధి (సుమారు రూ. 959 కోట్లు) నమోదు చేశాయి. శుక్రవారం బీఎస్ఈలో డీఆర్ఎల్ షేరు సుమారు ఆరు శాతం క్షీణించి రూ. 4,599 వద్ద క్లోజయ్యింది. -
వ్యాక్సిన్: డాక్టర్ రెడ్డీస్ కీలక ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన వేళ దేశీ ఫార్మసీ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కీలక ప్రకటన చేసింది. రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వీ’ వ్యాక్సిన్‌కు సంబంధించి భారత్‌లో త్వరలోనే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి అనుమతి పొందినట్లు శనివారం వెల్లడించింది. 1500 మందిపై వైద్య పరిశోధనలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. రెండో దశ ఫలితాలు పరిశీలించిన అనంతరం, స్పుత్నిక్ వీ టీకా గురించి ఆందోళనలు అవసరం లేదని, డేటా అండ్ సేఫ్టీ మానిటరింగ్ బోర్డు(డీఎస్ఎంబీ) ఫేజ్ 3 ప్రయోగాలకు పచ్చజెండా ఊపినట్లు డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు సంస్థ ఎండీ, కో- చైర్మన్ జీవీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణలో ఇదొక మైలురాయి వంటిది. భారతీయుల కోసం ప్రభావంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్‌ను తీసుకువచ్చేందుకు ఈ నెలలోనే మూడో దశ ప్రయోగాలు ప్రారంభించనున్నాం’’ అని తెలిపారు. కాగా రష్యాలోని మైక్రోబయోలజీ, ఎపిడిమాలజీ గమాలియా జాతీయ పరిశోధన సంస్థ స్పుత్నిక్ వీ టీకాను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. స్థానిక ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు లభిండంతో, మార్కెట్లోకి విడుదల చేసిన తొలి కరోనా నిరోధక వ్యాక్సిన్‌గా నిలిచింది. (చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ) ఈ టీకా 91.4 శాతం ప్రభావంతంగా పనిచేస్తుందని రష్యా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తొలుత కొన్ని దేశాలు సందేహం వ్యక్తం చేశాయి. అయితే ఇప్పుడు యూఏఈ, ఈజిప్టు, వెనిజులా, బెలారస్ వంటి దేశాల్లో స్పుత్నిక్ వీ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతుండగా, అల్జీరియా, అర్జెంటీనా, బొలీవియా, సెర్బియా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాయి. ఇక భారత్‌లో స్పుత్నిక్ వీ పంపిణీ హక్కులను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబరులో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. కాగా దేశీయంగా తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ల టీకా డోసులను నేడు ప్రజలకు అందజేస్తున్న విషయం తెలిసిందే. -
వారాంతానికల్లా మరో వ్యాక్సిన్ రెడీ!
న్యూఢిల్లీ, సాక్షి: కోవిడ్-19 కట్టడికి ఈ వారంలోనే మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. యూఎస్ ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్ రూపొందించిన వ్యాక్సిన్ ఇందుకు అర్హత సాధించింది. క్లినికల్ పరీక్షల డేటాను విశ్లేషించిన యూఎస్ఎఫ్డీఏ మంగళవారం సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మోడర్నా వ్యాక్సిన్ వినియోగంపై గురువారం నిపుణుల సలహా కమిటీ సమావేశంకానుంది. కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాక ఈ వ్యాక్సిన్‌ను సైతం అత్యవసర ప్రాతిపదికన వినియోగించేందుకు యూఎస్ఎఫ్డీఏ అధికారికంగా అనుమతించనున్నట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. వెరసి వారాంతానికల్లా కరోనా వైరస్ కట్టడికి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు తెలియజేశాయి. ఫైజర్ వ్యాక్సిన్‌కు సైతం ఇదే తరహాలో అనుమతులు లభించడంతో సోమవారం నుంచి పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే మోడర్నా వ్యాక్సిన్ 94 శాతం సమర్థతను చూపినట్లు క్లినికల్ పరీక్షల డేటా వెల్లడించడంతో వారాంతానికల్లా అందుబాటులోకి రానున్నట్లు హెల్త్‌కేర్ రంగ నిపుణులు భావిస్తున్నారు. (ఇక యూఎస్‌లోనూ ఫైజర్ వ్యాక్సిన్!) రెండేళ్లపాటు రక్షణ రష్యన్ సంస్థ గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ రెండేళ్లపాటు రక్షణ నిస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ కనీసం రెండేళ్లపాటు రక్షణను కల్పించగలదని గమలేయా హెడ్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ తాజాగా పేర్కొన్నారు. బయోఎన్‌టెక్ సహకారంతో ఫైజర్ రూపొందించిన వ్యాక్సిన్ 4-5 నెలలపాటు రోగనిరోధక శక్తిని ఇవ్వగలదని ఈ సందర్భంగా ఫార్మా నిపుణులు ప్రస్తావిస్తున్నారు. గమలేయా అంచనాలు నిజమైతే భారత్‌కు ఇది అత్యంత శుభవార్త కాగలదని వ్యాఖ్యానించారు. కాగా.. తమ పరీక్షలలో స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ 91.4 శాతం సత్ఫలితాలు ఇచ్చినట్లు గమలేయా ఇన్స్టిట్యూట్ ఇటీవల వెల్లడించడం గమనార్హం! (తొలి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్- పరీక్షలకు రెడీ) డాక్టర్ రెడ్డీస్ ద్వారా దేశీయంగా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌పై క్లినికల్ పరీక్షలను హెల్త్‌కేర్ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ చేపట్టింది. పరీక్షలు విజయవంతమైతే వ్యాక్సిన్‌కు నియంత్రణ సంస్థల నుంచి అనుమతులను కోరనుంది. తద్వారా దేశీయంగా 10 కోట్ల డోసేజీల సరఫరాకు వీలు కలగనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. నిజానికి దేశీ వినియోగానికి అనువైన వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్ నిల్వ, పంపిణికి అనువైన పరిస్థితులు, అధిక జనాభాకు అందించే వెసులుబాటు, ఆర్థిక భారం తదితర పలు అంశాలను సమీక్షించాక ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలియజేశారు. -
స్పుత్నిక్-వీ.. రష్యా కీలక నిర్ణయం
మాస్కో: ప్రపంచ దేశాలన్ని ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ రేసులో ఉన్నాయి. త్వరగా టీకాని తీసుకువచ్చి.. సురక్షితమని నిరూపించి.. ఇతర దేశాలకు అమ్మాలని భావిస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థను పరిగెత్తించడంలో కోవిడ్ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందనడంలో సదేహం లేదు. అందుకే పలు దేశాలు తమ వ్యాక్సిన్ ఎంత సురక్షితమో.. ఎప్పటి వరకు అందుబాటులోకి రానుందనే విషయాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అభివృద్ధి చేస్తోన్న కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి స్పుత్నిక్-వీ మాస్ వ్యాక్సినేషన్ని(సామూహిక టీకా కార్యక్రమం) ప్రారంభించాలని నిర్ణయించింది. ఇక ఇప్పటికే యూకే ఫైజర్-బయోఎంటెక్ కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించిన మొదటి దేశంగా నిలిచిన సంగతి తెలిసిందే. యూకే నిర్ణయం వెల్లడించిన గంటల వ్యవధిలోనే రష్యా ఈ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ 95 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉందని రష్యా గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: 90%సామర్థ్యం ఉండాల్సిందే!) అంతార్జీతయ మార్కెట్లో స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ఒక్క డోసుకు 10 అమెరికన్ డాలర్ల కన్నా (రూ. 740) తక్కువ ఖర్చు అవుతుంది. కరోనా నుంచి రక్షణ పొందటానికి ప్రతి వ్యక్తికి స్పుత్నిక్-వీ రెండు డోసులు సరిపోతాయని రష్యా వెల్లడించింది. అంటే కరోనా వ్యాక్సిన్ కోసం ఒక్కొక్కరు 20 డాలర్లు అంటే 1580 రూపాయల కన్నా తక్కువే ఖర్చు చేయాల్సి వస్తోంది. స్పుత్నిక్-వీ కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి అంతర్జాతీయ డెలివరీ జనవరిలో జరుగుతుంది. రష్యన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ ఇతర దేశాలతో పాటు భారతదేశంలో కూడా తయారు చేయారవుతుందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) తెలిపింది. (చదవండి: దేశానికంతా టీకా అక్కర్లేదు) డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్, ఆర్డీఐఎఫ్ హిమాచల్‌ప్రదేశ్ కసౌలిలోని సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ నుంచి అవసరమైన క్లియరెన్స్ పొందిన తరువాత భారతదేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ ఫేజ్ 2/3/ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు ప్రకటించింది. -
భారత్‌లో ప్రారంభమైన స్పుత్నిక్ ప్రయోగాలు
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ కోవిడ్ వ్యాక్సిన్ 2, 3 దశల క్లినికల్ ప్రయోగాలను భారత్‌లో ప్రారంభించినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) తెలిపింది. వివిధ ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు జరగనున్నాయని, దాని భద్రత రోగనిరోధక శక్తి అంశాలపై అధ్యయనం చేస్తామని రెండు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ క్లినికల్ ప్రయోగాలను జేఎస్ఎస్ మెడికల్ రీసెర్చ్ నిర్వహిస్తుందన్నాయి. మొదటిదశ ప్రయోగంలో 28వ రోజున 91.4 శాతం సామర్థ్యంతో, 42 రోజుల అనంతరం 95 శాతం సామర్థ్యంతో ఈ వ్యాక్సిన్ పనిచేసినట్లు ఆర్డీఐఎఫ్ తెలిపింది. మూడో దశ ప్రయోగాల్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రయోగంలో 40,000 మంది వలంటీర్లు పాల్గొంటున్నారు. ఈ వ్యాక్సిన్‌ని దేశ అవసరాలకూ, ఇతర దేశాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ కో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ తెలిపారు. భారత్‌లో పది కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీకి ఆర్డీఐఎఫ్తో డాక్టర్ రెడ్డీస్ లాబ్ ఒప్పందం కుదుర్చుకుంది. (మా వ్యాక్సిన్ సేఫ్: సీరం ఇన్స్టిట్యూట్) -
హెటెరో కీలక డీల్..మరో రెండు నెలల్లో వ్యాక్సిన్!
మాస్కో/ హైదరాబాద్: దేశీయంగా రష్యన్ వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్ ఫార్మా కంపెనీ హెటెరో డ్రగ్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్)తో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ తయారీకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెటెరో తాజాగా పేర్కొంది. తద్వారా ఏడాదికి 10 కోట్ల డోసేజీల తయారీని చేపట్టనున్నట్లు తెలియజేసింది. 2021 మొదట్లో వ్యాక్సిన్ తయారీ ప్రారంభంకావచ్చని అంచనా వేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆర్డీఐఎఫ్ పేర్కొంది. కాగా.. వ్యాక్సిన్ తయారీకి హెటెరోకు ప్రత్యేకించిన యూనిట్లేకున్నప్పటికీ హైదరాబాద్‌లోగల బయోఫార్మాస్యూటికల్ ప్లాంటులో వ్యాక్సిన్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. స్పుత్నిక్-వి తయారీకి హెటెరోతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా భారత ప్రజలకు సురక్షితమైన, అత్యంత ప్రభావిత వ్యాక్సిన్‌ను అందించే వీలున్నట్లు ఆర్డీఐఎఫ్ సీఈవో కైరిల్ డిమిత్రేవ్ పేర్కొన్నారు. వేగంగా అందించేందుకు స్పుత్నిక్-విని స్థానికంగా తయారు చేయగలిగితే సాధ్యమైనంత త్వరగా ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించేందుకు వీలుంటుందని హెటెరో ల్యాబ్స్ అంతర్జాతీయ మార్కెటింగ్ డైరెక్టర్ బి. మురళీ కృష్ణారెడ్డి ఆర్డీఐఎఫ్తో ఒప్పందం సందర్భంగా పేర్కొన్నారు. ఇందుకు దేశీ క్లినికల్ పరీక్షలు దోహదపడనున్నట్లు తెలియజేశారు. కాగా.. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ రెండు, మూడు దశల క్లినికల్ పరీక్షలను చేపట్టేందుకు ఫార్మా రంగ హైదరాబాద్ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశీయంగా స్పుత్నిక్-వి వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు 2021 మార్చిలోగా పూర్తికావచ్చని ఇటీవల డాక్టర్ రెడ్డీస్ అంచనా వేసింది. 91.4 శాతం బెలారస్, వెనిజులా తదితర పలుదేశాలలో ప్రపంచవ్యాప్తంగా స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆర్డీఐఎఫ్ తెలియజేసింది. రష్యాలో 40,000 మందిపై నిర్వహించిన మూడో దశ పరీక్షలలో సానుకూల ఫలితాలు వెలువడినట్లు పేర్కొంది. వీటి రెండో మధ్యంతర డేటా ప్రకారం 91.4 శాతం సత్ఫలితాలు సాధించినట్లు ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ వ్యాక్సిన్‌ను ఒక్కో డోసు 10 డాలర్ల(రూ. 740) కంటే తక్కువకు అందించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఎపిడిమియాలజీ, మైక్రోబయాలజీ గమలేయా నేషనల్ సెంటర్ సహకారంతో ఆర్డీఐఎఫ్ స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన విషయం విదితమే. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి 120 కోట్ల వ్యాక్సిన్లకు దరఖాస్తులు వచ్చినట్లు ఆర్డీఐఎఫ్ తెలియజేసింది. -
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ముందుగా మనకే!
ముంబై, సాక్షి: కోవిడ్-19 కట్టడికి బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ను తొలుత దేశీయంగా పంపిణీ చేసేందుకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ అదార్ పూనావాలా తాజాగా స్పష్టం చేశారు. ఇందుకు వీలుగా వ్యాక్సిన్ల కొనుగోలుకి దేశీ ప్రభుత్వంతో చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తద్వారా 2021 ఏప్రిల్‌కల్లా తొలి బ్యాచ్‌ను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 70 శాతం సత్ఫలితాలను సాధించిన తమ వ్యాక్సిన్ 90 శాతాన్ని సైతం అధిగమించనున్నట్లు ఆస్ట్రాజెనెకా పేర్కొన్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతి లభించవచ్చని భావిస్తున్నట్లు పూనావాలా చెప్పారు. ఫలితంగా ఫిబ్రవరి, మార్చిలలో పూర్తిస్థాయి అనుమతులకు వీలుండవచ్చని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌కు త్వరితగతిన అనుమతి పొందేందుకు ప్రయత్నించనున్నట్లు ఆస్ట్రాజెనెకా ఇటీవల తెలియజేసింది. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు చేయడం ద్వారా తక్కువ ఆదాయ దేశాలకు వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు వివరించింది. పంపిణీ సులభం దేశీ మార్కెట్లలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రూ. 1,000 స్థాయిలో్ ఉండవచ్చని, అయితే ప్రభుత్వం భారీ పరిమాణంలో కొనుగోలు చేయడం ద్వారా మరింత చౌకగా అందించేందుకు వీలుంటుందని పూనావాలా ఇటీవల పేర్కొన్నారు. 2021 జులైకల్లా సీరమ్ ఇన్స్టిట్యూట్కు 40 కోట్ల డోసేజీలను ఉత్పత్తి చేయగల సామర్థ్యమున్నట్లు తెలియజేశారు. కాగా.. ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ యూకేలో అనుమతి పొందితే.. అత్యవసర వినియోగానికి దేశీయంగానూ ఔషధ నియంత్రణ సంస్థ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యాక్సిన్‌ను 2-8 సెల్షియస్‌లో నిల్వ చేసేందుకు వీలుండటంతో దేశీ మార్కెట్లో సులభంగా పంపిణీ చేయవచ్చని ఫార్మా వర్గాలు చెబుతున్నాయి. చౌకలో యూఎస్ కంపెనీల వ్యాక్సిన్లతో పోలిస్తే స్పుత్నిక్-వి వ్యాక్సిన్ చౌకలో లభించగలదని రష్యా పేర్కొంటోంది. అంతేకాకుండా తమ వ్యాక్సిన్ సులభంగా నిల్వ చేయడంతోపాటు.. పంపిణీకీ వీలుంటుందని చెబుతోంది. యూఎస్ దిగ్గజాలలో ఫైజర్, మోడర్నా రూపొందించిన వ్యాక్సిన్లు రెండు డోసేజీలలో వినియోగించవలసి ఉంటుందని పేర్కొంది. కాగా.. ఫైజర్ ఇంక్ వ్యాక్సిన్ ధరను 19.5 డాలర్లుగా తొలుత తెలియజేసింది. అంటే రెండు డోసేజీలకు కలిపి 39 డాలర్లు వ్యయంకాగలదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదేవిధంగా మోడర్నా ఇంక్ రూపొందించిన వ్యాక్సిన్ ధర మరింత అధికంగా 50-74 డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. -
కోవిడ్-19: మోడర్నా వ్యాక్సిన్ డేటా రెడీ!
న్యూయార్క్: కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తుది దశ క్లినికల్ పరీక్షల డేటాను విడుదల చేసేందుకు అమెరికన్ ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చివరి దశ క్లినికల్ పరీక్షలలో తమ వ్యాక్సిన్ 90 శాతంపైగా సత్ఫలితాలు ఇచ్చినట్లు యూఎస్ దిగ్గజం ఫైజర్ ఇంక్ పేర్కొంది. ఇక స్ఫుత్నిక్ పేరుతో విడుదల చేసిన వ్యాక్సిన్ అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) తెలియజేసింది. ఈ బాటలో తాజాగా మోడర్నా సైతం తుది దశ పరీక్షల డేటాను ప్రకటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దేశీయంగా.. ఫైజర్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మైనస్ 70 డిగ్రీల సెల్షియస్‌లో నిల్వ ఉంచవలసి ఉన్నట్లు వెలువడిన వార్తలతో ఫార్మా రంగ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. దేశీయంగా ఈ వ్యాక్సిన్ నిల్వ, రవాణా, పంపిణీ వంటివి సమస్యాత్మకంగా నిలవనున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో మోడర్నా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌కు ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు. చివరి దశ పరీక్షలకు సంబంధించిన తొలి మధ్యంతర విశ్లేషణ తమ వద్ద ఉన్నట్లు మోడర్నా చెబుతోంది. ఈ డేటా ద్వారా వ్యాక్సిన్ ఎంత సురక్షితమన్న అంశాన్ని తెలుసుకునే వీలున్నట్లు తెలియజేసింది. విశ్లేషణకు వీలుగా ఈ డేటాను స్వతంత్ర పర్యవేక్షక బోర్డుకి నివేదించనున్నట్లు వెల్లడించింది. తద్వారా వ్యాక్సిన్ పరీక్షల ఫలితాలను విశ్లేషించి సూచనలు చేయనున్నట్లు తెలియజేసింది. నోవావాక్స్.. ఐసీఎంఆర్ సహకారంతో రూపొందిస్తున్న కోవిడ్‌షీల్డ్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షల కోసం దేశీయంగా ఎన్రోల్మెంట్ పూర్తియినట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. మరోవైపు నోవావ్యాక్స్, సీరమ్ అభివృద్ధి చేస్తున్న కోవావ్యాక్స్కూ ఐసీఎంఆర్ సేవలు అందిస్తోంది. కాగా.. స్ఫుత్నిక్-వి వ్యాక్సిన్‌పై దేశ, విదేశాలలో ఇటీవల క్లినికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వీటి మధ్యంతర ఫలితాలు 92 శాతం విజయవంతమైనట్లు ఆర్డీఐఎఫ్ చెబుతోంది. జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో రూపొందిస్తున్నవ్యాక్సిన్ 90 శాతంపైగా సత్ఫలితాలు ఇచ్చినట్లు ఫైజర్ ప్రకటించిన మరుసటి రోజు రష్యన్ వ్యాక్సిన్ వివరాలు వెల్లడికావడం గమనార్హం! దేశీయంగా వ్యాక్సిన్లను 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య నిల్వ చేస్తుంటారని ఫార్మా రంగ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ బాటలో అతితక్కువ టెంపరేచర్‌ను తీసుకుంటే.. మైనస్ 25 డిగ్రీలు మాత్రమేనని చెబుతున్నారు. వెరసి ఇందుకు అనువైన వ్యాక్సిన్లు మాత్రమే దేశీయంగా వినియోగించేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. -
100 మందిపై స్పుత్నిక్–వీ ప్రయోగం
మాస్కో/న్యూఢిల్లీ: భారత్‌లోని 100 మంది వలంటీర్లపై, రష్యా కోవిడ్ టీకా స్పుత్నిక్–వీను ప్రయోగించేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కి డ్రగ్ కంట్రోలర్ జనరల్(డీసీజీఐ) అనుమతిచ్చినట్లు రష్యా వార్త సంస్థ స్పుత్నిక్ వెల్లడించింది. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ నిర్ణయించాల్సి ఉంది. మూడో దశలోకి ప్రవేశించే ముందు, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయాల్సి ఉంది. రష్యా అభివృద్ధి పరిచిన స్పుత్నిక్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు భారత్‌లో వ్యాక్సిన్ పంపిణీకి, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ప్రయోగాల అనంతరం 10 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను తయారుచేయడానికి రెడ్డీస్ ల్యాబ్‌కి అనుమతిచ్చినట్లు ఆర్డీఐఎఫ్ వెల్లడించింది. గత నెలలో ఆర్డీఐఎఫ్ భారత ప్రభుత్వంతోనూ, ఔషధ కంపెనీలతో స్థానికంగా స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీపై చర్చించింది. అలాగే స్పుత్నిక్–వీ భద్రత, దాని పనితీరుపై మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ‘ది లాన్సెట్’మెడికల్ జర్నల్ లో ప్రచురించారు. రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కి 100 మందిపై, మూడో దశలో 1,400 మంది వలంటీర్లపై ప్రయోగాలు జరుపుతారని అధికారులు వెల్లడించారు. తొలిగా 4 కేటగిరీల వారికి టీకా పంపిణీ కరోనా మహమ్మారికి భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ‘స్పెషల్ కోవిడ్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం’ కింద ప్రాధాన్య వర్గాలకు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలి దశలో వ్యాక్సిన్ల పంపిణీ కోసం ప్రభుత్వం ప్రజలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరించింది. ఇందులో కోటి మంది డాక్టర్లు, నర్సులు, ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆశా వర్కర్లు ఉన్నారు. అలాగే 2 కోట్ల మంది మున్సిపల్ కార్మికులు, పోలీసులు, సైనిక సిబ్బంది.. 26 కోట్ల మంది 50 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. 50 ఏళ్లలోపు వయసుండి ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికీ మొదటి దశలోనే టీకా ఇచ్చే అవకాశం ఉంది. 77 లక్షలు దాటిన కేసులు దేశంలో గత 24 గంటల్లో 54,366 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,61,312కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 690 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,17,306 కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 69,48,497 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,95,509 గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 8.96 శాతం ఉన్నాయి. రికవరీ రేటు 89.53 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.51గా నమోదైంది. -
రెండో వాక్సిన్ : పుతిన్ కీలక ప్రకటన
మాస్కో : కరోనా వైరస్ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తరుణంలోరష్యా మరో కీలక అంశాన్ని వెల్లడించింది. రెండో వ్యాక్సిన్ తయారీకి సిద్ధమవుతోంది. కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు రెండవ వ్యాక్సిన్‌కు సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. కోవిడ్-19 రెండవ వ్యాక్సిన్‌కు రష్యా రెగ్యులేటరీ అనుమతి ఇచ్చినందుకు సంతోషంగా ఉందని బుధవారం ప్రభుత్వ సమావేశంలో ఆయన ప్రకటించారు. తాజాగా సైబీరియాకు చెందిన వెక్టార్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు అనుమతినిచ్చింది. గత నెలలో ప్రారంభ దశ మానవ పరీక్షలను పూర్తి చేసినందుకు పుతిన్ శాస్త్రవేత్తలను అభినందించారు. ఇక మొదటి, రెండవ టీకా ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి విదేశీ భాగస్వాములతో కూడా పనిచేస్తున్నామనీ, విదేశాలలో కూడా తమ టీకాను అందిస్తామన్నారు. కాగా తొలి వాక్సిన్ స్పుత్నిక్ వీ ను రష్యా రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు మాసంలో కోవిడ్-19 వ్యాక్సిన్‌కు రెగ్యులేటరీ ఆమోదం పొందిన మొట్టమొదటి దేశంగా అవతరించింది. రష్యాలో1,340,409 కేసులు నమోదయ్యాయి. కేసులో విషయంలో అమెరికా, ఇండియా, బ్రెజిల్ తరువాత ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద దేశంగా రష్యా నిలిచింది. -
త్వరలో రష్యా ప్రజలకు కరోనా టీకా
మాస్కో: కరోనా వైరస్‌ను నిరోధించే ‘స్పుత్నిక్ –వీ’ టీకా త్వరలో మాస్కోలో ప్రజా పంపిణీకి సిద్ధమవుతోందని రష్యా అధికార మీడియా గురువారం వెల్లడించింది. అయితే, పూర్తిస్థాయిలో భద్రత, సామర్థ్య పరీక్షలు జరపకుండానే ఈ టీకాను మార్కెట్లోకి తీసుకురావాలన్న ప్రయత్నాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు కూడా వచ్చాయి. స్పుత్నిక్–వీ టీకాలు ప్రజాపంపిణీ కోసం పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయని గతవారమే రష్యా ఆరోగ్య శాఖ ప్రకటించింది. త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాలకు వాటిని పంపించనున్నామని పేర్కొంది. ‘గమాలెయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ’ రూపొందించిన ఈ టీకా అవసరమైన అన్ని నాణ్యత పరీక్షల్లో విజయవంతమైందని స్పష్టం చేసింది. పూర్తిస్థాయి మానవులపై పూర్తిస్థాయిలో ప్రయోగాలు ముగియకముందే, వినియోగానికి ప్రభుత్వ అనుమతి పొందిన తొలి టీకాగా స్పుత్నిక్–వీ నిలిచింది. అనుమతి పొందిన తరువాత అడ్వాన్స్డ్ ట్రయల్స్‌ను కొనసాగించారు. సుమారు 40 వేల మందిపై జరుగుతున్న ఫేజ్ 3 ప్రయోగ ఫలితాలు అక్టోబర్, నవంబర్‌ల్లో వెలువడే అవకాశముంది. -
రష్యా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్
మాస్కో: రష్యా కరోనా టీకా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ భద్రతపై అనుమానాలు నెలకొ న్నాయి. టీకా డోసులు తీసుకున్న ప్రతీ ఏడుగురు వలంటీర్లలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్లు వచ్చినట్టుగా రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మూడో దశ ప్రయోగాల్లో భాగంగా 40 వేల మందికి టీకా డోసులు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. వారిలో ఇప్పటివరకు 300 మందికి వ్యాక్సిన్ ఇస్తే వారిలో 14 శాతం మందిలో సైడ్ ఎఫెక్ట్లు కనిపించాయి. మొదటి డోసు తీసుకున్న వారిలో 14శాతం మందికి నిస్సత్తువ, కండరాల నొప్పులు వంటివి వచ్చాయని, జ్వరం కూడా ఎక్కువగానే వచ్చినట్టుగా ఆరోగ్య మంత్రి మురాషఖో తెలిపారు. 21 రోజుల తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి రెండో డోసు టీకా ఇస్తామని చెప్పారు. స్పుత్నిక్ వీ కరోనా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు ఇంకా పూర్తి కాకముందే రష్యా ప్రభుత్వం వ్యాక్సిన్‌ని హడావుడిగా మార్కెట్లో విడుదల చేసింది. ప్రపంచంలోనే మొదటి వ్యాక్సిన్ తెచ్చిన దేశంగా నిలవాలన్న ఉద్దేశంతో త్వరితగతిన అనుమతులు మంజూరు చేసినట్టుగా విమర్శలు వచ్చాయి. మాస్కోలో సెప్టెంబర్ మొదట్లో తుది దశ ప్రయోగాలు మొదలు పెట్టారు. టీకా భద్రత, నాణ్యతపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగకుండా మార్కెట్లోకి విడుదల చేయ డంపై ఇప్పటికే చాలామంది శాస్త్రవేత్తలు అభ్యంతరాలు హెచ్చరికలు జారీ చేశారు. భా రత్కి కోటి డోసులు ఇవ్వడానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌తో రష్యా ఒప్పందం కుదుర్చుకుంది. డీజీసీఐ అనుమతులు రావాల్సిన నేపథ్యంలో సైడ్ ఎఫెక్ట్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. -
డాక్టర్ రెడ్డీస్- జేఎంసీ ప్రాజెక్ట్స్ జోరు
కోవిడ్-19 కట్టడికి రష్యా రూపొందించిన వ్యాక్సిన్‌పై దేశీయంగా మూడో దశ క్లినికల్ పరీక్షలను చేపట్టేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న వార్తలతో దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కౌంటర్‌కు రెండో రోజూ డిమాండ్ కనిపిస్తోంది. మరోపక్క తాజాగా కాంట్రాక్టులు లభించినట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల కంపెనీ జేఎంసీ ప్రాజెక్ట్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కోవిడ్-19 కట్టడికి రిజిస్టరైన రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్-విను దేశీయంగా అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న వార్తలతో వరుసగా రెండో రోజు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కౌంటర్ వెలుగులో నిలుస్తోంది. ఎన్ఎస్ఈలో తొలుత 4 శాతం జంప్‌చేసి రూ. 4,773ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 4,767 వద్ద ట్రేడవుతోంది. స్పుత్నిక్-విపై దేశీయంగా మూడో దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పరీక్షలు విజయవంతమైతే 10 కోట్ల డోసేజీలను డాక్టర్ రెడ్డీస్‌కు ఆర్డీఐఎఫ్ అందించనుంది. గమేలియా నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో రూపొందించిన కోవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్-విపై రష్యాలో రెండు దశల పరీక్షలను నిర్వహించారు. వీటిలో ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని, సమర్థవంతంగా పనిచేస్తున్నదని ఆర్డీఐఎఫ్ ఇప్పటికే తెలియజేసింది. జేఎంసీ ప్రాజెక్ట్స్ దేశ, విదేశాల నుంచి రూ. 1,342 కోట్ల విలువైన కాంట్రాక్టులు తాజాగా లభించినట్లు మౌలిక సదుపాయాల కంపెనీ జేఎంసీ ప్రాజెక్ట్స్ తెలియజేసింది. వీటిలో తూర్పు ఆసియా నుంచి దక్కించుకున్న రూ. 725 కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఉన్నట్లు పేర్కొంది. ఈ బాటలో ఒడిషాలో నీటిపారుదల సౌకర్యాల కల్పనకు రూ. 471 కోట్ల ప్రాజెక్ట్ లభించగా.. బిల్డింగ్ నిర్మాణం కోసం రూ. 146 కోట్ల కాంట్రాక్టును ఉత్తరాది నుంచి పొందినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో జేఎంసీ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతంపైగా జంప్‌చేసి రూ. 57.40ను తాకింది. ప్రస్తుతం 4.5 శాతం ఎగసి రూ. 55.40 వద్ద ట్రేడవుతోంది. -
'స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ : డా.రెడ్డీస్ భారీ డీల్
సాక్షి, ముంబై: రష్యా కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన దేశీయ ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ భారీ ఒప్పందాన్ని సొంతం చేసుకుంది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ పంపిణీ, క్లినికల్ ట్రయల్స్ కోసం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఎఫ్)తో భారీ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం పదికోట్ల (100 మిలియన్ల ) మోతాదుల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది. ట్రయల్స్ విజయవంతమైతే నవంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సీఈవో కిరిల్ దిమిత్రేవ్ వెల్లడించారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అడెనోవైరల్ వెక్టర్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుందన్నారు. దశాబ్దాలుగా 250 కి పైగా క్లినికల్ అధ్యయనాలలో పరీక్షించబడిందని,ఇందులో దీర్ఘకాలిక ప్రతికూలతలు లేకుండా సురక్షితంగా తేలిందన్నారు. అలాగే ఈ టీకా తయారీ మరో నాలుగు భారతీయ తయారీదారులతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఒకటి, రెండు దశల ప్రయోగాల్లో సానుకూల ఫలితాల నేపథ్యంలో మూడు దశ ట్రయల్స్ నిర్వహించనున్నామని రెడ్డీస్ సీఈవో జీవీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ సహా రష్యా వ్యాక్సిన్‌పై పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘స్పుత్నిక్ వి’కి మూడో దశ పరీక్షలకు భారత్‌లో రెడ్డీస్ ఒప్పందం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, తయారీకి పుణేకు చెందిన సీరం సంస్థ ఒప్పందాన్ని చేసుకుని ప్రయోగాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. (కరోనా: డా.రెడ్డీస్ కొత్త ఔషధం) -
రష్యా వ్యాక్సిన్- డాక్టర్ రెడ్డీస్ చేతికి
కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ స్పుత్నిక్-Vపై దేశీయంగా మూడో దశ క్లినికల్ పరీక్షలను చేపట్టేందుకు డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రష్యా సావరిన్ వెల్త్ ఫండ్ ఆర్డీఐఎఫ్ తాజాగా పేర్కొంది. తద్వారా దేశీయంగా డాక్టర్ రెడ్డీస్ మూడో దశ క్లినికల్ పరీక్షలను చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఇవి విజయవంతమైతే నవంబర్ తొలి వారానికల్లా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే వీలుంటుందని అభిప్రాయపడింది. తాజాగా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 10 కోట్ల డోసేజీలను డాక్టర్ రెడ్డీస్‌కు సరఫరా చేయనున్నట్లు తెలియజేసింది. ఈ వివరాలను ఆంగ్ల మీడియా వెల్లడించింది. సురక్షితం ఎడెనోవైరల్ వెక్టర్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన స్పుత్నిక్-V వ్యాక్సిన్ సురక్షితమైనదని డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందం సందర్భంగా ఆర్డీఐఎఫ్ సీఈవో కైరిల్ దిమిత్రేవ్ పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్లను తయారు చేసేందుకు మరో నాలుగు దేశీ కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకునేందుకు చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. విభిన్న వ్యాక్సిన్లపై ఆసక్తి చూపడం ద్వారా వివిధ దేశాలు, సంస్థలు.. ప్రజలను సంరక్షించుకునేందుకు కట్టుబాటును ప్రదర్శిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. మానవ ఎడినోవైరల్ వెక్టర్స్ ద్వారా రూపొందించిన తమ వ్యాక్సిన్‌ను 40,000 మందిపై ప్రయోగించి చూశామని, 250 క్లినికల్ డేటాలను విశ్లేషించామని వివరించారు. తద్వారా ఇది సురక్షితమని తేలడమేకాకుండా దీర్ఘకాలంలో ఎలాంటి ప్రతికూల ప్రభావాలనూ చూపలేదని స్పష్టం చేశారు. రష్యాలో తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలు సఫలమయ్యాయని.. దేశీ ప్రమాణాల ప్రకారం మూడో దశ పరీక్షలకు డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. (కరోనా భారత్: 50 లక్షలు దాటిన కేసులు) -
కరోనా: మార్కెట్లోకి రష్యా వ్యాక్సిన్
మాస్కో : కోవిడ్-19 కట్టడికి రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ మార్కెట్లో విడుదలైంది. రష్యా గమాలియా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడిమాలజీ అండ్ మైక్రోబయాలజీ, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) సంయుక్తంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్ రష్యా ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. ‘తొలివిడత టీకా డోసులు ప్రజలకి అందుబాటులో ఉన్నాయి’ అని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. రష్యా తన వ్యాక్సిన్‌ను భారత్‌లో మూడో దశ ప్రయోగాలు జరిపి మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నద్ధంగా ఉంది. దీనికి సంబంధించి రష్యా నుంచి ప్రతిపాదనలు అందినట్టుగా నీతి అయోగ్ సభ్యుడు వి.కె. పాల్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనల్ని మన దేశంలో పలు మెడికల్ కంపెనీలు పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా, బ్రెజిల్, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్ వంటి దేశాలు రష్యా టీకాకు అనుమతులు మంజూరు చేశాయి. చదవండి: తరువాతి మహమ్మారికి సిద్ధంగా ఉండాలి! -
ఈ వారంలోనే కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ!
మాస్కో : ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్‌గా రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ నమోదైందని అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రకటించిన కొద్దివారాల అనంతరం వ్యాక్సిన్ విస్తృత పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ వారంలోనే సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సహకారంతో గమలేయా ఇనిస్టిట్యూట్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. మరికొద్ది రోజుల్లోనే స్పుత్నిక్ వీకి అనుమతి లభించనుందని, పౌరుల వినియోగానికి నిర్ధిష్ట విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అసోసియేట్ మెంబర్ డెనిస్ లగునోవ్ తెలిపారు. సెప్టెంబర్ 10 నుంచి 13 మధ్య అనుమతుల ప్రక్రియ ముగించుకుని కరోనా వైరస్ వ్యాక్సిన్ తొలి బ్యాచ్ విడుదలవుతుందని చెప్పారు. అదే రోజు నుంచి ప్రజలకు వ్యాక్సిన్‌ను ఇవ్వడం మొదలవుతుందని తెలిపారు. ప్రజలందరూ వ్యాక్సిన్ కోసం రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చని అయితే ముందుగా హైరిస్క్ గ్రూపులకు ప్రాధాన్యత ఇస్తారని వివరించారు. తొలుత వైద్య సిబ్బంది, వృద్ధులు వంటి హైరిస్క్ గ్రూపులకు వ్యాక్సిన్ ఇవ్వాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ లక్ష్యంగా నిర్ధేశించుకుందని చెప్పారు. మరోవైపు మూడో దశ వ్యాక్సిన్ పరీక్షలపై స్పష్టత లేకుండానే వ్యాక్సిన్‌ను ప్రజల్లోకి తీసుకురావడం పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఆగస్ట్ 11న స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. తమ కుమార్తెల్లో ఒకరికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు స్వయంగా ఆయన వెల్లడించారు. ఇక రష్యాలో 10,27,334 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జాన్హాప్కిన్స్ యూనివర్సిటీ తాజా గణాంకాలు తెలిపాయి. -
మూడో దశ ప్రయోగాలకు రష్యా యోచన..
మాస్కో: కరోనా వైరస్ ప్రభావంతో అన్ని దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే కరోనాను నిర్మూలించే క్రమంలో వివిధ దేశాలు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నంలో చాలా బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో కరోనాను నిర్మూలించే వ్యాక్సిన్ తీసుకొచ్చినట్లు ఇటీవల రష్యా ప్రకటించింది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలను రష్యా మీడియాకు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో రష్యా వ్యాక్సిన్ కేవలం రెండు దశలను మాత్రమే పూర్తి చేసిందని, అడ్వాన్స్డ్ ట్రైల్స్ (మూడో దశ ప్రయోగం) పూర్తి చేయలేదని కొన్ని దేశాలు ఆరోపించాయి. వివిధ దేశాల ఒత్తిడితో మూడో దశ ప్రయోగాలను ప్రారంభించే ఆలోచనలో రష్యా ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా మూడో దశలో 40,000 మంది వాలంటీర్లపై కరోనా టీకాను ప్రయోగించనున్నారని టీఏఎస్ఎస్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అయితే కరోనాను దుర్కొనేందుకు రష్యా 'స్పుత్నిక్' టీకాను ప్రకటించినా, మూడో దశ మానవ ప్రయోగాలకు సంబంధించిన సమాచారంపై స్పష్టత లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) పేర్కొనడంతో రష్యా టీకాపై వివిధ దేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. అందువల్ల మూడో దశ ప్రయోగానికి రష్యా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. -
10 లక్షల వ్యాక్సిన్లు పాక్‌కు బహుమతి?
మాస్కో: కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు రష్యా 'స్పుత్నిక్' టీకాను ప్రకటించడంతో ప్రపంచ దేశాలకు కొండంత భరోసా వచ్చినట్లయింది. అయితే ఈ టీకా మూడో దశ మానవ ప్రయోగాలకు సంబంధించిన సమాచారంపై స్పష్టత లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) పేర్కొనడంతో టీకా ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దీని ఉత్పత్తి ప్రారంభించడానికి ముందే ఈ వ్యాక్సిన్ కావాలంటూ వివిధ దేశాలు కోట్ల సంఖ్యలో ఆర్డర్లు చేశాయి ఈ క్రమంలో పాకిస్తాన్‌కు రష్యా పది లక్షల డోసులు ఉచితంగా ఇవ్వనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. (రష్యా టీకాపై మిశ్రమ స్పందన!) "చైనా తర్వాత ఇప్పుడు రష్యా.. పాకిస్తాన్‌కు 10 లక్షల కరోనా వ్యాక్సిన్లను బహుమతిగా అందిస్తోంది. అయితే ఇది మానవ ప్రయోగాల (మూడో దశ)కోసమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది" అంటూ ఫేస్బుక్, వాట్సాపుల్లో తిరుగుతున్న వార్త సారాంశం. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. అసలు రష్యా ఇంకా వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించనేలేదు. వచ్చే నెలలో టీకా ఉత్పత్తి ప్రారంభిస్తామని వెల్లడించింది. మరోవైపు పాక్‌కు బహుమతిగా లక్షల డోసులు ఇస్తున్నట్లు ఎక్కడా ప్రకటించనూలేదు, దీనిపై డబ్ల్యూహెచ్‌వో స్పందించనూ లేదు. కాబట్టి ఇది పూర్తిగా అసత్య వార్త. అయితే చైనా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలను మాత్రం పాకిస్తాన్‌లోనే పరీక్షిస్తున్నారు. (20 దేశాల నుంచి బిలియన్ డోసులు ప్రి ఆర్డర్) వాస్తవం: రష్యా అభివృద్ధి చేసిన 'స్పుత్నిక్' వ్యాక్సిన్ 10 లక్షల డోసులను పాకిస్తాన్‌కు బహుమతిగా ఇవ్వలేదు. -
నెలాఖరుకు రష్యా టీకా
మాస్కో: కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు రూపొందించిన ‘స్పుత్నిక్’టీకా ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానుంది. వ్యాక్సిన్ ఉత్పత్తిని రష్యా ప్రారంభించిందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఇంటర్ఫాక్స్ వార్తా సంస్థ తెలిపింది. మాస్కోలోని గమలేయా ఇనిస్టిట్యూట్ స్పుత్నిక్ టీకాను అభివృద్ధి చేసింది. ప్రపంచంలో తొలి కరోనా టీకా తమదేనని, సమర్థమంతంగా పనిచేస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రష్యా జరిపిన క్లినికల్ ట్రయల్స్‌పై స్పష్టత లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అంటోంది. -
‘రష్యా టీకా అడ్వాన్స్ స్టేజ్‌లో లేదు’
లండన్: కరోనా వ్యాక్సిన్ తయారీలో భాగంగా ప్రయోగ దశలో ముందున్నాయని తాము భావిస్తున్న తొమ్మిది వ్యాక్సిన్లలో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. పరీక్షల దశలోనే వ్యాక్సిన్ల కోసం ఒప్పందాలు చేసుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి వీలుగా డబ్లు్యహెచ్‌వో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది టీకాలను అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నట్లుగా గుర్తించింది. స్పుత్నిక్ వ్యాక్సిన్‌పై తగినంత సమాచారం లేదు కాబట్టి దాని సమర్థతపై నిర్ణయానికి రాలేమని డబ్ల్యూహెచ్‌వో సీనియర్ సలహాదారు డాక్టర్ బ్రూస్ అయల్వార్డ్ అన్నారు. టీకా ఏ దశలో ఉందో అర్థం చేసుకోవడానికి రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. (రష్యా టీకాపై మిశ్రమ స్పందన!) -
రష్యా టీకాపై మిశ్రమ స్పందన!
మాస్కో/మయామీ: కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు టీకా (స్పుత్నిక్) సిద్దమైందని రష్యా చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందన కలిగించింది. మూడో దశ మానవ ప్రయోగాలు పూర్తి కాకుండానే టీకా (స్పుత్నికను విడుదల చేయడం ఏమాత్రం సరికాదని, మానవ ప్రయోగాల సమాచా రాన్ని డబ్ల్యూహెచ్ఓకు సమర్పించలేదని పలువురు విమర్శలకు దిగగా.. రష్యా మాత్రం తన దారిన తాను ముందుకెళుతోంది. ప్రభుత్వ నియంత్రణ సంస్థల వద్ద టీకా నమోదు ప్రక్రియను పూర్తి చేసి, ఒకట్రెండు వారాల్లోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని రష్యా ప్రకటించింది. వ్యాక్సిన్‌కు రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా స్పందిస్తోందని, తన కుమార్తెకు తొలి దఫా టీకా ఇచ్చామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. టీకాను లాటిన్ అమెరికా దేశాలతోపాటు ఆసియా దేశాలకూ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. టీకా వేసుకున్న వారిని పరిశీలించేందుకు రష్యా స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ తయారు చేస్తున్నట్లు సమాచారం. ప్రయోగ సమాచారం ఏదీ? స్పుత్నిక్ టీకాకు చాలా వేగంగా అనుమతులి వ్వడం నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. సామర్థ్యం, భద్రత వంటి అంశాల్లో స్పుత్నిక్ ఇప్పటికీ ప్రామాణిక పద్ధతులను పాటించ లేదని కాబట్టి ఈ టీకాను వాడటం సరికాదని వీరు అంటున్నారు. తొలి రెండు దశల ప్రయోగాల్లో భాగంగా దాదాపు వంద మందిపై టీకా పరీక్షించారని, మూడో దశలో వేల మందిపై జరపాల్సిన ప్రయోగాలు చేపట్టనే లేదన్నది వీరి అభ్యంతరం. ‘అదృష్టవంతులైతే పనిచేస్తుందేమో’ హైదరాబాద్: రష్యా అభివృద్ధి చేసిన టీకాను ఎక్కువ మందిపై పరీక్షించకపోతే దాని సామర్థ్యాన్ని అంచనా వేయడం కష్టమని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యురల్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ప్రజలు అదృష్టవంతులైతే టీకా పనిచేస్తుందేమో అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వాళ్లు తగినన్ని ప్రయోగాలు చేయలేదు. ఎక్కువ మందిలో టీకా ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు మూడో దశ మానవ ప్రయోగాలు అవసరం’అని చెప్పారు. -
చందమామకు ఆవలి వైపు...
చందమామను మన ం ఎప్పుడూ ఒకేవైపు చూస్తుంటాం. భూమి ఆకర్షణ శక్తి వల్ల చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూనే 29.5 రోజులకు ఓసారి భూమి చుట్టూ తిరగడం వల్ల.. మనకు ఎప్పుడూ ఒకవైపే కనిపిస్తుంటాడు. నల్లటి మచ్చలు.. ముసలమ్మ.. ఓ కుందేలు.. ఎవరికిష్టమైనవి వారు ఊహించేసుకుంటున్నాం. అయితే.. చందమామ ఆవలి ముఖంపై ఏముంది? అన్న మిస్టరీ వీడిపోయి శనివారం నాటికి 55 ఏళ్లు అయ్యాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో.. చంద్రుడి అవతలి వైపు రూపానిదే. చంద్రుడి అవతలి రూపాన్ని 1959, అక్టోబర్ 4న రష్యన్ వ్యోమనౌక లూనా-3 ఫొటో తీసింది. అంతరిక్షంలోకి తొలి ఉపగ్రహం ‘స్పుత్నిక్’ను పంపి రెండేళ్లు అయిన సందర్భంగా.. రష్యా లూనా-3ని నింగికి పంపింది. కానీ.. లూనా-3లో ఉన్న కెమెరా ఫిల్మ్ డెవలప్మెంట్ వ్యవస్థ అనుకున్నంత బాగా పనిచేయలేదు. రేడియో తరంగాల ద్వారా చిత్రాలను భూమికి పంపడంలోనూ నాణ్యత దెబ్బతిని మొత్తానికి అస్పష్ట చిత్రాలు.. తర్వాత ఎట్టకేలకు స్పష్టమైన చిత్రాలు అందాయి. ఇంకేం.. చంద్రుడి అవతలి రూపాన్ని చూసిన పదేళ్లకే మనిషి అక్కడ పాదం మోపాడు!