సాక్షి, న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో దేశంలో అందుబాటులోకి రానున్న రష్యా స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ ధర రూ.995.40గా ఉండనుంది. రష్యానుంచి దిగుమతి చేసుకునే ఈ వ్యాక్సిన్ ధరను డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ శుక్రవారం వెల్లడించింది. దిగుమతి చేసుకున్న మోతాదుల ధరలో మోతాదుకు ఐదు శాతం జీఎస్టీ ఉంటుంది. భారతదేశంలో తయారైతే ఈ టీకా ధర ఇంకా కొంచెం చౌకగా అందుబాటులోకి వస్తుందని డా.రెడ్డీస్ తెలిపింది.
వచ్చే వారం నుంచి స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ మార్కెట్లో లభించే అవకాశం ఉందని కేంద్రం గురువారం తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో సీరం ఉత్పత్తి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాలు లభిస్తున్నాయి. వాక్సిన్ కొరత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో రష్యా వాక్సిన్ రాకతో ఆ కొరత తీరే అవకాశం ఉందని భావిస్తున్నారు. 91.6 శాతం సామర్థ్యం కలిగిన స్పుత్నిక్-వీ భారతదేశంలో ఉపయోగం కోసం ఆమోదించబడిన మూడవ టీకా అయిన సంగతి తెలిసిందే.
Imported doses of Sputnik V #COVID19 vaccine are presently priced at Rs 948 + 5% GST per dose, with the possibility of a lower price point when local supply begins: Dr. Reddy’s Laboratories pic.twitter.com/bEowM6ZhZY
— ANI (@ANI) May 14, 2021
చదవండి : కోవీషీల్డ్ డోసుల గ్యాప్: పూనావాలా స్పందన
గుడ్ న్యూస్: స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి
కోవిడ్ ఫండ్: క్రిప్టో కరెన్సీ బిలియనీర్ భారీ విరాళం
Comments
Please login to add a commentAdd a comment