Russia's Sputnik V Covid-19 Vaccine To Be Available In Market From Early Next Week: Govt Official - Sakshi
Sakshi News home page

గుడ్ న్యూస్: స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి

Published Thu, May 13 2021 5:20 PM | Last Updated on Thu, May 13 2021 8:42 PM

 Russia Sputnik Vvaccine to be available in market from early next week: Govt - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా కరోనా  వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న సమయంలో కేంద్రం  శుభవార్త చెప్పింది. ర‌ష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ టీకా  త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ వ్యాక్సిన్‌ భారతదేశానికి చేరుకోనుందని వచ్చే వారం నాటికి మార్కెట్లో లభించే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.

దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ విలేకరుల సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకేపాల్ ఈ ప్రకటన చేశారు. ప్రపంచంలోని మొట్టమొదటి వ్యాక్సిన్‌గా భావిస్తున్న స్పుత్నిక్-వీ టీకా స్థానిక ఉత్పత్తి జూలైలో ప్రారంభమవుతుందన్నారు.  దాదాపు 15.6 కోట్ల మోతాదులను తయారు చేయవచ్చని అంచనా  వేస్తున్నామని తెలిపారు. రష్యాకు చెందిన గమలేయ నేషనల్ సెంటర్ అభివృద్ధి చేసిన  స్పుత్నిక్-వీ టీకాను హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ తయారు చేయనుంది. ఎఫ్‌డిఎ, డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదించిన ఏ కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు  అయినా భారత్‌లో అనుమతి ఉంటుందని ఒకటి రెండు రోజుల్లో స్పుత్నిక్-వీ టీకాకు దిగుమతి లైసెన్స్ మంజూరు కానుందని  పాల్ తెలిపారు దీంతో కోవాగ్జిన్‌, కోవ్‌షీల్డ్, స్పుత్నిక్-వీ ఈ మూడు వ్యాక్సిన్‌లకు మాత్రమే దేశంలో విక్రయానికి  అనుమతి ఉందని ఆయన తెలిపారు.  దేశంలో  రెండో దశలో క‌రోనా ఉధృతి  పెరుగుతున్న నేప‌థ్యంలో మూడో ద‌శ వ్యాక్సినేష‌న్‌ ప్రక్రియ మ‌రింత వేగ‌వంతం చేయనుంది.

చదవండి : కరోనా: సీనియర్‌ వైద్యుల మూకుమ్మడి రాజీనామా 
రెండు రోజులుగా ఆకలితో.. అమ్మ, సోదరుడి శవాల పక్కనే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement