
సాక్షి, హైదరాబాద్: భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి కరోనా వైరస్ అంతానికి సంబంధించి స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు కొన్ని వారాల్లోనే అనుమతి లభించవచ్చని ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ భావిస్తోంది. తాజాగా ఒక వెబినార్ సందర్భంగా కంపెనీ ఏపీఐ, సర్వీసెస్ సీఈవో దీపక్ సప్రా ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాక్సిన్ ప్రయోగాలకు సంబంధించిన డేటా ప్రస్తుతం ఔషధ నియంత్రణ సంస్థ వద్ద ఉందని తెలిపారు.
91.6 శాతం సామర్థ్యంతో ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ పనిచేస్తున్నట్టు చెప్పారు. భారత్‌తోపాటు పలు దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో (ఆర్‌డీఐఎఫ్) డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. రష్యా, భారత్, యూఏఈతోపాటు ఇతర దేశాల్లోనూ స్పుతి్నక్–వి వ్యాక్సిన్ ఔషధ పరీక్షలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment