మరో గుడ్‌న్యూస్‌: త్వరలోనే సింగిల్‌ డోస్‌​ వ్యాక్సిన్‌ | Single dose vaccine in India soon? RDIF plans to bring Sputnik V Light | Sakshi
Sakshi News home page

మరో గుడ్‌న్యూస్‌: త్వరలోనే సింగిల్‌ డోస్‌​ వ్యాక్సిన్‌

Published Fri, May 14 2021 9:26 PM | Last Updated on Fri, May 14 2021 9:44 PM

Single dose vaccine in India soon? RDIF plans to bring Sputnik V Light - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ శుక్రవారం లాంచ్‌ చేసింది. త్వరలోనే ఇది మార‍్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో తొలిడోస్‌ను హైదరాబాద్‌లో వేసింది కూడా. ఈ క్రమంలో మరో గుడ్‌ న్యూస్‌ను ఫార్మా దిగ్గజం వెల్లడించింది.  కరోనా నివారణలో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) స్పుత్నిక్-వీ సింగిల్-డోస్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వీ లైట్‌’ను త్వరలో భారత్‌కు తీసుకురావాలని యోచిస్తోంది.

ఈ సందర్భంగా వర్చువల్ సమావేశంలో ఆర్‌డీఐఎఫ్‌ సీఈఓ కిరిల్ డిమిత్రోవ్ మాట్లాడుతూ, త్వరలోనే భారతదేశంలో స్పుత్నిక్-వీ లైట్‌ను కూడా లాంచ్‌ చేయాలని భావిస్తున్నామన్నారు. అదే జరిగితే సింగిల్‌ డోస్‌ స్పుత్నిక్-వీ లైట్  దేశంలో విడుదలైన తొలి టీకా అవుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా, జాన్సన్ అండ్‌  జాన్సన్‌ మాత్రమే సింగిల్-మోతాదు వ్యాక్సిన్‌ తీసుకొచ్చింది. స్థానిక సరఫరా ప్రారంభమైనప్పుడు టీకా ధర తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది దేశంలో 850 మిలియన్లకు పైగా టీకాలను ఉత్పత్తి చేయాలని రష్యా భావిస్తోందని డిమిత్రోవ్ చెప్పారు. (సింగిల్‌ డోస్ స్పుత్నిక్ లైట్ వచ్చేసింది: రష్యా)

మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న సమయంలో భారతీయులు ఆరోగ్యంగాసురక్షితంగా ఉండేలా దేశీయ టీకా డ్రైవ్‌కు తోడ్పడటం తమ అతిపెద్ద ప్రాధాన్యత అని సంస్థ కో-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్  జీవీ ప్రసాద్ వెల్లడించారు.అత్యంత ప్రభావవంతమైన ఈ టీకా తయారీని త్వరలోనే దేశంలో మొదలవుతుందన్నారు.  91.6 శాతం ప్రభావవంతమైన ఈ వ్యాక్సిన్‌  ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెండింటి కంటే ఎక్కువ సమర్థత రేటు దీని సొంతమని తెలిపారు. డబుల్ డోస్ స్పుత్నిక్-వీ ని భారత మార్కెట్లో విడుదల చేసిది. టీకా ధర మోతాదుకు రూ .995.(రూ .948 + 5శాతం జీఎస్‌టీ)గా నిర్ణయించిన సంగతి  తెలిసిందే.

చదవండి: కోవిడ్‌ మరణాల లెక్కలు: ఐహెచ్‌ఎంఈ షాకింగ్‌ స్టడీ

దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ ధర ఎంతంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement