Dr Reddys Laboratories
-
ప్రాణాంతక వ్యాధికి మందు తయారుచేయనున్న డా.రెడ్డీస్
ప్రాణాంతక హైపోవొలెమిక్ షాక్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే సెంథాక్విన్ ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తయారుచేసి విక్రయించనుంది. అయితే ఈ డ్రగ్‌ను తయారుచేసేందుకు అమెరికాకు చెందిన ఫార్మాజ్ ఇంక్., అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తెలిపింది. కొత్త ఔషధాలను మనదేశంలో అందుబాటులోకి తీసుకురావడానికి ఫార్మాజ్ ఇంక్., తో భాగస్వామ్యం ఉపకరిస్తుందని డాక్టర్ రెడ్డీస్ సీఈఓ (బ్రాండెడ్ మార్కెట్స్) ఎంవీ రమణ ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం సెంథాక్విన్ ఔషధాన్ని భారత్‌లో విక్రయించడానికి పూర్తి హక్కులు డాక్టర్ రెడ్డీస్‌కు లభిస్తాయి. ‘లైఫాక్విన్’ బ్రాండు పేరుతో ఈ మందును మనదేశంతో పాటు నేపాల్‌లో విక్రయించడానికి సంస్థ సిద్ధపడుతోంది. ఎవరికైనా శస్త్రచికిత్స చేసినప్పుడు, లేదా డయేరియా, వాంతులు, ట్రామా.. తదితర సందర్భాల్లో రోగికి తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తవచ్చు. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో హైపోవొలెమిక్ షాక్ అని పరిగణిస్తారు. ఇదీ చదవండి: ఇంజిన్‌లో సమస్య.. 16వేల కార్లను రీకాల్ చేసిన ప్రముఖ కంపెనీ -
ప్రపంచంలో ప్రతీది ప్రకృతితో ముడిపడి ఉంటుంది: జి.వి. ప్రసాద్
ఒక ఫొటో వెయ్యి పదాలకు సమానం. పక్షులు, వన్య్రప్రాణల ఫొటోలు తీయాలంటే, గంటల కొద్దీ వేచి చూడాలి. వాటి ప్రశాంతతకు భంగం కలగకుండా ఫొటోలు తీయడం కత్తిమీద సాములాంటిదే. పారిశ్రామికవేత్త, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.వి. ప్రసాద్‌కి మాత్రం అది ఆటవిడుపు. ఆయన దేశ విదేశాల్లో పర్యటించి తీసిన ఫొటోలతో ఇటీవల ‘ది బర్డ్స్ అండ్ బిలీఫ్స్’ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా... సాక్షితో సంభాషణ. ►ఔషధాల తయారీ రంగంలో తీరిక లేకుండా ఉండే మీకు, పక్షుల కోసం పర్యటనలు, ఫొటోగ్రఫీ హాబీ ఎప్పటి నుంచి? గత పది, పదిహేనేళ్లుగా ఫొటోగ్రఫీ చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి, స్వయంగా తీసిన ఫొటోల సమాహారమే ఈ పుస్తకం. కొన్ని ఫొటోలతో పుస్తకాన్ని తీసుకురావాలని, మరికొన్నింటితో ప్రదర్శన ఏర్పాటు చేయాలని నా ఆలోచన. గతంలో రెండు పుస్తకాలు ప్రచురించాను. ఒకటి అలాస్కా మీద, మరొకటి స్పితి వ్యాలీ. ఇది మూడో పుస్తకం. ► ‘బర్డ్స్ అండ్ బిలీఫ్స్’ లో మంచి కొటేషన్లు కూడా కనిపిస్తున్నాయి! నన్ను ప్రభావితం చేసే సూక్తులు కనిపించినప్పడు, విన్నప్పుడు పుస్తకంలో రాసుకోవడం నాకు పాతికేళ్లుగా అలవాటు. వాటిలో కొన్నింటిని ఇందులో పొందుపరిచాను. ఈ పుస్తకం నా అభిరుచికి, జ్ఞాపకాలకు నిలువుటద్దం. ►ఇందులో ఏఏ ప్రదేశాల పక్షులున్నాయి? మనదేశంలో దక్షిణాదిలో హైదరాబాద్, ఉత్తరాది నుంచి భరత్పూర్, కాన్హా నేషనల్ పార్క్. ఆఫ్రికా ఖండంలో కెన్యా, టాంజానియా, బొట్సువానా, నార్త్ ఆర్కిటిక్, అంటార్కిటికా తదితర ప్రాంతాల పక్షుల ఫొటోలున్నాయి. ఆంటార్కిటికాలో పెంగ్విన్స్ కూడా తీశాను. నార్త్ అమెరికాలో అలాస్కా కూడా కవర్ చేశాను. ఈ ప్రాంతాలలో కనిపించే పక్షులతో పాటు క్షీరదాలు, ప్రకృతి ఫొటోలూ తీశాను. కానీ, ఈ పుస్తకాన్ని మాత్రం పక్షుల కోసమే కేటాయించాను. ►వలస పక్షులు భారీగా వచ్చే ఆంధ్రప్రదేశ్, పులికాట్ సరస్సుకు వెళ్లారా? వెళ్లాను, ఫ్లెమింగో ఫొటోలు తీశాను. కానీ ఈ పుస్తకంలో ప్రచురించలేదు. ► బర్డ్ వాచింగ్ కోసం విభిన్నమైన అనేక ప్రాంతాలను సందర్శించారు. మీకు బాగా నచ్చిన ప్రదేశం, సందర్భం, ఫొటో ఏది? అలాస్కాలో ల్యాండ్ స్కేప్‌లు, మంచినీటి సరస్సులు, ఉప్పు నీటి చెరువులు, పొరలు పొరలుగా పేరుకుపోయిన మంచు... మొత్తంగా చూస్తే ప్రకృతి అద్భుతంగా స్ఫూర్తిదాయంగా అనిపిస్తుంటుంది. పెద్ద ఎలుగుబంట్లు, బాల్డ్ ఈగల్స్, సాల్మన్ చేపలతో పాటు రకరకాల చేపలుంటాయి. సముద్రం నుంచి మంచి నీటి సరస్సుల వైపుకు గుంపులుగా వచ్చే చేపల్ని చూడడం వర్ణించలేనటువంటి అనుభూతి. అలాగే మరొకటి... ఆఫ్రికాలో ప్రాణులు వలస వెళ్లడం. వైల్డ్ బీస్ట్ పెద్ద సంఖ్యలో నదిని దాటుతున్న దృశ్యం ఇప్పటికీ కళ్లముందు కదలాడుతోంది. ► ఆర్నిథాలజిస్టు ఆశిష్, కెమెరా మెళకువలు నేర్పిన సురేశ్ చిత్తూరి గురించి మీ పుస్తకంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు! ఆశిష్‌తో చాలా ఏళ్ల పరిచయం. వాళ్ల పిల్లలు, మా పిల్లలు క్లాస్మేట్స్. బర్డ్ వాచింగ్‌ను పరిచయం చేసింది ఆయనే. ఇక శ్రీనివాస హ్యాచరీస్ సురేశ్ చిత్తూరి కూడా నాకు మంచి మార్గదర్శి. ► ఎన్నిరకాల పక్షులను ఫొటో తీశారు? రెండువందలకు పైగా పక్షి జాతులను ఫొటో తీశాను. ► మీ పుస్తకంలో పాలపిట్ట, కాకి, కోకిల కనిపించాయి. కానీ రామచిలుక కనిపించలేదు! అలాగే కొల్లేటి కొంగలు, చిల్కా సరస్సులో విహరించే పక్షులను మేము తర్వాతి పుస్తకంలో చూడవచ్చా? రామచిలుకల ఫొటో తీశాను. కానీ, పుస్తకానికి ఫొటోల ఎంపికలో వదలిపెట్టాను. కొల్లేరు వెళ్లలేదు. చిల్కా సరస్సుకు వచ్చే ఏడాది వెళదామనుకుంటున్నాను. ► మీ నేపథ్యం మొత్తం హైదరాబాదేనా? లేదు, పాక్షిక హైదరాబాదీని. నాల్గవ తరగతి వరకు హైదరాబాద్‌లో చదివాను. తర్వాత నెల్లూరులో 12వ తరగతి వరకు, రెండున్నరేళ్లు చెన్నై అన్నా యూనివర్సిటీ, ఆ తర్వాత చికాగోలో ఇలినాయీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజినీరింగ్, మాస్టర్స్ పర్డ్యూ (Purdue University) యూనివర్సిటీలో పూర్తి చేసి హైదరాబాద్‌కి వచ్చాను. ► పుస్తకం విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని వన్య్ర΄ాణుల సంరక్షణ కోసం విరాళమని ప్రకటించారు. వన్య్రప్రాణుల సంరక్షణలో ప్రభుత్వం తగినంత శ్రద్ధ చూపట్లేదని అనుకుంటున్నారా? ప్రభుత్వం వన్య్రప్రాణుల సంరక్షణకు పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తోంది. కానీ, ప్రభుత్వం ఒక్కటే అన్నింటినీ పరిష్కరించలేదు. వ్యక్తుల విరాళాలు చాలా ఉపయోగ పడతాయి. పర్యావరణం, వన్య్రప్రాణుల పరిరక్షణ ముఖ్యమైన అంశం అని నేను మద్దతు ఇస్తున్నాను. ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తున్నాం. పుస్తక విక్రయాలతో వచ్చే డబ్బు నాకవసరం లేదు. ఉచితంగా ఇస్తే పుస్తకం గౌరవం తగ్గిపోతుంది. అందుకే విక్రయాలను మంచి పనికి విరాళంగా ఇవ్వాలనుకున్నాను. ► అంజిరెడ్డి (డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ వ్యవస్థాపకులు)గారు చెప్పినట్లుగా మన కుండ నిండిన తర్వాత, అదనంగా వచ్చి పడుతున్న నీటిని మరొకరికి ఉపయోగపడేలా చేయాలి అనే సూత్రాన్ని పాటిస్తున్నారా? ఆయన నుంచి అలాగే మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్నదేమిటి? మా నాన్నగారు (గ్రీన్ పార్క్ హోటల్ వ్యవస్థాపకులు) చాలా డీటెయిల్ ఓరియెంటెడ్. మనం చేస్తున్న పని గురించి సూక్ష్మ స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని చెబుతారు. వివరాలన్నీ సమగ్రంగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడేవారు. మా మామగారు (అంజిరెడ్డి) విజన్ చాలా విస్తృతమైనది. వారిద్దరినీ ఒకే ’ఫ్రేమ్’లో చె΄్పాలంటే... ‘అడవి అందులో చెట్లు’ అని చెప్పవచ్చు. అంజిరెడ్డి గారి ద్వారా అడవిని చూస్తే, మా నాన్న గారి ద్వారా అందులో వృక్షాలను చూశాను. ► పాఠకులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ‘ప్రపంచంలోని ప్రతిదీ ప్రకృతితో ముడిపడి ఉంటుంది. మన ఆరోగ్యం అడవి ఆరోగ్యంతో ముడిపడి ఉంది. మన శ్రేయస్సు కోసం ప్రకృతి పరిరక్షణ తప్పనిసరి’ అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ ‘కొంతవరకైనా ప్రకృతితో మమేకమవుదాం’ అనుకుంటే... ప్రకృతి పరిరక్షణ కోసం చేయగలిగిన చిన్న చిన్న పనులు అందరమూ చేయగలుగుతాం. శాస్త్రీయతకు గౌరవం డాక్టర్ రెడ్డీస్ సంస్థలో 1990 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్న జీవీ ప్రసాద్ ఆ సంస్థ ఎదుగుదల, 66 దేశాలకు విస్తరణలో తనవంతుగా విశేషమైన కృషి చేశారు. సశాస్త్రీయమైన పరిశోధనల పరంపరలో ఆయనను వరించిన కొన్ని ప్రత్యేక గుర్తింపులు... పురస్కారాలివి. వైపీఓ గ్లోబల్ ఇంపాక్ట్ అవార్డు– 2020 వి. కృష్ణమూర్తి అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ బై ద సెంటర్ ఫర్ ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్, 2019 బౌండరీ బ్రేకర్ లీడర్ అవార్డ్, సీఈఓ అవార్డ్స్ 2018 ఇండియా బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ బై సీఎన్‌బీసీ ఆసియా, 2015 ఇండియాస్ బెస్ట్ సీఈవో బై బిజినెస్ టుడే, 2014 ఇండియా టాలెంట్ మేనేజ్మెంట్ అవార్డ్ బై సీఎన్‌బీసీ ఆసియా, 2014 ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
డాక్టర్ రెడ్డీస్‌కు ప్రిమ్సివ్ ట్రేడ్‌మార్క్ హక్కులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫైజర్ ప్రోడక్ట్స్ నుంచి ప్రిమ్సివ్ ఔషధానికి సంబంధించి భారత మార్కెట్లో ట్రేడ్‌మార్క్ హక్కులను దక్కించుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) తెలిపింది. బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో దీన్ని ఉపయోగిస్తారు. 2022 మే నుంచి ఫైజర్ ప్రోడక్ట్స్ ఇండియా తో కలిసి డీఆర్ఎల్ ఈ బ్రాండును భారత్‌లో మా ర్కెటింగ్ చేస్తోంది. తాజాగా ట్రేడ్‌మార్క్ హక్కులు కొనుగోలు చేయడంతో ఇకపై ఇందులో ఉపయో గించే ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్)ను, ఔ షధాన్ని తమ ప్లాంట్లలో ఉత్పత్తి చేయనుంది. దీనితో ఈ ఔషధం ధర దాదాపు 85 శాతం మేర తగ్గనుంది. చదవండి: ఆటో ఎక్స్పో 2023: ఎలక్ట్రిక్ వాహనాలే హైలైట్, 5 మోడళ్లు ప్రపంచంలో తొలిసారి -
డాక్టర్ రెడ్డీస్ రూ. 1,500 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) వ్యాపార విస్తరణపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇందులో సింహభాగం బయోసిమిలర్స్, ఇంజెక్టబుల్స్ తదితర విభాగాల సామర్థ్యాల పెంపు కోసం వినియోగించనుంది. అలాగే ప్రస్తుత ప్లాంట్ల విస్తరణ, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలను మెరుగుపర్చుకోవడం, డిజిటైజేషన్ ప్రాజెక్టులు మొదలైన వాటిపైనా ఇన్వెస్ట్ చేయనుంది. ఆనలిస్ట్‌లతో సమావేశంలో సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ ఈ విషయలు తెలిపారు. ఏడాదికి 30–40 ఉత్పత్తులు కాకుండా అర్ధవంతమైన వృద్ధికి అవకాశాలు ఉన్న 20–25 ఉత్పత్తులనైనా ప్రవేశపెట్టడంపై మరింతగా దృష్టి సారిస్తున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. పనితీరు అంతగా బాగాలేని కొన్ని బ్రాండ్లను సరిచేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఆయన వివరించారు. గత కొన్నేళ్లుగా పాటిస్తున్న వైవిధ్య వ్యాపార వ్యూహాల కారణంగా కేవలం ఒక మార్కెట్ లేదా ఒక నిర్దిష్ట అవకాశంపై ఆధారపడే పరిస్థితులను, రిస్కులను తగ్గించుకోగలిగామని ఇజ్రేలీ చెప్పారు. ప్రస్తుత భౌగోళిక .. రాజకీయ .. ఆర్థిక అనిశ్చితులు, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్లు, కరెన్సీ హెచ్చుతగ్గులు మొదలైన సవాళ్లు నెలకొన్న కష్టసమయంలోనూ వృద్ధి సాధించేందుకు ఈ వ్యూహాలే తమకు తోడ్పడగలవని పేర్కొన్నారు. -
రెడ్డీస్ ల్యాబొరేటరీస్ దూకుడు..! జర్మన్ కంపెనీ రెడ్డీస్ చేతిలోకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తాజాగా జర్మనీకి చెందిన నింబస్ హెల్త్‌ను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు నిశ్చయాత్మక ఒప్పందం కుదిరిందని కంపెనీ గురువారం ప్రకటించింది. అయితే డీల్ విలువను రెడ్డీస్ వెల్లడించలేదు. ఔషధాల తయారీలో ఉపయోగించే గంజాయిని టోకుగా విక్రయించేందుకు నింబస్ హెల్త్‌కు జర్మనీలో లైసెన్స్ ఉంది. సంబంధిత ఔషధాలను ప్రవేశపెట్టేందుకు ఈ కంపెనీ కొనుగోలు దోహదం చేస్తుందని రెడ్డీస్ వెల్లడించింది. ‘అధిక వైద్య అవసరాలను పరిష్కరించడానికి, చికిత్సకు ఔషధ గంజాయిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా నొప్పి నివారణ, నరాల సంబంధ సమస్యలకు వినియోగిస్తున్నారు. ఔషధ గంజాయిపై అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం మేము తప్పనిసరిగా ఉండాల్సిన విభాగం అని నమ్ముతున్నాం’ అని డాక్టర్ రెడ్డీస్ యూరోపియన్ జనరిక్స్ హెడ్ ప్యాట్రిక్ అఘానియన్ తెలిపారు. 2017లో జర్మనీ పార్లమెంట్ చట్టబద్ధం చేయడంతో ఔషధ గంజాయికి కొన్నేళ్లుగా డిమాండ్ పెరుగుతోంది. జర్మనీలో ఔషధ గంజాయి విపణి గతేడాది 25 శాతం అధికమై రూ.1,030 కోట్లుంది. చదవండి: విదేశాలకు లక్ష కియా కార్లు -
చిన్నపిల్లలకు వ్యాక్సిన్ త్వరగా తీసుకురండి: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: చిన్న పిల్లలకు అవసరమైన వ్యాక్సిన్ ప్రయోగాలు త్వరితగతిన విజయవంతం చేసి కరోనా బారి నుంచి వారిని కాపాడవలసిన ఆవశ్యకత ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. కోవిడ్ –19పై పోరాటంలో టీకా శాశ్వత రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ప్రతినిధులతో శనివారం గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. డా.రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి వస్తున్న స్పుత్నిక్–వి వ్యాక్సిన్ దిగుమతి, మన దేశంలో తయారీ, పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి డీఆర్డీవో సంయుక్త భాగస్వామ్యంతో 2 డీజీ ఔషధం రావడం, ఇది సంపూర్ణ దేశీయ ముడిసరుకుతో తయారు చేయడం ఆత్మనిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా ఉందని గవర్నర్ ప్రశంసించారు. అయితే వ్యాక్సిన్ ఉత్పత్తి వేగవంతం చేయాలని తయారీదారులకు తమిళిసై సూచించారు. ఈ జూలై నెలాఖరు వరకు దాదాపు రెండు కోట్ల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డోసులు దిగుమతి చేసుకుంటామని రెడ్డీస్ లేబొరేటరీస్ ప్రతినిధులు గవర్నర్‌కు తెలిపారు. ఈ సంవత్సరం ఆఖరి వరకు దిగుమతులు, మన దేశంలో తయారీ ద్వారా దాదాపు 15 నుంచి 20 కోట్ల వరకు వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్టు డా.పి.సౌందరరాజన్ పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో స్పుత్నిక్ టీకాలు షురూ!
బంజారాహిల్స్: రష్యా తయారీ స్పుత్నిక్–వి టీకాల కార్యక్రమం హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో తొలిడోసును డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఫార్మా సంస్థకు చెందిన ఒక ఉద్యోగికి వేశారు. మన దేశంలో ప్రస్తు తం స్పుత్నిక్ టీకాలను రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఆ సంస్థతో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ భాగస్వా మ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం రెడ్డీస్ ల్యాబ్స్ దిగుమతి చేసుకున్న మొదటి బ్యాచ్ 1.50 లక్షల స్పుత్నిక్ డోసులను వేయనున్నామని, నెల రోజుల వ్యవధిలో మొత్తంగా 10 లక్షల డోసులు రానున్నా యని అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి వెల్లడించారు. తమ నెట్వర్క్ వ్యాప్తం గా టీకా కేంద్రాలను తెరిచి, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అపోలో హాస్పిటల్స్, అపోలో క్లినిక్స్ సహా 60కిపైగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆస్పత్రి ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ డివిజన్ అధ్యక్షుడు కె.హరిప్రసాద్ తెలిపారు. రెడ్డీస్ ల్యాబ్స్ బ్రాండెడ్ మార్కెట్స్ సీఈవో ఎంవీ రమణ మాట్లాడుతూ.. తొలి బ్యాచ్ టీకాను హైదరాబాద్, విశాఖలో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని, త్వరలోఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతాలో మొదలుపెడతామని వెల్లడించారు. -
భారత్‌లో త్వరలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్!
సాక్షి, హైదరాబాద్: భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి కరోనా వైరస్ అంతానికి సంబంధించి స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు కొన్ని వారాల్లోనే అనుమతి లభించవచ్చని ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ భావిస్తోంది. తాజాగా ఒక వెబినార్ సందర్భంగా కంపెనీ ఏపీఐ, సర్వీసెస్ సీఈవో దీపక్ సప్రా ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాక్సిన్ ప్రయోగాలకు సంబంధించిన డేటా ప్రస్తుతం ఔషధ నియంత్రణ సంస్థ వద్ద ఉందని తెలిపారు. 91.6 శాతం సామర్థ్యంతో ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ పనిచేస్తున్నట్టు చెప్పారు. భారత్‌తోపాటు పలు దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తో (ఆర్డీఐఎఫ్) డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. రష్యా, భారత్, యూఏఈతోపాటు ఇతర దేశాల్లోనూ స్పుతి్నక్–వి వ్యాక్సిన్ ఔషధ పరీక్షలు జరిగాయి. -
వ్యాక్సిన్: డాక్టర్ రెడ్డీస్ కీలక ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన వేళ దేశీ ఫార్మసీ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కీలక ప్రకటన చేసింది. రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వీ’ వ్యాక్సిన్‌కు సంబంధించి భారత్‌లో త్వరలోనే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి అనుమతి పొందినట్లు శనివారం వెల్లడించింది. 1500 మందిపై వైద్య పరిశోధనలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. రెండో దశ ఫలితాలు పరిశీలించిన అనంతరం, స్పుత్నిక్ వీ టీకా గురించి ఆందోళనలు అవసరం లేదని, డేటా అండ్ సేఫ్టీ మానిటరింగ్ బోర్డు(డీఎస్ఎంబీ) ఫేజ్ 3 ప్రయోగాలకు పచ్చజెండా ఊపినట్లు డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు సంస్థ ఎండీ, కో- చైర్మన్ జీవీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణలో ఇదొక మైలురాయి వంటిది. భారతీయుల కోసం ప్రభావంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్‌ను తీసుకువచ్చేందుకు ఈ నెలలోనే మూడో దశ ప్రయోగాలు ప్రారంభించనున్నాం’’ అని తెలిపారు. కాగా రష్యాలోని మైక్రోబయోలజీ, ఎపిడిమాలజీ గమాలియా జాతీయ పరిశోధన సంస్థ స్పుత్నిక్ వీ టీకాను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. స్థానిక ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు లభిండంతో, మార్కెట్లోకి విడుదల చేసిన తొలి కరోనా నిరోధక వ్యాక్సిన్‌గా నిలిచింది. (చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ) ఈ టీకా 91.4 శాతం ప్రభావంతంగా పనిచేస్తుందని రష్యా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తొలుత కొన్ని దేశాలు సందేహం వ్యక్తం చేశాయి. అయితే ఇప్పుడు యూఏఈ, ఈజిప్టు, వెనిజులా, బెలారస్ వంటి దేశాల్లో స్పుత్నిక్ వీ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతుండగా, అల్జీరియా, అర్జెంటీనా, బొలీవియా, సెర్బియా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాయి. ఇక భారత్‌లో స్పుత్నిక్ వీ పంపిణీ హక్కులను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబరులో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. కాగా దేశీయంగా తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ల టీకా డోసులను నేడు ప్రజలకు అందజేస్తున్న విషయం తెలిసిందే. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 720 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 720 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ. 1,092 కోట్లతో పోలిస్తే లాభం సుమారు 30 శాతం తగ్గింది. కొన్ని ఉత్పత్తులను అవుట్–లైసెన్సింగ్ చేయడం, పన్నుపరమైన ప్రయోజనాలు వంటివి కూడా గతంలో కలిపి చూపించిన నేపథ్యంలో .. దానితో పోల్చితే తాజా క్యూ2లో లాభం తగ్గిందని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) సౌమేన్ చక్రవర్తి తెలిపారు. ఉత్పాదకత మెరుగుపడటం, సానుకూల విదేశీ మారక రేట్ల ఊతంతో స్థూల లాభాల మార్జిన్‌పై ప్రతికూల ప్రభావం కొంత తగ్గిందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన ఉత్పత్తులతో పాటు కోవిడ్ చికిత్సలో ఉపయోగపడే అవకాశాలు ఉన్న పలు ఔషధాలపై తమ పరిశోధన బృందాలు కసరత్తు చేస్తున్నాయని డీఆర్ఎల్ సహ చైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. మరిన్ని విశేషాలు.. n కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం తదితర అంశాల ఊతంతో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయం 21 శాతం పెరిగి రూ. 3,980 కోట్లుగా నమోదైంది. n ఉత్తర అమెరికా మార్కెట్ 28% పెరిగి రూ. 1,830 కోట్లకు చేరింది. విదేశీ మారకం రేటు అనుకూలత, కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టడం ఇందుకు దోహదపడింది. n యూరప్ ఆదాయాలు 36% పెరిగి రూ. 380 కోట్లకు చేరాయి. కొత్తగా ఆస్ట్రియా మార్కెట్లోకి కూడా కంపెనీ ప్రవేశించింది. అటు వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 4% వృద్ధితో రూ. 860 కోట్లకు చేరింది. రూబుల్ బలహీనపడటం రష్యాలో ఆదాయంపై ప్రభావం చూపింది. n భారత్ మార్కెట్లో ఆదాయం 21 శాతం వృద్ధి చెంది రూ. 910 కోట్లకు చేరింది. వొకార్డ్ వ్యాపారం కొనుగోలు, కొత్త ఉత్పత్తుల అమ్మకాలు ఇందుకు తోడ్పడ్డాయి. n ఫార్మాసూటికల్ సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం 20 శాతం పెరిగి రూ. 850 కోట్లుగా నమోదైంది. బీఎస్ఈలో డీఆర్ఎల్ షేరు సుమారు 3 శాతం క్షీణించి రూ. 4,950 వద్ద క్లోజయ్యింది. సైబర్ దాడి ప్రభావమేమీ లేదు అక్టోబర్ 22న కంపెనీ సర్వర్లపై సైబర్ దాడులు చోటుచేసుకోవడంపై చక్రవర్తి స్పందించారు. దీనిపై సత్వరం బైటి సైబర్ సెక్యూరిటీ నిపుణుల సహాయం తీసుకున్నామని, కార్యకలాపాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడకుండా జాగ్రత్తపడ్డామని ఆయన తెలిపారు. ఇప్పటిదాకానైతే తమ విచారణలో డేటా చౌర్యం వంటివేమీ జరిగిన దాఖలాలేమీ బైటపడలేదని చక్రవర్తి వివరించారు. కోవిడ్–19 టీకా స్పుత్నిక్ వి రెండో దశ ట్రయల్స్ డిసెంబర్ నాటికి పూర్తి కాగలవని సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. పరిస్థితులను బట్టి మూడో దశ పరీక్షలు మార్చి ఆఖరు నాటికి పూర్తి కావొచ్చన్నారు. మరోవైపు, సౌమేన్ చక్రవర్తి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో సీఎఫ్‌వోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారని కంపెనీ తెలిపింది. డిసెంబర్ 1న అగర్వాల్ బాధ్యతలు చేపడతారు. -
డాక్డర్ రెడ్డీస్ ల్యాబ్ నికర లాభం డౌన్
ఫార్మా రంగ హైదరాబాద్ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో నికర లాభం30 శాతం క్షీణించి రూ. 762 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 4,897 కోట్లను తాకింది. ఇబిటా 11 శాతం తక్కువగా రూ. 1,276 కోట్లుగా నమోదైంది. కాగా.. త్రైమాసిక ప్రాతిపదికన నికర లాభం 32 శాతం పుంజుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పేర్కొంది. ఇదేవిధంగా ఆదాయంలో 11 శాతం వృద్ధి సాధించినట్లు తెలియజేసింది. ఈ నెల 22న కంపెనీపై సైబర్ అటాక్ జరిగిన నేపథ్యంలో అన్ని కీలక కార్యకలాపాలనూ తగిన నియంత్రణతో తిరిగి ప్రారంభించినట్లు తెలియజేసింది. షేరు ఓకే ఫలితాల నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 1 శాతం వెనకడుగుతో రూ. 5,053 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 5,150 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 4,990 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. కాగా.. ఈ ఏడాది క్యూ2లో అన్ని మార్కెట్లలోనూ వృద్ధిని సాధించగలిగినట్లు ఫలితాల విడుదల సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ సహచైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రొడక్టివిటీ మెరుగుపడటంతో ఆర్‌వోసీఈ బలపడినట్లు తెలియజేశారు. కోవిడ్-19కు ఇప్పటికే విడుదలైన ప్రొడక్టులకుతోడు తమ రీసెర్చ్ టీమ్ మరిన్ని ఉత్పత్తులు, నివారణ పద్ధతులపై పరిశోధన చేస్తున్నట్లు వివరించారు. మార్జిన్లు వీక్ క్యూ2లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ స్థూల మార్జిన్లు 3.6 శాతం క్షీణించి 53.9 శాతానికి చేరగా.. నికర లాభ మార్జిన్లు 22.8 శాతం నుంచి 15.6 శాతానికి బలహీనపడ్డాయి. ఈ కాలంలో పరిశోధన, అభివృద్ధి వ్యయాలు 9 శాతం పెరిగి రూ. 436 కోట్లకు చేరగా.. గ్లోబల్ జనరిక్స్ బిజినెస్ 21 శాతం ఎగసి రూ. 3,984 కోట్లను అధిగమించింది. అయితే ప్రొప్రీటరీ ప్రొడక్టుల ఆదాయం 92 శాతం క్షీణించి రూ. 62 కోట్లను తాకింది. -
రష్యా వ్యాక్సిన్ వయా డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 వ్యాక్సిన్ విషయంలో భారత్‌లో పెద్ద ముందడుగు పడింది. ఈ ఏడాదే రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వి వ్యాక్సిన్ దేశంలో అడుగు పెట్టనుంది. ఈ వ్యాక్సిన్ మూడవ దశ ఔషధ పరీక్షలతోపాటు పంపిణీకై హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించిన తర్వాత రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఆర్డీఐఎఫ్ సరఫరా చేయనుంది. పరీక్షలు విజయవంతం అయి, వ్యాక్సిన్ నమోదు ప్రక్రియ పూర్తి అయితే.. ఈ ఏడాది చివరి నుంచే దేశంలో వ్యాక్సిన్ల డెలివరీ ఉండే అవకాశం ఉందని రెడ్డీస్ బుధవారం ప్రకటించింది. రష్యాకు చెందిన గమలేయ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ స్పుత్నిక్–వి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. నమ్మదగిన ఎంపిక... రష్యాలో 25 ఏళ్లుగా డాక్టర్ రెడ్డీస్‌కు సుస్థిర, గౌరవప్రద స్థానం ఉందని ఆర్డీఐఎఫ్ సీఈవో కిరిల్ దిమిత్రీవ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. హ్యూమన్ ఎడినోవైరస్ డ్యూయల్ వెక్టర్ ప్లాట్‌ఫాంపై ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేశామని, ఇది సురక్షితమైందని వివరించారు. వ్యాక్సిన్‌ను భారత్‌కు తీసుకు వచ్చేందుకు ఆర్డీఐఎఫ్తో భాగస్వామ్యం సంతోషంగా ఉందని డాక్టర్ రెడ్డీస్ కో–చైర్మన్, ఎండీ జి.వి.ప్రసాద్ అన్నారు. మొదటి, రెండవ దశ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని గుర్తు చేశారు. భద్రత, సమర్థత తెలుసుకునేందుకు, అలాగే భారత నియంత్రణ సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా మూడవ దశ ఔషధ పరీక్షలు దేశంలో జరుపనున్నట్టు వెల్లడించారు. భారత్‌లో కోవిడ్–19పై పోరులో స్పుత్నిక్–వి వ్యాక్సిన్ నమ్మదగిన ఎంపిక అని చెప్పారు. ఈ ఏడాది చివరిలో భారత్‌లో టీకా సరఫరా జరగవచ్చునని, మానవ ప్రయోగాలు వచ్చే నెల నుంచి మొదలుకావచ్చునని ఆర్డీఐఎఫ్ అధ్యక్షుడు దిమిత్రీవ్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ చెప్పారు. ప్రయోగాల ఫలితాల ఆధారంగా భారత్‌లో టీకా పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. స్పుత్నిక్–విపై ప్రస్తుతం రష్యాలో సుమారు 40 వేల మందిపై మూడో దశ మానవ ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటి ఫలితాలు అక్టోబర్/నవంబర్ నెలల్లో తెలిసే అవకాశం ఉంది. వయో వృద్ధులు, కోవిడ్–19 బారిన పడేందుకు అవకాశమున్న వారికి అత్యవసర పరిస్థితుల్లో స్పుత్నిక్–వి టీకా అందించే ఆలోచన చేస్తున్నట్లు భారత్ గత వారమే తెలిపిన నేపథ్యంలో తాజా పరిణామాలకు ప్రాధాన్యం ఏర్పడింది. రష్యా టీకాపై ఇప్పటివరకూ జరిగిన ప్రయోగాలు మెరుగైన పలితాలే ఇచ్చినట్లు మెడికల్ జర్నల్ ద లాన్సెట్ ఇటీవలే స్పష్టం చేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. దూసుకెళ్లిన షేరు.. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తో భాగస్వామ్యం వార్తల నేపథ్యంలో రెడ్డీస్ షేరు ధర దూసుకెళ్లింది. క్రితం ముగింపుతో పోలిస్తే బుధవారం షేరు ధర బీఎస్ఈలో 4.24 శాతం అధికమై రూ.4,631.55 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో షేరు ధర 4.69 శాతం ఎగసి రూ.4,651.95 వరకు వెళ్లింది. ఎన్ఎస్ఈలో కంపెనీ షేరు ధర 4.17 శాతం అధికమై రూ.4,442.35 వద్ద స్థిరపడింది. మళ్లీ మొదలైన ఆక్స్ఫర్డ్ టీకా ప్రయోగాలు కరోనా కట్టడికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాలు భారత్‌లో మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాల తరఫున భారత్‌లో సీరమ్ ఇన్స్టిట్యూట్ (సీఐఐ) నిర్వహిస్తున్న ఈ ప్రయోగాలకు అనుమతి ఇస్తూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) డాక్టర్. వి.జి.సోమాని బుధవారం ఆదేశాలు జారీ చేశారు. టీకా తీసుకున్న ఓ యూకే మహిళ అస్వస్థతకు గురైన నేపథ్యంలో సెప్టెంబ ర్ 11న ప్రయోగాలపై తాత్కాలిక నిషేధం విధించడం తెలిసిందే. అనారోగ్యానికి గురైన మహిళ సమాచారాన్ని మొత్తం సమీక్షించిన తరువాత యూకేలోనూ ప్రయోగాలను పునరుద్ధరించేందుకు అనుమతి లభించగా.. డీసీజీఐ కొన్ని నిబంధనలతో టీకాలు చేపట్టవచ్చునని సీఐఐకు ఆదేశాలు ఇచ్చారు. సీఐఐ ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని మంగళవారమే డీసీజీఐకి అందించగా అదే రోజుల ప్రయోగాల పునరుద్ధరణకు ఆదేశాలూ జారీ అయ్యాయి. కాకపోతే మరింత క్షుణ్ణంగా పరిశీలించాకే టీకా ఎవరికి ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాలని, కార్యకర్తల అనుమతి పత్రాల్లో కొన్ని మార్పులు సూచించింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 764 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నికర లాభం 76 శాతం పెరిగి రూ. 764.2 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 434.4 కోట్లు. తాజాగా గ్లోబల్ జనరిక్స్ వ్యాపార విభాగం గణనీయంగా వృద్ధి చెందడం, పన్నులపరమైన భారం కొంత తగ్గడం తదితర అంశాలు లాభాల వృద్ధికి దోహదపడ్డాయని సంస్థ సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి తెలిపారు. క్యూ4లో ఆదాయం 10 శాతం వృద్ధితో సుమారు రూ. 4,017 కోట్ల నుంచి దాదాపు రూ. 4,432 కోట్లకు పెరిగింది. కోవిడ్–19 వ్యాధి చికిత్సకు ఉపయోగపడే ఔషధాలను తయారు చేసేందుకు ఇతర సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సంస్థ ఎండీ జీవీ ప్రసాద్ వెల్లడించారు. అత్యధిక అమ్మకాలు.. నాలుగో త్రైమాసికంలో అత్యధిక స్థాయిలో విక్రయాలు నమోదు చేసినట్లు చక్రవర్తి తెలిపారు. వార్షికంగా ఆదాయాలు 13 శాతం, లాభాలు నాలుగు శాతం పెరిగాయని పేర్కొన్నారు. వార్షిక లాభాల వృద్ధికి పన్ను అంశంతో పాటు కనీస ప్రత్యామ్నాయ పన్ను (ఎంఏటీ) క్రెడిట్ కూడా తోడ్పడిందని వివరించారు. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం మెరుగ్గా సాగిందని సౌమేన్ చక్రవర్తి తెలిపారు. క్యూ4లో ఫార్మా సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు 6 శాతం పెరిగి రూ. 719.5 కోట్లకు చేరాయి. అంతర్జాతీయంగా జనరిక్స్ విభాగం ఆదాయం 20% పెరిగి రూ. 3,640 కోట్లకు చేరింది. ఇందులో ఉత్తర అమెరికా మార్కెట్ 21% పెరిగి రూ. 1,496 కోట్ల నుంచి రూ.1,807 కోట్లకు ఎగసింది. యూరప్ దేశాల్లో ఆదాయాలు 80% వృద్ధితో రూ. 345 కోట్లకు చేరింది. భారత మార్కెట్లో ఆదాయాలు 5% పెరిగాయి. కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ కారణంగా సరుకు రవాణా సంబంధ సమస్యలతో అమ్మకాలపై పాక్షికంగా ప్రభావం పడింది. 2019–20 ఏడాదికి గాను రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 25 తుది డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. -
రెడ్డీస్ చేతికి వొకార్డ్ జనరిక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్.. ఇదే రంగంలోని వొకార్డ్‌కు చెందిన కొన్ని విభాగాల బ్రాండెడ్ జనరిక్స్ దేశీ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుంది. ఈ మేరకు వొకార్డ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ బుధవారం వెల్లడించింది. ఇందులో భాగంగా భారత్‌తో పాటు నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్టీవుల బిజినెస్‌ను సైతం చేజిక్కించుకోనుంది. డీల్ విలువ రూ.1,850 కోట్లు. డీల్ ద్వారా వొకార్డ్‌కు చెందిన 62 బ్రాండ్లు డాక్టర్ రెడ్డీస్ పరంకానున్నాయి. శ్వాసకోస, కేంద్ర నాడీ మండల, చర్మ, జీర్ణకోశ, నొప్పుల విభాగాలకు చెందిన పలు బ్రాండ్లను రెడ్డీస్ సొంతం చేసుకోనుంది. వొకార్డ్‌కు చెందిన అమ్మకాలు, మార్కెటింగ్ టీమ్‌లతో పాటు.. హిమాచల్‌ప్రదేశ్‌లోని బడ్డిలో గల తయారీ ప్లాంటు సైతం డాక్టర్ రెడ్డీస్‌కు దక్కుతుంది. స్లంప్‌సేల్ ప్రాతిపదికన ఈ డీల్ కుదుర్చుకున్నట్లు రెడ్డీస్ వెల్లడించింది. భారత మార్కెట్ తమకు ముఖ్యమని, వొకార్డ్ వ్యాపారాల కొనుగోలుతో ఇక్కడ మరింత విస్తరించేందుకు మార్గం సుగమం అయిందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కో–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. తాజా కొనుగోలుతో అధిక వృద్ధికి ఆస్కారమున్న విభాగాలలో కంపెనీకి మరిన్ని అవకాశాలు లభిస్తాయని వివరించారు. -
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభం 19% డౌన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ నికర లాభం 19 శాతం క్షీణించి రూ. 470 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ3లో ఇది రూ. 579 కోట్లు. ఇక తాజాగా ఆదాయం 7 శాతం క్షీణతతో రూ. 3,968 కోట్ల నుంచి రూ. 3,707 కోట్లకు తగ్గింది. ఉత్తర అమెరికా మార్కెట్లలో అమ్మకాలు మందగించడం లాభాల క్షీణతకు కారణమని శనివారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో కంపెనీ సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి తెలిపారు. నాలుగో త్రైమాసికంలోనూ అమెరికాలో ధరలపరమైన ఒత్తిళ్లు కొంత మేర ఉండొచ్చని కంపెనీ సీవోవో అభిజిత్ ముఖర్జీ పేర్కొన్నారు. అనుమతులు పొందే కొత్త ఔషధాల సంఖ్య తక్కువగానే ఉండొచ్చని వివరించారు. మరోవైపు, వెనెజులా, ఉత్తర అమెరికాల్లో అమ్మకాల తగ్గుదలతో సమీక్షాకాలంలో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయాలు 9 శాతం క్షీణించి రూ. 3,060 కోట్లకు పరిమితమయ్యాయి. కీలకమైన ఉత్తర అమెరికాలో ఆదాయాలు 15 శాతం తగ్గి రూ. 1,660 కోట్లకు క్షీణించాయి. దివీస్ లాభం 9 శాతం అప్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దివీస్ ల్యాబ్స్ నికర లాభం 9 శాతం పెరిగి రూ. 268 కోట్లకు చేరింది. ఇక ఆదాయం రూ. 860 కోట్ల నుంచి రూ. 976 కోట్లకు పెరిగింది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 మధ్య కాలంలో తమ విశాఖపట్నం ప్లాంట్‌లోని రెండో యూనిట్లో అమెరికా ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించినట్లు సంస్థ తెలిపింది. ఎఫ్‌డీఏ సూచనలకు సంబంధించి తాము చేపట్టిన దిద్దుబాటు చర్యలు మొదలైన వాటి గురించి ఇప్పటికే వివరణనిచ్చినట్లు పేర్కొంది. తదుపరి ఎఫ్‌డీఏ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది. -
డాక్టర్ రెడ్డీస్ చేతికి ఆరు బ్రాండ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తాజాగా డుసెర్ ఫార్మా నుంచి 6 ఓవర్-ది-కౌంటర్ (ఓటీసీ) బ్రాండ్స్‌ను కొనుగోలు చేసింది. తద్వారా అమెరికాలో బ్రాండెడ్ కన్జూమర్ హెల్త్ ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించినట్లయిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ సోనిగ్ తెలిపారు. అమెరికాలో తమ ఓటీసీ వ్యాపార విభాగం వృద్ధికి ఇవి తోడ్పడతాయని ఆయన చెప్పారు. డాక్టర్ రెడ్డీస్ కొనుగోలు చేసిన వాటిలో డోయాన్స్, బఫెరిన్, న్యూపర్ కైనాల్ ఆయింట్మెంట్, క్రూయెక్స్ నెయిల్ జెల్, కామ్ట్రెక్స్, మయోఫ్లెక్స్ ఉన్నాయి. ప్రధానంగా దగ్గు, జలుబు, చర్మ సమస్యలు మొదలైన వాటి చికిత్సలో వీటిని ఉపయోగిస్తారు. ఈ బ్రాండ్స్ కొనుగోలుకు ఎంత వెచ్చించారనేది కంపెనీ వెల్లడించలేదు. బుధవారం బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ షేరు 0.92 శాతం పెరిగి రూ. 3,053 వద్ద ముగిసింది. -
రెండేళ్లలో డాక్టర్ రెడ్డీస్ మార్జిన్ గెడైన్స్ 25%
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్: ఫార్మా వ్యాపారంలో లాభదాయకత పెంచేందుకు తక్కువ మార్జిన్లున్న ఉత్పత్తులను వదిలించుకొని, వ్యయాలను నియంత్రించేందుకు నిర్మాణాత్మక వ్యూహ రచన చేస్తున్నామని డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ తెలిపారు. వచ్చే రెండేళ్లలో మార్జిన్ గెడైన్స్ 25 శాతంగా లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ప్రధమార్థంతో పోలిస్తే ద్వితీయార్థంలో మరిన్ని కొత్త ఔషధ ఉత్పత్తులు మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని బుధవారం రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన తర్వాత వివిధ ఈక్విటీ రీసెర్చ్ సంస్థలకు చెందిన విశ్లేషకులతో జరిపిన కాన్ఫరెన్స్‌కాల్‌లో ఆయన ఈ విషయం వెల్లడించారు.డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్‌కు నోటి ద్వారా తీసుకునే మందుల (ఓరల్ సాలిడ్స్) తయారీ సంస్థగా మార్కెట్లో పేరుంది. అయితే దీనికి భిన్నంగా కొన్నేళ్లుగా ఇన్జెక్టబుల్స్పై దృష్టి పెట్టామని, ఈ ఏడాది ఫైల్ చేసిన 11 ఏఎన్‌డీఏ (అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్స్)లలో 50 శాతం ఇంజెక్టబుల్స్, టాపికల్స్, ప్యాచెస్, సాఫ్ట్ జెల్స్ ఉన్నాయని అభిజిల్ ముఖర్జీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చే ఏడాది 60 శాతానికి పెరుగుతుందని, దీని వల్లనే పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) వ్యయాలు పెరుగుతున్నాయన్నారు. చర్మ వ్యాధుల చికిత్సలో వాడే ఔషధాల తయారీలో పోటీ తక్కువగా ఉండటంతో పాటు లాభదాయకత అధికంగా ఉండటంతో ఆ మార్కెట్‌పై దృష్టి పెట్టామన్నారు. వెనిజులా ప్రధాన మార్కెట్? అమెరికా, రష్యా తర్వాత వెనిజులా దేశం తమకు అత్యంత ప్రధాన మార్కెట్గామారిందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రధామార్థంతో పోలిస్తే ద్వితీయార్థం ఫలితాలు మరింత ఆశాజనకంగా ఉంటాయన్నారు. అమెరికా మార్కెట్లో సరఫరా చేస్తున్న జనరిక్ ఔషధాల ధరలు గత రెండేళ్లలో అనూహ్యంగా పెరగడంపై దర్యాప్తు కోరుతూ అక్కడి ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన వివాదాస్పద అంశాలపై సాధికార వివరణలిచ్చామని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) సౌమెన్ చక్రవర్తి తెలిపారు. -
తెల్లమచ్చల నివారణకు డాక్టర్ రెడ్డీస్ లోషన్
5ఎంఎల్ బాటిల్ ధర రూ. 709 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : శరీరంపై ఏర్పడే తెల్లమచ్చల(బొల్లి) వ్యాధిని తగ్గించే లోషన్‌ను డాక్టర్ రెడ్డీస్ మార్కెట్లోకి విడుదల చేసింది. మెల్గెయిన్ పేరుతో విడుదల చేసిన ఈ లోషన్‌ను వినియోగిస్తే మూడు నెలల్లో మచ్చలు తగ్గి శరీరం రంగులోకి కలిసిపోతాయని డాక్టర్ రెడ్డీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అలోక్ సోనిగ్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మెల్గెయిన్ను లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. దేశంలో 5 కోట్లమంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని, ఇందులో 55 శాతం మంది తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు సర్వేలో వెల్లడయ్యిందన్నారు. ఇస్సార్ ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసిన ఈ లోషన్‌ను డాక్టర్ రెడ్డీస్ మార్కెటింగ్ చేస్తుందని, 5ఎంఎల్ బాటిల్ ధరను రూ. 709గా నిర్ణయించినట్లు అలోక్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో డెర్మటాలజీ విభాగంలో డాక్టర్ రెడ్డీస్‌ను టాప్ 5 కంపెనీల్లో ఒకటిగా నిలపాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు వివరించారు. -
డాక్టర్ రెడ్డీస్ నుంచి ఆప్టిడోజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అధిక రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించే కాంబినేషన్ ట్యాబ్లెట్స్ ‘ఆప్టిడోజ్’ను డాక్టర్ రెడ్డీస్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అమ్లోడైపిన్ 2.5 ఎంజీ. టెల్మిసర్టన్ 200ఎంజి, హైడ్రోక్లోరోథిజైడ్ 6.25 ఎంజీ కాంబినేషన్లో ప్రవేశపెట్టిన ఆప్టిడోజ్ పది ట్యాబ్లెట్స్ ధరను రూ.80గా నిర్ణయించినట్లు డాక్టర్ రెడ్డీస్ ఇండియా జనరిక్ హెడ్ అలోక్ సోని తెలిపారు. శుక్రవారం ఆప్టిడోజ్‌ను లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేసిన అనంతరం సోని మాట్లాడుతూ డాక్టర్ రెడ్డీస్ ఆదాయంలో 25 నుంచి 30% హృదయ సంబంధిత విభాగం నుంచే సమకూరుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ మూడు కాంబినేషన్లు వాడే వారు మోతాదును బట్టి ట్యాబ్లెట్‌కు రూ.12 నుంచి రూ.18 వరకు వ్యయం చేయాల్సి వచ్చేదని, కాని ఇప్పుడు మూడు కాంబినేషన్లు కలిపి రూ.8 కే అందిస్తున్నట్లు తెలిపారు. 10 శాతం వృద్ధి: ఈ ఏడాది వ్యాపారంలో 8-10% వృద్ధి నమోదుకావచ్చని అలోక్ తెలిపారు. కొత్త ఔషధ విధానంతో ధరలు తగ్గడం, ఆర్థిక మందగమనం వంటి కారణాలతో ఈ ఏడాది దేశీయ ఫార్మా రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోందన్నారు. తప్పనిసరి ఔషధాలపై ధరలను నియంత్రిస్తూ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథార్టీ తీసుకున్న నిర్ణయం కంపెనీకి చెందిన 15-20 డ్రగ్స్‌పైపడుతుందని, ఇది ఆదాయంపై 5% వరకు ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.