ప్రాణాంతక హైపోవొలెమిక్ షాక్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే సెంథాక్విన్ ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తయారుచేసి విక్రయించనుంది. అయితే ఈ డ్రగ్‌ను తయారుచేసేందుకు అమెరికాకు చెందిన ఫార్మాజ్ ఇంక్., అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తెలిపింది.
కొత్త ఔషధాలను మనదేశంలో అందుబాటులోకి తీసుకురావడానికి ఫార్మాజ్ ఇంక్., తో భాగస్వామ్యం ఉపకరిస్తుందని డాక్టర్ రెడ్డీస్ సీఈఓ (బ్రాండెడ్ మార్కెట్స్) ఎంవీ రమణ ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం సెంథాక్విన్ ఔషధాన్ని భారత్‌లో విక్రయించడానికి పూర్తి హక్కులు డాక్టర్ రెడ్డీస్‌కు లభిస్తాయి. ‘లైఫాక్విన్’ బ్రాండు పేరుతో ఈ మందును మనదేశంతో పాటు నేపాల్‌లో విక్రయించడానికి సంస్థ సిద్ధపడుతోంది.
ఎవరికైనా శస్త్రచికిత్స చేసినప్పుడు, లేదా డయేరియా, వాంతులు, ట్రామా.. తదితర సందర్భాల్లో రోగికి తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తవచ్చు. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో హైపోవొలెమిక్ షాక్ అని పరిగణిస్తారు.
ఇదీ చదవండి: ఇంజిన్‌లో సమస్య.. 16వేల కార్లను రీకాల్ చేసిన ప్రముఖ కంపెనీ
Comments
Please login to add a commentAdd a comment