సాక్షి,హైదరాబాద్: దేశీయ ఫార్మా దిగ్గజం 'డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్' ఆస్ట్రేలియాకు చెందిన మేనే(Mayne) ఫార్మా గ్రూప్ అమెరికా జెనరిక్ ప్రిస్క్రిప్షన్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కంపెనీ 15 మిలియన్ డాలర్ల ఆకస్మిక చెల్లింపులు, 90 మిలియన్ డాలర్ల మేర నగదు చెల్లింపులు చేయనుంది.
నిజానికి మేనే ఫార్మా అమెరికా జెనరిక్స్ ప్రిస్క్రిప్షన్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో సుమారు 85 జెనరిక్ ఉత్పత్తులు ఉన్నాయి. ఇందులో 45 వాణిజ్య ఉత్పత్తులు కాగా, మిగిలిన 40 ఆమోదించబడిన నాన్-మార్కెటెడ్ ఉత్పత్తులు. కంపెనీ ఉత్పత్తులలో మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించే ఔషధాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమోదం పొందింని ఈ ఉత్పత్తుల్లో హార్మోనల్ వెజినల్ రింగ్, బర్త్ కంట్రోల్ పిల్, కార్డియో ప్రోడక్ట్ వంటి అధిక విలువలు కలిగిన ఉత్పత్తులు ఉన్నాయి. వీటితో పాటు ఫెంటోరా, నటాజియా, ప్రోలెన్సా వంటి కీలకు ఔషధాలు కూడా ఉన్నాయి.
డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ చేతికి మేనే ఫార్మా దక్కడంతో రోగులకు తక్కువ ధరలకే మందులను అందించడానికి, అంతే కాకుండా అవసరమైన మందులు వేగవంతంగా అందించడానికి సహాయపడుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎరెజ్ ఇజ్రాయెలీ మాట్లాడుతూ బలమైన బ్యాలెన్స్ షీట్ బేస్ వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి, దీర్ఘకాలిక వృద్ధి ప్రాముఖ్యత కలిగిన ఉత్పత్తులను పొందేందుకు వీలు కల్పిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment