Dr Reddy lyaboretaris
-
ప్రాణాంతక వ్యాధికి మందు తయారుచేయనున్న డా.రెడ్డీస్
ప్రాణాంతక హైపోవొలెమిక్ షాక్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే సెంథాక్విన్ ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తయారుచేసి విక్రయించనుంది. అయితే ఈ డ్రగ్‌ను తయారుచేసేందుకు అమెరికాకు చెందిన ఫార్మాజ్ ఇంక్., అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తెలిపింది. కొత్త ఔషధాలను మనదేశంలో అందుబాటులోకి తీసుకురావడానికి ఫార్మాజ్ ఇంక్., తో భాగస్వామ్యం ఉపకరిస్తుందని డాక్టర్ రెడ్డీస్ సీఈఓ (బ్రాండెడ్ మార్కెట్స్) ఎంవీ రమణ ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం సెంథాక్విన్ ఔషధాన్ని భారత్‌లో విక్రయించడానికి పూర్తి హక్కులు డాక్టర్ రెడ్డీస్‌కు లభిస్తాయి. ‘లైఫాక్విన్’ బ్రాండు పేరుతో ఈ మందును మనదేశంతో పాటు నేపాల్‌లో విక్రయించడానికి సంస్థ సిద్ధపడుతోంది. ఎవరికైనా శస్త్రచికిత్స చేసినప్పుడు, లేదా డయేరియా, వాంతులు, ట్రామా.. తదితర సందర్భాల్లో రోగికి తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తవచ్చు. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో హైపోవొలెమిక్ షాక్ అని పరిగణిస్తారు. ఇదీ చదవండి: ఇంజిన్‌లో సమస్య.. 16వేల కార్లను రీకాల్ చేసిన ప్రముఖ కంపెనీ -
దేశంలోనే టాప్ కంపెనీలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవి..
భారత్‌లో అత్యంత విలువైన 500 ప్రైవేటు కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మొదటిస్థానంలో నిలిచింది. యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ విభాగమైన బర్గండీ ప్రైవేట్, హురున్ ఇండియా సంయుక్తంగా ఒక నివేదిక తయారుచేశాయి. గతేడాది అక్టోబరు వరకు ఆయా కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా దీన్ని రూపొందించాయి. అందులోని కొన్ని ముఖ్యమైన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. టాప్ 3 కంపెనీలు ఇవే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.15.6 లక్షల కోట్లు (ప్రస్తుత విలువ రూ.19.65 లక్షల కోట్లు). దాంతో ఈ కంపెనీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.12.4 లక్షల కోట్లతో (ప్రస్తుత విలువ రూ.14.90 లక్షల కోట్లు) రెండో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.11.3 లక్షల కోట్లతో (ప్రస్తుత విలువ రూ.10.55 లక్షల కోట్లు) మూడో స్థానంలో ఉన్నాయి. ప్రైవేటు రంగంలోని టాప్-500 కంపెనీల (రిజిస్టర్డ్, అన్ రిజిస్టర్డ్) మార్కెట్ విలువ 2.8 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.231 లక్షల కోట్లు)గా ఉంది. సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, సింగపూర్ల సంయుక్త జీడీపీ కంటే ఈ మొత్తం అధికం. ఏడాది వ్యవధిలో ఈ కంపెనీలు 13% వృద్ధితో 952 బిలియన్ డాలర్ల (సుమారు రూ.79 లక్షల కోట్ల) విక్రయాలను నమోదు చేశాయి. ఒక త్రైమాసికంలో దేశ జీడీపీ కంటే ఇవి ఎక్కువ. దేశంలోని 70 లక్షల మందికి (మొత్తం ఉద్యోగుల్లో 1.3 శాతం) ఈ కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించాయి. ఒక్కో కంపెనీ సగటున 15,211 మందికి ఉపాధి కల్పించగా, ఇందులో 437 మంది మహిళలు ఉన్నారు. 179 మంది సీఈఓ స్థాయిలో ఉన్నారు. కంపెనీ స్థాపించి 10 ఏళ్లు కూడా పూర్తవని సంస్థలు 52 ఉన్నాయి. 235 ఏళ్ల చరిత్ర కలిగిన ఈఐడీ-ప్యారీ కూడా 500 కంపెనీల జాబితాలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జాబితాలో 28వ స్థానం సాధించింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు 2023 ఎడిషన్‌లో మరోసారి టాప్-10 జాబితాలోకి చేరాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. హైదరాబాద్ కేంద్రంగా 29 కంపెనీలు ఈ జాబితాలో చోటు సాధించగా, వీటి మార్కెట్ విలువ రూ.5,93,718 కోట్లని నివేదిక తెలిపింది. ఏడాది క్రితంతో పోలిస్తే, ఈ మొత్తం విలువ 22% పెరిగింది. దేశంలో సొంతంగా అభివృద్ధి చెందిన సంస్థల్లో రెండో స్థానంలో నిలిచిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.67,500 కోట్ల విలువను కలిగి ఉంది. నమోదు కాని సంస్థల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఈ సంస్థ విలువ ఏడాది క్రితంతో పోలిస్తే 22.1% పెరిగింది. టాప్ కంపెనీలు(మార్కెట్ విలువ) ఇవే.. దివీస్ ల్యాబ్స్: రూ.90,350 కోట్లు డాక్డర్ రెడ్డీస్: రూ.89,152 కోట్లు మేఘా ఇంజినీరింగ్: రూ.67,500 కోట్లు అరబిందో ఫార్మా: రూ.50,470 కోట్లు హెటెరో డ్రగ్స్: రూ.24,100 కోట్లు లారస్ ల్యాబ్స్: రూ.19,464 కోట్లు సైయెంట్: రూ.17,600 కోట్లు ఎంఎస్ఎన్ ల్యాబ్స్: రూ.17,500 కోట్లు డెక్కన్ కెమికల్స్: రూ.15,400 కోట్లు కిమ్స్: రూ.15,190 కోట్లు ఇదీ చదవండి: రూ.70వేలకోట్ల అమెజాన్ షేర్లు అమ్మనున్న బెజోస్.. ఈ జాబితాలో సువెన్ఫార్మా, నాట్కోఫార్మా, తాన్లా ప్లాట్‌ఫామ్స్, రెయిన్బో హాస్పిటల్స్, ఆరజెన్ లైఫ్‌సైన్సెస్, అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ, యశోదా హాస్పిటల్స్, మెడ్‌ప్లస్, ఒలెక్ట్రాగ్రీన్‌టెక్, ఎన్సీసీ, సీసీఎల్ ప్రొడక్ట్స్, హెచ్‌బీఎల్ పవర్, గ్రాన్యూల్స్, మేధా సర్వో డ్రైవ్స్, కేఫిన్ టెక్, ఎంటార్ కంపెనీలు ఉన్నాయి. -
మైగ్రేన్ నుంచి ఉపశమనం కలిగించే సరికొత్త డివైజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పార్శ్వపు నొప్పి (మైగ్రేన్) నివారణకు ఔషధ రహిత పరిష్కారాన్ని ఫార్మా రంగ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తీసుకువచ్చింది. నెరివియో పేరుతో చేతికి ధరించే పరికరాన్ని ప్రవేశపెట్టింది. యూఎస్ఎఫ్డీఏ అనుమతి ఉందని, 12 ఏళ్లు, ఆపై వయసున్న వారు వైద్యుల సిఫార్సు మేరకు దీన్ని వాడొచ్చని కంపెనీ గురువారం ప్రకటించింది. తలనొప్పి ప్రారంభమైన 60 నిమిషాలలోపు వాడాలి. లేదా పార్శ్వపు నొప్పి నివారణకు ప్రతి రెండు రోజులకు ఒకసారి ఉపయోగించాల్సి ఉంటుంది. -
డా.రెడ్డీస్ చేతికి ‘మేనే’ అమెరికా జెనరిక్ ప్రిస్క్రిప్షన్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో
సాక్షి,హైదరాబాద్: దేశీయ ఫార్మా దిగ్గజం 'డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్' ఆస్ట్రేలియాకు చెందిన మేనే(Mayne) ఫార్మా గ్రూప్ అమెరికా జెనరిక్ ప్రిస్క్రిప్షన్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కంపెనీ 15 మిలియన్ డాలర్ల ఆకస్మిక చెల్లింపులు, 90 మిలియన్ డాలర్ల మేర నగదు చెల్లింపులు చేయనుంది. నిజానికి మేనే ఫార్మా అమెరికా జెనరిక్స్ ప్రిస్క్రిప్షన్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో సుమారు 85 జెనరిక్ ఉత్పత్తులు ఉన్నాయి. ఇందులో 45 వాణిజ్య ఉత్పత్తులు కాగా, మిగిలిన 40 ఆమోదించబడిన నాన్-మార్కెటెడ్ ఉత్పత్తులు. కంపెనీ ఉత్పత్తులలో మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించే ఔషధాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమోదం పొందింని ఈ ఉత్పత్తుల్లో హార్మోనల్ వెజినల్ రింగ్, బర్త్ కంట్రోల్ పిల్, కార్డియో ప్రోడక్ట్ వంటి అధిక విలువలు కలిగిన ఉత్పత్తులు ఉన్నాయి. వీటితో పాటు ఫెంటోరా, నటాజియా, ప్రోలెన్సా వంటి కీలకు ఔషధాలు కూడా ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ చేతికి మేనే ఫార్మా దక్కడంతో రోగులకు తక్కువ ధరలకే మందులను అందించడానికి, అంతే కాకుండా అవసరమైన మందులు వేగవంతంగా అందించడానికి సహాయపడుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎరెజ్ ఇజ్రాయెలీ మాట్లాడుతూ బలమైన బ్యాలెన్స్ షీట్ బేస్ వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి, దీర్ఘకాలిక వృద్ధి ప్రాముఖ్యత కలిగిన ఉత్పత్తులను పొందేందుకు వీలు కల్పిస్తుందన్నారు. -
అమెరికా మార్కెట్లో కొత్తగా 30 ఔషధాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) వచ్చే ఆర్థిక సంవత్సరం కీలకమైన అమెరికా మార్కెట్లో దాదా పు 30 కొత్త ఔషధాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రస్తుతం సింగిల్ డిజిట్ స్థాయిలో వృద్ధి ఉన్నా వచ్చే అయిదు నుంచి ఏడేళ్లలో రెండంకెల స్థాయిలో సాధించగలమని ఇన్వెస్టర్లతో సమావేశంలో కంపెనీ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. ప్రస్తుతానికి ధరలపరమైన ఒత్తిళ్ల కారణంగా ఆదాయ వృద్ధి కొంత ఒడిదుడుకులకు లోను కావచ్చని పేర్కొన్నారు. అటు చైనా మార్కె ట్లో తాము ఏటా రెండంకెల స్థాయిలో ఫైలింగ్స్ చేస్తున్నామని చెప్పారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో 40,50 ఫైలింగ్స్ ఉండొచ్చని వివరించారు. సాధారణంగా ఉత్పత్తులకు అనుమతి లభించాలంటే .. దరఖాస్తు చేసుకున్న తర్వాత 18–24 నెలలు వరకు సమయం పడుతుందని ఇజ్రేలీ తెలిపారు. గతేడాది నాలుగు ఉత్పత్తులకు అనుమతి లభించిందని, ఈ ఏడాది కూడా దాదాపు అదే స్థాయిలో లేదా అంతకు మించి ఉండొచ్చని ఆశిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే డబుల్ డిజిట్ వృద్ధి సాధిస్తున్నామని.. వచ్చే, ఆపై ఆర్థిక సంవత్సరాల్లో ఇది ఇంకా మెరుగుపడగలదని పేర్కొన్నారు. -
డాక్టర్ రెడ్డీస్‌కు మరో చిక్కు..
నెక్సియం జెనరిక్ అమ్మకాలపై అమెరికా కోర్టు తాత్కాలిక నిషేధం 3 రోజుల్లో రూ. 1,000 నష్టపోయిన షేరు ధర హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు అమెరికా సమస్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే యూఎస్ఎఫ్డీఏ ఇచ్చిన వార్నింగ్ లేఖలతో సతమతమవుతున్న కంపెనీకి తాజాగా అమెరికా కోర్టు రూపంలో మరో సమస్య వచ్చి పడింది. అమెరికా మార్కెట్లో నెక్సియమ్ ట్యాబ్లెట్ల విక్రయాలను తాత్కాలికంగా నిషేధిస్తూ స్థానిక కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. డాక్టర్ రెడ్డీస్ విక్రయిస్తున్న జెనరిక్ వెర్షన్లో ఊదా రంగు (పర్పుల్) వినియోగించడంపై ప్రత్యర్థి ఫార్మా కంపెనీ అస్ట్రాజెనికా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దీనిపై తదుపరి విచారణ జరిపే వరకు అమ్మకాలను నిషేధిస్తూ అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు ఆఫ్ డెలవారే ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 12కు వాయిదా వేసింది. ఉదారంగు ట్యాబ్లెట్స్ అంటేనే నెగ్జియమ్ అని డాక్టర్లు, రోగులు గుర్తుపట్టే విధంగా తాము ప్రచారం చేశామని, ఇందుకోసం 250 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు ఆస్ట్రాజెనికా చెపుతోంది. ఈ ట్యాబ్లెట్ల విక్రయాలను నిషేధం విధిస్తే డాక్టర్ రెడ్డీస్ 30-50 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నష్టపోతుందని అంచనా వేస్తున్నట్లు ఏంజెల్ బ్రోకింగ్ పేర్కొంది. ఈ మేరకు ఈపీఎస్ రూ. 1-2 తగ్గుతుంది. ఈ వార్తల నేపథ్యంలో వరుసగా మూడో రోజు కూడా డాక్టర్ రెడ్డీస్ షేరు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. నవంబర్ 6న నమోదైన గరిష్ట స్థాయి రూ. 4,292తో పోలిస్తే ఇప్పటి వరకు ఈ షేరు రూ. 962 (23%) నష్టపోయింది. మంగళవారం ఒక్కరోజే 5 శాతం నష్టపోయి రూ. 3331 వద్ద ముగిసింది.