తెల్లమచ్చల నివారణకు డాక్టర్ రెడ్డీస్ లోషన్ | Dr Reddy's Launches Skin Disorder Treatment Lotion in India | Sakshi
Sakshi News home page

తెల్లమచ్చల నివారణకు డాక్టర్ రెడ్డీస్ లోషన్

Published Fri, Jun 13 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM

తెల్లమచ్చల నివారణకు డాక్టర్ రెడ్డీస్ లోషన్

తెల్లమచ్చల నివారణకు డాక్టర్ రెడ్డీస్ లోషన్

5ఎంఎల్ బాటిల్ ధర రూ. 709
 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : శరీరంపై ఏర్పడే తెల్లమచ్చల(బొల్లి) వ్యాధిని తగ్గించే లోషన్‌ను డాక్టర్ రెడ్డీస్ మార్కెట్లోకి విడుదల చేసింది. మెల్‌గెయిన్ పేరుతో విడుదల చేసిన ఈ లోషన్‌ను వినియోగిస్తే మూడు నెలల్లో మచ్చలు తగ్గి శరీరం రంగులోకి కలిసిపోతాయని డాక్టర్ రెడ్డీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అలోక్ సోనిగ్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మెల్‌గెయిన్‌ను లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేశారు.
 
దేశంలో 5 కోట్లమంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని, ఇందులో 55 శాతం మంది తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు సర్వేలో వెల్లడయ్యిందన్నారు. ఇస్సార్ ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసిన ఈ లోషన్‌ను డాక్టర్ రెడ్డీస్ మార్కెటింగ్ చేస్తుందని, 5ఎంఎల్ బాటిల్ ధరను రూ. 709గా నిర్ణయించినట్లు అలోక్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో డెర్మటాలజీ విభాగంలో డాక్టర్ రెడ్డీస్‌ను టాప్ 5 కంపెనీల్లో ఒకటిగా నిలపాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement