skin disorder
-
ఒంటిరితనాన్ని భరించలేకపోయాను.. చనిపోతాననుకున్నా : హీరోయిన్
యమదొంగ సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ తర్వాత హోమం, కృష్ణార్జున , కింగ్, చింతకాయల రవి వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడింది. ఒక్కసారి కాదు రెండుసార్లు క్యాన్సర్ బారిన పడి పోరాడి గెలిచింది. ఆరోగ్యం పూర్తిగా కోలుకొని తిరిగి సినిమాల్లో నటిస్తున్న సమయంలో ‘విటిలిగో’ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. ప్రస్తుతం దాన్నుంచి కోలుకుంటుంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను అనుభవించిన మానసిక క్షోభను బయటపెట్టింది. నాకు క్యాన్సర్ సోకినప్పుడు నా ఫ్రెండ్స్, సన్నిహితులతో సమస్య గురించి చెప్పుకున్నాను. వారు చాలా ధైర్యం ఇచ్చారు. కానీ నాకు 'విటిలిగో' అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడ్డానని తెలియగానే ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని. ఎప్పుడూ కెమెరా ముందు ఉండే నేను ఇంటరితనాన్ని భరించలేకపోయాను. చనిపోతానేమో అని భయమేసింది. అందుకే ఈ సమస్యను అందరికీ తెలిసేలా చేశాను. దీంతో కాస్త రిలీఫ్ అనిపించింది. ఎవరైనా నా శరీరంపై ఆ మచ్చలేంటని అడిగితే నా ఇన్‌స్టా చూడమని నిర్మొహమాటంగా చెబుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. -
అయ్యో పాపం.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు ఇంత దారుణ పరిస్థితేంటీ?
మమతా మోహన్ దాస్. ఈ పేరు మీకు గుర్తుందా? ఏంటీ అప్పుడే మర్చిపోయారా? మన యంగ్ టైగర్ సినిమాతో టాలీవుడ్లో ఏంట్రీ ఇచ్చింది. ఇంకా గుర్తుకు రాలేదా? రాదుగా మరీ.. ఎందుకంటే అలా వెండితెరపై మెరిసి.. ఇలా చటుక్కున్న మాయమైన హీరోయిన్లలో మమతా ఒకరు. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ యమదొంగతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ కుట్టి పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నటించిన హోమం, కృష్ణార్జున సినిమాల్లోనూ పెద్దగా గుర్తింపు రాలేదు. మమతా మోహన్ దాస్‌ను దర్శకధీరుడు రాజమౌళి తెలుగు తెరకు పరిచయం చేశారు. మమతా మలయాళ చిత్రాలతో పాటు తమిళ, తెలుగు సినిమాల్లోనూ నటించింది. గతంలో క్యాన్సర్ బారిన పడిన నటి ఆ తర్వాత కోలుకుంది. మరో సారి లింఫోమా అనే వ్యాధితో పోరాడి కోలుకున్నారు. రెండు భయంకరమైన వ్యాధులను జయించిన నటికి తాజాగా మరో వ్యాధి సోకింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా వేదికగా మమతా మోహన్ దాస్ వెల్లడించింది. తాను ప్రస్తుతం బొల్లి వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. తనకు బొల్లి వ్యాధి సోకిందని.. ఇది తన చర్మం రంగును కోల్పోయేలా చేస్తోందని చెబుతోంది మలయాళ ముద్దుగుమ్మ. క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్‌ను చూసిన స్నేహితులు, అభిమానులు స్పందించారు. నువ్వు ఒక ఫైటర్ అంటూ ధైర్యం చెబుతున్నారు. క్యాన్సర్ జయించినట్లే ఇప్పుడు కూడా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. మమతా మోహన్‌దాస్ చివరిసారిగా 2022 మలయాళ చిత్రం జన గణ మనలో కనిపించింది. View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) -
స్కిన్ ఎలర్జీ.. ఈ అమ్మాయి ఏం చేసిందంటే!
సాధారణంగా చర్మంపై దద్దుర్లు వచ్చినా.. కాస్త మంట పుట్టినా ఏమైందోనని కంగారు పడి డాక్టర్ల దగ్గరకు పరిగెత్తేవాళ్లు చాలామందే ఉంటారు. వెంటనే డెర్మటాలజిస్టును సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకుని మందులు వాడతారు. అయితే డెన్మార్క్ చెందిన ఓ యువతి మాత్రం తనకు ఉన్న అరుదైన చర్మ వ్యాధిని ఓ హాబీగా మలచుకుంది. కుంచెపై గీయాల్సిన కళాకృతులను చర్మంపై గీస్తూ కాన్వాస్‌లా మార్చేసుకుని నలుగురిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. వివరాలు... ఆరస్ పట్టణానికి చెందిన 18 ఏళ్ల యువతి ఎమ్మా అల్డెన్రిడ్కు డెర్మాటోగ్రఫియా అనే డిజార్డర్ ఉంది. (600 క్యాలరీలను కరిగించే బ్లాంకెట్) సాధారణ పరిభాషలో దీనిని స్కిన్ రైటింగ్ అంటారు. చర్మం ఉబ్బిపోవడం, ఎర్రగా మారడం, విపరీతమైన దురద దీని లక్షణాలు. అంతగా ప్రమాదకరం కాకపోయినప్పటికీ ఈ ఎలర్జీ కారణంగా నలుగురిలో ఉన్నపుడు కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు డెర్మాటోగ్రఫియా ఉన్నవాళ్లు. కాగా మూడేళ్ల క్రితం ఎమ్మా చేతులపై ఈ వ్యాధి లక్షణాలను గమనించిన ఆమె స్నేహితురాలు ఈ విషయాన్ని తనతో పంచుకుంది. అయితే విచిత్రంగా తనతో పాటు తన కజిన్స్‌కు కూడా ఇదే తరహా లక్షణాలు ఉన్నట్లు తెలుసుకుంది. దీంతో పెద్దగా ఇబ్బంది లేదని తెలుసుకున్న ఎమ్మా.. అప్పటి నుంచి చర్మం ఉబ్బిన ప్రతిసారి అప్పటికప్పుడు తనకు పెన్సిల్‌తో తోచిన డ్రాయింగ్ వేస్తూ, పేర్లు రాస్తూ ఆ ఫొటోలు తన స్నేహితులతో పంచుకుంటోంది.(ట్విటర్లో కొత్త జీవిని కనుగొన్న ప్రొఫెసర్) ఈ విషయం గురించి ఎమ్మా మాట్లాడుతూ.. ‘‘నేను పార్టీకి వెళ్లిన సందర్భాల్లో సన్నిహితులను సర్ప్రైజ్ చేయడానికి ఈ ట్రిక్ ఉపయోగిస్తున్నా. నోటితో పలికిన పదాలను ఇలా చర్మంపై ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోతారు. వాళ్లు కూడా నాలాగే చర్మంపై డిజైన్స్ వేయాలని ప్రయత్నిస్తారు. కానీ కుదరదు. కొంతమందేమో దీని వల్ల నీకు ఇబ్బంది అనిపించదా అని అడుగుతుంటారు. నిజం చెప్పాలంటే డెర్మాటోగ్రఫియా వల్ల నాకెప్పుడూ ఇబ్బంది తలెత్తలేదు. అయితే ఒక్కోసారి విపరీతమైన దురద వస్తుంది. అప్పుడు నా పరిస్థితిని చూస్తే నాకు ఏమైపోతుందోనని పక్కనున్న వాళ్లు భయపడిపోతారు. కానీ ఈ డిజార్డర్ నా జీవితంపై ఇంతవరకు ఎలాంటి దుష్ప్రభావం చూపలేదు. డాక్టర్లు కొన్ని మందులు రికమండ్ చేశారు. కానీ వాటి వల్ల ఈ గీతలు, రాతలు రాయలేను కాబట్టి వాటిని వాడటం మానేశా’’అని చెప్పుకొచ్చింది. View this post on Instagram #dermatographia #skinwriting #hi A post shared by Dermatographia (@dermatographia_) on Aug 8, 2017 at 3:29am PDT -
తెల్లమచ్చల నివారణకు డాక్టర్ రెడ్డీస్ లోషన్
5ఎంఎల్ బాటిల్ ధర రూ. 709 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : శరీరంపై ఏర్పడే తెల్లమచ్చల(బొల్లి) వ్యాధిని తగ్గించే లోషన్‌ను డాక్టర్ రెడ్డీస్ మార్కెట్లోకి విడుదల చేసింది. మెల్గెయిన్ పేరుతో విడుదల చేసిన ఈ లోషన్‌ను వినియోగిస్తే మూడు నెలల్లో మచ్చలు తగ్గి శరీరం రంగులోకి కలిసిపోతాయని డాక్టర్ రెడ్డీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అలోక్ సోనిగ్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మెల్గెయిన్ను లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. దేశంలో 5 కోట్లమంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని, ఇందులో 55 శాతం మంది తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు సర్వేలో వెల్లడయ్యిందన్నారు. ఇస్సార్ ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసిన ఈ లోషన్‌ను డాక్టర్ రెడ్డీస్ మార్కెటింగ్ చేస్తుందని, 5ఎంఎల్ బాటిల్ ధరను రూ. 709గా నిర్ణయించినట్లు అలోక్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో డెర్మటాలజీ విభాగంలో డాక్టర్ రెడ్డీస్‌ను టాప్ 5 కంపెనీల్లో ఒకటిగా నిలపాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు వివరించారు.