Actress Mamta Mohandas shares her tough times during vitiligo disease - Sakshi
Sakshi News home page

Mamta Mohandas : 'మానసిక క్షోభకు గురయ్యాను.. అందుకే అందరికీ తెలిసేలా చేశాను'

Published Mon, Feb 20 2023 1:23 PM | Last Updated on Mon, Feb 20 2023 1:53 PM

Actress Mamta Mohandas Shares Her Tough Times During Vitiligo Disease - Sakshi

యమదొంగ సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన మలయాళ భామ మమతా మోహన్‌ దాస్‌. ఆ తర్వాత హోమం, కృష్ణార్జున , కింగ్‌, చింతకాయల రవి వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్‌ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సమయంలోనే క్యాన్సర్‌ బారిన పడింది. ఒక్కసారి కాదు రెండుసార్లు క్యాన్సర్‌ బారిన పడి పోరాడి గెలిచింది. ఆరోగ్యం పూర్తిగా కోలుకొని తిరిగి సినిమాల్లో నటిస్తున్న సమయంలో ‘విటిలిగో’ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. ప్రస్తుతం దాన్నుంచి కోలుకుంటుంది.

తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను అనుభవించిన మానసిక క్షోభను బయటపెట్టింది. నాకు క్యాన్సర్‌ సోకినప్పుడు నా ఫ్రెండ్స్‌, సన్నిహితులతో సమస్య గురించి చెప్పుకున్నాను. వారు చాలా ధైర్యం ఇచ్చారు. కానీ నాకు 'విటిలిగో' అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడ్డానని తెలియగానే ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని.

ఎప్పుడూ కెమెరా ముందు ఉండే నేను ఇంటరితనాన్ని భరించలేకపోయాను. చనిపోతానేమో అని భయమేసింది. అందుకే ఈ సమస్యను అందరికీ తెలిసేలా చేశాను. దీంతో కాస్త రిలీఫ్‌ అనిపించింది. ఎవరైనా నా శరీరంపై ఆ మచ్చలేంటని అడిగితే నా ఇన్‌స్టా చూడమని నిర్మొహమాటంగా చెబుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement