Yamadonga
-
ఒంటిరితనాన్ని భరించలేకపోయాను.. చనిపోతాననుకున్నా : హీరోయిన్
యమదొంగ సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ తర్వాత హోమం, కృష్ణార్జున , కింగ్, చింతకాయల రవి వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడింది. ఒక్కసారి కాదు రెండుసార్లు క్యాన్సర్ బారిన పడి పోరాడి గెలిచింది. ఆరోగ్యం పూర్తిగా కోలుకొని తిరిగి సినిమాల్లో నటిస్తున్న సమయంలో ‘విటిలిగో’ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. ప్రస్తుతం దాన్నుంచి కోలుకుంటుంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను అనుభవించిన మానసిక క్షోభను బయటపెట్టింది. నాకు క్యాన్సర్ సోకినప్పుడు నా ఫ్రెండ్స్, సన్నిహితులతో సమస్య గురించి చెప్పుకున్నాను. వారు చాలా ధైర్యం ఇచ్చారు. కానీ నాకు 'విటిలిగో' అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడ్డానని తెలియగానే ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని. ఎప్పుడూ కెమెరా ముందు ఉండే నేను ఇంటరితనాన్ని భరించలేకపోయాను. చనిపోతానేమో అని భయమేసింది. అందుకే ఈ సమస్యను అందరికీ తెలిసేలా చేశాను. దీంతో కాస్త రిలీఫ్ అనిపించింది. ఎవరైనా నా శరీరంపై ఆ మచ్చలేంటని అడిగితే నా ఇన్‌స్టా చూడమని నిర్మొహమాటంగా చెబుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. -
అయ్యో పాపం.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు ఇంత దారుణ పరిస్థితేంటీ?
మమతా మోహన్ దాస్. ఈ పేరు మీకు గుర్తుందా? ఏంటీ అప్పుడే మర్చిపోయారా? మన యంగ్ టైగర్ సినిమాతో టాలీవుడ్లో ఏంట్రీ ఇచ్చింది. ఇంకా గుర్తుకు రాలేదా? రాదుగా మరీ.. ఎందుకంటే అలా వెండితెరపై మెరిసి.. ఇలా చటుక్కున్న మాయమైన హీరోయిన్లలో మమతా ఒకరు. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ యమదొంగతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ కుట్టి పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నటించిన హోమం, కృష్ణార్జున సినిమాల్లోనూ పెద్దగా గుర్తింపు రాలేదు. మమతా మోహన్ దాస్‌ను దర్శకధీరుడు రాజమౌళి తెలుగు తెరకు పరిచయం చేశారు. మమతా మలయాళ చిత్రాలతో పాటు తమిళ, తెలుగు సినిమాల్లోనూ నటించింది. గతంలో క్యాన్సర్ బారిన పడిన నటి ఆ తర్వాత కోలుకుంది. మరో సారి లింఫోమా అనే వ్యాధితో పోరాడి కోలుకున్నారు. రెండు భయంకరమైన వ్యాధులను జయించిన నటికి తాజాగా మరో వ్యాధి సోకింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా వేదికగా మమతా మోహన్ దాస్ వెల్లడించింది. తాను ప్రస్తుతం బొల్లి వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. తనకు బొల్లి వ్యాధి సోకిందని.. ఇది తన చర్మం రంగును కోల్పోయేలా చేస్తోందని చెబుతోంది మలయాళ ముద్దుగుమ్మ. క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్‌ను చూసిన స్నేహితులు, అభిమానులు స్పందించారు. నువ్వు ఒక ఫైటర్ అంటూ ధైర్యం చెబుతున్నారు. క్యాన్సర్ జయించినట్లే ఇప్పుడు కూడా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. మమతా మోహన్‌దాస్ చివరిసారిగా 2022 మలయాళ చిత్రం జన గణ మనలో కనిపించింది. View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) -
15 ఏళ్ల తర్వాత బైక్ రైడ్.. ఎన్టీఆర్ హీరోయిన్ వీడియో వైరల్
దర్శకుడు ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘యమదొంగ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన మలయాళ నటి మమతా మోహన్ దాస్. ఆ సినిమాలో ఒక స్పెషల్ గ్లామరస్ పాత్రలో కనిపిస్తూనే ఎన్టీఆర్ కు గట్టి పోటీని ఇచ్చింది. ఆమె నటనను చూసి దర్శకుడు రాజమౌళి అప్పట్లో షూటింగ్ స్పాట్ లోనే షాక్ అయ్యేవారట. కెరీర్ మొదట్లోనే క్యాన్సర్‌ని జయించిన ఈ మలయాళీ బ్యూటీ నటిగానే కాకుండా సింగర్‌గా కూడా ఆకట్టుకుంది. చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్’లో ‘ఆకలేస్తే అన్నంపెడతా’, ఎన్టీఆర్ ‘రాఖీ’లో ‘రాఖీ రాఖీ..’ లాంటి సూపర్ హిట్‌పాటలు ఈ బ్యూటీ పాడినవే. చింతకాల రవి, కేడీ చిత్రాల తర్వాత ఆమె టాలీవుడ్‌కి దూరమైంది. మలయాళంలో సినిమాలు చేస్తున్న మమతా టాలీవుడ్‌కి మాత్రం దాదాపు 11 ఏళ్లుగా దూరంగా ఉంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మమత.. రీసెంట్గా బైక్ రైడ్ చేస్తున్న వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.. బైక్‌ని స్టైలిష్‌గా నడుపుతూ అదరగొట్టేసింది. ఎవరో రైడ్‌కి తీసుకెళ్తారని వెయిట్ చెయ్యడం ఎందుకు? 15 సంవత్సరాల తర్వాత బైక్ డ్రైవ్ చేయడం అమేజింగ్.. కెరీర్ స్టార్టింగ్‌లో సినిమా ప్రయత్నాలు చేసేటప్పుడు మోటార్ సైకిల్ నడిపేదాన్నని పోస్ట్ చేసింది. ప్రస్తుతం మమత . తెలుగు - తమిళ్ - మలయాళంలో తెరకెక్కుతున్న 'లాల్ బాగ్' అనే సినిమాలో నటిస్తోంది. థ్రిల్లర్ కాన్సెప్ట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరల్డ్ వైడ్ గా విస్తరిస్తున్న సాఫ్ట్ వేర్ అంశాన్ని హైలెట్ గా చూపించనున్నారాట. ఇక సమ్మర్ లో ఒకేసారి తెలుగు తమిళ్ మలయాళం భాషల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) -
జనవరి 3న వస్తున్న ‘యమదొంగ’!
యమదొంగ చిత్రానికి తమిళ తెరపైకి రావడానికి వేళయ్యింది. బాహుబలి చిత్రం ఫేమ్ ఎస్ఎస్.రాజమౌళి బాహుబలి చిత్రానికి ముందు తెలుగులో తన దర్శకత్వంలో బ్రహ్మాండంగా చెక్కిన చిత్రం యమదొంగ. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగానూ ప్రముఖ నటుడు మోహన్‌బాబు ప్రధాన పాత్రలోనూ నటించిన ఈ చిత్రంలో నటి కుష్బూ, ప్రియమణి, మమతామోహన్‌దాస్, రంభ మేలి కలయికలో రూపొందిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందించారు. విజయేంద్ర ప్రసాద్ కథతో రాజమౌళి 2007లో తెరకెక్కించిన యమదొంగ చిత్రం కమర్శియల్‌గానూ మ్యూజికల్‌గానూ మంచి విజయాన్ని సాధించింది. సోషియో ఫాంటసీ ఇతివృత్తంతో భూలోకం, యమలోకంలో జరిగే జనరంజకంగా రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో విజయన్ పేరుతో అనువాదమైంది. దీనికి అనువాద రచయితగా ఏఆర్కే.రాజా పనిచేశారు. దీన్ని తమిళంలో ఓం శ్రీసప్త కన్నియమ్మన్ పతాకంపై ఎం.జయకీర్తి, రేవతీ మేఘవన్నన్ అనువదించారు. కాగా అనువాద కార్యక్రమాలను పూర్తి చేసుకున్న విజయన్ చిత్రాన్ని శ్రీ మనీశ్వర మూవీస్ సంస్థ విడుదల హక్కులను పొంది జనవరి 3న తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తోంది. -
కోలీవుడ్‌కు జూనియర్ ఎన్టీఆర్
చెన్నై: జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన యమదొంగ చిత్రం ఇప్పుడు విజయన్ పేరుతో కోలీవుడ్‌కు రానుంది. బాహుబలి చిత్రం ఫేమ్ రాజమౌళి 2007లో తెరకెక్కించిన భారీ చిత్రం యమదొంగ. ఆయన ఇప్పటి వరకు 11 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో ఐదు చిత్రాలు తమిళంలో రీమేక్గానూ, రెండు చిత్రాలు అనువాదంగానూ, 3 చిత్రాలు అన్ని భాషల్లోనూ ఏక కాలంలో విడుదలయ్యాయి. అలాంటిది యమదొంగ సుమారు 12 ఏళ్ల తరువాత తమిళంలో అనువాదం అవుతుండడం విశేషం. విజయేంద్రప్రసాద్ కథను అందించిన ఈ చిత్రానికి మరగతమణి (ఎంఎం.కీరవాణి) సంగీతాన్ని, కేకే.సెంథిల్‌కుమార్ ఛాయాగ్రహణాన్ని అందించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్‌కు జంటగా ప్రియమణి, మమతామోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. నటి ఖుష్బూ, మోహన్‌బాబు, ప్రధాన పాత్రల్లో నటించగా, నటి రంభ ఒక పాటలో నటించడం విశేషం. భూలోకం, యమలోకంలో జరిగే రసవత్తరమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. కాగా ఇప్పుడీ చిత్రాన్ని తమిళంలో విజయన్ పేరుతో ఓం శ్రీసప్త కన్నీయయ్యన్ క్రియేషన్ పతాకంపై ఎం.జయకీర్తి, రేవతి మేఘవన్నన్లు అనువదిస్తున్నారు. దీనికి అనువాద రచయిత బాధ్యతలను ఏఆర్కే.రాజరాజా నిర్వహిస్తున్నారు. కాగా ఈ చిత్ర విడుదల హక్కులను ఓం శ్రీ మునీశ్వర మూవీస్ సంస్థ పొందింది. డిసెంబర్ 13వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. -
మస్త్ హ్యాపీ
వెండితెరపై సెంచరీని ఎప్పుడో పూర్తి చేసిన అందాల తార రంభ ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓన్లీ సౌత్‌లోనే కాదు, హిందీ చిత్రాల్లోనూ నటించి సత్తా చాటారు. బుల్లితెరపై కూడా ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. ఇప్పుడు రంభను ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే... ఆమె మూడో బిడ్డకు జన్మనిచ్చారు. 2010లో కెనడాకి చెందిన ఇంద్రకుమార్ పద్మనాభన్‌ను వివాహం చేసుకున్నారు రంభ. ఈ దంపతులకు ఆల్రెడీ లాణ్య, షాషా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. ‘‘ఈ నెల 23న బేబీ బాయ్‌కి జన్మనిచ్చాను. పేరెంటింగ్ లైఫ్ చాలా బాగుంది’’ అని పేర్కొన్నారు రంభ. కాగా, 2007లో దేశముదురు, యమదొంగ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేసిన రంభ 2008లో కీలక పాత్ర చేసిన ‘దొంగ సచ్చి నోళ్లు’ తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు. బుల్లితెరపై మాత్రం కనిపిస్తున్నారు. -
‘తారాజువ్వ’లా.. తారక్ సినీ కెరీర్!
అసలు పేరు ‘నందమూరి తారక రామరావు జూనియర్’...కానీ అభిమానులు మాత్రం ‘యంగ్ టైగర్’గా పిలుచుకుంటారు. మాస్ ఇమేజ్‌కు నిలువెత్తు నిదర్శనంలా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్.. 35వ పుట్టిన రోజు నేడు.. ఈ సందర్భంగా శనివారం విడుదల చేసిన ‘అరవింద సమేత’ ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వస్తోంది. ఫస్లుక్లో ఎన్టీఆర్ కత్తి పట్టుకుని, సిక్స్‌పాక్ బాడీతో పవర్ బ్యాంక్‌లా, మాస్ హీరోకు నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తున్నాడు. అయితే ఈ కొత్త లుక్ కోసం తారక్ ఎంతో శ్రమించాడు. ఎంతోమంది బాలీవుడ్ టాప్ హీరోలకు ఫిజికల్ ట్రైనర్‌గా పనిచేసిన లాయిడ్ స్టీవెన్స్ శిక్షణలో యంగ్‌టైగర్ రాటుదేలాడు. తారక్ ఫిజక్ గురించి మాట్లాడుకోవాలంటే యమదొంగకు ముందు...యమదొంగ తర్వాత అనే చెప్పాలి. ఎందుకంటే యమదొంగ ముందువరకూ ఈ హీరో దాదాపు 100 కేజీల బరువుతో ఉండేవాడు. ఆ తర్వాత 20 కేజీల బరువు తగ్గి చాలా స్టైలిష్‌గా తయారయ్యాడు. నేటితో 36వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ హీరో సినీ జీవితాన్ని ఓ సారి చూద్దామా.... భారీ సినీ నేపథ్యం.. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకు లేనటువంటి భారీ సినీ నేపథ్యం ఎన్టీఆర్‌కు సొంతం. తాతగారి పేరు పెట్టుకుని యాక్టింగ్, డాన్స్‌తో దూసుకుపోతున్న ఈ హీరో ప్రేక్షకుల హృదయాల్లో ‘జూనియర్ ఎన్టీఆర్’గా స్థానం సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే పరిశ్రమలోకి... బన్నీ, రామ్ చరణ్ కంటే ముందే పరిశ్రమకు వచ్చాడు తారక్. తొలిసారిగా 1996 ‘బాల రామాయణం’ చిత్రంలో రాముడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓ ఐదేళ్లలోనే అంటే 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేదు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నం.1’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ‘ఆది’ సినిమా తారక్‌లోని మాస్ హీరోను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ తర్వాత ఈ యంగ్ టైగర్ కెరీర్ ఆశించినంత బాగా సాగలేదు. అల్లరి రాముడు, నాగ లాంటి రెండు డిజాస్టర్ల తరువాత ‘సింహాద్రి’ రూపంలో జక్కన్నే మరోసారి ఎన్టీఆర్‌కు భారీ విజయాన్ని ఇచ్చాడు. తరువాత అశోక్, సాంబ, నాగ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరోసారి గట్టెక్కించిన జక్కన్న... ఇలా ఆరేళ్లపాటు కొనసాగిన తారక్ సిని ప్రస్థానాన్ని ‘దర్శక ధీరుడు’ రాజమౌళి మరోసారి మలుపు తిప్పాడు. 2007లో రాజమౌళి తారక్‌తో ‘యమదొంగ’ సినిమాను తీసాడు. ఈ సినిమా కోసం జూనియర్ 20 కేజీల బరువు తగ్గి, కొత్త లుక్‌తో ఆకట్టుకోవడమే కాక నటనలో తాతకు తగ్గ మనవడిగా నిరుపించుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ యమగోలతో బాక్సాఫీస్ దుమ్ము దులిపితే.. తాతకు తగ్గ మనవడిగా జూనియర్ యమదొంగతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టాడు. ‘టెంపర్’ చూపించాడు.... యమదొంగ తర్వాత అదుర్స్, బృందావనం లాంటి సినిమాలతో ఘనవిజయాలు సాధించిన ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్’ సినిమాతో మరోసారి సరికొత్తగా తనని తాను ఆవిష్కరించుకున్నాడు.. అవినీతి పోలీసు అధికారి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో పూరీ, ఎన్టీఆర్లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఎన్టీఆర్ యాక్టింగ్, పూరి మార్క్ పంచ్ డైలాగ్‌లతో టెంపర్ మంచి విజయాన్ని అందుకుంది. జనతా గ్యారేజ్‌తో కొత్తగా... టెంపర్ తర్వాత సినిమాల ఎంపికలో తారక్‌లో చాలా మార్పు వచ్చింది. రొటిన్‌కు భిన్నంగా, కథాబలం ఉన్న చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే సమయంలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ఇలా నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ సినిమాలతో వరుస విజయాలందుకున్నాడు తారక్. ప్రస్తుతం ఈ యంగ్‌టైగర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. -
బాహుబలి సెట్లో ప్రియమణి
బాహుబలి తొలి భాగం రిలీజ్ అయి చాలా కాలం అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న బాహుబలి పార్ట్ 2 రిలీజ్ కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయినా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తూనే ఉంది. తాజాగా సినిమాలోని కీలక సన్నివేశాల షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్ సెట్లో జరుగుతున్న విశేషాలు బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం ఐడి కార్డు ఉన్నవారిని తప్ప ఇతరులను సెట్ లోకి అనుమతించటం లేదు. అయితే ఇంత స్ట్రిక్ట్‌గా భారీగా తెరకెక్కుతున్న బాహుబలి సెట్లో.. అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న కోరిక సామాన్యులతో పాటు సినీ తారలకు కూడా కలుగుతోంది. అయితే అందరూ వెళ్లలేకపోయినా ఓ సౌత్ బ్యూటీ మాత్రం బాహుబలి సెట్లోకి అడుగుపెట్టింది. జక్కన్న దర్శకత్వంలో యమదొంగ సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రియమణి, బాహుబలి షూటింగ్ స్పాట్లో సందడి చేసింది. రాజమౌళితో ఉన్న స్నేహం కారణంగానే ప్రియమణికి ఈ అవకాశం లభించింది. అయితే షూటింగ్ చూసొచ్చిన ప్రియమణి, తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నా.. సినిమాకు సంబంధించిన విశేషాలను మాత్రం సీక్రెట్ గానే ఉంచింది. -
జక్కన్నతో జూనియర్
ప్రజెంట్ టాలీవుడ్లో టాప్ ఇమేజ్ ఉన్న దర్శకుడు రాజమౌళి. స్టార్ హీరోల లిస్ట్‌లో ముందు వరుసలో వినిపించే పేరు ఎన్టీఆర్. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో ఒకేసారి కెరీర్ ప్రారంభించిన ఈ ఇద్దరు.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. భారీ ఫాలోయింగ్‌తో పాటు అదే స్థాయిలో కలెక్షన్ స్టామినా ఉన్న రాజమౌళి, ఎన్టీఆర్‌ల కాంబినేషన్లో మరో సినిమా కోసం అభిమానులు కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. స్టూడెంట్ నంబర్ 1 సినిమా తరువాత సింహాద్రి, యమదొంగ సినిమాల కోసం కలిసి పనిచేసిన రాజమౌళి, ఎన్టీఆర్.. చాలా కాలంగా మరో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత మూడేళ్లుగా బాహుబలి సినిమాతో బిజీగా ఉన్న రాజమౌళి, ఆ సినిమా పూర్తవ్వగానే జూనియర్‌తో సినిమా చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు వీరి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన చర్చలు కూడా ప్రారంభం అయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మరోసారి ఎన్టీఆర్ కోసం ఓ పక్కా మాస్ యాక్షన్ సబ్జెక్ట్‌ను రెడీ చేసే పనిలో పడ్డాడు. ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా మరోసారి ఈ కాంబినేషన్ తెర మీదకు వస్తే మాత్రం రికార్డ్లను తిరగరాయటం కాయం అంటున్నారు ఫ్యాన్స్. -
త్వరలో ప్రేమ వివాహం చేసుకుంటున్నా: దీపు
ప్రతిభావంతులైన నేటి తరం యువ గాయకుల్లో దీపు ఒకరు. ఎనిమిదేళ్ల క్రితం ‘టెన్త్‌క్లాస్’ సినిమా ద్వారా గాయకునిగా పరిచయమయ్యారు తను. ఇప్పటివరకూ మూడొందల పై చిలుకు సినీ గీతాలను ఆలపించి, తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఓ మంచి స్థానాన్ని సాధించిన ఈ యువ సంగీత కెరటంతో ‘సాక్షి’ సంభాషణ... కెరీర్ ఎలా ఉంది? బావుందండీ.. కెరీర్ ప్రారంభించినప్పట్నుంచీ ఒక్క రోజు కూడా ఖాళీగా లేను. పాడుతూనే ఉన్నాను. నా సక్సెస్‌కి కారణం.. నా సంగీత దర్శకులే. మీ కెరీర్లో మీకు బాగా పేరుతెచ్చిన పాటలు? ‘యమదొంగ’లో ‘నాచోరె నాచోరె..’, ‘చిరుత’లో ‘లవ్యూ రా.. లవ్యూ రా..’, ‘మగధీర’లో ‘నా కోసం నువ్ జుట్టు పీక్కుంటే బాగుంది..’, ‘రచ్చ’లో ‘ హీ ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ’.. ఇలా చాలా పాటలున్నాయి. అయితే.. ఇవన్నీ ఓ ఎత్తు ‘ఈగ’లో కీరవాణిగారు పాడించిన ‘నేనే నానినే నేనే నానినే..’ పాట ఓ ఎత్తు. గాయకునిగా నన్ను మరో మెట్టు పై కూర్చోబెట్టిందీ పాట. మీ కెరీర్లో మరిచిపోలేని ప్రశంస? ‘నేనే నానినే..’ పాట చరణంలోని ఓ లైన్ హై పిచ్‌లో ఉంటుంది. నాకంటే ముందు ఆ పాటను కొంతమందితో పాడించారట కీరవాణి. కానీ.. ఆయనకు నచ్చలేదు. నేను పాడిన తీరుతో ఆయన సంతృప్తి చెందారు. ‘ఈ పాట నీ కోసమే పుట్టినట్లుంది. హై పిచ్‌ని బాగా అందుకున్నావ్’ అని కీరవాణిగారు ఇచ్చిన ప్రశంస జీవితంలో మరచిపోలేను. సింగర్లు ఎక్కువైపోయారు కదా! పోటీ కష్టంగా ఉందా? పోటీ ఎక్కువే. కానీ.. నా స్థానం నాకుందని నేను నమ్ముతాను. నా అదృష్టం బాగుండి మంచి పాటలు పాడాను. ఇంకా పాడాలి. గాయకునిగా చెరగని స్థానాన్ని సంపాదించాలి. నా ముందున్న కర్తవ్యం అదే. గాయకునిగా ప్రేరణ? చిన్నప్పట్నుంచీ బాలూగారి పాటలు వింటూనే పెరిగాను. ఆయనలా పాడాలని ప్రయత్నించేవాణ్ణి. పాటల పోటీల్లో కూడా పాల్గొనేవాణ్ణి. శంకర్‌మహదేవన్, కె.కె ప్రభావం కూడా నాపై ఉంది. ఇంట్లో ఎవరైనా సింగర్స్ ఉన్నారా? తాతగారు పాడేవారట. మా బాబాయ్ కూడా మ్యూజికల్ నైట్స్‌లో పాడేవారు. వారి పోలికే వచ్చిందేమో! సినిమాల్లో అవకాశం ఎలా వచ్చింది? ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లోని నా పాట మిక్కీ జె.మేయర్‌గారికి నచ్చిందట. వెంటనే... టెన్త్‌క్లాస్’ సినిమాకు నాతో పాడించారు. అలా సింగర్‌ని అయ్యా. మ్యూజిక్ డెరైక్షన్ చేయాలనే ఆలోచనేమైనా ఉందా? ప్రస్తుతానికి లేదు. అయితే... ఓ ఆల్బమ్ మాత్రం చేస్తా. ఎవరైనా ఆల్బమ్ చేయడానికి ముందుకొస్తే సరే. లేకపోతే నా సొంత ఖర్చుతోనే ఆల్బమ్ చేస్తా. మ్యూజికల్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు కదా! ఇప్పటివరకూ ఎన్ని దేశాల్లో పాడారు? ‘సూపర్‌సింగర్’ కార్యక్రమం నాకు ఎక్కడలేని గుర్తింపును తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మ్యూజికల్ షోస్ ఇచ్చానంటే దానికి ‘సూపర్‌సింగర్’ కార్యక్రమమే కారణం. ఇప్పటివరకూ అమెరికా, దుబాయ్, మస్కట్, మలేసియా, సింగపూర్... తదితర ప్రదేశాల్లో షోలు చేశాను. గాయకునిగా మీ లక్ష్యం? బాలీవుడ్లో పాడాలి. ఇళయరాజా, రెహమాన్‌లతో పనిచేయాలని ఉంది. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకుంటూనే ఉన్నాను. మ్యూజిక్‌లో డిప్లమా చేశాను. ప్రస్తుతం రామాచారి వద్ద లైట్ మ్యూజిక్, విజర్సు బాలసుబ్రమణ్యంగారి వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నా. అసలు మీ స్వస్థలం ఏది? నేను పూర్తి హైదరాబాదీని. ఇక్కడే బీటెక్ చేశాను. మరి పెళ్లెప్పుడు? ఆ పనిలోనే ఉన్నా. త్వరలోనే చెబుతా. ప్రేమ వివాహమా? అవును. ఎవరా అమ్మాయి. ఆమె సింగరేనా? కాదు..అసలు నా ప్రొఫెషన్‌తో ఆమెకు సంబంధం లేదు.