జక్కన్నతో జూనియర్ | Rajamouli next movie with ntr | Sakshi
Sakshi News home page

జక్కన్నతో జూనియర్

Published Tue, Jun 14 2016 8:42 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

జక్కన్నతో జూనియర్ - Sakshi

జక్కన్నతో జూనియర్

ప్రజెంట్ టాలీవుడ్లో టాప్ ఇమేజ్ ఉన్న దర్శకుడు రాజమౌళి. స్టార్ హీరోల లిస్ట్లో ముందు వరుసలో వినిపించే పేరు ఎన్టీఆర్. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో ఒకేసారి కెరీర్ ప్రారంభించిన ఈ ఇద్దరు.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్కు కేరాఫ్ అడ్రస్గా మారారు. భారీ ఫాలోయింగ్తో పాటు అదే స్థాయిలో కలెక్షన్ స్టామినా ఉన్న రాజమౌళి, ఎన్టీఆర్ల కాంబినేషన్లో మరో సినిమా కోసం అభిమానులు కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

స్టూడెంట్ నంబర్ 1 సినిమా తరువాత సింహాద్రి, యమదొంగ సినిమాల కోసం కలిసి పనిచేసిన రాజమౌళి, ఎన్టీఆర్.. చాలా కాలంగా మరో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత మూడేళ్లుగా బాహుబలి సినిమాతో బిజీగా ఉన్న రాజమౌళి, ఆ సినిమా పూర్తవ్వగానే జూనియర్తో సినిమా చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు వీరి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నాడట.

ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన చర్చలు కూడా ప్రారంభం అయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మరోసారి ఎన్టీఆర్ కోసం ఓ పక్కా మాస్ యాక్షన్ సబ్జెక్ట్ను రెడీ చేసే పనిలో పడ్డాడు. ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా మరోసారి ఈ కాంబినేషన్ తెర మీదకు వస్తే మాత్రం రికార్డ్లను తిరగరాయటం కాయం అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement