మమతా మోహన్ దాస్. ఈ పేరు మీకు గుర్తుందా? ఏంటీ అప్పుడే మర్చిపోయారా? మన యంగ్ టైగర్ సినిమాతో టాలీవుడ్‌లో ఏంట్రీ ఇచ్చింది. ఇంకా గుర్తుకు రాలేదా? రాదుగా మరీ.. ఎందుకంటే అలా వెండితెరపై మెరిసి.. ఇలా చటుక్కున్న మాయమైన హీరోయిన్లలో మమతా ఒకరు. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ యమదొంగతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ కుట్టి పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నటించిన హోమం, కృష్ణార్జున సినిమాల్లోనూ పెద్దగా గుర్తింపు రాలేదు. మమతా మోహన్ దాస్‌ను దర్శకధీరుడు రాజమౌళి తెలుగు తెరకు పరిచయం చేశారు.
మమతా మలయాళ చిత్రాలతో పాటు తమిళ, తెలుగు సినిమాల్లోనూ నటించింది. గతంలో క్యాన్సర్ బారిన పడిన నటి ఆ తర్వాత కోలుకుంది. మరో సారి లింఫోమా అనే వ్యాధితో పోరాడి కోలుకున్నారు. రెండు భయంకరమైన వ్యాధులను జయించిన నటికి తాజాగా మరో వ్యాధి సోకింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా వేదికగా మమతా మోహన్ దాస్ వెల్లడించింది.
తాను ప్రస్తుతం బొల్లి వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. తనకు బొల్లి వ్యాధి సోకిందని.. ఇది తన చర్మం రంగును కోల్పోయేలా చేస్తోందని చెబుతోంది మలయాళ ముద్దుగుమ్మ. క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్‌ను చూసిన స్నేహితులు, అభిమానులు స్పందించారు. నువ్వు ఒక ఫైటర్ అంటూ ధైర్యం చెబుతున్నారు. క్యాన్సర్ జయించినట్లే ఇప్పుడు కూడా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. మమతా మోహన్‌దాస్ చివరిసారిగా 2022 మలయాళ చిత్రం జన గణ మనలో కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment