vitiligo
-
తమన్నా బాయ్ ఫ్రెండ్ విటిలిగోను దాచిపెట్టాడట: దీనికి చికిత్స ఉందా?
టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటి తమన్నా భాటియా ప్రియుడు నటుడు విజయ్ వర్మ సంచలన విషయాన్ని ప్రకటించాడు. తనకు విటిలిగో(బొల్లి) అనే చర్మ వ్యాధి ఉందని అయితే దాన్ని దాచి పెట్టానని చెప్పుకొచ్చాడు. విజయ్ వర్మ తాజాగా మీడియాతో మాట్లాడుతూ “నా సినిమాల కోసం దాన్ని దాచిపెట్టాను. ఎందుకంటే అది ప్రేక్షకుల దృష్టి మరల్చుతుంది. నా నటన తప్ప మరేదో చూడాలని నేను కోరుకోను, అందుకే నేను దానిని దాచాను. ఇన్నాళ్లు దీన్ని దాచినందుకు ఎప్పుడూ బాధపడలేదు. ఈ నేటి తరం చాలా తెలివైన వారు. అర్థం చేసుకుంటారు. వారికి ఆ బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను. ” అని వెల్లడించాడు.ఇది కేవలం కాస్మెటిక్ విషయమే. అయినా మొదట్లో చాలా భయపడ్డాను, సక్సెస్ అందుకున్న తరువాత దాని గురించి ఆలోచించడం మానేసాను అని తెలిపాడు. గల్లీ బాయ్ నటుడు. బొల్లి (vitiligo)వ్యాధి అంటే ఏమిటి? ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. చర్మం మీద సహజంగా ఉండే రంగు పోవడం, తెల్లటి ప్యాచెస్ లేదా మచ్చలు ఏర్పడడాన్నే విటిలిగో లేదా బొల్లి అంటారు. వంశపారంపర్య కారణాలతో పాటు, ఇనేక ఇతర కారణాలవల్ల ఇది వస్తుంది. చర్మంలో ఉండే మెలనోసైట్లుగా పిలిచే మెలనిన్(melanin) కణాల స్థాయి క్షీణించినపుడు చర్మంపై తెల్లటి మచ్చలు వస్తాయి. దీన్నే బొల్లి అంటారు. ఇది అంటువ్యాధి కాదు. బాధితులను తాకడం ద్వారా ఇది వ్యాప్తి చెందదు.ఇందులో చాలా రకాలున్నాయి. ప్రధానంగా సెగ్మెంటల్, నాన్ సెగ్మెంటల్ అని ఉంటాయి. శరీరంలో ఒక్క భాగంలో మాత్రమే ఉంటే దాన్ని సెగ్మెంటల్ అని, అలా కాకుండా చాలాచోట్ల ఉంటే నాన్ సెగ్మెంటల్ అని అంటారు. బొల్లి రకం, దాని వ్యాప్తిని బట్టి చికిత్స ఆధార పడి ఉంటుంది.అయితే బొల్లి వ్యాధి సోకిన వారిలో మానసిక కుంగుబాటు,ఆందోళన ఒత్తిడి లాంటి సమస్యలొస్తాయి. ఈ నేపథ్యంలో మందులతోపాటు, బాధితులకు భరోసా ఇవ్వడం, మానసిక స్థైరాన్ని కల్పించడం చాలా అవసరం. చికిత్సదీర్ఘ కాలంపాటు చికత్స తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మెలోనిన్ చికిత్స, అల్ట్రావైలెట్ లైట్ చికిత్సను సిఫార్సు చేస్తుంటారు. ఇంకా వైద్యుల పర్యవేక్షణలో వ్యాధి నిర్ధారణ మేరకు కార్టికోస్టెరాయిడ్ క్రీమ్‌లు నారో-బ్యాండ్ అల్ట్రా వైలెట్ B చికిత్స (Narrow-band ultraviolet B therapy) ఫోటోకీమోథెరపీ (Photochemotherapy), లేజర్ చికిత్స శస్త్ర చికిత్స ద్వారా చర్మం మార్పిడి లాంటివి అందుబాటులో ఉన్నాయి. -
బొల్లి వ్యాధి బయటకు రానివ్వకుండా కుంగదీసినా..కళ గెలిపించింది!
స్కూలు అకడమిక్ పరీక్షల్లో కాస్త వెనకబడితేనే కుంగిపోతుంటారు. పిల్లలు. అలాంటిది పదేళ్ల వయసులో తన శరీరం మీద తెల్లని మచ్చలు రావడం చూసిన ఆశా ఖత్రికి ఏమీ అర్థం కాలేదు. తన స్నేహితులు, చుట్టుపక్కల వారి శరీరం మీద అలాంటి మచ్చలు ఏవీ కనపడకపోవడంతో తను ఏదో ప్రత్యేకంగా ఉన్నట్లు భావించి.. అందరిలా తను లేదని చాలా బాధపడింది. తనకొచ్చిన బొల్లి మచ్చలు పోవడం లేదని తీవ్ర నిరాశకు లోనైంది. ఏది ప్రయత్నించినా తనకి ఎదురే వచ్చాయి. అయినా తన చిన్ననాటి అలవాటునే ఉజ్వల భవిష్యత్‌గా మార్చుకుని, సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమన్‌గా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది ముఫ్పైరెండేళ్ల ఆశాఖత్రి. రాజస్థాన్‌లోని చిత్తోర్ఘర్కు చెందిన ఆశా ఖత్రి పదేళ్ల వయసులో ఉన్నప్పుడు మిగతా పిల్లల్లా కాకుండా ఒళ్లంతా తెల్లని మచ్చలతో కొంచెం అసాధారణంగా ఉండేది. తన రూపాన్ని చూసుకుని చిన్నారి ఆశా చాలా కుంగిపోయింది. అది గమనించిన తల్లిదండ్రులు, స్నేహితులు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఆమెలో ధైర్యాన్ని నింపుతూ, వైద్యం చేయించేవారు. ఎంతోమంది డాక్టర్లకు చూపించినప్పటికీ పెద్ద మార్పు రాలేదు. కుంగిపోయినప్పటికీ... తన పరిస్థితి చూసుకుని ఎప్పుడూ బాధపడే ఆశ.. మందులు, హార్మోన్లలో మార్పుల వల్ల విపరీతమైన బరువు పెరిగిపోయింది. దీంతో సమాజంలో తిరగాలంటే చాలా బిడియంగా ఉండేది తనకు. అంగవైకల్యం ఉన్న అమ్మాయిలా అందరూ తనని చూసేవారు. ఇంత బాధలోనూ ధైర్యం తెచ్చుకుని ఎం.ఏ., బీఈడీ. చేసింది. చదువు పూర్తయ్యాక ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమైంది. సంవత్సరాలపాటు కష్టపడినప్పటికి కాలం కలిసిరాక ఉద్యోగం రాలేదు. ఎవరి మీదా ఆధారపడకుండా తన కాళ్లమీద తనే నిలబడాలనకునే ఆశ.. ఏదోఒకటి చేసి సంపాదించాలన్న కోరికతో రకరకాలుగా ప్రయత్నిస్తూ చివరికి క్రొచెట్ను ఎంచుకుంది. అలవాటునే సంపాదనగా... క్రొచెట్ టాయిస్‌ను తయారు చేసే కళ ఒక తరం నుంచి మరోతరానికి బదిలీ అవుతుంటుంది. ఆశ చిన్నప్పుడు అల్లికలతో బొమ్మలు తయారుచేసే క్రొచెట్కళను తన అమ్మ, అమ్మమ్మల దగ్గర నేర్చుకుంది. వివిధ రకాల బొమ్మలు చేస్తుండేది. ఆ అలవాటే తన డెస్టినీ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అనేకప్రయత్నాలు విఫలం అయ్యి దిక్కుతోచని రోజులవి. అది 2021 నవంబర్. ఒకరోజు ఆశ...తన చుట్టాల పిల్లలు క్రొచెట్ టాయిస్‌తో ఆడడం చూసింది. క్రొచెట్ టాయిస్‌తో ఆ పిల్లలు ఎంతో సంతోషంగా ఉండడం గమనించిన ఆశ.. తను కూడా ఆ టాయిస్‌ను తయారు చేసి ఆన్లైన్లో విక్రయించవచ్చన్న ఆలోచన వచ్చింది. అనుకున్న వెంటనే తనకు తెలిసిన క్రొచెట్ కళతో చిన్న ఆక్టోపస్‌ను తయారు చేసి అందరికి చూపించింది. అది చూసిన వారంతా చాలా బావుంది. క్యూట్‌గా ఉంది అని చెప్పడంతో.. మరికొన్ని టాయిస్ తయారు చేసి, ఎగ్జిబీషన్‌లో ప్రదర్శించింది. అక్కడ ఆ టాయిస్‌ను చూసిన వారంతా ఇష్టపడి కొనడం, ఆశకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. తన బొమ్మలకు వస్తోన్న ఆదరణను చూసి మరిన్ని టాయిస్‌ను రూపొందించి చిన్నచిన్న ఎగ్జిబిషన్లలో విక్రయించేది. అక్కడ వచ్చిన స్పందనతో తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది. తను తయారు చేసే టాయిస్‌ను ఇన్స్టాగ్రామ్, ఇంకా వెబ్సైట్ ఆశి. టాయిస్.స్టూడియో పేరిట విక్రయిస్తోంది. రెండువేలకుపైగా బొమ్మలు అమ్ముడయ్యాయి. ఆశ టాయిస్కు దేశవ్యాప్తంగా కస్టమర్లు ఉన్నారు. పిల్లలు ఆడుకునే బొమ్మల నుంచి ఇల్లు,ఆఫీసు అలంకరణకు వాడే వివిధ రకాల వస్తువులను తయారు చేసి విక్రయిస్తోంది. జైపూర్‌లో బాగా పాపులర్ అయిన ‘‘టాటూ కేఫ్’’ కు డ్రీమ్ క్యాచర్స్‌ను తయారు చేసి ఇవ్వడం విశేషం. ఒకపక్క బొల్లి, మరోపక్క అధిక బరువు ఉన్నప్పటికీ... తన టాలెంట్‌తో అందమైన క్రొచెట్ టాయిస్‌ను రూపొందిస్తూ కస్టమర్ల మనసులు గెలుచుకుంటోంది ఆశాఖత్రి. దారులన్నీ మూసుకు పోయినప్పటికీ... ఏదో ఒకదారి తెరిచే ఉటుంది. ఒపిగ్గా ఆ దారిని వెతికి పట్టుకుంటే బంగారు భవిష్యత్‌కు మార్గం సుగమం అవుతుందనడానికి ఆశాఖత్రి ఉదాహరణగా నిలుస్తోంది. (చదవండి: లాయర్ని కాస్త విధి ట్రక్ డ్రైవర్‌గా మార్చింది! అదే ఆమెను..) -
‘విటిలిగో’ వ్యాధితో బాధపడుతున్న మమతా మోహన్‌దాస్..లక్షణాలు ఇవే!
తెరపై అందంగా కనిపించి అందరిని అలరించే హీరోయిన్లు.. తెరవెనుక ఎన్నో సమస్యలతో బాధపడుతుంటారు. కొందరికి ఆర్థిక, మానసిక సమస్యలు అయితే మరికొందరికి అనారోగ్య ఇబ్బందులు. అయినా కూడా వినోదాన్ని అందించడంలో మాత్రం వారు వెనుకడుగు వేయడం లేదు. అరుదైన రోగాలను సైతం ధైర్యంగా ఎదుర్కొని చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రెండు సార్లు(2010, 2013) కేన్సర్ బారిన.. ధైర్యంగా,ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకొని కోలుకున్న మమతా మోహన్‌దాస్.. తాజాగా మరో అరుదైన చర్మ వ్యాధి బారిన పడ్డారు. తాను ‘విటిలిగో(బొల్లి)’ వ్యాధి బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏంటో చూద్దాం. ‘విటిలిగో’ ఎందుకు వస్తుంది? చర్మం లోని మెలనిన్ కణాలు మృతి చెందడం వల్ల కాని, చర్మానికి హాని జరగడం వల్ల కాని ఈ వ్యాధి వస్తుంది. బొల్లి వల్ల చర్మం మీద తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. రంగు కాస్త తక్కువగా ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వారికి సోకే అవకాశం ఉంది. మానసిక కుంగుబాటు, రసాయన ప్రభావాలకు గురి కావడం, ఎండకు అధికంగా ఎక్స్ పోజ్ కావడం వల్ల కూడా బొల్లి వ్యాధి రావొచ్చు. ఇది ప్రమాదమేమీ కాదు. ప్రాణాపాయం కూడా కాదు. లక్షణాలు ఏంటి? ఈ వ్యాధి సోకిన వారి చేతులు, ముఖం, జననేంద్రియాల చుట్టూ తెల్లని పాచెస్ కనిపిస్తాయి. తల, వెంట్రుకలు, కనుబొమ్మలు, గడ్డం మీద జుట్టు తెల్లబడుతుంది. నోరు, ముక్కు లోపలి భాగంలో కణజాలాలలో రంగు మారుతంది. చికిత్స ఏంటి? ఈ వ్యాధికి శాశ్వత నివారణ లేదు. కానీ బొల్లి వ్యాప్తిని ఆపడానికి మాత్రం చికిత్స ఉంది. బొల్లి లక్షణాలను కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. తెల్లని మచ్చలు నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్న సమయంలోనే చికిత్స అందించాలి. యూవీ థెరపీ, స్టెరాయిడ్ క్రీమ్స్, ఫోటో కీమో థెరపీ ద్వారా తెల్లటి మచ్చలను తగ్గించొచ్చు. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే శాశ్వత నివారణ సాధ్యం కాకపోవచ్చు. గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్య నిపుణులు, పలు అధ్యాయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే సరైన నిర్ణయం. View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) -
తెల్లమచ్చల నివారణకు డాక్టర్ రెడ్డీస్ లోషన్
5ఎంఎల్ బాటిల్ ధర రూ. 709 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : శరీరంపై ఏర్పడే తెల్లమచ్చల(బొల్లి) వ్యాధిని తగ్గించే లోషన్‌ను డాక్టర్ రెడ్డీస్ మార్కెట్లోకి విడుదల చేసింది. మెల్గెయిన్ పేరుతో విడుదల చేసిన ఈ లోషన్‌ను వినియోగిస్తే మూడు నెలల్లో మచ్చలు తగ్గి శరీరం రంగులోకి కలిసిపోతాయని డాక్టర్ రెడ్డీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అలోక్ సోనిగ్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మెల్గెయిన్ను లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. దేశంలో 5 కోట్లమంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని, ఇందులో 55 శాతం మంది తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు సర్వేలో వెల్లడయ్యిందన్నారు. ఇస్సార్ ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసిన ఈ లోషన్‌ను డాక్టర్ రెడ్డీస్ మార్కెటింగ్ చేస్తుందని, 5ఎంఎల్ బాటిల్ ధరను రూ. 709గా నిర్ణయించినట్లు అలోక్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో డెర్మటాలజీ విభాగంలో డాక్టర్ రెడ్డీస్‌ను టాప్ 5 కంపెనీల్లో ఒకటిగా నిలపాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు వివరించారు.