టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటి తమన్నా భాటియా ప్రియుడు నటుడు విజయ్ వర్మ సంచలన విషయాన్ని ప్రకటించాడు. తనకు విటిలిగో(బొల్లి) అనే చర్మ వ్యాధి ఉందని అయితే దాన్ని దాచి పెట్టానని చెప్పుకొచ్చాడు.
విజయ్ వర్మ తాజాగా మీడియాతో మాట్లాడుతూ “నా సినిమాల కోసం దాన్ని దాచిపెట్టాను. ఎందుకంటే అది ప్రేక్షకుల దృష్టి మరల్చుతుంది. నా నటన తప్ప మరేదో చూడాలని నేను కోరుకోను, అందుకే నేను దానిని దాచాను. ఇన్నాళ్లు దీన్ని దాచినందుకు ఎప్పుడూ బాధపడలేదు. ఈ నేటి తరం చాలా తెలివైన వారు. అర్థం చేసుకుంటారు. వారికి ఆ బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను. ” అని వెల్లడించాడు.ఇది కేవలం కాస్మెటిక్ విషయమే. అయినా మొదట్లో చాలా భయపడ్డాను, సక్సెస్ అందుకున్న తరువాత దాని గురించి ఆలోచించడం మానేసాను అని తెలిపాడు. గల్లీ బాయ్ నటుడు.
బొల్లి (vitiligo)వ్యాధి అంటే ఏమిటి?
ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. చర్మం మీద సహజంగా ఉండే రంగు పోవడం, తెల్లటి ప్యాచెస్ లేదా మచ్చలు ఏర్పడడాన్నే విటిలిగో లేదా బొల్లి అంటారు. వంశపారంపర్య కారణాలతో పాటు, ఇనేక ఇతర కారణాలవల్ల ఇది వస్తుంది.
చర్మంలో ఉండే మెలనోసైట్లుగా పిలిచే మెలనిన్(melanin) కణాల స్థాయి క్షీణించినపుడు చర్మంపై తెల్లటి మచ్చలు వస్తాయి. దీన్నే బొల్లి అంటారు. ఇది అంటువ్యాధి కాదు. బాధితులను తాకడం ద్వారా ఇది వ్యాప్తి చెందదు.
ఇందులో చాలా రకాలున్నాయి. ప్రధానంగా సెగ్మెంటల్, నాన్ సెగ్మెంటల్ అని ఉంటాయి. శరీరంలో ఒక్క భాగంలో మాత్రమే ఉంటే దాన్ని సెగ్మెంటల్ అని, అలా కాకుండా చాలాచోట్ల ఉంటే నాన్ సెగ్మెంటల్ అని అంటారు. బొల్లి రకం, దాని వ్యాప్తిని బట్టి చికిత్స ఆధార పడి ఉంటుంది.అయితే బొల్లి వ్యాధి సోకిన వారిలో మానసిక కుంగుబాటు,ఆందోళన ఒత్తిడి లాంటి సమస్యలొస్తాయి. ఈ నేపథ్యంలో మందులతోపాటు, బాధితులకు భరోసా ఇవ్వడం, మానసిక స్థైరాన్ని కల్పించడం చాలా అవసరం.
చికిత్స
దీర్ఘ కాలంపాటు చికత్స తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మెలోనిన్ చికిత్స, అల్ట్రావైలెట్ లైట్ చికిత్సను సిఫార్సు చేస్తుంటారు. ఇంకా వైద్యుల పర్యవేక్షణలో వ్యాధి నిర్ధారణ మేరకు కార్టికోస్టెరాయిడ్ క్రీమ్లు నారో-బ్యాండ్ అల్ట్రా వైలెట్ B చికిత్స (Narrow-band ultraviolet B therapy) ఫోటోకీమోథెరపీ (Photochemotherapy), లేజర్ చికిత్స శస్త్ర చికిత్స ద్వారా చర్మం మార్పిడి లాంటివి అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment