తమన్నాతో లవ్ ట్రాక్ బయటపడిన తర్వాత బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ పేరు టాలీవుడ్‌లో కూడా మారుమోగింది. అంతకు ముందు నాని ‘ఎంసీఏ’ సినిమాలో నటించినా.. విజయ్‌కి అంతగా గుర్తింపు రాలేదు. కానీ తమన్నా ప్రియుడని తెలిసిన తర్వాత విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులు ఆరా తీశారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు అక్కడ వరుస అవకాశాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కెరీర్ తొలినాళ్లలో విజయ్ చాలా అవమానాలకు గురయ్యాడట. అవకాశాలు వచ్చినట్లే వచ్చి మిస్ అయ్యేవట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్..తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకున్నాడు.
బాలీవుడ్‌కి వచ్చిన కొత్తలో నాకు చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ వాటిలో చాలా వరకు ఎలాంటి కారణం లేకుండానే చేయి జారిపోయాయి. కెరీర్ ప్రారంభంలో ఓ పెద్ద సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కొన్ని ఫోటోలు కూడా పంపమని అడిగారు. హీరోగా సెలెక్ట్ చేసినట్లు కూడా చెప్పారు. కొన్నాళ్లకు నన్ను ఆ ప్రాజెక్ట్ నుంచి తీసేసినట్లు తెలిపారు.
(చదవండి: ఆ డైలాగ్ ఎలా రాశారో తెలియదు..నా మాటే జీవిత వింటుంది: రాజశేఖర్)
కారణం ఏంటంటే.. ఆ మూవీ దర్శకుడికి మూఢ నమ్మకాలు ఎక్కువ. తన జ్యోతిష్యుడు చెప్పాడని నన్ను సినిమా నుంచి తొలగించాడు. ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డాను. ఆ సమయంలో నటుడు నసీరుద్దీన్ షా నన్ను చాలా ఓదార్చాడు. ఆయన చెప్పిన మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో అవమానాలను ఎదుర్కోవాలని ఆయన నాతో అన్నారు.
ఎప్పటికైనా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాను. ఇష్టం లేకపోయినా డబ్బు కోసం చిన్న చిన్న పాత్రలు కూడా చేశాను.అందిన అవకాశాలను వినియోగించుకొని నటుడిగా ఎదిగాను’అతని విజయ్ వర్మ చెప్పుకొచ్చాడు. షార్ట్ ఫిల్మ్ ‘చిట్టగాంగ్’(2008) తో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు విజయ్. అమితాబ్ బచ్చన్ ‘పింక్’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment