astrologer
-
Visakhapatnam: మహిళపై జ్యోతిష్యుడు అత్యాచారం..
కొమ్మాది(విశాఖపట్నం): పెందుర్తి బీసీ కాలనీకి చెందిన జ్యోతిష్యుడు మోతి అప్పన్న అలియాస్ అప్పన్న దొర (50) అస్థి పంజరం కేసు మిస్టరీ వీడింది. భీమిలి నేరెళ్ల వలసకు చెందిన భార్యాభర్తలు గుడ్డాల మౌనిక, ఊళ్ల చిన్నారావు పథకం ప్రకారం అతన్ని హత్య చేశారు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులు, సీసీ ఫుటేజ్, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా భీమిలి పోలీసులు నిందితులను గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు. భీమిలి సీఐ బి.సుధాకర్ తెలిపిన వివరాలివి..పెందుర్తి బీసీ కాలనీకి చెందిన మోతి అప్పన్న.. భార్య కొండమ్మ, కుమారులు ప్రసాద్, దుర్గా ప్రసాద్‌లతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన ఇంటింటికీ వెళ్లి జ్యోతిష్యం చెబుతుంటాడు. ఇబ్బందుల్లో ఉన్న వారి ఇళ్లలో పూజలు చేస్తూ.. తద్వారా వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఆయన ఈ నెల 9న ఆనందపురం వెళ్తున్నట్లు ఇంటి వద్ద చెప్పాడు. ఆ రోజు రాత్రి అప్పన్న ఇంటికి రాకపోవడంతో 10న ఆయన పెద్ద కుమారుడు దుర్గా ప్రసాద్ ఆనందపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా ఉప్పాడ ప్రాంతంలో అప్పన్న తప్పిపోయినట్లు గుర్తించి, ఆ ప్రాంతంలో అతని కుటుంబ సభ్యులు, పోలీసులు గాలించారు. అక్కడ ఓ ప్రైవేట్ లేఅవుట్లో అప్పన్నకు సంబంధించిన అవశేషాలు గుర్తించారు.పథకం ప్రకారం.. కత్తితో పొడిచికాగా.. నిందితులు నెల రోజుల కిందట ఆనందపురం మండలం లొగడలవానిపాలెంలో ఒక అద్దె ఇంట్లో దిగారు. అక్కడకు సమీపంలో ఉన్న యడ్ల తిరుపతమ్మ అనే టీ దుకాణం యజమానితో వారికి పరిచయం ఏర్పడింది. అదే టీ దుకాణానికి ప్రతి మంగళ, ఆదివారాల్లో అప్పన్న దొర వస్తుండేవాడు. చుట్టు పక్కల గ్రామాల్లో వాస్తు, పూజలు చేస్తుండేవాడు. తనకు కూడా సమస్యలు ఉన్నాయని, పరిష్కరించాలని నిందితురాలు అప్పన్నకు చెప్పగా ఇంటికి వచ్చి పూజలు చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలో మౌనిక ఇంటికి వెళ్లిన అప్పన్న ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అత్యాచారం చేశాడు.ఈ విషయం ఎవరికై నా చెపితే కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. ఆమె ఈ విషయాన్ని తన భర్త చిన్నారావుకు తెలియజేయగా అప్పన్న దొరను హత్య చేయడానికి పథకం వేశారు. ఉప్పాడలో ఉన్న తన తల్లికి ఆరోగ్యం సరిగా లేదని, పూజ చేయాలని చిన్నారావు అప్పన్నను నమ్మించాడు. రూ.7 వేలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ నెల 9న బటన్ కత్తి, పల్సర్ బైక్ తెప్పించుకుని అతన్ని ఆనందపురం మండలం క్రాస్ రోడ్డు, బోయపాలెం మీదుగా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ లే అవుట్‌కు తీసుకువెళ్లాడు. అతన్ని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో చిన్నారావు కుడిచేతి చూపుడు వేలికి గాయం కాగా కేజీహెచ్‌లో చికిత్స తీసుకున్నాడు.ఒక రోజు ఆగి..ఆధారాలు లేకుండా చేసేందుకు తర్వాత రోజు టిన్నర్, పెట్రోల్ కొనుగోలు చేశాడు. 11వ తేదీ వేకువజాము 4 గంటల సమయంలో రెండు లీటర్ల టిన్నర్, మరో రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొని తన భార్యతో కలిసి బయలుదేరాడు. ఉదయం ఆరు గంటల సమయంలో మృతదేహాన్ని కాల్చివేశాడు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులు ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కోపంతో చిన్నారావు జ్యోతిష్యుడిని హత్య చేశాడని, ఈ ఘటనలో భర్తకు మౌనిక సహకారం అందించడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు సీఐ బి.సుధాకర్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బటన్ కత్తి, రక్తపు మరకలు కలిగిన నిందితుడి జీన్ ప్యాంటు, అప్పన్నదొర ఫోన్ పౌచ్, లైటర్, పల్సర్ ద్విచక్రవాహనం, కీ పాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.అదృశ్యమైన జ్యోతిష్యుడు.. అస్థిపంజరమై! -
విశాఖలో జ్యోతిష్యుడి దారుణ హత్య
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. జ్యోతిష్యుడు దారుణ హత్యకు గురయ్యారు. జ్యోతిష్యుడు అప్పన్న అస్థి పంజరం కాపులుప్పాడలో లభ్యమైంది. మహిళతో అసభ్య ప్రవర్తన నేపథ్యంలో హత్య జరిగినట్టు పోలీసుల అనుమానిస్తున్నారు. ఒక రౌడీ షీటర్, ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసి కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో క్షుద్ర పూజలు ఆనవాళ్లు కనిపించాయి. అస్థి పంజరం వద్ద పూసలు, సగం కాలిన ఫోటో, పంచే లభ్యమయ్యాయి.మరోవైపు, తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. కరీంనగర్ శివారు దుర్శేడ్ గ్రామంలోని పాఠశాలలో క్షుద్ర పూజలు చేశారు. పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయుడి గది ముందు పసుపు, కుంకుమ కుద్రపూజల ఆనవాళ్లు చూసి విద్యార్థులు బెంబేలెత్తారు. -
హృతిక్, జూ.ఎన్టీయార్ల మధ్య ‘వార్’కి టైమ్ బాగుందట!
ప్రముఖ బాలీవుడ్ అగ్రనటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) తదుపరి చిత్రం వార్ 2(War 2) పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీయర్ సైతం నటిస్తుండడంతో దక్షిణాదిలోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో ప్రముఖ బాలీవుడ్ జ్యోతిష్కుడు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కానుందంటూ జోస్యం చెప్పడం విశేషం.బాలీవుడ్లో ప్రఖ్యాత జ్యోతిష్కుడు విక్రమ్ చంద్రరమణి హృతిక్ జ్యోతిష శాస్త్ర చార్ట్‌ను విశ్లేషించారు, దీని ప్రకారం 2025 అతని కెరీర్లో కీలకమైన సంవత్సరంగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హృతిక్ తన కెరీర్లో 10వ సూర్య దశను అనుభవిస్తున్నాడనీ ఈ సూర్య దశ జూలై 2025లో ముగిసి చంద్ర దశగా మారుతుందనీ ఆయన వివరిస్తున్నారు. ఆల్–టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘కహో నా... ప్యార్ హై’ (2000) సమయంలోనూ హృతిక్ విజయంలో వీనస్ కీలక పాత్ర పోషించిందని జ్యోతిష్కుడు విక్రమ్ అంటున్నారు. అదే విధంగా ఈ ఏడాది కూడా హృతిక్‌కు అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పారు. హృతిక్ వ్యక్తిగత వృత్తి జీవితంలో కీలక పరిణామాలు ఈ ఏడాది ప్రధమార్ధంలో జరిగే అవకాశం ఉందనీ, జనవరి ఫిబ్రవరిలో రియల్ ఎస్టేట్, స్టాక్‌లు లేదా ప్రైవేట్ ఈక్విటీలో వ్యూహాత్మక పెట్టుబడులు ఆయన పెడతారని కూడా జ్యోతిష్కుడు చెబుతున్నారు. బహుభాషా చిత్రాల ఒప్పందాలతో సహా, వినోద పరిశ్రమలో తన స్థాయిని మరింతగా విస్తరించవచ్చునన్నారు. అలాగే ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో కూడా హృతిక్ కొత్త మార్గాలను, నైపుణ్యాలను సంపాదించడంతో పాటుగా తన సినిమాల పోర్ట్‌ఫోలియోను వైవిధ్యంగా మారుస్తారని చెప్పారు. హృతిక్ గత చిత్రాలలో ’వార్’ (2019) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ’విక్రమ్ వేద’ (2022), ’ఫైటర్’ (2024) విమర్శకుల ప్రశంసలు పొందడంతో సరిపెట్టుకున్నాయి. మరోవైపు ఈ ఏడాది జనవరి 10న హృతిక్ రోషన్ తన 51వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ తరుణంలో, ఆయనకు ఇది మరో విజయవంతమైన సంవత్సరం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఏడాది ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కానున్న వార్ 2 హిందీ సినిమాల్లో రికార్డ్–బ్రేకింగ్ ఓపెనర్‌గా అంచనా వేస్తున్న నేపధ్యంలో పండితుడు చెప్పిన ఈ జోస్యం అభిమానులను సంతోషపెట్టేదే అని చెప్పాలి. మరోవైపు జోస్యం ఫలించి ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే ఈ సినిమాలో తొలిసారి విలన్‌గా నటిస్తున్న జూ.ఎన్టీయార్(Jr NTR) బాలీవుడ్ కెరీర్ కూడా మలుపు తిరగడం ఖాయంగానే కనిపిస్తోంది. -
రేవతి కుటుంబానికి అండగా వేణుస్వామి.. ఆర్థికసాయం అందజేత
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్ కుటుంబసభ్యులను వేణుస్వామి పరామర్శించారు. కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన తనవంతు సాయంగా రేవతి కుటుంబానికి రూ.2 లక్షల సాయం అందించారు. అంతేకాకుండా బాలుడి పేరిట తన సొంత డబ్బులతో మృత్యుంజయ హోమాన్ని చేస్తానని వేణుస్వామి అన్నారు.వేణు స్వామి మాట్లాడుతూ..' శ్రీ తేజ్‌ను చూసి వచ్చా. తాను త్వరలో కోరుకుంటాడు. నా సొంత డబ్బులతో మృత్యుంజయ హోమాన్ని శ్రీ తేజ్ పేరున చేస్తాను. నా శక్తి మేర రేవతి కుటుంబానికి రూ. 2 లక్షల సాయం అందజేస్తున్నా. కొంచెం ఆలస్యమైనా సరే శ్రీతేజ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాడు. ఇది అనుకోని సంఘటన. వచ్చే ఏడాది మార్చి 28 వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదు. అయితే ఆ తరువాత అంతా మంచే జరుగుతుంది.' అని అన్నారు. -
ఈ రాశివారికి ఇంటాబయటా అనుకూలం...లాభసాటిగా వ్యాపారాలు.. !
శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శర దృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.ఏకాదశి ఉ.8.47 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పుబ్బ సా.5.04 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: రా.1.00 నుండి 2.44 వరకు, దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.57 వరకు, తదుపరి ప.2.27 నుండి 3.15 వరకు, అమృతఘడియలు: ఉ.10.04 నుండి 11.48 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.00, సూర్యాస్తమయం: 5.28. మేషం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలయ దర్శనాలు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.వృషభం: మిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం..మిథునం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. ఉద్యోగయోగం.కర్కాటకం: బంధువులతో మాటపట్టింపులు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలలో కొన్ని చికాకులు. ఉద్యోగాలలో సమస్యలు ఎదురుకావచ్చు.సింహం: కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ముఖ్య సమాచారం.కన్య: .బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. పనులలో తొందరపాటు. నిర్ణయాలలో మార్పులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒత్తిడులు. స్థిరాస్తి వివాదాలు తప్పవు.తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక ప్రగతి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకం. వస్తులాభాలు.వృశ్చికం: పనుల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు. ఆర్థిక లాభాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులు∙నిరాశ చెందుతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.మకరం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. ఆలయ దర్శనాలు.కుంభం: దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత.మీనం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. శుభకార్యాల నిర్వహణ. -
Astrologer Amy Tripp: ట్రంపే గెలుస్తారు
వాషింగ్టన్: ట్రంప్, కమలా హారిస్లమధ్య ఓటర్ల మద్దతు కేవలం ఒక శాతం తేడా ఉందన్న వార్తల నడుమ అక్కడి ప్రముఖ జ్యోతిష్యు రాలు అమీ ట్రిప్ ఆసక్తికరమైన భవిష్యవాణి వినిపించారు. అమెరికా అధ్యక్ష పగ్గాలు ట్రంప్ చేతి కొస్తాయని చెప్పారు. అధ్యక్షుడు జో బైడెన్ జూలై 21న రేసు నుంచి తప్పుకుంటారని ఆమె చెప్పిన జోస్యం ఫలించింది. దాంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ‘సూర్యుడు ట్రంప్‌నకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఈసారి గెలుపు ట్రంప్‌దే’ అంటూ ట్రిప్ చేసిన తాజా పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంతేకాదు, ‘‘హారిస్ శక్తిమంతమైన నాయకురాలిగా ఎదుగుతారు. నాలుగేళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతారు’’ అంటూ 2020లోనే చెప్పారు. అదీ అక్షరసత్యమైనట్టే కన్పిస్తోంది.ఆగస్టులో అమెరికాలో విపరిణామాలు!అమీ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రలాజికల్ రీసెర్చ్ (ఐసార్) నుంచి సర్టిఫైడ్ జ్యోతిష్యురాలు. లైసెన్స్డ్ థెరపిస్ట్ కూడా. నేషనల్ కౌన్సిల్ ఫర్ జియోకాస్మిక్ రీసెర్చ్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్లలో క్రియాశీలకంగా ఉన్నారు. గ్రహచారం తదితరాల ఆధారంగా బైడెన్ జూలై 21న అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటారు’’ అని అమీ జూలై 11వ తేదీన చెప్పారు. అది అచ్చంగా అలాగే జరిగింది. ‘‘ఈసారి ట్రంపే గెలుస్తారు. అయితే అధ్యక్షునిగా ఆయన అనూహ్య నిర్ణయాలతో అమెరికాలో రాజకీయ అనిశ్చితి ఏర్పడవచ్చు’’ అమీ చెప్పారు. ఆగస్టులో ప్రచారం, రాజకీయాల్లో విపరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు! -
సైకాలజీ చదివిన బ్యూటీ.. ప్రత్యేక పూజలు ఎందుకు చేయించుకున్నట్లో? (ఫోటోలు)
-
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: ‘నీవు నాతో ఏడు అడుగులు నడిచావు'! ఇకపైన..
గృహస్థాశ్రమ ప్రవేశం చేయడానికి యువతీ యువకు లకు ఉండవలసిన సాధారణ లక్షణాలు ఐదింటిని రామాయణం నిర్దేశించింది. వాటిలో వ్యక్తిత్వం ఒకటి. భార్య ప్రవర్తన దగ్గరికి వచ్చేసరికి... ఆమె నీతో కలిసి పుట్టలేదు. నీతో కలిసి పెరగలేదు. వేరొకరి ఇంట పుట్టింది. ఎవరికో కూతురు. ఆమెకూ ఆశలు ఉంటాయి. కోరికలున్నాయి, సంతోషం కావాలి, ఆమె నీ ఇంటి కోడలిగా వచ్చింది. ఆమె సంతోషం గా ఉండేటట్టు చూడవలసిన మొట్టమొదటి కర్తవ్యం మామగారిది. తరువాత భర్తది. రామాయణంలో మామగారి పేరు చెప్పగానే ఆయన ఆ΄్యాయతను తలచుకుని సీతమ్మ పరవశించిపోతుంది. ఇది మానవీయ సంబంధాలకు భారతదేశం చేసిన పట్టాభిషేకం.అందుకే సప్తపది మంత్రాల్లో ఒక విశిష్టమైన విషయాన్ని చెప్పారు. సప్తపది అయితే తప్ప వివాహ తంతు పూర్తి అయినట్టు కాదు.. అంటారు. ఏడడుగులు నడిచిన తరువాత వరుడు – వధువుతో ఒక మాట అంటాడు. ‘నీవు నాతో కలిసి ఏడు అడుగులు నడిచావు కాబట్టి ఇకపైన ‘నీవు నాకు మంచి స్నేహితురాలివికా. నా మనసు ఎరిగి ప్రవర్తించు’ అంటాడు. అంటే – జన్మతః అనుబంధం కాదు. కానీ ఇప్పుడు జీవితంలో మధ్యలో ప్రవేశించింది. ఇక జీవితానికి నిర్ణయాత్మక శక్తి ఆమెయే.స్నేహమంటే మనసు మనసుతో కలవాలి. ఒకరు మరొకరికి అర్థం కావాలి. వారి సంతోషం కోసం... ఇవతలివారి వైపునుంచి కొంత త్యాగం ఉంటుంది. అలాగే వీరి సంతోషం కోసం అవతలివారి వైపునుండి కొంత త్యాగం ఉంటుంది. ఇలా జరిగితేనే దాంపత్యం సంతోషంగా సాగుతుంది.అలా కాక నీకిది సంతోషం కాకపోయినా నాకిది ఇష్టం, నేనిది చేస్తాను.. అన్నప్పడు గృహస్థాశ్రమం అర్థం ఏమిటి? దాంపత్య లక్ష్యం నీరుకారిపోతుంది. అది కాదు... ఒకరి సంతోషానికి మరొకరు కారణం కాగలగాలి. సుమనస్క... అంటారు. అంటే నీవు మంచి మనసుతో ప్రవర్తించు, నేను మంచి మనసుతో ప్రవర్తిస్తా. అలా మనిద్దరం అరమరికలు లేకుండా సఖ్యంగా సంతోషంగా మంచి స్నేహితులుగా ఉందాం. నాకున్న బలహీనతలేమిటో, బలమేమిటో నీవు తెలుసుకోవాలి.అలాగే నీ బలాలు, బలహీనతలు నేను తెలుసుకోవాలి. వాటికి తగిన విధంగా మనం నడుచుకుంటూ, తప్పులు చేస్తే మన్నించుకుని సర్దుకుపోతూ ప్రేమగా ఉండాలి. అంతే తప్ప ఒకరి తప్పులు మరొకరు వెతకడమే ధ్యేయంగా సంసారం చేస్తూ, ఇద్దరి పరువును, కుటుంబ గౌరవాన్ని, వంశ ప్రతిష్ఠను బజారుకీడ్చవద్దు. ఒకరిపట్ల మరొకరు అవగాహనతో, ఆప్యాయతతో, ప్రేమతో సంతోషంగా బతకడానికి ఇంటిని శాంతి స్థానం చేసుకుందాం.బయట ఎన్ని ఒత్తిడులున్నా, ఎన్ని కష్టాలు పడుతున్నా... ఇంటికొచ్చి ఒకరి ముఖం మరొకరం చూసుకోగానే ఉపశమనం పొందగలగాలి. సాహచర్యంలో పరస్పరం శాంతి పొందాలి. ఒకరం తప్పు చేస్తే మరొకరం ప్రేమ తో మందలించుకోగలగాలి. అరమరికలొద్దు. వాటిని అర్థం చేసుకుని ఎవరికి వారం సంస్కరించుకుందాం.’’ అనుకోవాలి.అంటే నిజానికి గృహస్థాశ్రమ ప్రవేశం చేసేటప్పుడు ఇద్దరి మధ్య ఎంత అవగాహనతో ప్రారంభం కావాలో, సుఖమయమైన సంసార జీవితానికి ప్రేమ ఎంత అవసరమో పెద్దలు తెలియపరుస్తారు.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Dimple Hayathi: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లో పూజలు (ఫొటోలు)
-
జ్యోతిష్యుడు హత్య
అన్నానగర్: జ్యోతిష్యుడి హత్య కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. తేని జిల్లా దేవదానపట్టి ఉత్తర వీధికి చెందిన మన్మథన్ (35)కు దేవిక అనే భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మన్మథన్ జ్యోతిష్యం చెపుతూ ఫైనాన్‌న్స్ ఇచ్చేవాడు. శనివారం ఇతని భార్య, పిల్లలు దిండుక్కల్‌లోని పుట్టింటికి వెళ్లారు. ఆదివారం ఇంటికి తిరిగి వచ్చి చూడగా మన్మథన్ కత్తిపోట్లకు గురై శవంగా కనిపించాడు. షాక్‌కు గురైన భార్య పోలీసులకు సమాచారం అందించింది. పోలీసుల విచారణలో నల్లకరుప్పన్ పట్టికి చెందిన జయదీప(40) మన్మథన్ వద్ద అప్పు తీసుకుంది. వడ్డీ, అసలు చెల్లించకపోవడంతో ఆమెని మన్మథన్ దూషించాడు. దీంతో జయదీప మన్మథన్ ని చంపాలని నిర్ణయించుకుంది. ముత్తుమణితో కలిసి పథకం వేసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మన్మథన్ను హత్య చేసి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో జయదీప, ముత్తుమణిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. -
జ్యోతిష్యుడు చెప్పాడని సినిమా నుంచి తొలగించారు: విజయ్ వర్మ
తమన్నాతో లవ్ ట్రాక్ బయటపడిన తర్వాత బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ పేరు టాలీవుడ్లో కూడా మారుమోగింది. అంతకు ముందు నాని ‘ఎంసీఏ’ సినిమాలో నటించినా.. విజయ్‌కి అంతగా గుర్తింపు రాలేదు. కానీ తమన్నా ప్రియుడని తెలిసిన తర్వాత విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులు ఆరా తీశారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు అక్కడ వరుస అవకాశాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కెరీర్ తొలినాళ్లలో విజయ్ చాలా అవమానాలకు గురయ్యాడట. అవకాశాలు వచ్చినట్లే వచ్చి మిస్ అయ్యేవట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్..తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకున్నాడు. బాలీవుడ్‌కి వచ్చిన కొత్తలో నాకు చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ వాటిలో చాలా వరకు ఎలాంటి కారణం లేకుండానే చేయి జారిపోయాయి. కెరీర్ ప్రారంభంలో ఓ పెద్ద సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కొన్ని ఫోటోలు కూడా పంపమని అడిగారు. హీరోగా సెలెక్ట్ చేసినట్లు కూడా చెప్పారు. కొన్నాళ్లకు నన్ను ఆ ప్రాజెక్ట్ నుంచి తీసేసినట్లు తెలిపారు. (చదవండి: ఆ డైలాగ్ ఎలా రాశారో తెలియదు..నా మాటే జీవిత వింటుంది: రాజశేఖర్) కారణం ఏంటంటే.. ఆ మూవీ దర్శకుడికి మూఢ నమ్మకాలు ఎక్కువ. తన జ్యోతిష్యుడు చెప్పాడని నన్ను సినిమా నుంచి తొలగించాడు. ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డాను. ఆ సమయంలో నటుడు నసీరుద్దీన్ షా నన్ను చాలా ఓదార్చాడు. ఆయన చెప్పిన మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో అవమానాలను ఎదుర్కోవాలని ఆయన నాతో అన్నారు. ఎప్పటికైనా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాను. ఇష్టం లేకపోయినా డబ్బు కోసం చిన్న చిన్న పాత్రలు కూడా చేశాను.అందిన అవకాశాలను వినియోగించుకొని నటుడిగా ఎదిగాను’అతని విజయ్ వర్మ చెప్పుకొచ్చాడు. షార్ట్ ఫిల్మ్ ‘చిట్టగాంగ్’(2008) తో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు విజయ్. అమితాబ్ బచ్చన్ ‘పింక్’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్లో పలు సినిమాల్లో నటిస్తున్నాడు. -
దేశరాజకీయాల్లో పెను మార్పలు.. ఎన్నికల తర్వాత మహిళ ప్రధాని!
తుమకూరు(బెంగళూరు): వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రధానిగా ఒక మహిళ అధికారం చేపడతారని ప్రముఖ జ్యోతిష్యుడు యశ్వంత గురూజీ చెప్పారు. తుమకూరు జిల్లాలోని తిపటూరు తాలూకా నోణవినకెరెలో ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తాను చెప్పిన జోస్యం నిజమైందని అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఒక మహిళ పగ్గాలు చేపడుతుందని, ఇందిరాగాంధీ తరువాత ఆమె రెండవ మహిళా ప్రధాని అవుతారని చెప్పారు. రాబోయే మహా శివరాత్రి తరువాత దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు. మహా శివరాత్రిలోగా ఎన్నికల జరిగితే ప్రధాని మోదీకి మరో అవకాశం ఉంటుంది, శివరాత్రి తరువాత జరిగితే ఆయనకు ఇబ్బందులు తప్పవని అన్నారు. చదవండి: కాంగ్రెస్ నిర్వాకం వల్లే ఈశాన్యంలో సమస్యలు.. నార్త్ఈస్ట్... జిగర్ కా తుక్డా: మోదీ -
Daily Horoscope: ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు.. ప్రత్యేక గుర్తింపు..
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.అష్టమి రా. 9.33 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: రేవతి రా. 12.12 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: ప. 12.43 నుండి 2.15 వరకు, దుర్ముహూర్తం: ప.12.30 నుండి 1.23 వరకు, అమృతఘడియలు: రా.9.52 నుండి 11.15 వరకు; సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.35. రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు.ఆత్మీయులతో కలహాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. వృషభం: కార్యజయం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తా శ్రవణం. పలుకుబడి పెరుగుతుంది. నూతన పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. మిథునం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కర్కాటకం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. సింహం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. కన్య: కొత్త విషయాలు తెలుస్తాయి. మీ నిజాయితీ పదిమందీ గుర్తిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. తుల: రుణబాధల నుండి విముక్తి. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. వృశ్చికం: పరిస్థితుల ప్రభావంతో నిర్ణయాలు మార్చుకుంటారు. పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ధనుస్సు: బంధువులతో తగాదాలు. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలు ముందుకు సాగవు. మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆలయ దర్శనాలు వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కుంభం: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. ఆరోగ్య సమస్యలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు. మీనం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వస్తులాభాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు కొద్దిగా గందరగోళంగా ఉంటాయి. -
జ్యోతిష్యుడితో వివాహేతర సంబంధం .. రెండు ఇళ్లు, డబ్బులు అడగడంతో
అన్నానగర్: సెందమంగలమ్ సమీపంలో భార్యతో విడిగా జీవిస్తున్న ఓ జ్యోతిష్యుడిని సోమవారం కత్తితో నరికి దారుణంగా హత్య చేసిన ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేశారు. నామక్కల్ జిల్లా సెందమంగళం సమీపంలోని కొండమనాయక్ కన్పట్టి వెస్ట్ రోడుకు చెందిన సుందర్ రాజన్ (60) జ్యోతిష్యుడు, భార్య బేబీ (55) నరేష్ కుమార్ (34), సిమల్ (28) ఇద్దరు కుమారులు ఉన్నారు. తన వద్దకు జ్యోతిష్యం కోసం వచ్చే విడాకులు తీసుకున్న, వితంతువులైన మహిళలను సుందర్రాజన్ లక్ష్యంగా చేసుకుని వారిని తన వలలో పడేసి వారితో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా అదే ప్రాంతానికి చెందిన భర్త నుంచి విడిపోయి జీవిస్తున్న పరమేశ్వరి(48) జ్యోతిష్యం కోసం సుందర్రాజన్ను చూసేందుకు రావడంతో స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ తరచుగా ఏకాంతంగా కలుసుకునేవారు. ఈ విషయం బేబీకి తెలుసు. సుందర్ రాజన్‌ను చాలాసార్లు హెచ్చరించినా అతను మారలేదు. దీంతో బేబీ రెండేళ్ల క్రితం భర్త, కొడుకులను వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న సుందర్ రాజన్‌కు పరమేశ్వరి భోజనం పెట్టి గమనిస్తూ వచ్చింది. ఈ స్థితిలో సోమవారం సుందర్రాజన్ పేగులు బయటకు వచ్చిన స్థితిలో ఇంట్లో దారుణంగా హత్య చేయబడ్డాడు. ఇది గమనించిన చుట్టుపక్కల ప్రజలు వెంటనే సేందమంగళం పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుందర్ రాజన్ తన ఇంటిని స్నేహితురాలు పరమేశ్వరికి రాసిచ్చాడని, అయితే ఆమె అతని వద్ద ఉన్న రెండు ఇళ్లు, డబ్బులు అడగడంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సుందర్ రాజన్ పరమేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పరమేశ్వరితో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో మహిళతో అక్రమ సంబంధం ఉంది. ఇంతలో పరమేశ్వరి మరో ప్రేమికుడితో కలిసి సుందర్రాజన్ను చంపేందుకు పథకం వేసింది. ఈ నేపథ్యంలో పరమేశ్వరి ఆదివారం రాత్రి తన ప్రేమికుడితో కలిసి సుందర్రాజన్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న సుందర్రాజన్ను వారిద్దరూ కత్తితో పొడిచి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సెందమంగళం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంటనే పోలీసులు అదే ప్రాంతంలో ఉన్న పరమేశ్వరిని అరెస్టు చేసి తీవ్రంగా విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ఆమె మరో ప్రేమికుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
హీరోయిన్ ఇంట్లో వేణుస్వామి సీక్రెట్ పూజలు.. బయటికొచ్చిన వీడియో
ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్పి నిత్యం వార్తల్లో నిలిచే వేణుస్వామి నాగచైతన్య-సమంత డివర్స్ న్యూస్‌తో మరింత ఫేమస్ అయ్యాడు. వారిద్దరూ విడిపోతారంటూ పెళ్లికి ముందే చెప్పాడు. కట్‌చేస్తే పెళ్లైన నాలుగేళ్లకే వారు విడాకులు తీసుకోవడంతో వేణుస్వామి పాపులర్ అయ్యాడు. ఇక కొన్నాళ్లుగా సక్సెస్ కోసం టాలీవుడ్ ప్రముఖులు వేణుస్వామి చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా హీరోయిన్ నిధి ఆగర్వాల్ చేత వేణు స్వామి ప్రత్యేక పూజలు చేయించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2018లో సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ తెలుగు, తమిళంలో పలు చిత్రాలు చేసినా ఆమె కెరీర్ ఆశించినంత సక్సెస్‌ఫుల్‌గా లేదు. దీంతో సినిమా అవకాశాల కోసం నిధి రాజ శ్యామల యాగం చేసింది. ఇక గతంలో రష్మిక ఇంట్లో కూడా వేణుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. మరి వేణుస్వామిని నమ్ముకున్న నిధి అగర్వాల్‌కి కూడా లక్ కలిసొస్తుందా? అన్నది చూడాల్సి ఉంది. -
ఇన్స్టాగ్రామ్ లవ్ ఆ్రస్టాలజర్ను నమ్మిన ఐటీ ఉద్యోగిని.. ఆ తర్వాత..
సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో లవ్ ఆ్రస్టాలజర్ గోపాల్ శాస్త్రిగా ప్రకటనలు ఇచ్చి, సంప్రదించిన వారిని నిండా ముంచుతున్న పంజాబ్‌లోని మొహాలీ ప్రాంతానికి చెందిన లలిత్ ఎట్టకేలకు చిక్కాడు. నగర యువతి నుంచి రూ.47.11 లక్షలు కాజేసిన ఇతడిని అక్కడ అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చినట్లు జాయింట్ సీపీ డాక్టర్ గజరావ్ భూపాల్ సోమవారం ప్రకటించారు. వివరాల ప్రకారం.. లలిత్ తండ్రి గోపాల్ చాంద్ జ్యోతిష్యుడు. ఆయన నుంచి వారసత్వంగా ఈ విద్యను నేర్చుకుని వృత్తి చేపట్టాడు. కొన్నాళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు తెరిచిన లలిత్ ఆన్లైన్ జ్యోతిష్యమంటూ గూగుల్, యూట్యూబ్స్‌లో యాడ్స్ ఇచ్చాడు. నగరానికి చెందిన ఓ యువతి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. జాతకాలు, పూజలపై నమ్మకం ఉన్న ఆమె కొన్ని వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేసింది. ఇలా ఉండగా ఆన్లైన్లో వచ్చిన ఓ ప్రకటన ఆమె దృష్టిని ఆకర్షించింది. అందులోని ఫోన్ నంబర్లో సంప్రదించింది. తన విషయాన్ని గోపాల్ శాస్త్రిగా చెప్పుకున్న లలిత్‌కు చెప్పగా సమస్యలు పరిష్కరిస్తానంటూ నమ్మబలికాడు. తొలుత ఆమె వివరాలు తెలుసుకున్న బురిడీ బాబా ఏదో పరిశీలనలు చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. చివరకు జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయని, నివారణ పూజలు చేసి సరిదిద్దుతానని నమ్మబలికాడు. పూజ ప్రారంభించడానికి, ఇతర ఖర్చులకు రూ.32 వేలు చెల్లించాలని కోరాడు. ఇలా మొదలెట్టిన అతగాడు పలు దఫాలుగా రకరకాల పేర్లు చెప్పి ఆమె నుంచి రూ.47.11 లక్షలు వసూలు చేశాడు. బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాలతో కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ కె.హరిభూషణ్‌రావు నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసింది. లలిత్‌ను మొహాలీలో అరెస్టు చేసి పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చింది. గతంలో పాతబస్తీకి చెందిన ఓ మహిళ కూడా ఇదే తరహాలో రూ.4 లక్షలు కోల్పోయింది. ఆ నేరంలో ఇతడి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. -
అయ్యో నాగరాజా! జ్యోతిష్యుడు చెప్పాడని..
క్రైమ్: దైవ భక్తి మంచిదే. కానీ, ఆ భక్తి ముసుగులో మూఢనమ్మకాల్ని ప్రచారం చేసేవాళ్లను నమ్మడం ఏమాత్రం మంచిదికాదు. పైగా బాగా చదువుకున్న వాళ్లు కూడా ఆ మత్తులో మోసపోతుండడం తరచూ చూస్తున్నాం. తాజాగా ఓ వ్యక్తి మోసపోయి జేబు గుల్లజేసుకోవడంతోనే ఆగిపోలేదు. గుడ్డిగా జ్యోతిష్యుడు చెప్పింది చేసి వారంపాటు ఆస్పత్రి పాలయ్యాడు. తమిళనాడు ఈరోడ్ జిల్లా, కోపిచెట్టిపాళయం సత్తి రోడ్డు నివాసి రాజా(54) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గత కొన్నిరోజులుగా ఆయన కలలో పాములు కనిపిస్తున్నాయట. ఆ దెబ్బకి ఆయన నిద్రపోవడమే మానేశాడు. నిద్రలేమితో ఆయన ఆరోగ్యం దెబ్బ తింటూ వచ్చింది. ఈ క్రమంలో.. ఓ జ్యోతిష్యుడ్ని కలిశాడు. తనకు నాగదోషం ఉందని చెప్పాడు. అదే అదను అనుకున్నాడేమో.. దోష పరిహారానికి ప్రత్యేక పూజలు చేయాలని ఏర్పాట్ల కోసం గట్టిగా డబ్బులు తీసుకున్నాడు. సమీపంలోని ఓ ఆలయానికి తీసుకెళ్లి.. నాగదోష పరిహార పూజలు చేయించాడు. ఆఖరి ఘట్టంగా.. తన వెంట బోనులో తెచ్చిన ఓ రస్సెల్ వైపర్ పామును రాజా ముందు ఉంచి.. మూడుసార్లు పాములా నాలుక ఆడించమన్నాడు. ఆయన నాలుక ఆడిస్తుండగా.. జ్యోతిష్యుడు ఏవో మంత్రాలు వల్లించాడు. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి నాలుక ఆడించడగా.. బోనులోంచి సర్రుమని తల బయట పెట్టిన పాము, రాజా నాలుక మీద కాటేసింది. ఆ దెబ్బకు నొప్పితో విలవిలలాడిపోయాడు ఆయన. ఇది గమనించిన ఆ ఆలయ పూజారి పరిగెత్తుకుంటూ వచ్చి.. రాజాను రక్షించే ఉద్దేశంతో ఓ కత్తితో నాలుక కత్తిరించాడు. ఆలస్యం జరగకపోవడంతో అతని ప్రాణాలు నిలిచాయి. కానీ, నాలుక పోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే అతన్ని స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాము విషానికి అతని నాలుక కణజాలం దెబ్బతింది. అయినప్పటికీ.. నాలుకను తిరిగి విజయవంతంగా సర్జరీ ద్వారా అతికించారు. వాపు తగ్గిన తర్వాత ఆయన ఇప్పుడు సాధారణంగా మాట్లాడగలిగే స్థితికి చేరడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అత్యంత విషపూరితమైన రస్సెల్ వైపర్‌ను కలిగి ఉండడం, అంతకు మించి మోసం చేయడం తదితర నేరాల కింద ఆ జ్యోతిష్యుడిని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. -
జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. భార్య, కన్నబిడ్డను..
సాక్షి, బెంగళూరు(దొడ్డబళ్లాపురం): సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా కొందరు మూఢ నమ్మకాలను వీడటం లేదు. జ్యోతిష్యుడి మాటలు నమ్మి చెడు జరుగుతుందని నమ్మిన వ్యక్తి కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను ఇంట్లోంచి బయటకు పంపించిన దారుణ సంఘటన చెన్నపట్టణ పరిధిలోని మంజునాథ్ లేఔట్లో చోటుచేసుకుంది. వివరాలు... నవీన్ (35), శ్రుతికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రుత్విక్ (2) అనే కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నారి పుట్టిన నక్షత్రం వల్ల బిడ్డకు, ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి వల్ల నీకు కీడు జరుగుతుందని ఓ జ్యోతిష్యుడు చెప్పడంతో ఆ మాటలు నమ్మిన నవీన్ భార్య, బిడ్డపై నిత్యం దాడి చేసి హింసించేవాడు. ఇంట్లోంచి వెళ్లిపోవాలని లేదంటే పెట్రోల్ పోసి ఇద్దరినీ తగలబెడతానని బెదిరించడంతో శ్రుతి తన బిడ్డను తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
సినిమా – బయోపిక్: దోసె కింగ్ పై ఆమె యుద్ధం
ఇరవై ఏళ్లు ఆమె న్యాయం కోసం యుద్ధం చేసింది. ఎక్కడా తగ్గలేదు.. దేనికీ భయపడలేదు. అవతల ఉన్నది వందల కోట్లకు అధిపతి, రెస్టరెంట్ రంగానికి సమ్రాట్, వేలాది ఉద్యోగుల దేవుడు ‘శరవణ భవన్’ రాజగోపాల్. కాని ఆయన వల్ల తనకు అన్యాయం జరిగిందని ఆమె న్యాయపోరాటం చేసింది. ఆమె కథ ఇప్పుడు ‘జైభీమ్’ దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో బాలీవుడ్లో ‘దోసె కింగ్’గా చిత్ర రూపం దాలుస్తోంది. ఆమె పేరు జీవజ్యోతి శాంతకుమార్. ఇది ఆమె పోరాటగాథ. ‘శరవణ భవన్’ పి.రాజగోపాల్‌ను చెన్నై వచ్చిన కొత్తల్లో ఒక జ్యోతిష్యుడు ఏదైనా ‘అగ్ని’తో ముడిపడిన వ్యాపారం పెట్టు అన్నాడు. రాజగోపాల్ ‘శరవణ భవన్’ రెస్టరెంట్ పెట్టి, సక్సెస్ అయ్యి, 22 దేశాల్లో తన హోటల్ సామ్రాజ్యాన్ని విస్తరించి 30 వేల కోట్ల సంపదకు ఎగబాకాడు. జ్యోతిష్యుడు చెప్పింది నిజమైంది. అయితే అగ్నితో పోల్చే ‘కామాగ్ని’తో అదే రాజగోపాల్ అంత పేరూ దహించుకుపోవడమూ ఈ జోస్యంలో ఉంది. ఆమె పేరు జీవజ్యోతి జీవజ్యోతి ఎంతో చలాకీ అమ్మాయి. చదువుకుంటున్న అమ్మాయి. శరవణ భవన్లో పని చేసే అసిస్టెంట్ మేనేజర్ కూతురిగా పి.రాజగోపాల్‌కు 1996లో పరిచయం అయ్యింది. అప్పటికే రాజగోపాల్ ‘దోసె కింగ్’ గా చెన్నైలో పేరు గడించాడు. శరవణ భవన్లో వేలాది ఉద్యోగులకు రకరకాల అలవెన్సులు ఇస్తూ కన్నబిడ్డల్లా చూసుకుంటూ దేవుడయ్యాడు. అతని మాటకు ఎదురు లేదు. 1972లో ఒక వివాహం (ఇద్దరు కొడుకులు), 1994లో మరో వివాహం చేసుకున్న రాజగోపాల్ జీవజ్యోతిని మూడో వివాహం చేసుకోవాలనుకున్నాడు. దానికి కారణం కూడా జోతిష్యమే.‘మీ ఇద్దరి జాతకాలు కలిశాయి. ఆమెను చేసుకుంటే నువ్వు మరిన్ని ఘనవిజయాలు సాధిస్తావు’ అని ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలతో ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే జాతకం ఒకటి తలిస్తే జీవజ్యోతి మరొకటి తలిచింది. ట్యూషన్ మాస్టర్‌తో ప్రేమ జీవజ్యోతి పి.రాజగోపాల్‌ను తన గార్డియన్ గా భావించింది. పెద్దాయన అభిమానం ప్రదర్శిస్తున్నాడనుకుంది తప్ప అతని మనసులో ఏముందో ఊహించలేకపోయింది. ఈలోపు ఆమె శాంతకుమార్ అనే లెక్కల ట్యూషన్ మాస్టర్ ప్రేమలో పడి 1999లో పెళ్లి చేసుకోవడానికి పారిపోయింది. ఆమె మీద అప్పటికే కన్ను వేసి ఉన్న రాజగోపాల్ ఆ జంటను చెన్నై రప్పించి కాపురం పెట్టించాడు. కాని 2000 సంవత్సరంలో శాంతకుమార్‌ను బెదిరించి జీవజ్యోతితో తెగదెంపులు చేసుకోమన్నాడు. దీనికి జీవజ్యోతి ఒప్పుకోలేదు. శాంతకుమార్ కూడా. 2001లో హత్య జీవజ్యోతిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న రాజగోపాల్ తన దగ్గర పని చేసే డేనియల్‌తో 5 లక్షలకు డీల్ మాట్లాడుకుని శాంతకుమార్‌ను చంపించే పథకం పన్నాడు. అయితే డేనియల్ శాంతకుమార్‌ను కనికరించి ఐదువేలు ఇచ్చి ముంబై పారిపోమని చెప్పాడు. రాజగోపాల్‌తో శాంతకుమార్‌ను హత్య చేశానని చెప్పేశాడు. అయితే శాంతకుమార్ జీవజ్యోతికి ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో ‘నువ్వు వచ్చేసెయ్. రాజగోపాల్ కాళ్లమీద పడి వదిలేయ్‌మని అడుగుదాం’ అనేసరికి అతను వచ్చాడు. ఇద్దరూ రాజగోపాల్ దగ్గరకు వెళ్లారు. దీంతో కోపం పట్టలేకపోయిన రాజగోపాల్ అక్టోబర్ 28న వాళ్లను తన మనుషులతో తీసుకెళ్లాడు. అక్టోబర్ 31న శాంతకుమార్ శవం అడవిలో దొరికింది. జీవజ్యోతి ఈ దెబ్బతో పూర్తిగా దారికొస్తుందని భావించిన రాజగోపాల్ ఆమెను ఇంటికి వెళ్లనిచ్చాడు. అయితే ఆమె నేరుగా చెన్నై పోలీస్ కమిషనర్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడంతో దోసె కింగ్ సామ్రాజ్యం ఉలిక్కిపడింది. సుదీర్ఘ పోరాటం రాజగోపాల్‌కు ఉన్న పలుకుబడి ముందు జీవజ్యోతి ఎటువంటి ప్రలోభాలకు, వొత్తిళ్లకూ లొంగలేదు. తనకు అన్యాయం జరిగిందని గట్టిగా నిలబడి న్యాయం కోసం పోరాడింది. అయితే రాజగోపాల్ కేవలం 9 నెలలు మాత్రం జైలులో ఉండి తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. అతను జైలులో ఉన్న కాలంలో మంచి భోజనం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. 2004లో సెషన్స్ కోర్టు రాజగోపాల్‌కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దాని మీద రాజగోపాల్ హైకోర్టుకు అప్పీలు చేయగా 2010లో చెన్నై హైకోర్టు మరింత శిక్ష పెంచుతూ యావజ్జీవం చేసింది. దీనిపై సుప్రీం కోర్టులో పోరాడాడు రాజగోపాల్. ఇంత జరుగుతున్నా జీవజ్యోతి ప్రతి చోటా తన న్యాయపోరాటం కొనసాగించింది. 2019 మార్చిలో సుప్రీం కోర్టు హైకోర్టు శిక్షనే బలపరిచి జూలై 7, 2019న లొంగిపోవాలని రాజగోపాల్‌ను ఆదేశించగా అప్పటికే జబ్బుపడ్డ రాజగోపాల్ జూలై 9న అంబులెన్స్‌లో వచ్చి కోర్టులో లొంగిపోయాడు. కాని ఆ వెంటనే విజయ హాస్పిటల్ ప్రిజనర్స్ వార్డ్‌కు తరలించాల్సి వచ్చింది. గుండెపోటుతో అతడు జూలై 18న మరణించాడు. సినిమా పేరు ‘దోసె కింగ్’ జంగిల్ పిక్చర్స్ వారు జీవ జ్యోతి నుంచి బయోపిక్ రైట్స్ కొనుక్కుని ‘జై భీమ్’ దర్శకుడు టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ పోరాటమంతా హిందీలో సినిమాగా తీయనున్నారు. తారాగణం ఇంకా ఖరారు కావాల్సి ఉంది.‘నా పోరాటం సినిమాగా రానుండటం నాకు సంతోషంగా ఉంది’ అంది జీవ జ్యోతి. అయితే సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఒక రోజైనా జైలులో ఉండకుండా రాజగోపాల్ మరణించడం పట్ల ఆమెకు ఇంకా అసంతృప్తే ఉంది. -
నయనతార పెళ్లిపై ప్రముఖ ఆస్ట్రాలజర్ సంచలన వ్యాఖ్యలు
Astrologer Predictions Nayanthara Marriage Life: ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ సెలబ్రెటీల గురించిన జోష్యంపై ఆసక్తికర విషయాలను చెబుతు ఉంటారు ఆయన. గతంలో సమంత-నాగచైతన్య పెళ్లి సమయంలో ఆయన షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సమంతకు వైవాహిక జీవితం కలిసి రాదని, ఆమె పెళ్లి చేసుకున్న అతి త్వరలోనే భర్తతో విడిపోతుందని జోష్యం చెప్పారు. ఇక చై-సామ్ విడాకుల ప్రకటన అనంతరం వేణు స్వామి చెప్పినట్లుగానే ఆమె జీవితంలో జరిగిందని అందరు చర్చించుకున్నారు. ఇప్పడు తాజాగా ఆయన లేడీ సూపర్ స్టార్ నయన తార పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: ‘ద పీకాక్’ మ్యాగజైన్‌పై మహేశ్, ఫొటో షేర్ చేసిన సూపర్ స్టార్ అయితే నయనతార-విఘ్నేశ్ శివన్‌ల పెళ్లి గత కొంతకాలంగా చర్చనీయాంశం అవుతుంది. 5ఏళ్లుగా రిలేషన్లో ఉన్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లాక్డౌన్లో వీరిద్దరు నిశ్చితార్థం చేసుకోవడంతో వీరి పెళ్లి అంశం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 9న తిరుమల తిరుపతి దేవస్థానంలో నయన్-శివన్‌లు పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో నయనతార వైవాహిక జీవితంపై అస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: మహేశ్-రాజమౌళి మూవీపై అప్డేట్ ఇచ్చిన రచయిత విజయేంద్ర ప్రసాద్ నయన తారకు పెళ్లి అచ్చిరాదని, వివాహ అనంతరం తన వైవాహిక జీవితం సవ్యంగా సాగదని ఆయన అంటున్నారు. తన జాతకంలో గురుడు నీచ స్థితిలో ఉన్నాడని, అందువల్ల వైవాహిక జీవితంలో కలతలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అంతేకాదు విడాకులు కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. అలాగే స్టార్ హీరోయిన్స్ అనుష్క శెట్టి, రష్మిక మందన్నాల గురించి కూడా చెప్పారు. వీరికి సైతం పెళ్లి జీవితం అచ్చి రాదని, వీరి జాతకంలో కూడా గురువు నీచ స్థితిలో ఉన్నట్లు తెలిపారు. ఇక చివరగా సమంత, పూజ హెగ్డే, రష్మిక మందన్నా, నయనతార సినీ కేరీర్ 2024 తర్వాత అంతమైపోతుందని ఆయన పేర్కొన్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1551342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జగన్ మరోసారి సీఎం కావడం ఖాయం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాల స్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు అధికారం చేపట్టడం ఖాయమని, ఎన్ని పార్టీలు కలిసి పోటీచేసినా ఆయన ముందు చిత్తవుతాయని ప్రముఖ జ్యోతిష పండితుడు మాండ్రు నారాయణ రమణారావు సిద్ధాంతి జోస్యం చెప్పారు. ఏపీ సచివాలయంలో ప్రతికూల శక్తులు బలంగా పనిచేస్తున్నాయని, అక్కడ మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితి గురించి ఉగాది సందర్భంగా నారాయణరావు సిద్ధాంతి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఎన్ని పార్టీలు కలిసినా జగన్ ముందు చిత్తే.. ‘వైఎస్ జగన్ గ్రహాలు, నక్షత్రాలు శుభ బలంగా ఉన్నాయి. ఈ కారణం వల్లనే ఆయనపై ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా చిత్తవడం ఖాయం. సీఎం జగన్మోహన్రెడ్డి గ్రహాలు కుజుడు, రవి, చం ద్రుడు, శని, శుక్ర గ్రహాలు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. దీనికితోడు ఛాయా గ్రహాలైన రాహు, కేతువులు, మే నెల నుంచి సానుకూల ప్రభావం చూపబోతున్నాయి. ఈ గ్రహాల అనుకూలత కారణంగా 120–150 సీట్లలో ఆయన గెలిచి మరోమారు అధికారం చేజిక్కించుకుంటారు. ఆయన తూర్పు ఆగ్నేయ స్థానంలో కూర్చుని పాలన చేస్తే రాజకీయంగా మరింత పట్టు వస్తుంది. ప్రజల నుంచి కూడా మరింత ఆదరణ లభిస్తుంది. ఏపీ సెక్రటేరియట్ వాస్తు అధ్వానంగా ఉంది. ఈ సెక్రటేరియట్లో ప్రతికూల శక్తులు బలంగా ఉన్నాయి. ఈ సెక్రటేరియట్లో పనిచేస్తున్న ఉద్యోగులపై కూడా ఇది ప్రభావాన్ని చూపుతుంది. ఇందులోని కొన్ని ముఖ్య భాగాలను మార్పు చేస్తే కోర్టు కేసులు, పెండింగ్ పనుల్లో కదలిక వస్తుంది. అసెంబ్లీ నిర్మాణంలో కూడా లోపం ఉంది. ఈ లోపాలను కూడా సవరించుకోవాలి. మూడు రాజధానుల పనుల్లో అప్పుడే కదలిక వస్తుంది. బాబు పరిస్థితి అగమ్యగోచరమే.. చంద్రబాబు నాయుడుకు చెందిన ముఖ్య గ్రహాలు రోజురోజుకూ బలహీనపడుతున్నాయి. ముఖ్యంగా రవి, శని, శుక్ర, చంద్ర గ్రహాలతోపాటు ఛాయా గ్రహాలైన రాహు, కేతువులు పూర్తిగా నీరసపడుతున్నాయి. ఈ గ్రహాల స్థితి ఇలాగే కొనసాగితే ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేనట్టే. గ్రహాలు బలంగా ఉన్నవారు చంద్రబాబుతో జట్టుకట్టినా వారి పరిస్థితి కూడా అగమ్యగోచరమే అవుతుంది. చంద్రబాబు గ్రహబలాలను బట్టి ఇప్పుడిప్పుడే ఆయనకు రాజకీయ యోగం లేదు. మోదీకి ఏమీ కాదు.. ప్రధాని మోదీ రవి, శుక్ర, శని, కుజ, చంద్ర గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈయనపై ఎంతటివారు నిలబడినా తట్టుకోలేరు. ఘోరంగా పరాజయం పాలవుతారు. కేంద్రంలో మళ్లీ మోదీ విజయకేతనం ఎగరవేయడం ఖాయం. ప్రధాని గ్రహాల పయనాన్ని బట్టి చూస్తే ఎవరు ఆయన్ను ఎంత విమర్శించినా ఆయనకేం కాదు.’ -
అశ్లీల వీడియోల పేరుతో బ్లాక్మెయిల్ కేసు: వెలుగులోకి కొత్తపేరు
సాక్షి, బనశంకరి (కర్ణాటక): మంత్రి సోమశేఖర్ కుమారుడు నిశాంత్‌ని అశ్లీల వీడియోల పేరుతో బ్లాక్మెయిల్ చేసిన కేసులో రాహుల్భట్తో పాటు సోమవారం మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సూత్రధారి ఎవరు అనేదానిపై సీసీబీ పోలీసులు విచారణ చేప ట్టారు. ఇండి ఎమ్మెల్యే యశవంతరాయగౌడ పాటిల్ కుమార్తె పేరుతో ఉన్న సిమ్‌కార్డు నుంచి నిశాంత్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయని తేలింది. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ కుమార్తె ఉన్నత విద్య కోసం గత 10 నెలలుగా విదేశాల్లో ఉందని, ఆమె సిమ్‌కార్డును రాకేశ్ అణ్ణప్ప అనే స్నేహితునికి ఇచ్చిందని, అతడు దానిని దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. -
నీ అశ్లీల వీడియో లీక్ చేస్తా.. మంత్రి కొడుక్కి బెదిరింపులు!
సాక్షి, బనశంకరి(కర్ణాటక): నీ అశ్లీల వీడియో నా వద్ద ఉంది, డబ్బులు ఇవ్వకపోతే లీక్ చేస్తానని మంత్రి కుమారున్ని బెదిరించాడన్న కేసులో ప్రముఖ జ్యోతిష్యుని కొడుకుని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి ఎస్టీ సోమశేఖర్ కుమారుడు నిశాంత్‌ను ఆర్టీ నగరలో ఉండే రాహుల్‌భట్ బెదిరించాడని, ఆదివారం అతన్ని అరెస్ట్ చేశామని జాయింట్ పోలీస్ కమిషనర్ రమణ్‌గుప్తా తెలిపారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అశ్లీల వీడియోను సృష్టించి మంత్రి పీఏలు శ్రీనివాసగౌడ, బానుప్రకాష్ల మొబైళ్లకు పంపి డబ్బుకు డిమాండ్ పెట్టారు. లేదంటే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బ్లాక్‌బెయిల్ చేశారని నిశాంత్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాహుల్‌భట్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఐఏసీ విక్రాంత్ మూడోదఫా జలపరీక్షలు ఆరంభం -
'రకుల్ పెళ్లి ఆగిపోతుంది.. జైలుకు వెళ్లే అవకాశం'!
Venu Swamy Shocking Comments On Rakul Preet Singh Marraige: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోతుందని, ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తెలిపారు. ఒకవేళ వివాహం జరిగినా విడిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్ ఈ విషయాన్ని ఇటీవలె ప్రకటించిన సంగతి తెలిసిందే. తన 31 వ పుట్టినరోజు సందర్భంగా జాకీ భగ్నానీతో తన రిలేషన్‌ను బయటపెట్టింది. చదవండి: చార్ ధామ్ యాత్ర: ప్రత్యేక పూజలు నిర్వహించిన సామ్ త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుంది. అయితే రకుల్- జాకీ భగ్నానీల జాతకాన్ని పరిశీలించిన అనంతరం వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాకీ భగ్నానీది మకర రాశి అని, ఆయన జాతకంలో శని దృష్టి చంద్రుడు, శుక్రుడిపై ఉన్నందున వివాహానికి సంబంధించిన సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఇక రకుల్‌ది మిధున రాశి అని, ఆమె జాతకంలో గురువు, కేతువు కలిసి ఉండటం వల్ల కుటుంబం సౌఖ్యం ఉండదని చెప్పుకొచ్చారు. రకుల్ ప్రీత్ సింగ్- జాకీ భగ్నానీల పెళ్లి నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోతుంది. ఒకవేళ పెళ్లి జరిగినా ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంతానం కలగకపోవడం సహా న్యాయ పరమైన ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా రకుల్ ఓ కేసు విషయమై జైలు కెళ్లే అవకాశం ఉంది అని షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో సమంత- నాగచైతన్యల వివాహానికి సంబంధించి వేణుస్వామి చెప్పింది నిజమైంది. భార్యభర్తలుగా ఇక కొనసాగలేమంటూ చై-సామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి రకుల్ విషయంలో వేణు స్వామి చెప్పింది జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది. చదవండి: ChaySam Divorce: పెళ్లికి ముందే చెప్పారు.. సమంత-నాగ చైతన్య విడిపోతారని.. నేను అనుకున్నది నిజమైంది.. నా కల నెరవేరింది: సమంత -
ఆయన చెప్పిందే నిజమైంది..సామ్-చై విడిపోయారు
Naga Chaitanya-Samantha Divorce: సమంత- నాగ చైతన్య విడాకులపై గత కొంత కాలంగా వస్తున్న పుకార్లకు తెరపడింది. తాము విడాకులు తీసుకుంటున్నట్లు టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైతన్య-సమంత సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ఇక భార్యా-భర్తలుగా కొనసాగలేమని, చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో వీరి వైవాహిక బంధం ముగిసినట్లుయ్యింది. చదవండి: బ్రేకింగ్: సమంత-నాగ చైతన్య విడాకులు 2017, అక్టోబర్ 7న గోవాలో క్రిస్టియన్, హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న సామ్-చై అక్టోబర్2న విడాకులు ప్రకటించారు. గత కొన్నాళ్లుగా వీరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. విడాకులకు రెండు నెలల ముందే సమంత తన సోషల్‌మీడియా అకౌంట్లలో అక్కినేని అనే పదాన్ని తీసేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఇదిలా ఉండగా సమంత-నాగ చైతన్య విడిపోతారని మూడేళ్ల క్రితమే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చెప్పిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత-నాగ చైతన్యకు పెళ్లి తర్వాత విబేధాలు వస్తాయని,సినిమాల పరంగా బాగానే ఉన్నా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇబ్బందులు వస్తాయని వేణు స్వామి గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సామ్-చై పెళ్లికి ముందే వేణుస్వామి ఈ కామెంట్స్ చేయడం అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. చదవండి: చైసామ్ విడాకులు.. ఏంటీ? ఏం జరిగింది? అయితే ఇప్పుడు అదే వార్తలను నిజం చేస్తూ సమంత-నాగ చైతన్య విడిపోయారు. దీంతో వేణు స్వామి చెప్పిందే నిజమైందని, ఆయన మూడేళ్ల క్రితమే చెప్పిన విడాకులు నేటితో నిరూపితం అయ్యిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చై-సామ్ పెళ్లినాటి ఫోటోలు -
అనుష్క పెళ్లిపై జ్యోతిష్కుడు ఆసక్తికర వ్యాఖ్యలు
Astrologer Comments on Anushka Shetty Marriage: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క పెళ్లిపై వచ్చినన్ని రూమర్స్ మరే ఇతర హీరోయిన్స్‌పై వచ్చుండవేమో. గతంలో ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ వినిపించాయి. అయితే తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని, అలాంటివి వార్తల్లో నిజం లేదంటూ ఇద్దరూ క్లారిటీ ఇవ్వడంతో రూమర్స్‌కు ఫుల్స్టాప్ పడింది. అనంతరం ఓ బిజెనెస్ మెన్‌తో అనష్కుకు పెళ్లి ఫిక్సయిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అది కూడా ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. చదవండి : Nagarjuna: ఆ విషయం తలుచుకొని నాగార్జున భావోద్వేగం ఇక `నిశ్శబ్దం` సినిమా అనంతరం జోరు తగ్గించిన అనుష్క నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ సినిమా చేస్తుందని అనౌన్స్ చేసినా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అనుష్క పెళ్లిపై మరోసారి రూమర్స్ జోరందుకున్నాయి.ఈ నేపథ్యంలో అనుష్క వివాహంపై ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ జగన్నాథ్ గురూజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి : కమెడియన్ అలీ లగ్జరీ ఇంటిని చూశారా? అనుష్క వృత్తి విషయంలో ఎంతో సిన్సియర్ అని, ఆమె ముఖ కవళికలను బట్టి చూస్తే ఇండస్ట్రీ వ్యక్తిని కాకుండా బయటి వ్యక్తిని అనుష్క పెళ్లాడనుందని పేర్కొన్నారు. అనుష్క చాలా డౌన్ టూ ఎర్త్ అని, ఆమెలో కొంచెం కూడా అహంభావం ఉండదని తెలిపారు. ఇక పెళ్లి గురించి చెబుతూ..2023లోపు అనుష్కకు వివాహం జరుగుతుందని వివరించారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది చూడాల్సి ఉంది. చదవండి: బాక్సాఫీస్ వద్ద ‘లవ్‌స్టోరి’ప్రభంజనం.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే? -
రంగురాళ్ల చోరీ కేసులో కొత్త ట్విస్ట్
-
రంగురాళ్ల చోరీ కేసులో కొత్త ట్విస్ట్
-
‘జోతిష్యుడి’ కథ అడ్డం తిరిగింది!
నాగోలు: జోతిష్యం తెలుసంటూ కలరింగ్ ఇచ్చి ఆ ముసుగులో నకిలీ రంగురాళ్లు అంటగట్టడంతో పాటు హవాలా దందా, నకిలీ నోట్ల చెలామణి చేపట్టాడో బోగస్ జోతిష్యుడు. ఈ విషయం తెలియని పని వాడు మరికొందరితో కలిసి ఫేక్ కరెన్సీ ఎత్తుకుపోయాడు. ఇది కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో అతగాడు విలువైన రంగురాళ్లు, వజ్రాలు పోయాయంటూ కేసు పెట్టాడు. రంగంలోకి దిగిన ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో అసలు వ్యవహారం బయటపడింది. జోతిష్యుడితో సహా ఏడుగురిని అరెస్టు చేసిన అధికారులు రూ.17.72 కోట్ల టాయ్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ క్రైమ్స్ డీసీపీ యాదగిరి పూర్తి వివరాలు వెల్లడించారు. జోతిష్యుడి అవతారంలో మోసాలు... గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుళ్ళపల్లికి చెందిన బెల్లంకొండ మురళీకృష్ణ శర్మ పదో తరగతి వరకు చదివాడు. ఆపై జోతిష్యుడి అవతారం ఎత్తి మాయమాటలతో ఎదుటి వారిని తేలిగ్గా మోసం చేయడం మొదలెట్టాడు. ఈ ముసుగులో నకిలీ రంగురాళ్ళను అంటగట్టి అమాయకులను బురిడి కొ ట్టించి రూ.లక్షల్లో ఆర్జించాడు. 2006లో కుటుంబంతో వెళ్లి విజయవాడలో స్థిరపడ్డారు. అక్కడ ఉంటూ భక్తి నిధి పేరుతో ఓ వెబ్సైట్ ఏర్పాటు చేసిన నకిలీ రంగురాళ్ళు అమ్మాడు. ఈ మోసాలతో అనుకున్న స్థాయిలో ధనార్జన సాధ్యం కాలేదు. దీంతో విలాసా ల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. గతంలో కటకటాల్లోకి పంపిన సీబీఐ.. మురళీకృష్ణకు 2019లో నూరుద్దీన్ అనే వ్యక్తి ఇతడికి పరిచయమయ్యాడు. అతడు ట్రేడింగ్ చేస్తుండటంతో అందులో పెట్టుబడి పెట్టేందుకు తన బ్యాంకు ఖాతాలో రూ.90 కోట్లు ఉన్నట్లు నమ్మించాడు. ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు మల్కాజ్‌గిరిలో ఓ బ్యాంక్ అధికారుల సాయం తీసుకున్నాడు. తాత్కాలిక ప్రాతిపదికన తనకు ఆ నగదు తన ఖాతాలో ఏర్పాటు చూస్తే..24 గంటల్లో ఖరీదు చేసిన షేర్లు అమ్మేసి లాభాలు పంచుకుందామని ఎర వేశాడు. ఆ స్కామ్‌ను ముందే బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించారు. సీబీఐకు ఫిర్యాదు చేయగా మురళీకృష్ణతోపాటు కొందరు బ్యాంకువారిని అరెస్టు చేశారు. జైలు నుంచి వచ్చి కొత్త దందాలు... ఈ కేసులో బెయిల్ పొందిన మురళీకృష్ణ తన మకాంను నాగోల్ పరిధిలోని బండ్లగూడకు మార్చాడు. జూబ్లీహిల్స్‌లో మరో ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నాడు. జోతిష్యం, సమస్యల పరిష్కారం పేరుతో వివిధ ఛానళ్లలో ప్రకటనలు ఇచ్చి çఆకర్షితులైన వారికి నకిలీ రంగురాళ్లు విక్రయిస్తున్నాడు. దీంతో పాటు నలుగురు అనుచరుల్ని ఏర్పాటు చేసుకుని ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో నకిలీ నోట్ల చెలామణి చేపట్టాడు. ఆ కట్టుకథతో దొరికిపోయాడు.. ఈ నకిలీ జోతిష్యుడి వద్ద పని చేసే గుంటూరుకు చెందిన సి.నాగేంద్రప్రసాద్ శర్మ, వేల్పూరి పవన్ కుమార్, దొండపాటి రామకృష్ణ, చందులూరి విజయ్ కుమార్, కంభంపాటి సూర్యం, చందులూరి నాగేంద్రలకు దుర్భుద్ది పుట్టింది. ఈ నెల 14న వీరంతా కలిసి మురళీకృష్ణ ఇంట్లో నగదు ఉన్న బ్యాగ్ చోరీ చేశారు. దాన్ని తీసుకుని కారులో గుంటూరు జిల్లాకు వెళ్తున్న వీళ్లు మార్గ మధ్యంలో బ్యాగ్ తెరిచి చూశారు. బ్యాగ్‌లో ఉన్న వాటిలో కేవలం రూ.2 వేల నోట్లు 16 మాత్రమే అసలైనవి అని, మిగిలినవి నకిలీ కరెన్సీ, టాయ్ కరెన్సీగా గుర్తించారు. అవి తమ వద్ద ఉంటే పోలీసులు పట్టుకుంటారని భయపడిన ఆ నిందితులు నార్కట్‌పల్లి వద్ద ప్రధాన రోడ్డు దూరంగా తీసుకువెళ్లి పెట్రోల్ పోసి కాల్చేశారు. ఈ చోరీని తనకు అనుకూలంగా మార్చుకుని క్యాష్ చేసుకోవాలని భావించిన మురళీకృష్ణ తన ఇంటి నుంచి రూ.40 లక్షల విలువైన రంగురాళ్లు, వజ్రాలు చోరీ అయ్యాయని ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. అసలు విషయం చెప్పిన ఆరుగురు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు పిగుడురాళ్ల వెళ్లి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి విచారణలో చోరీ చేసిన నకిలీ నోట్లు, వాటిని కాల్చేయడం తదితర విషయాలు బయటపడ్డాయి. నకిలీ నోట్లు జోతిష్యుడి వద్దకు ఎలా వచ్చాయనే అనుమానంతో పోలీసులు అతడినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మురళీకృష్ణ హవాలా దందా, టాయ్ కరెన్సీతో మోసాలు, నకిలీ కరెన్సీ చెలామణి తదితరాలు బయటపెట్టాడు. దీంతో అతడి ఇంటిపై దాడి చేసిన పోలీసులు రూ.రూ.17.72 కోట్ల టాయ్ కరెన్సీ, రూ.6 లక్షల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. మురళీకృష్ణతో పాటు ఏడుగురు నిందితుల్నీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: 'ఆ రూపాయి నాణేం కోటికి కొంటాను' -
కూకట్‌పల్లిలో ప్రభుత్వ స్థలం ఉందని చెప్పి...
అమీర్‌పేట: సీఎం కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ పరిచయమైన ఓ వ్యక్తి జ్యోతిష్కుడిని మోసం చేశాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూకట్‌పల్లిలో స్థలం ఇప్పిస్తానంటూ రూ.25 లక్షలు కాజేసిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. దేవీ శైలేంద్రనాథ్ అనే వ్యక్తి ఎస్ఆర్నగర్లోని స్వస్థిక్ ప్లాజా హిమాలయా బుక్ స్టోర్ పైఅంతస్తులో నివాసముంటున్నాడు. ప్రసార మాధ్యమాల ద్వారా శైలేంద్రనాథ్ గురించి తెలుసుకుని ఓ వ్యక్తి వచ్చాడు. తన పేరు సుధాకర్ అని తాను సీఎం కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా పరిచయం చేసుకున్నాడు. పలుమార్లు జాతకం చూపించుకున్న సుధాకర్ వెంట ఇద్దరు గన్మెన్లు కూడా ఉండటంతో పాటు వారి వద్ద గన్స్ కూడా ఉండేవి. కూకట్‌పల్లిలో ఓ చోట ప్రభుత్వ స్థలం ఉందని, అది నీకు వచ్చేలా చూస్తానని, అందులో ఆధ్యాత్మిక కేంద్రం పెట్టుకోవచ్చని నమ్మించాడు. దీంతో శైలేంద్ర విడతలవారీగా 2019 నుంచి 2021 ఫిబ్రవరి వరకు రూ.25 లక్షలు ఇచ్చాడు. డబ్బులు తీసుకుని సంవత్సరాలు గడస్తున్నా స్థలం ఇప్పించకపోవడంతో అనుమానం వచ్చి తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని శైలేంద్ర కోరారు. డబ్బులు అడిగితే గన్‌తో కాల్చి చంపేస్తానని బెదిరించడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. -
ప్రదీప్ లీలలు : చెప్పేవి నీతులు.. చేసేవి చెడ్డ పనులు
సాక్షి, సిటీబ్యూరో: ఆధ్యాత్మికత ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నట్లు ప్రదీప్ జోషిపై సీసీఎస్ మహిళా ఠాణాలో ఫిర్యాదు చేసిన ఆయన మూడో భార్య డాక్టర్ శ్రేయ బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. వివిధ టీవీ చానళ్లలో ప్రవచనాలు వల్లించే ప్రదీప్ జోషి వాస్తవ జీవితంలో మాత్రం దుర్మార్గుడని ఆరోపించారు. ఆయన చెప్పే ధర్మం కేవలం పుస్తకాలకే పరిమితం, అది ఎదుటి వారికి చెప్పడానికే.. ఫాలో అవ్వడానికి కాదని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. తమ పెళ్లి సమయంలో అలేఖ్యతో వివాహం, విడాకులు, బాబు ఉన్న విషయం మాత్రమే చెప్పారు. మరో యువతి లక్ష్మీ ప్రత్యూషతో వివాహమైన విషయం చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని పేర్కొన్నారు. అమాయక అమ్మాయిల్ని మోసం చేయడంతో పాటు వారిని వదిలించుకోవడానికి వారినే బ్లేమ్ చేస్తుంటాడని, గత ఏడాది మార్చిలో తమ వివాహమైందని, ఆ తర్వాత ఆరు నెలలకే తనను వదిలించుకోవాలని చూశాడని శ్రేయ చెప్పారు. ఒక దశలో తాను పుట్టింటికి వెళ్లినప్పుడు తిరిగి రానీయకుండా గేటుకు తాళం వేశాడని, పోలీసు కేసు పెట్టిన తర్వాత కౌన్సెలింగ్‌కు రాకుండా కరోనా పేరుతో తప్పించుకున్నాడని ఆమె ఆరోపించారు. -
ప్రముఖ జ్యోతిష్యుడు కన్నుమూత
అహ్మదాబాద్: ప్రముఖ జ్యోతిష్యుడు బెజన్ దారువాలా (89) మరణించారు. గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన గత రాత్రి తుదిశ్వాస విడిచారని అహ్మదాబాద్‌లోని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈయన భారతదేశంలోని ప్రసిద్ధ జోతిష్య శాస్త్ర కాలమిస్ట్‌లలో ఒకరు. తన దశాబ్ధాల కెరీర్లో అనేక వార్తాపత్రికలు, న్యూస్ ఛానెల్‌తో సంబంధం కలిగి ఉన్నారు. అహ్మదాబాద్‌లో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. బెజన్‌కు 2015లో ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన చేతిని చూపించానని చెప్పడం విశేషం. అయితే తన తండ్రి కరోనా బారిన పడి మరణించారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కుమారుడు నాస్టూర్ దారువాలా ఖండించారు. కాగా.. బెజన్ దారువాలా మరణానికి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్రమంత్రి స్మతి ఇరానీలు సంతాపం ప్రకటిస్తూ.. 'ఆయన మరణం మమ్మల్ని కలిచివేసింది. వారి కుటుంబానికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఓం శాంతి' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే -
జ్యోతిష్యం చెబుతా
చేతిని చూసి మీకు జరగబోయేదేంటో జోష్యం చెబుతాను అంటున్నారు రెజీనా. అనడమే కాదు.. జోష్యానికి సంబంధించిన విషయాలను జాగ్రత్తగా అవగాహన చేసుకుంటున్నారు. ఇదంతా తన తదుపరి సినిమాలోని పాత్రకు సంబంధించిన ప్రాక్టీస్ అని అర్థం చేసుకోవచ్చు. ‘ఎవరు’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు రెజీనా. ఇటీవలే తమిళంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాను అంగీకరించారు. ఇందులో అక్షర గౌడ మరో హీరోయిన్. కార్తీక్ రాజు దర్శకుడు. మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను ఈ సినిమాలో చూపించనున్నారట. ‘‘ఈ సినిమాలో నేను జ్యోతిష్కురాలి పాత్రలో కనిపిస్తాను. డైరెక్టర్ నాకు ఈ కథ చెప్పాగానే బాగా కనెక్ట్ అయ్యాను’’ అని పేర్కొన్నారు రెజీనా. జనవరి 10 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. -
భారత ఓటమిని ముందే చెప్పిన జ్యోతిష్యుడు!
హైదరాబాద్ : ప్రపంచకప్‌లో భారత్ పోరాటం సెమీస్‌తో ముగిసింది. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన కోహ్లిసేన సెమీస్‌లో మాత్రం పరిస్థితులు అనుకూలించక న్యూజిలాండ్‌కు తల వంచింది. 240 పరుగుల సాధారణ లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది. అభిమానులకు తీరని గుండె కోతను మిగిల్చింది. అయితే భారత్ సెమీస్‌లో ఓడుతుందని ఓ జ్యోతిష్యుడు ఆరు నెలల ముందే తెలియజేశాడు. అతను చెప్పినట్లు భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు వెళ్లడం.. ఇప్పుడు చర్చనీయాంశమైంది. బాలాజీ హసన్ అనే సదరు జ్యోతిష్యుడు ఓ టీవీ చానెల్ క్యార్యక్రమంలో భాగంగా చెప్పిన ఈ మాటలు ఇప్పుడు అందరని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జనవరిలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను హీరో మాధవన్ ఇన్‌స్టాగ్రాంలో పంచుకోగా ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఏముందంటే.. 2019 ప్రపంచకప్‌లో ఏ జట్టు గెలుస్తుందని యాంకర్ ప్రశ్నించగా.. ఇది చాలా కష్టమైన ప్రశ్ననని పేర్కొన్న బాలాజీ హసన్.. ఇప్పటి వరకు గెలవని జట్టు సొంతం చేసుకుంటుందని సమాధానమిచ్చాడు. భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్‌కు చేరుతాయని, భారత్.. న్యూజిలాండ్ లేక ఇంగ్లండ్‌తో సెమీస్ ఆడుతుందన్నాడు. టైటిల్ మాత్రం న్యూజిలాండ్ గెలుస్తుందని, మ్యాన్ఆఫ్ది సిరీస్ కేన్ విలియమ్సన్‌ను వరిస్తుందన్నాడు. ఇక అతను చెప్పినట్లుగానే న్యూజిలాండ్.. భారత్‌తో గెలిచి ఫైనల్ చేరింది. ఇక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రేసులో కేన్ విలియమ్సన్, జోరూట్‌కు అవకాశాలున్నాయి. అత్యధిక పరుగుల జాబితాలో రోహిత్ శర్మ (648) టాప్‌స్కోరర్‌గా ఉండగా.. డేవిడ్ వార్నర్ 647 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరి కథ సెమీస్ పోరుతో ముగియడంతో తరువాతి స్థానాల్లో నిలిచిన జోరూట్ (549), కేన్ విలియమ్సన్ (548)కు అవకాశం ఉంది. ఫైనల్లో ఎవరు సెంచరీ సాధిస్తారో వారు మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలవనున్నారు. -
టైటిల్ మాత్రం న్యూజిలాండ్ గెలుస్తుంది!
-
మా చెయ్యి చూస్తారా!
దేశమంతటా ఎన్నికల హడావుడి హోరెత్తుతోంది. ఎలాగైనా గెలవాలని కలలుగంటోన్న బిహార్ రాజకీయ నేతల కోలాహలమంతా జాతక మహారాజుల ఇళ్ల ముందుంది. రానున్న ఎన్నికల్లో తమ జాతకం ఎలా రాసిపెట్టి ఉందో తెలుసుకునేందుకు వీరంతా జ్యోతిష్యుల చుట్టూ తిరుగుతున్నారు. రాశి ఫలం, పేరు బలాన్ని బట్టి మంచిచెడులను, లాభనష్టాలను బేరీజు వేసుకుంటున్నారు. కొన్ని వారాలుగా రాజకీయ పండితులూ, రాజకీయ విశ్లేషకులూ ప్రజల నోళ్లలో నానుతూ వచ్చారు. అయితే ఇప్పుడు వారి స్థానాన్ని జ్యోతిష్యులు ఆక్రమించారు. రాజకీయ నేతల భవిష్యత్తుని ముందుగానే నిర్ణయించే పనిలో వీరు బిజీ అయిపోయారు. ఎన్నికల తేదీలను ప్రకటించినప్పటికీ అనేక మంది ఆశావహులైన రాజకీయ నాయకులు పొత్తులెలా ఉంటాయోనని ఆందోళనలో గడిపారు. దీన్ని ఆసరాగా చేసుకొని జ్యోతిష్యులూ, హస్తసాముద్రికులూ, భవిష్యవాణిని వినిపించేవారూ ఏ అభ్యర్థి విజయావకాశాలు ఎలా ఉన్నాయో చెబుతూ రాజకీయ నాయకుల్లో ఉన్న ఆందోళనని, భయాన్నీ సొమ్ము చేసుకుంటున్నారు. లోక్‌సభలోకి ప్రవేశించాలని కలలుగనే అభ్యర్థులెందరో వీరిని ఆశ్రయిస్తున్నారు. వారి జయాపజయాలను బేరీజు వేసి, ఆశావహులను మెప్పిస్తున్నారు. అందరూ వారి చుట్టూనే.. ఈ ఎన్నికల్లో ఎవరికి టికెట్లు వస్తాయి? పార్టీ గుర్తులూ, ఎన్నికల ఒప్పందాలూ, గెలిచే వారెవరు, ఓటమి పాలయ్యేదెవరు? అనే విషయాలపైనే రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎంపీలు తమ స్థానాలు తమకు దక్కుతాయా? వేరే స్థానాలకు వెళ్లాల్సి వస్తుందా? కొత్త నియోజకవర్గాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలా? అనే విషయాలపైనే తర్జనభర్జన పడుతున్నారు. పట్నాలోని బైద్యనాథ్ ఝా శాస్త్రి అనే జ్యోతిష్యుడు ‘ఇప్పుడు తమ దగ్గరికి పలువురు రాజకీయ నాయకులు వస్తున్నారనీ, వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు తమ వైపే ఉండేలా ఏం చేయాలో చెప్పండని మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు’’ అనీ చెప్పారు. ఈ పరిస్థితుల్లో నవగ్రహాలకు పూజలు చేయటమే ముఖ్యమైన కర్తవ్యమని జ్యోతిష్యుడు బైద్యనాథ్ వారికి సెలవిస్తున్నారు. ‘‘అన్ని సందర్భాల్లోనూ ఇది అవసరం లేదు. అవసరాన్నీ, సందర్భాన్నీ బట్టి కనీసం సూర్యగ్రహం, గురుగ్రహం లాంటి రెండు మూడు గ్రహాలను సంతృప్తి పరచాలని’’ ఆయన చెబుతున్నారు. అయితే ఈ పూజలకు కనీసం వారం సమయం పడుతుందని, ప్రత్యేక మంత్రోచ్ఛరణలతో ఈ కార్యక్రమం చేపట్టాలనేది ఆయన మాట. కోరుకున్న ఫలితాలను ‘భగలాముఖి’ అనే పూజతో సాధించవచ్చునని ఆయన అంటున్నారు. ప్రత్యర్థిని ఓడించి, తమ కర్తవ్యాన్ని నెరవేర్చుకోవడానికి ఈ పూజ అద్భుతంగా పనిచేస్తుందని, పాట్నా నగరంలో పేరున్న శుక్లా యజుర్వేద అనే వేద పాఠశాల ఉపాధ్యాయుడు అక్షయ్ తివారీ అన్నారు. ఈ పూజ పది రోజుల తంతు అనీ, ఖరీదుతో కూడుకున్నదనీ, భారీగా పూజా సామగ్రి అవసరమని ఆయన చెప్పారు. ప్రముఖ రాజకీయ నాయకులెందరో తమ వద్దకు వస్తున్నారనీ, అయితే వారి పేర్లను మాత్రం బయటపెట్టబోమని జ్యోతిష్యులు అంటున్నారు. ఇది తమకు, వారికి మధ్య విశ్వాసానికి సంబంధించిన విషయమని స్పష్టం చేస్తున్నారు. -
హత్య చేసి.. నింపాదిగా కరపత్రాలు పంపిణీ
తమిళనాడు, సేలం: తిరుప్పూర్‌లో సోమవారం మిట్ట మధ్యాహ్నం ఓ జ్యోతిష్యుడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు ఓ హంతకుడు. అనంతరం నింపాదిగా అక్కడ గుమికూడిన వారికి హత్యకు గల కారణాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేసి వెళ్లాడు. వివరాలు.. తిరుప్పూర్ నగరంలో వెల్లివిళా పార్కు ఉంది. ఇక్కడ అనేక దుకాణలు ఉండడం వల్ల అన్ని వేళలా జనం రద్దీ ఉంటుంది. ఇక్కడ సోమవారం మధ్యాహ్నం కత్తితో వచ్చిన ఒక వ్యక్తి అటువైపుగా నడిచి వెళుతున్న ఒక జ్యోతిష్యుడిని పొడిచి దారుణంగా హత్య చేశాడు. జ్యోతిష్యుడు రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోగా, ఆ హంతకుడు ఒక చేతిలో కత్తితో.. మరో చేతిలో తాను తీసుకు వచ్చిన కరపత్రాలను అక్కడ గుమికూడిన వారికి, దుకాణాల వారికి నింపాదిగా పంచి పెట్టి వెళ్లిపోయాడు. పోలీసుల విచారణ.. ఘటనపై సమాచారం అందుకున్న తిరుప్పూర్ పోలీసులు అక్కడికి వెళ్లి, జ్యోతిష్యుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత హంతకుడు పంచిపెట్టిన కరపత్రాలను పరిశీలించారు. అందులో.. హత్యకు గురైన జ్యోతిష్యుడు తిరుప్పూర్ మంగళం భారతి పూదూర్కు చెందిన రమేష్ (అలియాస్ కుమార్). ఇతను గత 14 ఏళ్లకు పైగా కుమరన్ పార్కు వద్ద కూర్చుని జోష్యం చెబుతున్నాడు. అంతటితో ఆగకుండా అక్కడికి వచ్చే ప్రేమికులు, అమ్మాయిలను పిలిచి చేతులు పట్టుకుని, మాయమాటలు చెప్పి తన వలలో వేసుకుని వ్యభిచార రొంపిలోకి దించడం, అమాయకులైన అమ్మాయిలను లైం గికంగా వేధించడం వంటివి చేస్తున్నాడు. ఇతనికి ప్రముఖ రాజకీయ నేతలు అండగా ఉన్నారు. ఇతడి చెరలో గత రెండేళ్లుగా ఒక మహిళ చిక్కుకుని ఇబ్బందులు పడుతోంది. ఈమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఈ మహిళను రక్షించాలి. ఇటువంటి దుర్మార్గపు జ్యోతిష్కుడు బతికి ఉండాల్సిన అవసరం లేదు. అందుకే హతమారుస్తున్నా అని రాసి ఉంది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
వరంగల్ జ్యోతిష్కడి ఇంట్లో రూ లక్షలు పట్టివేత
సాక్షి, రామన్నపేట: వరంగల్ రామన్నపేటలోని జ్యోతిష్యుడు కాళేశ్వరం సుమన్‌శర్మ ఇంట్లో రూ.2.12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ జీవన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఇంట్లో నగదు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు ఎన్నికల టాస్క్‌ఫోర్స్ అధికారి ప్రశాంతి నేతృత్వంలో బుధవారం రాత్రి తనిఖీలు నిర్వహించగా నగదు లభ్యమైనట్లు ఆయన వివరించారు. ఈ నగదుకు సంబంధించిన వివరాలు తెలపకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
‘నాథులాల్ చెప్పాడు.. ప్రెసిడెంట్ అయ్యాను’
జైపూర్ : రాజస్తాన్ భిల్వారాకు 20 కిలోమీటర్ల దూరాన ఉన్న కరియో గ్రామానికి పలు రాజకీయ పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. ఏంటా ఊరి ప్రత్యేకత అంటే ఈ గ్రామం జ్యోతిష నగరంగా ప్రసిద్దికెక్కింది. ఇక్కడ ఉన్న ఓ పండితుని వల్ల ఈ గ్రామానికి ఇంత పేరు ప్రఖ్యాతులు. ఈ గ్రామ వాస్తవ్యుడైన నాథులాల్ వ్యాస్(95) అనే జ్యోతిషున్ని కలవడానికి నేతలంతా కరియో గ్రామానికి ప్రయాణం కట్టారు. నాథులాల్ ‘భృగు సాహిత్య’ నిపుణుడు మాత్రమే కాకా మంచి జ్యోతిష శాస్త్ర పండితుడు. ఈయన మాటకు తిరుగులేదని ఈ ప్రాంతంలో ఓ నమ్మకం. రాజస్తాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు రాజకీయ నాయకులకు ఇయన మాట అంటే చాలా గురి. దాంతో ఎన్నికల ముందు ఈ పండితున్ని కలిసి సలహా తీసుకోవడం ఆనవాయితీగా మారింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలువురు నేతలు ఈ పండితుడి ఇంటికి బారులు తీరారు. అయితే నాథులాల్ ఇంత ప్రసిద్ధి చెందడానికి కారణం మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. పాటిల్, ఆమె భర్త దేవ్ సింగ్ పాటిల్ నాథులాల్‌ని తరచుగా కలుస్తూ ఆయన సలహాలు పాటించేవారు. ఈ క్రమంలో ప్రతిభా పాటిల్ తన జీవితంలో చాలా ఉన్నతమైన స్థానాలకు వెళ్తుందని నాథులాల్ జోస్యం చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దాంతో పాటిల్ తన ప్రమాణస్వీకార మహోత్సవానికి నాథులాల్‌ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. అప్పటి నుంచి ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. జాతకాలను బాగా నమ్మే పలువురు రాజకీయ నేతలు తమ భవిషత్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు నాథులాల్ను కలవడం పరిపాటిగా మారింది. రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ, స్మృతి ఇరానీ, అమర్ సింగ్ వంటి పలవురు ప్రముఖులు నాథులాల్‌ని నమ్మే వారిలో కొందరు. -
అమ్మో.. సొంతింటిలో నిద్రపోవడమా?
సాక్షి, బెంగళూరు: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 170 కిలోమీటర్ల ప్రయాణం రోజూ చేయడమంటే మాటలా? కానీ నమ్మకం అలా చేయిస్తోంది. ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి సోదరుడు, ప్రజాపనుల శాఖ మంత్రి హెచ్డీ రేవణ్ణ జ్యోతిష్య నమ్మకాలతో రోజూ 340 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ప్రతి రోజూ నియోజకవర్గం (హోళెనరసిపుర) నుంచి రాజధాని బెంగళూరుకు రానుపోను ప్రయాణాలు సాగిస్తున్నారు. బెంగళూరులోని బనశంకరి ఫేజ్–2లో ఆయనకు పెద్ద ఇల్లు ఉంది. దేవగౌడ కుటుంబానికి సంబంధించిన నగరంలో, ఆ చుట్టు పక్కల పదుల సంఖ్యలో ఇళ్లు కూడా ఉన్నాయి. అయినా వాటిలో ఉండేందుకు ఆయన ఏ మాత్రం సుముఖంగా లేరు. అందుకు కారణం ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటే. మంత్రిగా ఉన్నన్నాళ్లు నగరంలోని సొంత ఇంట్లో నిద్రిస్తే దురదృష్టం వెంటాడుతుందని చెప్పారట. అంతేకాదు ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించటంతో అప్పటి నుంచి ఆయన రాత్రిపూట నగరంలో ఉండేందుకు తటపటాయిస్తున్నారు. అయితే ప్రభుత్వ బంగ్లాలో ఉండొచ్చని జ్యోతిష్యుడు సూచించినట్లు తెలుస్తోంది. మంత్రి ఏమంటున్నారు? మంత్రి రేవణ్ణకు ఇంత వరకు ప్రభుత్వ బంగ్లా కేటాయింపు జరగలేదు. కుమార పార్క్ వెస్ట్‌లోని బంగ్లాలో మాజీ మంత్రి హెచ్‌సీ మహదేవప్ప ఉన్న బంగ్లాలో రేవణ్ణ చేరాల్సి ఉంది. కానీ మహదేవప్ప మూడు నెలల గడువు కోరారు. రోజూ నియోజకవర్గం నుంచి బెంగళూరుకు రాకపోకలపై మంత్రి రేవణ్ణ స్పందిస్తూ.. ‘నాకు ఇంతదాకా బంగ్లా కేటాయించలేదు. అందుకే ఇలా తిరగాల్సి వస్తోంది’ అని చెప్పారు. బెంగళూరు– హోళెనరసిపుర మధ్య దూరం 170 కిలోమీటర్లు, మూడు గంటలకు పైగానే ప్రయాణం. ఇలా మొత్తం అంతా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ వ్యవహారంపై జేడీఎస్ నేత ఒకరు స్పందిస్తూ.. ‘ఎవరి నమ్మకాలు వారివి’ అన్నారు. -
జ్యోతిష్కుడు చెప్పాడని...
మూఢనమ్మకాల జాడ్యం గురించి ప్రజల్లో అవగాహన కోసం ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ.. ప్రజాప్రతినిధి, స్వయానా సీఎం సోదరుడు వాటిని ఆచరించటం చర్చనీయాంశమే. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి సోదరుడు, మంత్రి హెచ్డీ రేవణ్ణ దురదృష్టాన్ని దూరం చేసుకునేందుకు రోజూ 340 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ప్రతీరోజూ నియోజకవర్గం(హోలెనరసిపుర), రాజధాని బెంగళూరు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వార్తల్లో నిలిచారు. సాక్షి, బెంగళూరు: నిజానికి బెంగళూరులోని బనశంకరి ఫేజ్-2లో ఆయనకు లంకంత కొంప ఉంది. అంతేకాదు దేవగౌడ కుటుంబానికి సంబంధించిన నగరంలో, ఆ చుట్టు పక్కల పదుల సంఖ్యలో ఇళ్లులు ఉన్నాయి. అయినా వాటిలో ఉండేందుకు ఆయన ఏ మాత్రం సుముఖంగా లేరు. అందుకు కారణం ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటే. మంత్రిగా ఉన్ననాళ్లు నగరంలోని సొంత ఇంట్లో నిద్రిస్తే దురదృష్టం వెంటాడుతుందని చెప్పాడంట. అంతేకాదు ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించటంతో అప్పటి నుంచి ఆయన రాత్రిపూట నగరంలో ఉండేందుకు తటపటాయిస్తున్నారు. అయితే ప్రభుత్వ బంగ్లా కేటాయిస్తే అందులో హాయిగా ఉండొచ్చని జ్యోతిష్యుడు సూచించాడు. దీంతో బంగ్లా కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారణం చేశాక రేవణ్ణకు ఇంత వరకు బంగ్లా కేటాయింపు జరగలేదు. కుమార పార్క్ వెస్ట్‌లోని బంగ్లాలో మాజీ మంత్రి హెచ్ సీ మహదేవప్ప ఉన్నారు. ఖాళీ చేసేందుకు మూడు నెలల గడువు కోరటంతో చేసేది లేఖ రేవణ్ణ అప్ అండ్ డౌన్ జర్నీలతో గడుపుతున్నారు. ఈ వ్యవహారంపై రేవణ్ణ స్పందిస్తూ... ‘నాకు ఇంతదాకా బంగ్లా కేటాయించలేదు. అందుకే ఇలా తిరగాల్సి వస్తుంది’ అని తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు- హోలెనరసిపుర మధ్య దూరం 170 కిలోమీటర్లు, మూడు గంటలకు పైగానే జర్నీ. కాన్వాయ్‌లోని వాహనాలు, సిబ్బంది ఖర్చులు, ఇలా మొత్తం అంతా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ వ్యవహారంపై జేడీఎస్ నేత ఒకరు స్పందిస్తూ.. ‘ఎవరి నమ్మకాలు వారివి’ అని తెలిపారు. పలువురు మాత్రం ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. కుమారస్వామికి కలిసొచ్చిన ఇల్లు... -
బాలిక శిలగా మారుతుందని..
సాక్షి ప్రతినిధి, చెన్నై: మూఢ నమ్మకాలు మనిషిని ప్రభావితం చేస్తాయనడానికి తమిళనాడులో జరిగిన ఓ ఘటన నిదర్శనంగా నిలిచింది. పుట్టినరోజు నాడు చిన్నారి శిలగా మారుతుందని ఓ జ్యోతిష్యుడు చెప్పడంతో చిన్నారి తల్లిదండ్రులతో పాటు వందలాదిమంది పూజలు చేస్తూ ఆ సంఘటన కోసం ఎదురు చూశారు. చివరకు అలా జరగకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా మనమేల్‌కుడికి చెందిన పళని కుమార్తె మాసిల (12) ఆరోతరగతి చదువుతోంది. ఈ చిన్నారికి దైవభక్తి ఎక్కువ. త్వరలో తాను సన్యాసిని, స్వామిని కాబోతున్నానని తరచూ చెప్పుకునేది. అయితే ఆమె తల్లిదండ్రులు కుమార్తె మాటలను పెద్దగా పట్టించుకోకున్నా ఒక కంట కనిపెట్టసాగారు. వయసుకు మించిన మాటలాడుతున్న మాసిలను ఓ జ్యోతిష్యుని వద్దకు తీసుకెళ్లి జాతకం చూపించగా ‘12వ జన్మదినం రోజున చిన్నారి మాసిల ఒక శిలావిగ్రహంగా మారిపోతుంది’ అని చెప్పాడు. ఈ నెల 2న మాసిల 12వ జన్మదినం కావడంతో ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాలికకు పట్టుచీర కట్టి నిండుగా పూలతో అలంకరించారు. వడకూర్ అమ్మన్ ఆలయ ప్రాంగణానికి తీసుకెళ్లారు. రాత్రి పోద్దుపోతున్నా ఎంతసేపటికీ చిన్నారి మాసిల శిలగా మారలేదు. దీంతో ఆలయ పూజారి మాసిలకు, ఆమె తల్లిదండ్రులకు చీవాట్లు పెట్టి పంపివేశాడు. -
చిలుకా చెప్పవా.. మా బతుకు జోస్యం!
సాక్షి, వికారాబాద్, బషీరాబాద్ : చిలుక జోస్యం చెప్పించుకోవడానికి ఒకప్పుడు వారి ముందు జనం చేయిచాపేవారు. ఇప్పుడు వారే చేయిచాపాల్సిన దుస్థితి నెలకొంది. కాలం తెచ్చిన మార్పులకు వారి బతుకులు చితికిపోయాయి. చిలుక జోస్యమే వృత్తిగా బతుకుబండిని నడిపిస్తున్న ఆరె గొందిలీల సంచార జీవితాలు దుర్భరంగా మారాయి. గతంలో గుంపులుగా వచ్చి చిలుక జోస్యం చెప్పించుకునేవారు. నేడు రోజంతా కూర్చున్నా చేయిచాపి జాతకం చెప్పించుకునేవారే కరువయ్యారు. ఆదాయం లేక పూట గడవడమే కష్టంగా మారింది. దీంతో కొంతమంది వృత్తిని వదులుకోగా..మరికొందరు వంశపారంపర్యంగా వస్తున్న వృత్తిని వదులుకోలేక జీవనం సాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది జనాభా కలిగిన ఆరె గొందిలీల(బుడబుడకల) జీవన విధానంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. మహారాష్ట్ర నుంచి మూడు శతాబ్దాల కిందట వలస వచ్చిన ఆరె గొందిలీలు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయిలో స్థిరపడ్డారు. ఇక్కడ సుమారు 350 కుటుంబాలుండగా క్రమేపి బతుకుదెరువు కోసం హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్‌తోపాటు ఆంధ్రాలోని కడప, కర్నూలు జిల్లాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రముఖ దేవాలయాలు, పర్యాటక కేంద్రాలను ఎంచుకొని చిలుక జోస్యం చెబుతూ జీవనం సాగిస్తున్నారు. స్మార్ట్ఫోన్ల కాలంలో జనం చిలుక జోస్యాలను ఆదరించడంలేదు. తద్వారా ఆ వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న వందల కుటుంబాలకు జీవనాధారం లేకుండాపోయింది. దీంతో నేటితరం యువకులు పట్టణాల్లో ఆటోలు నడుపుతూ, మహిళలు స్టీలు సామాన్లు, బట్టలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఆరెగొందిలీల చారిత్రక నేపథ్యం.. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సామ్రాజ్యంలో ఆరెగొందిలీలు కీలకంగా ఉండేవారని ప్రాచుర్యంలో ఉన్న గాధను బట్టి తెలుస్తోంది. తన సామ్రాజ్యంలోని ప్రజలు పాలనపై ఏమనుకుంటున్నారో కనుక్కొని రావాలని ఆరెగొందిలీలను చక్రవర్తి ఆదేశించగా ఆరెగొందీలు మారువేషాల్లో కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు వెళ్లారు. వారిలో కొంతమంది తిరిగి మహారాష్ట్రకు వెళ్లగా మరికొంత మంది ఇక్కడే ఉండిపోయారు. ఇలా స్థిరపడినవాళ్లే నేడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. ప్రతి ఏడాది ఏరువాక పౌర్ణమి, మొహర్రం నాడు ప్రతి కుటుంబం ఎక్మాయి గ్రామానికి వచ్చి పండుగ చేసుకుంటుంది. తర్వాత మళ్లీ ఆయా జిల్లాలకు వెళ్తుంటాయి. అందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు... గొందిలీ కుటుంబాలు రాష్ట్రంలో రెండు వేల నుంచి మూడు వేల వరకు పెరిగాయి. వీరిలో సూర్యాపేట జిల్లాలో నివాసముంటున్న గొందిలీలు నిరాదరణకు గురైన తమను బీసీ ‘ఏ’ లో చేర్చాలని కోర్టు ద్వారా ప్రభుత్వంతో కొట్లాడారు. దీంతో సుమారు 500 కుటుంబాలను ప్రభుత్వం బీసీ‘ఏ’ జాబితాలో చేర్చింది. మిగతా జిల్లాల్లోని వారికి మాత్రం అధికారులు బీసీ ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడంలేదు. దీంతో వందల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందకుండా పోతున్నాయి. బతుకు కష్టమైంది మాది ఎక్మాయి. 60 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జాతకాలు చెబుతూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాను. నాలుగైదేళ్లుగా చిలుక జోస్యం చెప్పించుకునేవారు కరువయ్యారు. బతకడం కష్టంగా మారింది. – వకోరి శంకర్రావు, చిలక జ్యోతిష్యుడు, తాండూరు పిల్లలను చదివించలేకపోతున్నం మమ్మల్నీ బీసీ ‘ఏ’జాబితాలో చేర్చాలని చాలారోజుల నుంచి డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడంలేదు. దీంతో మా పిల్లలను చదివించుకోలేకపోతున్నం. సీఎం స్పందించి న్యాయం చేస్తారని నమ్ముతున్నం. – ఇగ్వే శ్రీనివాస్, సిద్దిపేట బీసీ ‘ఏ’ జాబితాలో చేర్చాలి రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది జనాభా ఉన్నం. మహారాష్ట్రలో బీసీ ఏ గ్రూపులో చేర్చింది. ఇక్కడి ప్రభుత్వం మా గొందిలీలను బీసీ ‘ఏ’గ్రూపులో చేర్చాలి. అందరికీ తహసీల్దార్ కార్యాలయాల నుంచి కులం సర్టిఫికెట్లు జారీ చేయాలి. – భౌరి మోహన్, గొందిలీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
జ్యోతిష్కుడి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : నగరానికి చెందిన జ్యోతిష్కుడొకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీల భవిష్యత్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన.. వారి భవిష్యత్ పరిస్థితులపై జోస్యం చెప్పారు. స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ.. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబానికి చెందినవారు దేశ ప్రధాని అవుతారని ప్రకటన చేశారు. అభిషేక్ బచ్చన్- ఐశ్యర్యరాయ్ల కుమార్తె ఆరాధ్య బచ్చన్‌కు రాజకీయ భవిష్యత్తు పుష్కలంగా ఉందనీ.. ప్యూచర్లో ఆమె దేశ ప్రధానయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు. అయితే ఆరాధ్య ప్రధాని కావాలంటే పేరును మాత్రం రోహిణిగా మార్చుకోవాలని సూచించారు. మరికొన్ని విషయాలు.. తమిళనాడులో మధ్యంతర ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికల్లో రజనీకాంత్ సీఎంగా ఎన్నికవుతారని వివరించారు. భారత్ పాక్‌ల భవిష్యత్తు గురించి కూడా ఙ్ఙానేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఇరు దేశాల మధ్య యుద్దం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి ఎన్నికవుతారన్నారు. అమెరికాలో కూడా డొనాల్డ్ ట్రంప్ మరోదఫా అధ్యక్షుడు అవుతారని ఆయన చెబుతున్నారు. దేశ కుభేరుడు ముఖేశ్ అంబానీ కుమారురు ఆకాశ్ అంబానీకి 2018 అంతగా కలిసిరాదని, అతని వివాహం 2019లో అవుతుందన్నారు. ‘గతంలో నేను చెప్పినవన్నీ జరిగాయి. 2009లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పాను. చిరంజీవి, రజనీకాంత్‌లు రాజకీయాల్లోకి వస్తారని చెప్పాను. నేనే చెప్పినట్టుగానే 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే రజనీకాంత్ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు కూడా నేను చెప్పినవి జరిగి తీరతాయి’ అని ఙ్ఞానేశ్వర్ ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. -
పనివాడే ప్రధాన సూత్రధారి?
సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శర్మ కిడ్నాప్ వ్యవహారంలో ఆయన వద్ద పని చేస్తున్న వ్యక్తే ప్రధాన సూత్రధారిగా పోలీసులు నిర్థారించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి చిలకలగూడ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు. లక్ష్మీకాంత్ శర్మ ప్రతిరోజూ బంజారాహిల్స్ రోడ్ నెం.7లో ఉన్న ఓ టీవీ కార్యాలయానికి వస్తుంటారు. ఇందులో భాగంగానే గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు డ్రైవర్లు, సహాయకుడితో కలిసి వచ్చారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో టీవీ కార్యక్రమం పూర్తయిన తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కారు ముందు సీట్లో కూర్చున్న అతడిని సఫారీ సూట్లలో వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్డగించారు. తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని, విచారణ నిమిత్తం రావాలంటూ చెప్పి బలవంతంగా వెనుక సీట్లో కూర్చోబెట్టారు. డ్రైవర్లతో పాటు సహాయకుడినీ కారు నుంచి దింపేసిన వారు ఇద్దరి సెల్ఫోన్లు సైతం లాక్కుని లక్ష్మీకాంత్ ఐదు నిమిషాల్లో వస్తారని చెప్పారు. ఆయనను వాహనంతో సహా రోడ్ నెం.7లోని వాటర్‌ట్యాంక్ వైపు తీసుకుని వెళ్లిపోయారు. కొద్దిసేపు అక్కడ వేచి చూసిన అతని అనుచరులు ముగ్గురిలో ఒకరి సెల్‌ఫోన్‌కు లక్ష్మీకాంత్ నుంచి ఫోన్ వచ్చింది. తనను ఎంక్వైరీ కోసం తీసుకువెళ్తున్నారంటూ చెప్పిన ఆయన అది పూర్తయిన తర్వాత వస్తానని, మీరు ఇంటికి వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో ఈ ముగ్గురూ చిలకలగూడ పరిధిలోని మధురానగర్‌లో ఉన్న లక్ష్మీకాంత్ ఇంటికి వెళ్లి విషయం చెప్పారు. అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో లక్ష్మీకాంత్‌కు చెందిన వాహనంలోనే ఇంటికి వచ్చిన ‘ఆ నలుగురూ’ ఓ చిన్న లేఖ తీసుకువచ్చి లక్ష్మీకాంత్ తండ్రి రాజగోపాల్రావుకు ఇచ్చారు. అందులో ‘నాన్న సార్ వారు వస్తారు. వాళ్లు అడుగుతారు మీకు తెలిసింది చెప్పండి’ అంటూ లక్ష్మీకాంత్ చేతిరాతతోనే రాసి ఉంది. దీనిని చూపించిన దుండగులు తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని చెప్పి ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకుని వెళ్ళారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల వైర్లు సైతం తొలగించిన దుండగులు డీవీఆర్ పట్టుకెళ్లారు. మరుసటి రోజు (శుక్రవారం) లక్ష్మీకాంత్ శర్మను ఆరామ్‌ఘర్ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఆయన చిలకలగూడ పోలీసుస్టేషన్‌కు వచ్చి తన కళ్లకు గంతలు కట్టారని, బెదిరించి చీటీ రాయించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఉదంతానికి సంబంధించి శుక్రవారం బంజారాహిల్స్ ఠాణాలో లక్ష్మీకాంత్ డ్రైవర్ చంద్రశేఖర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో కిడ్నాప్ కేసు నమోదైంది. మరోపక్క ఆయన తండ్రి రాజగోపాలరావు ఫిర్యాదుతో చిలకలగూడ పోలీస్ స్టేషన్లో మరో కేసు రిజిస్టరైంది. చంద్రశేఖర్ తన ఫిర్యాదు లో ఇంటికి వచ్చిన దుండగులు రూ.30 లక్షల నగదు, 30 తులాల బంగారం తీసుకువెళ్లారని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళారు. లక్ష్మీకాంత్ తండ్రి తన ఫిర్యాదులో 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు తీసుకువెళ్లారంటూ పేర్కొ న్నారు. ఈ రెండు కేసుల్నీ బంజారాహిల్స్, చిలకలగూడ పోలీసులు వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నా రు. ప్రాథమికంగా చిలకలగూడ పోలీసుల లక్ష్మీకాంత్ శర్మ వద్ద పని చేస్తున్న, పని చేసి మానేసిన వారి వివరాలు సేకరించి విశ్లేషించారు. ఈ నేపథ్యంలో ఓ పనివాడే సూత్రధారిగా ఈ వ్యవహారం సాగినట్లు గుర్తించారు. లోతుగా దర్యాప్తు చేసిన చిలకలగూడ పోలీసులు సోమవారం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని వి చారిస్తున్న పోలీసులు మిగిలిన నిందితుల్ని పట్టుకోవడంతో పాటు రికవరీలపై దృష్టి పెట్టారు. అయితే ఈ కేసులో అనేక అంశాలు మిస్టరీగా ఉన్నాయన్న అధికారులు నిందితులందరూ చిక్కితేనే చిక్కుముడులు వీడతాయని పేర్కొన్నారు. -
‘కోహ్లికి శుక్రుడు బలంగా ఉన్నాడు’
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వచ్చే వన్డే వరల్డ్ కప్ ఆడతాడని గతేడాదే స్పష్టం చేసిన నాగ్‌పూర్‌కు చెందిన 'క్రికెట్ జ్యోతిష్కుడు' నరేంద్ర బుందే.. ఇక రానున్న కాలం విరాట్ కోహ్లిదేనని తాజాగా పేర్కొన్నారు. కోహ్లి క్రికెట్ కెరీర్లో చిరస్మరణీయమైన రికార్డులు సాధిస్తాడని నరేంద్ర బుందే తెలిపారు. సచిన్ వంద సెంచరీల రికార్డుతో పాటు, అనేక రికార్డులను కోహ్లి బద్ధలు కొడతాడన్నారు. 2025 నాటికి సచిన్ సెంచరీల రికార్డును కోహ్లి బ్రేక్ చేస్తాడని పేర్కొన్న నరేంద్ర.. టీ 20, వన్డే వరల్డ్ కప్‌లను కోహ్లి నేతృత్వంలోని భారత్ జట్టు గెలుస్తుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం కోహ్లికి శుక్రగ్రహం బలంగా ఉన్న కారణంగా విదేశాల్లో కూడా అతనికి తిరుగుండదన్నారు. రాబోవు ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ అద్బుతమైన ప్రదర్శన చేస్తుందనే ఈ సందర్బంగా నరేంద్ర బుందే పేర్కొన్నారు. మరొకవైపు ఈ ఏడాది కోహ్లికి ఊహించని అదృష్టం కలిసొస్తుందన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఎవ్వరూ చేసుకోని ఒప్పందం కోహ్లికి దక్కనుందన్నారు. గతంలో సచిన్ క్రికెట్లో పునరాగమనం చేస్తారని, భారతరత్న వరిస్తుందని చెప్పిన బుందే..గంగూలీ పునరాగమనం, భారత్ 2011 ప్రపంచకప్ విజయం గురించి కూడా చెప్పారు. అలాగే ధోని మరో రెండేళ్లు ఆడతాడని గత ఏడాది చెప్పిన బుందే.. అదే క్రమంలో వరల్డ్ కప్ కూడా ఆడతాడని చెప్పారు. -
బుక్... లక్!
‘అమ్మాయి.. నువ్వు పుస్తకాలు చదివితే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది’... నాలుగైదేళ్ల క్రితం సోనాక్షీ సిన్హాకు ఓ పెద్ద జ్యోతిష్కుడు ఇచ్చిన సలహా ఇది. వెంటనే ఈ బ్యూటీ బోల్డన్ని పుస్తకాలు కొన్నారేమో అనుకుంటున్నారా? అదేం లేదు. సోనాక్షి ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ, ఈ మధ్య ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయట. ఆ విషయం గురించి సోనాక్షీ మాట్లాడుతూ – ‘‘నేను జాతకాలను నమ్మను. ఆ జ్యోతిష్కుడు నన్ను బుక్స్ చదవమన్నా చదవలేదు. విచిత్రం ఏంటంటే.. మూడేళ్ల క్రితం నేను చేసిన ‘లుటేరా’ రచయిత ఒ. హెన్రీ రాసిన కథ ఆధారంగా తీసినది. ఈ నెలలో విడుదలకు సిద్ధమవుతున్న ‘నూర్’ సబా ఇంతియాజ్ రాసిన నవల ఆధారంగా తీసిన చిత్రం. ‘లుటేరా’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు మంచి విజయం సాధించింది. ‘నూర్’ ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. సినిమా కూడా హిట్టవుతుంది. ఈ ఆరేళ్లల్లో నేను 20కి పైగా సినిమాలు చేస్తే, వాటిలో ‘లుటేరా’, ‘నూర్’ నా హార్ట్‌కి బాగా దగ్గరయ్యాయి. సో.. పుస్తకాలకూ, నాకూ నిజంగానే ఏదైనా కనెక్షన్ ఉండి ఉంటుందా? ఆ జ్యోతిష్కుడు చెప్పినట్లు పుస్తకాలు నాకు కలిసొస్తాయా? ఏమో.. ఇలాంటివాటి మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. ఏదో యాదృచ్ఛికంగా జరిగిందనిపిస్తోంది’’ అన్నారు. -
‘శ్రీలంక అధ్యక్షుడు చస్తాడు.. జ్యోతిష్యుడు అరెస్టు’
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చనిపోతాడని జోష్యం చెప్పిన శ్రీలంక మాజీ నావికుడు, ప్రస్తుతం జ్యోతిష్యాలు చెప్పుకుంటు బతుకుతున్న వజితా రోహన విజెమునిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 26నాటికి మైత్రిపాల చనిపోతాడంటూ అతడు చెప్పిన మాటలు ఫేస్‌బుక్‌తో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీలంకలోని క్రైం బ్రాంచ్‌కు చెందిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారణకు తరలించారు. గతంలో ఇతడు శ్రీలంక నావికుడిగా ఉన్నప్పుడు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై రైఫిల్‌తో దాడికి యత్నించాడు. ఇండో-లంక మధ్య కుదుర్చుకునేందుకు రాజీవ్ గాంధీ కొలంబో వెళ్లినప్పుడు రోహన తన తుపాకీతో దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన 1987 జులై నెలలో జరిగింది. ఆ దెబ్బకు అతడిని కోర్టు మార్షల్ చేసిన శ్రీలంక జైలుకు పంపించింది. జైలు శిక్ష పూర్తయిన తర్వాత అతడు ప్రస్తుతం జ్యోతిష్యుడిగా పనిచేస్తున్నాడు. -
అవును ఆనాడు చెప్పిందే నిజమైంది
-
జ్యోతిష్యుడిని కలిసిన క్వీన్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌తో వివాదాలతో పాటు, తన లేటెస్ట్ సినిమాతో మరోసారి నేషనల్ అవార్డ్ సాధించి వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న కంగనారనౌత్.., మరోసారి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ బోల్డ్ బ్యూటీ తన భవిష్యత్తును తెలుసుకునేందుకు ఓ జ్యోతిష్యుడిని కలిసిందట. ఎప్పటిలోగా తను సొంత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటుందో తెలుసుకునేందుకే జ్యోతిష్యుడిని కలిసిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్, మనాలీ సమీపంలోని మండీలో ఇల్లు కట్టిస్తున్న కంగనా, అక్కడికి సమీపంలోనే జోగీందర్ నగర్లో ఉండే పండిట్‌ను కలిసింది. కొన్ని గంటలపాటు అతనితో చర్చించిన క్వీన్, ఎప్పటిలోగా తనకంటూ ఓ కుటుంబం ఏర్పడుతుంది, తన తల్లి ఆరోగ్యం ఎలా ఉంటుంది, భవిష్యత్తులో తన సినిమాలకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది లాంటి విషయాలను అడిగి తెలుసుకుంది. గతంలో పలు ఇంటర్య్వూలలో జ్యోతిష్యం పై తనకు నమ్మకం ఉన్నట్టుగా ప్రకటించిన కంగనా, చాలా సార్లు జ్యోతిష్యులను సంప్రదించినట్టుగా తెలిపింది. అంతేకాదు అలా భవిష్యత్తు తెలుసుకోవటం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, ఇతరులు కూడా ప్రయత్నించవచ్చని చెపుతోంది. తన సినిమా రిలీజ్ డేట్లతో పాటు టైటిల్ ఎంపికలో కూడా జ్యోతిష్యులను సంప్రదిస్తానని తెలిపింది కంగనా రనౌత్. -
ఎడారి కోకిల
గ్రేట్ లవ్‌స్టోరీ భంబూర్ (సింధ్, పాకిస్థాన్) రాజావారు తీసుకున్న నిర్ణయం విని అంతఃపురం దిగ్భ్రాంతికి గురైంది. రాజుగారికి మతిగానీ చలించలేదు కదా! లేకపోతే ఏమిటి! పండంటి ఆడబిడ్డ కోసం కలలు కన్న రాజావారు... ఆ బిడ్డ పుట్టీ పుట్టగానే ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు? ముక్కు పచ్చలారని పాప చేసిన నేరం ఏమిటి? అందరి మనసుల్లోనూ ఇవే ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఎందుకు పుట్టాయో తెలియా లంటే ముందు ఏం జరిగిందో చెప్పాలి. ‘‘నా బిడ్డ భవిష్యత్ చెప్పండి’’ అంటూ పాపను జ్యోతిష్యుడికి చూపించాడు రాజు. ఆ జ్యోతిష్యుడు పాపను తీక్షణంగా చూసి...‘‘ఈ పాప మీ వంశ కీర్తికి అప్రతిష్ట తెస్తుంది’’ అని చెప్పాడు జ్యోతిష్యుడు. ‘‘ఈ పాపను ఒక చెక్కె పెట్టెలో పెట్టి సింధు నదిలో వదిలేయండి’’ అని భటులకు ఆజ్ఞాపించాడు. నదిలో బట్టలు ఉతుకుతున్న ఒక రజకుడికి ఈ పెట్టె దొరికింది. ‘‘ పిల్లలు లేని నాకు ఈ పాపను ఆ దేవుడే కానుకగా ఇచ్చాడు’’ అనుకున్నాడు రజకుడు. సస్సి నవ యవ్వనశోభతో వెలిగి పోతోంది. ఆమె అందం గురించి పొరుగు రాజ్యం వరకు తెలిసిపోయింది. ఆమె అపురూప సౌందర్యం గురించి ఆ నోటా ఈ నోటా విన్న ఓ రాకుమారుడు పున్ను... భంభూర్ వచ్చాడు. ‘‘అయ్యా... ఏ పని మీద వచ్చారు?’’ అడిగాడు సస్సి తండ్రి. ‘‘మీ కుమార్తెను చూడడానికి వచ్చాను’’ అని చెప్పబోయి నాలిక కర్చుకున్నాడు. అంతలోనే సర్దుకొని ‘‘ఈ బట్టలు ఉతికించడానికి వచ్చాను’’ అన్నాడు తన దగ్గర ఉన్న జత బట్టలను అతడికి ఇస్తూ. ఆ సమయంలోనే ఇంటి బయటకు వచ్చింది సస్సి. ఆమెను చూసీ చూడగానే ప్రేమలో పడిపోయాడు పున్ను. ‘‘ పెళ్లంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి’’ అనుకున్నాడు. ఆ అమ్మాయి పరిస్థితి కూడా అంతే. పున్నును చూసీ చూడగానే ప్రేమలో పడిపోయింది. ఒకరితో ఒకరికి మాటలు కలిశాయి. ఆ మాటలు ప్రేమపూలై వికసించాయి. కూతురు ప్రేమలో పడిన విషయం తండ్రికి మెల్లగా తెలిసి పోయింది. ‘‘ఎర్రగా బుర్రగా ఉంటేనే సరిపోదు. నా కూతురిని బాగా చూసు కోవాలంటే నాలాగే నువ్వూ కష్టపడాలి. నీకు చిన్న పరీక్ష పెట్టదలుచుకున్నాను. ఈ మూటలో ఉన్న బట్టలను ఉతికి తీసుకురా. మల్లెపూవులా మెరిసిపోవాలి’’ అని పున్నును ఆదేశించాడు సస్సి తండ్రి. ఆయన చెప్పినట్లే రేవుకెళ్లి బట్టలు ఉతికాడు పున్ను. అయితే అన్ని చొక్కాలూ చిరిగిపోయాయి. వాటిని చూసి నెత్తీ నోరూ బాదుకున్నాడు సస్సి తండ్రి. ‘‘మీరేమీ బాధపడకండి. ఇవి తీసుకోండి’’ అంటూ తాను చేసిన పనికి పరిహారంగా జేబులో నుంచి బంగారు నాణేలు తీసి అతనికిచ్చాడు పున్ను. పున్నులోని అమాయకత్వానికి ముచ్చటపడి ‘‘సరేనయ్యా...మా అమ్మాయిని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను’’ అని వరం ఇచ్చాడు సస్సి తండ్రి. పున్ను ఆకాశంలో తేలిపోయాడు. తన కొడుకు ఒక రజకుడి కూతురిని పెళ్లాడబోతున్న విషయం తెలిసి మండిపడ్డాడు పున్ను తండ్రి మీర్ హోత్ఖాన్. అతని సోదరులు ఉన్నపళంగా పున్ను దగ్గరికి బయలు దేరారు. ‘‘సస్సితోనే నా జీవితం. ఆమె లేని జీవితం నాకు అక్కర్లేదు’’... తెగేసి చెప్పాడు పున్ను. ఒకరికొకరు రహస్యంగా సైగ చేసుకున్నారు సోదరులు. ‘‘ఈ అమ్మా యినే పెళ్లిచేసుకుందావు గాని... ముందు ఇంటికి వెళదాం పద’’ అని మాయమాట లతో పున్ను, సస్సీలను తమతో తీసుకె ళ్లారు. మత్తుమందు కలిపిన ద్రవాన్ని పున్నుతో తాగించి, స్పృహ కోల్పోయేలా చేసి, ఒంటెపై కట్టేసి ఎడారిలో వదిలారు. మరుసటి రోజు జరిగిన మోసాన్ని గ్రహించింది సస్సి. ఆమె గుండె దుఃఖనది అయ్యింది. ప్రియుడిని వెదుక్కుంటూ, ఎన్నో మైళ్ల దూరం ప్రయాణిస్తూ ఎడారిలో వెదుకులాట మొదలెట్టింది. అంతే... తర్వాత ఆమె జాడ తెలియలేదు. ఎడారిలో ఆ ఇద్దరూ ఏమైపోయారో ఎవరికీ తెలియదు. మౌఖిక సాహిత్యం నుంచి మాత్రం ఎన్నో కథలు పుట్టాయి. అందులో ముఖ్యమైనది... భూమి తనకు తానుగా చీలిపోయి, ఇద్దరు ప్రేమికులను తనలో దాచుకుందని. తన గుండెల్లో పెట్టుకుందని. ఇది అందమైన కల్పనే కావచ్చు. కానీ ఆ ఇద్దరి ప్రేమ మాత్రం అజరామరమై నిలిచిపోయింది! -
'నేనేమీ జ్యోతిష్కుడిని కాదు..'
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య క్రికెట్ సిరీస్ కచ్చితంగా జరుగుతుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు శశాంక్ చాలా ఆశ్చర్యకరమైన సమాధానమిచ్చారు. 'సిరీస్ జరుగుతుందా.. లేదా చెప్పడానికి నేనేమీ జ్యోతిష్కుడిని కాదు' అంటూ జవాబిచ్చారు. భారత్-పాక్ క్రికెట్ సిరీస్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి క్లియరెన్స్ రాలేదని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తెలిపారు. సిరీస్ ఆడటానికి వేదిక, మ్యాచ్ ప్రసార హక్కులు, టిక్కెట్ల విక్రయం లాంటి అంశాలపై పాక్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పాక్ పర్యటనకు వెళ్లిన విదేశాంగశాఖమంత్రి సుష్మా స్వరాజ్ అక్కడ పాక్ ప్రతినిధి సర్తాజ్ అజీజ్‌తో చర్చలు జరుపుతారని పేర్కొన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై వస్తున్న విమర్శలపై ఆయన వివరణ ఇచ్చారు. సౌరవ్ విరుద్ద ప్రయోజనాలు పొందడం లేదని, అలా తాను భావించడం లేదని స్పష్టం చేశారు. ఇండియన్ సూపర్ లీగ్ అట్లెటికో డీ కోల్‌కతా జట్టుకు గంగూలీ సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకైతే రెండు ప్రయోజనాలు పొందడం అంశంపై చాలా మందికి అవగాహన లేదని, ఒకవేళ ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఏదైనా జట్టుతో గంగూలీకి సంబంధాలుంటే ఈ అంశంపై ఆలోచించాల్సి ఉంటుందని శశాంక్ మనోహర్ వివరించారు. -
బ్రిటిష్ గూఢచర్య సంస్థకు ఆస్థాన జ్యోతిష్యుడు
ఓ లుక్కేస్తారా! హిట్లర్ నాయకత్వంలో నాజీ సేనలు విజృంభిస్తున్న రోజులవి. 1940 వేసవి నాటికి ఫ్రాన్స్ భూభాగంలో చాలా వరకు నాజీలు స్వాధీనం చేసేసుకున్నారు. ఇంగ్లిష్ చానల్ దక్షిణ భాగంలో బ్రిటిష్ అధీనంలో ఉన్న కొన్ని దీవులనూ నాజీలు స్వాధీనం చేసుకున్నారు. హిట్లర్ వ్యూహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటికి దీటుగా ప్రతివ్యూహాలను పన్నడం బ్రిటిష్ గూఢచర్య సంస్థ ఎంఐ-5కి తలకు మించిన భారంగా పరిణమించింది. మానవ ప్రయత్నంతో సాధించలేనిది అతీంద్రయ విద్యల సాయంతోనైనా సాధించాలనుకున్న బ్రిటిష్ ప్రభుత్వం, చివరకు యూదు సంతతికి చెందిన జర్మన్ జ్యోతిషుడు లూయీ డి వోల్‌ను ఎంఐ-5 ఆస్థాన జ్యోతిషుడిగా నియమించి, కెప్టెన్ హోదా కట్టబెట్టింది. ఒకవైపు ఉధృతంగా రెండో ప్రపంచ యుద్ధం కొనసాగుతుంటే, ఈ జ్యోతిషుడు తాపీగా శత్రు బలగాల్లోని ముఖ్యుల జాతకాలను పరిశీలిస్తూ, పై అధికారులకు నివేదికలు పంపేవాడు. -
జ్యోతిష్యుడి ఇంటికే కన్నం
సుల్తాన్‌బజార్(హైదరాబాద్): అందరి భవిష్యత్తు చెప్పే జ్యోతిష్యుని ఇంటికే కన్నం వేసి, అతని భవిష్యత్తునే అయోమయం చేశారు దొంగలు. ఆదివారం సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ శివశంకర్ కథనమిదీ.. ఇసామియా బజార్‌కు చెందిన కమల్కిషోర్శర్మ(55) జ్యోతిష్యం చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి తన ఇంటికి తాళంవేసి ఓ దేవాలయంలో జరిగే భజన కార్యక్రమానికి వెళ్లాడు. ఆదివారం ఉదయం 6 గంటలకు తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి.. లోపలి వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉన్న 7 తులాల బంగారం, 12 లక్షల నగదు మాయమయ్యాయి. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
స్మృతీ ఇరానీ...రాబోయే రోజుల్లో రాష్ట్రపతి?
-
స్మృతీ ఇరానీ...రాబోయే రోజుల్లో రాష్ట్రపతి?
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ...ఓ జ్యోతిష్యుడిని కలవడం కలకలం రేపుతోంది. స్మృతీ ఇరానీ ఆదివారం... భీల్వాడాలోని జ్యోతిష్కుడు నాథూలాల్ వ్యాస్‌ను కలిశారు. భర్త జుబిన్‌తో కలిసి ఆమె నాథూలాల్ దగ్గరకు వెళ్లారు. జ్యోతిష్కుడుతో ఆమె సుమారు 4 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా స్మృతీ ఇరానీ భవిష్యత్ గురించి తెలుసుకునేందుకు చేయి చూపించుకున్నట్లు సమాచారం. తన రాజకీయ భవిష్యత్, కుటుంబ పరిస్థితి, ఆరోగ్య స్థితిగతులపై వివరాలు తెలుసుకున్న ఆమె నాథూలాల్ వ్యాస్ ఆశీర్వాదం తీసుకున్నట్లు భోగట్టా. నాథూలాల్ వ్యాస్ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. స్మృతీ ఇరానీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని, ఆమెకు అత్యున్నత పదవి దక్కే అవకాశముందని జ్యోతిష్యుడు చెప్పినట్లు సమాచారం. భవిష్యత్తులో స్మృతీ ఇరానీ రాష్ట్రపతి అయ్యే అవకాశముందని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా జ్యోతిష్యున్ని కలవడంపై స్మృతీ ఇరానీ వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు తనకు రాశిచక్రం లేదని, అందుకే జ్యోతిష్యున్ని కలిసినట్లు తెలిపారు. మరోవైపు స్మృతీ ఇరానీ జ్యోడిష్యుడ్ని కలవటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
మత్తిచ్చి అత్యాచారం చేసిన జ్యోతిష్యుడు!
జ్యోతిష్యుడి అరెస్ట్ పానీయంలో మత్తు మందు ఇచ్చి... బెంగళూరు : తన పెళ్లి ఎప్పుడు జరుగుతుందోనని జ్యోతిష్యం చెప్పిం చుకోడానికి వెళ్లిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీరుపై అత్యాచారం చేసిన జ్యోతిష్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఇక్కడి రామమూర్తినగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు శనివారం తెలిపిన సమాచారం మేరకు.. తమిళనాడుకు చెందిన దామోదరన్ అలియాస్ దాము రెండు సంవత్సరాల క్రితం రామమూర్తినగరలోని హొస్సళ నగరలో జ్యోతిష్య కేంద్రాన్ని ప్రారంభించాడు. ఇతని దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోడానికి పలువురు అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇక్కడి ఎలక్ట్రానిక్ సిటీలోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె దామోదరన్ దగ్గర ఈనెల 19వ తేదీన అపాయింట్మెంట్ తీసుకున్నారు. తనకు వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోడానికి ఆమె బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆ జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో దామోదరన్ ఆ యువతికి మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చాడు. దాన్ని తాగితే సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మించాడు. దీంతో ఆ పానీయం సేవించిన ఆ యువతి మత్తులోకి జారుకుంది. అనంతరం దామోదరన్ ఆమెపై అత్యాచారం చేశాడు. సాయంత్రం తరువాత ఆమెకు సృ్పహ వచ్చింది. వెంటనే ఆమె స్నేహితుడికి ఫొన్ చేసి విషయం చెప్పింది. అతను రామమూర్తినగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెపై అత్యాచారం జరిగిందని వైద్య నివేదికలో వెలుగు చూసింది. దీంతో దామోదరన్‌ను అరెస్ట్ చేశారని పోలీసులు శనివారం తెలిపారు. ఇలా ఎంత మందిని మోసం చేశాడు అని ఆరా తీస్తున్నామని చెప్పారు. -
దుష్టశక్తులను వదిలిస్తానని చెప్పి అత్యాచారం
మెల్బోర్న్: గ్రహ స్థితి బాగో పోయినా, గృహ స్థితి బాగో పోయినా మనం జ్యోతిష్యుల్ని సంప్రదించి వాటిని నివృత్తి చేసుకోవడానికి యత్నిస్తాం. జ్యోతిష్యం, వాస్తుని మూఢ నమ్మకాలగా భావించే వారు కొందరైతే, వాటిని ఉన్నతంగా భావించి పరిష్కార మార్గాలు వెతుక్కునే వారికి కూడా కొదవలేదు. మరోవైపు, జ్యోతిష్యం పేరుతో మోసాలకు పాల్పడేవారు కోకల్లలు. అసలు విషయాన్నివదిలేసి జనాన్ని బురిడీ కొట్టించడమే కొంతమంది లక్ష్యం. జ్యోతిష్యం అనగానే ముందుగా భారతీయులే గుర్తుకొస్తారు. భారతీయ పండితులంటే దేశ విదేశాల్లో చాలామంది బారులు తీరుతారు. అలా వచ్చిన ఓ మహిళపై భారత సంతతి జ్యోతిష్యుడొకడు ఆస్ట్రేలియాలో అత్యాచారం చేశాడు. వెంకటేష్ కొండప్ప అనే ఈ పెద్దమనిషి.. జనవరిలో తన వద్దకు వచ్చిన మహిళకు ఏవో దుష్ట శక్తులు ఉన్నాయని చెప్పి నమ్మించాడు. అనంతరం ఆమెను తన కార్యాలయానికి రప్పించుకుని అత్యాచారం చేశాడు. ఈ ఘటనలో అతనిపై ఎనిమిది చార్జిషీట్ల దాఖలు కావడంతో ఆ జ్యోతిష్యుడు శుక్రవారం మెల్బోర్న్ కోర్టుకు హాజరయ్యాడు. కొత్త వారితో శృంగారం జరిపితే సమస్యకు పరిష్కారం దొరకుతుందని ఆ జ్యోతిష్యుడు మాయమాటలు చెప్పాడని, వాటిని రెండు సార్లు తిరస్కరించినా ఆమెపై అత్యాచారం చేసినట్టు పోలీసులు కోర్టుకు విన్నవించారు. కాగా, ఆ మహిళ కక్ష కట్టి తనపై ఆరోపణలు చేసిందని, తాను ఎటువంటి తప్పు చేయలేదని అతను కోర్టుకు తెలిపాడు. -
కన్నబిడ్డతో సహా కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది
గోపవరం (నిడదవోలు రూరల్), న్యూస్‌లైన్ : నవమాసాలు మోసి కన్న బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ తల్లికి జ్యోతిష్యుడు చెప్పిన మాటలు తల్లడిల్లేలా చేశాయి. బిడ్డ నష్టజాతకుడని, కుటుంబ సభ్యులకు అనర్థాలు తప్పవని చెప్పిన మాటలకు తోడు ఆ కుటుంబంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఆ మాతృమూర్తి హృదయాన్ని కృంగదీశాయి. నష్ట జాతకుడిగా పేరుపడిన బిడ్డతో పాటు తాను కూడా తనువుచాలించాలని నిర్ణయించుకున్న ఆ తల్లి నాలుగేళ్ల కన్నబిడ్డతో సహా కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. కాలువలో కొట్టుకుపోతున్న ఆమెను చూసి స్థానికులు రక్షించగా ఆ బాలుడు గల్లంతయ్యాడు. మానవుడు భూమి నుంచి గ్రహాంతరయానం చేస్తున్న నేటి ఆధునిక యుగంలో జ్యోతిష్యుడి మాటలు విని బిడ్డతో సహా తల్లి ఆత్మహత్యకు యత్నించిన ఈ ఘటన నిడదవోలు మండలం గోపవరం సమీపంలోని మద్దూరు వంతెన వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి ఇన్నీస్‌పేటకు చెందిన దుర్గ (22) అనే మహిళ నాలుగేళ్ల కుమారుడు వర్థన్‌తో కలిసి సోమవారం ఉదయం 7.30 గంటల సమయంలో మద్దూరు వంతెన వద్దకు వచ్చింది. ముందుగా రాసుకున్న సూసైడ్ నోట్‌ను, భర్త మాధవ్, వర్ధన్ కలిసి ఉన్న ఫొటోను, హ్యాండ్ బ్యాగ్‌ను వంతెన మధ్యలో ఉన్న ఖానా వద్ద ఉంచి కుమారుడితో సహా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి దూకేసింది. నీటి ప్రవాహానికి దుర్గ ఒడ్డుకు కొట్టుకురాగా అటువైపు వెళుతున్న ఆటో డ్రైవర్ ప్రసాద్, స్థానికుడు కె.బుజ్జి చూసి ఆమెను రక్షించారు. బాలుడు కాలువలో గల్లంతయ్యాడు. ఘటనాస్థలంలో ఆమె ఉంచిన సూసైడ్‌నోట్‌లోని కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్‌కు స్థానికులు సమాచారం అందించారు. కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న దుర్గ బంధువులు బాలుడి కోసం కాలువలో వెతకకుండానే ఆమెను హడావుడిగా ఆటోలో అక్కడి నుంచి తీసుకువెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానికులు తొలుత 108 వాహనానికి సమాచారం అందించగా వాహనం వచ్చే సరికి ఆమెను బంధువులు తీసుకువెళ్లిపోయారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. నష్ట జాతకమేనా.. ఇంకేమైనా ఉందా? కుమారుడు నష్టజాతకుడని జ్యోతిష్యుడు చెప్పడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె చెప్పిందని స్థానికులు తెలిపారు. ఆత్మహత్యాయత్నం నుంచి బయటపడిన అనంతరం ప్రశ్నించగా బిడ్డ పెరిగేకొద్దీ మరిన్ని అరిష్టాలు జరుగుతాయని జ్యోతిష్కుడు చెప్పాడని, ఆ ప్రకారమే కుటుంబంలో ఇటీవల రెండు, మూడు ఘటనలు జరగడంతో ఆందోళనకు గురయ్యానని, దీంతో బిడ్డతో సహా చనిపోవాలనుకున్నట్టు చెప్పిందని స్థానికులు తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో ఇంకేమైనా కారణాలు కూడా ఉండివచ్చని స్థానికులు, పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజమండ్రి ఇన్నీస్‌పేటకు సిబ్బందిని పంపినట్టు సమిశ్రగూడెం పోలీసులు చెప్పారు. -
కన్ను అదిరితే కంగారేల?
నమ్మకం ఆడవాళ్లకి కుడికన్ను అదిరితే కీడు సంభవిస్తుందని, మగవారికి ఎడమకన్ను అదిరితే కష్టాలు తప్పవని విశ్లేషిస్తుంటారు జ్యోతిషవేత్తలు. ఈ నమ్మకం తాము సృష్టించింది కాదని, రామాయణ కాలంలోనే ఇది ప్రాచుర్యంలో ఉందని చెబుతారు వారు. రావణుడు సీతమ్మవారిని ఎత్తుకెళ్లేందుకు పయనమవగానే... సీతాదేవికి కుడికన్ను, లక్ష్మణుడికి ఎడమకన్ను అదిరాయట. ఆ తరువాత రావణుడు రామపత్నిని అపహరించాడు. అప్పట్నుంచీ కుడికన్ను అదిరితే స్త్రీకి, ఎడమకన్ను అదిరితే పురుషుడికి ప్రమాదాలు సంభవిస్తాయనే నమ్మకం ఏర్పడింది అంటారు. రామదండు లంక మీద దాడి చేయబోయే ముందు రావణుడికి, మండోదరికి కూడా కన్ను అదరిందట. హవాయిలో ఎడమకన్ను కొట్టుకుంటే ఓ అపరిచితుడు జీవితంలోకి వస్తాడని, కుడి కన్ను అదిరితే... తమ ఇంట్లో కానీ, బంధువుల ఇళ్లలోగానీ పసిబిడ్డ జన్మిస్తుందని విశ్వసిస్తారు. ఆఫ్రికాలో కన్ను పై రెప్ప కొట్టుకుంటే బంధువుల రాక అని, కిందిరెప్ప కొట్టుకుంటే కన్నీళ్ల కుండపోత తప్పదని అంటారు. నైజీరియాలో ఏ కన్ను కొట్టుకున్నా చెడే జరుగుతుందంటారు. ఇక చైనా వారికి కుడికన్ను అదిరితే మంచి, ఎడమకన్ను అదిరితే కీడు. అంతేకాదు... అదిరే సమయాన్ని బట్టి వారు ఫలితాన్ని అంచనా వేస్తుంటారు. అదెలాగంటే... ఉదయం 11 నుంచి 1 గంట మధ్య అదిరితే ఓ గొప్ప వ్యక్తిని కలుస్తారట. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య అయితే కష్టాలు వస్తాయట. 3 నుంచి 5 మధ్య అయితే విదేశాల నుంచి అతిథులు వస్తారట. ఇలా చాలా లెక్కలున్నాయి వారికి! అయితే నిద్ర సరిపోకపోయినా, కళ్లు ఎక్కువగా అలసిపోయినా, నరాల బలహీనత, విటమిన్ల లోపం, కొన్ని రకాల కంటి సంబంధిత రోగాల వల్ల కూడా కన్ను అదరడం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. వాళ్లు చెప్పేది వాస్తవమే కావచ్చు. కానీ నమ్మకాల మాటేమిటి!