
సంచనాల జ్యోతిష్యురాలి అంచనా
వాషింగ్టన్: ట్రంప్, కమలా హారిస్‌లమధ్య ఓటర్ల మద్దతు కేవలం ఒక శాతం తేడా ఉందన్న వార్తల నడుమ అక్కడి ప్రముఖ జ్యోతిష్యు రాలు అమీ ట్రిప్ ఆసక్తికరమైన భవిష్యవాణి వినిపించారు. అమెరికా అధ్యక్ష పగ్గాలు ట్రంప్ చేతి కొస్తాయని చెప్పారు. అధ్యక్షుడు జో బైడెన్ జూలై 21న రేసు నుంచి తప్పుకుంటారని ఆమె చెప్పిన జోస్యం ఫలించింది. దాంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ‘సూర్యుడు ట్రంప్‌నకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఈసారి గెలుపు ట్రంప్‌దే’ అంటూ ట్రిప్ చేసిన తాజా పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంతేకాదు, ‘‘హారిస్ శక్తిమంతమైన నాయకురాలిగా ఎదుగుతారు. నాలుగేళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతారు’’ అంటూ 2020లోనే చెప్పారు. అదీ అక్షరసత్యమైనట్టే కన్పిస్తోంది.
ఆగస్టులో అమెరికాలో విపరిణామాలు!
అమీ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రలాజికల్ రీసెర్చ్ (ఐసార్) నుంచి సర్టిఫైడ్ జ్యోతిష్యురాలు. లైసెన్స్‌డ్ థెరపిస్ట్ కూడా. నేషనల్ కౌన్సిల్ ఫర్ జియోకాస్మిక్ రీసెర్చ్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్‌లలో క్రియాశీలకంగా ఉన్నారు. గ్రహచారం తదితరాల ఆధారంగా బైడెన్ జూలై 21న అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటారు’’ అని అమీ జూలై 11వ తేదీన చెప్పారు. అది అచ్చంగా అలాగే జరిగింది. ‘‘ఈసారి ట్రంపే గెలుస్తారు. అయితే అధ్యక్షునిగా ఆయన అనూహ్య నిర్ణయాలతో అమెరికాలో రాజకీయ అనిశ్చితి ఏర్పడవచ్చు’’ అమీ చెప్పారు. ఆగస్టులో ప్రచారం, రాజకీయాల్లో విపరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు!
Comments
Please login to add a commentAdd a comment