Amy
-
Astrologer Amy Tripp: ట్రంపే గెలుస్తారు
వాషింగ్టన్: ట్రంప్, కమలా హారిస్లమధ్య ఓటర్ల మద్దతు కేవలం ఒక శాతం తేడా ఉందన్న వార్తల నడుమ అక్కడి ప్రముఖ జ్యోతిష్యు రాలు అమీ ట్రిప్ ఆసక్తికరమైన భవిష్యవాణి వినిపించారు. అమెరికా అధ్యక్ష పగ్గాలు ట్రంప్ చేతి కొస్తాయని చెప్పారు. అధ్యక్షుడు జో బైడెన్ జూలై 21న రేసు నుంచి తప్పుకుంటారని ఆమె చెప్పిన జోస్యం ఫలించింది. దాంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ‘సూర్యుడు ట్రంప్‌నకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఈసారి గెలుపు ట్రంప్‌దే’ అంటూ ట్రిప్ చేసిన తాజా పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంతేకాదు, ‘‘హారిస్ శక్తిమంతమైన నాయకురాలిగా ఎదుగుతారు. నాలుగేళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతారు’’ అంటూ 2020లోనే చెప్పారు. అదీ అక్షరసత్యమైనట్టే కన్పిస్తోంది.ఆగస్టులో అమెరికాలో విపరిణామాలు!అమీ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రలాజికల్ రీసెర్చ్ (ఐసార్) నుంచి సర్టిఫైడ్ జ్యోతిష్యురాలు. లైసెన్స్డ్ థెరపిస్ట్ కూడా. నేషనల్ కౌన్సిల్ ఫర్ జియోకాస్మిక్ రీసెర్చ్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్లలో క్రియాశీలకంగా ఉన్నారు. గ్రహచారం తదితరాల ఆధారంగా బైడెన్ జూలై 21న అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటారు’’ అని అమీ జూలై 11వ తేదీన చెప్పారు. అది అచ్చంగా అలాగే జరిగింది. ‘‘ఈసారి ట్రంపే గెలుస్తారు. అయితే అధ్యక్షునిగా ఆయన అనూహ్య నిర్ణయాలతో అమెరికాలో రాజకీయ అనిశ్చితి ఏర్పడవచ్చు’’ అమీ చెప్పారు. ఆగస్టులో ప్రచారం, రాజకీయాల్లో విపరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు! -
తల్లి ప్రేమకు సరిహద్దులు లేవు
అమెరికన్ మహిళ మేఘన్ గత సంవత్సరం అక్టోబర్‌లో మన దేశానికి చెందిన బీదింటి చిన్నారిని దత్తత తీసుకొని ‘అమీ’ అని పేరు పెట్టింది. అమీకు డౌన్‌సిండ్రోమ్ ఉంది. దత్తత తీసుకొని సంవత్సరం పూర్తయిన సందర్భంగా హృదయాన్ని కదిలించే వీడియోను మేఘన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మేఘన్‌కు ఇద్దరు అబ్బాయిలు. వీరితో కలిసి అమీ సంతోషంగా ఆడుకుంటున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తాయి. గత ఫిబ్రవరిలో ఇంటిని దీపావళి పండగ అలంకరణలతో ముస్తాబు చేసి అమీ బర్త్‌డేను ఘనంగా జరిపారు. ‘చిలిపి, తెలివైన, అందమైన చిన్నారికి తల్లి అయినందుకు గర్వపడుతున్నాం. మా ఫ్యామిలీ పజిల్ నుంచి తప్పిపోయి మళ్లీ దొరికిన మిస్సింగ్ పీస్ అమీ’ అంటూ రాసింది మేఘన్. ‘మీ సంతోషం సంగతి ఎలా ఉన్నా మీరు ఒక అమ్మాయికి అందమైన, అద్భుతమైన భవిష్యత్తును ఇచ్చారు. దయార్ద్ర హృదయం ఉన్న మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి’ అంటూ నెటిజనులు స్పందించారు. -
పద్మావతి 2
ఆశ్చర్యపోకండి! ‘ఆమీ’ అనే మలయాళీ సినిమా ఇది! దీన్ని బ్యాన్ చెయ్యాలని కేరళలో ఇప్పుడు ప్రదర్శనలు జరుగుతున్నాయి. కేరళ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలయింది. ‘పద్మావతి’ స్టోరీ, ‘ఆమీ’ స్టోరీ వేర్వేరు. అయినప్పటికీ, పద్మావతికి ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయో, అన్ని అడ్డంకులూ ‘ఆమీ’కీ ఎదురవుతున్నాయి. ఇస్లాం మతం స్వీకరించిన కమలాసురయ్య (కమలాదాస్) అనే కేరళ రచయిత్రి బయోగ్రఫీ ‘ఆమీ’. 75 ఏళ్ల వయసులో 2009లో ఆమె మరణించారు. కేరళలో ‘లవ్ జిహాద్’ ధోరణి మొదలైందే కమలాదాస్ వల్ల కాబట్టి, ఇప్పుడు ఆమె జీవిత చరిత్రపై వస్తున్న సినిమాను విడుదల కాకుండా సెన్సార్ బోర్డును ఆదేశించాలని కేరళ సంప్రదాయవాదులు కోరుతున్నారు. మతాంతర వివాహాలకు ఈ సినిమా ప్రేరణ కలిగించి, సమాజాన్ని దారి తప్పించే ప్రమాదం ఉందని వారి ఆందోళన. పిటిషన్ వేసింది కె.పి.రామచంద్రన్ అనే లాయర్. కమలాదాస్ బయోగ్రఫీ ఇప్పటికే ‘లవ్ క్వీన్ ఆఫ్ మలబార్’ అనే పుస్తకంగా కూడా తర్జుమా అయింది. దాన్నుంచి కొన్ని ముఖ్యమైన భాగాలను తీసుకుని దర్శకులు కమల్ ‘ఆమీ’ని చిత్రీకరించారు. పుస్తకం రాసింది కెనడా రచయిత్రి మెర్రీలీ వైస్బోర్డ్. కమల తను స్వీకరించిన మతంపై తర్వాత్తర్వాత విశ్వాసం కోల్పోయిందని మెర్రీలీ ఆ పుస్తకంలో రాసినట్లు కూడా రామచంద్రన్ తన పిటిషన్లో ప్రస్తావించారు. -
ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో హాలీవుడ్ చిత్రం ఎమీ
‘‘అమెరికాలో ‘అమీష్ కమ్యూనిటీ’ అని ఒకటుంది. వాళ్లు... మనుషులు కనిపెట్టిన కరెంట్, వాహనాల్లాంటివి వాడరు. ప్రకృతి సిద్ధమైనవాటినే వినియోగిస్తారు. ఈ తెగ నేపథ్యంలో చేసిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది’’ అన్నారు ఆర్పీ పట్నాయక్. సంగీత దర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా తెలుగులో తన ప్రతిభ చాటుకున్న ఆర్పీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమీ. ఈ చిత్రం ద్వారా ఆయన హాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. టీపీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రసాద్ కూనిశెట్టి, రమేష్ నూతి ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 1న ఈ చిత్రం ‘వీఓడి’ (వీడియో ఆన్ డిమాండ్) ద్వారా విడుదల చేయనున్నారు. అంటే... థియేటర్లలో కాకుండా ఇంటర్నెట్ ద్వారా విడుదల చేస్తారు. అదే రోజున ఈ చిత్రం డీవీడీ కూడా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను ఆర్పీ చెబుతూ -‘‘ఇది ఇండియన్ ఇంగ్లిష్ మూవీ కాదు. కంప్లీట్ హాలీవుడ్ మూవీ. ఇలా పూర్తి స్థాయి హాలీవుడ్ చిత్రం చేసిన తొలి తెలుగువాళ్లం మేమే’’ అని చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్ కూనిశెట్టి మాట్లాడుతూ -‘‘ఈ చిత్రనిర్మాణానికి రెండేళ్లు పట్టింది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత జాన్ షీన్బర్గ్ ఈ చిత్రం నచ్చి, మార్కెటింగ్ చేయడానికి ముందుకు రావడం ఆనందంగా ఉంది. తెలుగులో విడుదల చేయమని చాలామంది కోరుతున్నారు. దాని గురించి తర్వాత ఆలోచిస్తాం’’ అని చెప్పారు. -
‘ఎమీ’తో హాలీవుడ్ లోకి ఎంటరయిన ఆర్పీ పట్నాయక్