జ్యోతిష్యుడితో వివాహేతర సంబంధం .. రెండు ఇళ్లు, డబ్బులు అడగడంతో | - | Sakshi
Sakshi News home page

జ్యోతిష్యుడితో వివాహేతర సంబంధం .. రెండు ఇళ్లు, డబ్బులు అడగడంతో

Published Tue, Apr 11 2023 1:48 AM | Last Updated on Tue, Apr 11 2023 7:33 AM

- - Sakshi

అన్నానగర్‌: సెందమంగలమ్‌ సమీపంలో భార్యతో విడిగా జీవిస్తున్న ఓ జ్యోతిష్యుడిని సోమవారం కత్తితో నరికి దారుణంగా హత్య చేసిన ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేశారు. నామక్కల్‌ జిల్లా సెందమంగళం సమీపంలోని కొండమనాయక్‌ కన్పట్టి వెస్ట్‌ రోడుకు చెందిన సుందర్‌ రాజన్‌ (60) జ్యోతిష్యుడు, భార్య బేబీ (55) నరేష్‌ కుమార్‌ (34), సిమల్‌ (28) ఇద్దరు కుమారులు ఉన్నారు.

తన వద్దకు జ్యోతిష్యం కోసం వచ్చే విడాకులు తీసుకున్న, వితంతువులైన మహిళలను సుందర్‌రాజన్‌ లక్ష్యంగా చేసుకుని వారిని తన వలలో పడేసి వారితో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా అదే ప్రాంతానికి చెందిన భర్త నుంచి విడిపోయి జీవిస్తున్న పరమేశ్వరి(48) జ్యోతిష్యం కోసం సుందర్‌రాజన్‌ను చూసేందుకు రావడంతో స్నేహితులయ్యారు.

ఆ తర్వాత ఇద్దరూ తరచుగా ఏకాంతంగా కలుసుకునేవారు. ఈ విషయం బేబీకి తెలుసు. సుందర్‌ రాజన్‌ను చాలాసార్లు హెచ్చరించినా అతను మారలేదు. దీంతో బేబీ రెండేళ్ల క్రితం భర్త, కొడుకులను వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న సుందర్‌ రాజన్‌కు పరమేశ్వరి భోజనం పెట్టి గమనిస్తూ వచ్చింది. ఈ స్థితిలో సోమవారం సుందర్‌రాజన్‌ పేగులు బయటకు వచ్చిన స్థితిలో ఇంట్లో దారుణంగా హత్య చేయబడ్డాడు.

ఇది గమనించిన చుట్టుపక్కల ప్రజలు వెంటనే సేందమంగళం పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుందర్‌ రాజన్‌ తన ఇంటిని స్నేహితురాలు పరమేశ్వరికి రాసిచ్చాడని, అయితే ఆమె అతని వద్ద ఉన్న రెండు ఇళ్లు, డబ్బులు అడగడంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సుందర్‌ రాజన్‌ పరమేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే పరమేశ్వరితో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో మహిళతో అక్రమ సంబంధం ఉంది. ఇంతలో పరమేశ్వరి మరో ప్రేమికుడితో కలిసి సుందర్‌రాజన్‌ను చంపేందుకు పథకం వేసింది. ఈ నేపథ్యంలో పరమేశ్వరి ఆదివారం రాత్రి తన ప్రేమికుడితో కలిసి సుందర్‌రాజన్‌ ఇంటికి వెళ్లింది.

ఆ సమయంలో అక్కడే ఉన్న సుందర్‌రాజన్‌ను వారిద్దరూ కత్తితో పొడిచి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సెందమంగళం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంటనే పోలీసులు అదే ప్రాంతంలో ఉన్న పరమేశ్వరిని అరెస్టు చేసి తీవ్రంగా విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ఆమె మరో ప్రేమికుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement