శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.అష్టమి రా. 9.33 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: రేవతి రా. 12.12 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: ప. 12.43 నుండి 2.15 వరకు, దుర్ముహూర్తం: ప.12.30 నుండి 1.23 వరకు, అమృతఘడియలు: రా.9.52 నుండి 11.15 వరకు;
సూర్యోదయం: 5.35,
సూర్యాస్తమయం: 6.35.
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు,
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు.ఆత్మీయులతో కలహాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
వృషభం: కార్యజయం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తా శ్రవణం. పలుకుబడి పెరుగుతుంది. నూతన పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
మిథునం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
సింహం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
కన్య: కొత్త విషయాలు తెలుస్తాయి. మీ నిజాయితీ పదిమందీ గుర్తిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
తుల: రుణబాధల నుండి విముక్తి. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.
వృశ్చికం: పరిస్థితుల ప్రభావంతో నిర్ణయాలు మార్చుకుంటారు. పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
ధనుస్సు: బంధువులతో తగాదాలు. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలు ముందుకు సాగవు.
మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆలయ దర్శనాలు వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
కుంభం: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. ఆరోగ్య సమస్యలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.
మీనం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వస్తులాభాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు కొద్దిగా గందరగోళంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment